Tag Archives: fact checking in telugu

భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన

Claim/వాదన: వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.

Conclusion/నిర్ధారణ: నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి మాత్రమే సంబంధించినది, నిషేధం అన్ని బాణసంచాలపై కాదు.

Rating: Misleading —

Fact Check వివరాలు:

వాదన ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం మాత్రమే కాకుండా, భారతదేశం అంతటా బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని, సుప్రీం కోర్టును ఉద్దేశించి తప్పుదారి పట్టించే పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.దీనిపై శ్రీ విష్ణు శంకర్ జైన్ అభిప్రాయాలను తప్పక వినండి.”

క్రింద ట్వీట్ చూడండి:

FACT CHECK

ఈ వాదనలోని వాస్తవం పరిశీలించే క్రమంలో మొదట సుప్రీంకోర్టు అటువంటి తీర్పు ఏమైనా ఇచ్చిందా అని వెతకగా, గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతంకు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది మరియు దానిపై ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చిందని కనుగొన్నము. 2018 తీర్పును స్పష్టం చేసే వార్తా నివేదికలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

బాణసంచాలో బేరియం మరియు నిషేధిత రసాయనాల వాడకంపై నిషేధం దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, అన్ని రాష్ట్రాలకు కట్టుబడి ఉంటుందని సుప్రీం కోర్టు ఒక రివ్యూ పిటిషన్‌లో తన ఆదేశాలపై స్పష్టత ఇచ్చింది.రాజస్థాన్‌కు సంబంధించి, న్యాయమూర్తులు A.S బోపన్న మరియు M.M సుందరేష్ 7 నవంబర్ 2023న వివరణ ఇచ్చారు, ఈ ఉత్తర్వులు ఇప్పుడు రాజస్థాన్‌తో సహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని అపెక్స్ కోర్టు(apex court)పేర్కొంది.

2018 తీర్పు ప్రకారం, “గ్రీన్ క్రాకర్స్” పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు బాణాసంచా పర్యావరణ, గాలి నాణ్యతను ప్రభావితం చేయకూడదని నిర్దేశించింది మరియు తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేసే మరియు విపరీతమైన శబ్దాన్ని నివారించే ‘పర్యావరణ అనుకూలమైన’ లేదా “గ్రీన్” బాణసంచా తయారీని “బాణసంచా కర్మాగారాలకు” తప్పనిసరి చేసింది.

దీపావళి బాణసంచాలో నిషేధిత రసాయనాలు ‘బేరియం సాల్ట్’ వంటివి మరియు ఈ రసాయనాలతో కూడిన బాణాసంచా వాడకాన్ని నిషేధించబడ్డాయి మరియు “గ్రీన్ క్రాకర్స్” అనుమతించబడతాయని సుప్రీం కోర్ట్ 2021 నాటి తీర్పులో పేర్కొంది.

అందువల్ల, నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి సంబంధించినది మరియు పోస్ట్‌లో పేర్కొన్నట్లు దేశవ్యాప్తంగా అన్ని బాణసంచాలపై నిషేధం కాదు. వాస్తవానికి, తయారీదారులు సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ పటాకులు/బాణసంచా ఉత్పత్తి చేస్తున్నచో అవి అనుమతించబడతాయి. అందువల్ల, దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

మరి కొన్ని fact Checks:

10 లో 9 పట్టణ ప్రైవేటు పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ చదవలేరట! ఎంతవరకు నిజం?

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check

వాట్సాప్‌లో షేర్ అవుతున్న చిత్రం టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం అని వైరల్ అవుతోంది; Fact Check

ఇటీవల, టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది, నలుపు మరియు తెలుపు ఫోటో 18 వ శతాబ్దపు కర్ణాటక పాలకుడు నిజమైన టిప్పు సుల్తాన్‌ను యొక్క చిత్రం అని ఒక వాదన. ఈ చిత్రాన్ని రంగుల చిత్రంతో పోలుస్తూ, ఇన్నాళ్లుగా భారత పాఠశాల పాఠ్య పుస్తకాలలో కాంగ్రెస్ ముద్రిస్తూ వస్తున్నది ఈ రంగుల చిత్రం.

క్యాప్షన్ ఈ విధంగా ఉంది: “ప్రచార ఐసా ఫైలావో కి పంక్చర్ వాలే షకల్ వాలా లూటేరా భీ సుల్తాన్ దిఖే”,
(తెలుగు అనువాదం:ముఖం కూడా సరిగాలేని దొంగని, సుల్తాన్ అనిపించే విధంగా ప్రచారం చేయండి)

వాస్తవ పరిశీలన కోసం Digiteye Indiaకి పంపిన WhatsApp చిత్రాన్ని క్రింద చూడండి.

టిప్పు సుల్తాన్, 18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యానికి (ప్రస్తుత కర్ణాటకలో భాగం) పూర్వపు పాలకుడు. అతను మైసూర్ టైగర్ అని కూడా పిలువబడ్డాడు.అయితే,కొంత కాలం క్రితం,సాంప్రదాయవాద సమూహాల(conservative groups) వాదనల ప్రకారం,అతను చాలా మంది హిందువులను వధించిన క్రూరమైన, హిందూ వ్యతిరేక నాయకుడని అతని పేరు వివాదాస్పదంగా మారింది.మరో వైపు చాలా మంది అతను ఒక దేశభక్తుడు అని నమ్ముతారు.

Fact Check

ఈ చిత్రం 2018 నుండి చెలామణిలో ఉందని Digiteye India తేలుకొంది. దీనిని భారత ప్రభుత్వ అధికారిక తపాలా స్టాంప్ మరియు ఇతర పాఠ్యపుస్తకాల నుండి టిప్పు సుల్తాన్ యొక్క సుపరిచితం చిత్రంతో ఇండోర్‌కు చెందిన బిజెపి నాయకుడు రమేష్ మెండోలా మొదట ట్వీట్ చేశారు.

Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా ఈ చిత్రం(నలుపు మరియు తెలుపులో ఉన్న ఫోటో) పిక్సెల్స్‌లోని ఆర్కైవ్‌లలో అందుబాటులో ఉందని మరియు ఇది 18వ శతాబ్దపు వ్యాపారి హమద్ బిన్ ముహమ్మద్ అల్-ముర్జాబి అనే వ్యక్తి చిత్రమని వెల్లడైంది.అతనిని టిప్పు టిప్ అనే మారుపేరుతో పిలుస్తారు. ఆక్స్‌ఫర్డ్ రీసెర్చ్ ఎన్‌సైక్లోపీడియాస్(Oxford Research Encyclopaedias) ప్రకారం, అతను జాంజిబార్‌లో ఏనుగు దంతాలు మరియు బానిస వ్యాపారి, 19వ శతాబ్దంలో, టాంగన్యికా సరస్సుకి పశ్చిమాన “అరబ్ జోన్”లో ఎంతో పలుకుబడి మరియు బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు.

మరియు టిప్పు టిప్ ఉబ్బిన ముక్కు వలన అతనికి ఆ పేరు తెచ్చి పెట్టింది. కావున, సోషల్ మీడియాలో వైరల్ అయిన చిత్రం టిప్పు సుల్తాన్ చిత్రం కాదు, 18 వ శతాబ్దంలో తూర్పు మధ్య భాగంకు చెందిన బానిస వ్యాపారి టిప్పు టిప్ యొక్క చిత్రం.

వాదన/Claim: “టిప్పు సుల్తాన్ యొక్క నిజమైన ఫోటో” మరియు భారతీయ పాఠశాల పాఠ్య పుస్తకాలలో కాంగ్రెస్‌ ముద్రిస్తూవస్తున్న చిత్రంతో పోలిక అనేది ఒక వాదన.

నిర్ధారణ/Conclusion: నలుపు మరియు తెలుపు చిత్రం టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం కాదు, 18వ శతాబ్దంలో మధ్యప్రాచ్యాని(Middle East)కి చెందిన బానిస వ్యాపారి టిప్పు టిప్ యొక్క చిత్రం.

Rating: Totally False —

మరి కొన్ని Fact checks:

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

 

 

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check

అమెరికాలోని రైలు పైన బి.ఆర్ అంబేద్కర్ పోస్టర్‌ను చూపుతూ బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా వేసిందని,భారతదేశంలోని “మనువాది మీడియా”(“manuwadi media”)ఈ వార్తను కవర్ చేయడం లేదని పేర్కొంటూ ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: “जो काम भारत नहीं कर सका वह काम अमरीका ने करके दिखाया अमरीका की सबसे लम्बी दूरी की ट्रेन पे बाबासाहब का पोस्टर लगाया गया ? मगर भारत की मनुवादी मीडिया यह खबर नहीं दिखाएगी जय भीम” (తెలుగు అనువాదం–భారతదేశం చేయలేని పనిని అమెరికా చేసి చూపించింది, బాబాసాహెబ్ పోస్టర్‌ను అమెరికా సుదూర రైలులో ఉంచారు. కానీ భారతదేశ మనువాడి మీడియా(manuwadi media) ఈ వార్తలను చూపించదు– Jai Bhim)

ఇది ఇక్కడ ,ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

ఈ రైలు భారతదేశంలో సుపరిచితం మరియు నిశితంగా పరిశీలిస్తే ఇది మెట్రో కోచ్ లాగా కనిపిస్తుంది, అమెరికా  రైలు మాత్రం కాదు.భారతదేశంలోని మెట్రో రైళ్ల కోసం గూగుల్‌లో వెతికితే, ఆ చిత్రం ఢిల్లీ మెట్రోపై బాబాసాహెబ్ పోస్టర్‌ సూపెర్-ఇంపోజ్డ్ చేయబడిందని తెలుస్తుంది.దిగువన అసలైన ఢిల్లీ మెట్రో మరియు పోస్టర్‌తో సూపెర్-ఇంపోజ్డ్ చేయబడిన రైలు చూడండి.

అసలు చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు మరియు లోగో స్పష్టంగా ఢిల్లీ మెట్రోది, క్లెయిమ్/వాదన ప్రకారం అమెరికా రైలుది కాదు.అంతేకాకుండా, అటువంటి చర్య ఏదైనా ఉంటె భారతీయ మీడియా ద్వారా విస్తృతంగా కవర్ చేయబడి ఉండేది మరియు క్లెయిమ్/వాదనను ధృవీకరించడానికి ఏ విశ్వసనీయమైన వార్త సంస్థలు నుండి ఎటువంటి వార్త అందుబాటులో లేదు.

ఉదాహరణకు కొన్ని US హై-స్పీడ్ రైళ్లు క్లెయిమ్‌లో చూపిన రైలుకు పూర్తిగా భిన్నంగా కనిపిస్తాయి. దిగువన ఉన్న చిత్రాలు/ఇమేజ్ చూడండి.

కావున ఈ క్లెయిమ్/వాదన పూర్తిగా తప్పు.

Claim/వాదన:US ప్రభుత్వం తమ సుదూర రైలులో(లాంగ్-జర్నీ రైలు) BR అంబేద్కర్ పోస్టర్‌ను ప్రదర్శిస్తోంది.

Conclusion/నిర్ధారణ:ఈ Claim/వాదన పూర్తిగా తప్పు మరియు ఆ చిత్రం/పోస్టర్‌ ఢిల్లీ మెట్రోపై సూపెర్-ఇంపోజ్డ్ చేయబడింది.

Rating: Misrepresentation —

మరి కొన్ని Fact Checks:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check