Tag Archives: fake news in telugu

ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’ అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేసారా ; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేశారని ఒక వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. ఎలోన్ మస్క్ యొక్క ‘X’ లేదా Twitter ఖాతా నుండి అటువంటి ప్రత్యుత్తరం ఏదీ కూడా ఇవ్వబడలేదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– 

వాస్తవ పరిశీలన వివరాలు

‘X’లో స్క్రీన్‌షాట్‌తో కూడిన ట్వీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలోన్ మస్క్ చేశారంటూ, ఒక వాదన షేర్ చేయబడుతోంది.

ఎవరో “నువ్వు పెడోఫిల్ అని బూటకపు ప్రచారం చేస్తున్నారని” ఒక వినియోగదారుని హెచ్చరికకు,వెంటనే “అది బూటకం కాదు. నేను పెడోఫిల్‌ని” అని మస్క్ చేసిన ప్రత్యుత్తరం కనిపించింది.

పోస్ట్‌కి ఒక్క రోజులో దాదాపు 28,000 లైక్‌లు వచ్చి వైరల్ అయ్యింది, మరియు ఎక్కువ మంది వినియోగదారులను చర్చలో పాల్గొనేలా చేసింది.

FACT CHECK

ట్విట్టర్ ఎకౌంటు చూడగానే అనుమానాస్పదంగా కనిపించడంతో Digiteye India టీమ్ వాస్తవ పరిశీలనకు పూనుకుంది.సాధారణంగా, మస్క్ అధికారిక Twitter ఖాతాలో వైలెట్ రంగులో సబ్‌స్క్రయిబ్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది, కానీ “నేను పెడోఫైల్” అని పేర్కొన్న ఖాతాలో “ఫాలో” బటన్ ఉంది.

మరియు,మేము మస్క్ ఫీడ్‌ యొక్క పరిశీలన ప్రకారం, మరియు సోషల్ బ్లేడ్ యొక్క గణాంకాల ప్రకారం కూడా అటువంటి ట్వీట్ అతని ఖాతాలో లేదని,లేదా తొలగించబడిన పోస్ట్‌లలో కూడా లేదని తెలుసుకున్నాము.

కావున ఈ వాదన తప్పు.

మరి కొన్ని Fact Checks:

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

 

 

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:  అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:సెప్టెంబరు 2023లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశాధినేతలు భారతదేశానికి చేరుకుంటున్న సంబంధిత వీడియోను జనవరి 2024లో జరిగిన రామమందిర కార్యక్రమానికి వస్తున్నట్లుగా షేర్ చేయబడింది.

రేటింగ్: సంపూర్ణంగా తప్పు–

వాస్తవ పరిశీలన వివరాలు

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇతర ప్రపంచ నేతలు, విదేశీ ప్రముఖులతో సహా జనవరి 22, 2024న రామాలయ ప్రతిష్ఠాపన లేదా ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను వీడియో క్యాప్చర్ చేసిందని దావా పేర్కొంది.

“22 జనవరి 2024న రామమందిరం,అయోధ్యకు హాజరవుతున్న అతిథులు” అనే శీర్షికతో ఇక్కడ మరియు ఇక్కడ Facebookలో షేర్ చేయబడింది.

FACT CHECK

సంబంధిత సమాచారం కోసం మేము Googleలో పరిశీలించగా, పైన పేర్కొన్న ప్రపంచ నాయకులు వేడుకకు హాజరవుతున్నట్లు పేర్కొన్న వార్తలేవీ కనిపించలేదు.మరియు, ఈ వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకుంటే, సెప్టెంబరు 2023లో భారతదేశంలో జరిగిన G20 సమ్మిట్‌కు ప్రపంచ నాయకులు హాజరైనప్పుడు,దానికి సంబంధించిన పాత వీడియో అని నిర్ధారణకు వచ్చాము.

ఈ పాత వీడియో నుండి తీసిన క్లిప్స్,ఇప్పుడు ఈ నాయకులు రామమందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యారనే వాదన/దావాకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడింది.కావున,వీడియో మరియు వాదన/దావా పూర్తిగా తప్పు.వీడియోలో చూపబడిన ప్రపంచ నాయకులెవరూ కూడా జనవరి 22,2024న జరిగిన రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కాలేదు.

మరి కొన్ని Fact Checks:

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

మాల్దీవుల అధ్యక్షుడు భారత ప్రధాని మోడీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారా?; వాస్తవ పరిశీలన

కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది:వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది.

నిర్ధారణ/CONCLUSION:ఈ వీడియోను డిసెంబర్ 26న సుజిత్ రామచంద్రన్ అనే వినియోగదారుడు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వినియోగదారుడు వీడియో/స్కెచ్ యొక్క తారాగణాన్ని, Disclaimer/డిస్క్లైమర్ని జత చేసి, వీడియో పూర్తిగా అవగాహన కోసం చిత్రీకరించబడింది అనిపేర్కొన్నారు.

రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన యొక్క వివరాలు:

కొందరు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేస్తున్న వీడియో ఒకటి మతపరమైన వాదనలతో వైరల్ అవుతోంది.
ఈ వీడియో కేరళలో చిత్రీకరించబడిందని, మరియు క్రిస్మస్ వేడుకకి విరాళం ఇవ్వడానికి ఇష్టపడని వ్యక్తి నుండి కొందరు వ్యక్తులు బలవంతంగా డబ్బు అడుగుతున్నట్లు చూపుతుందని వాదనలు ఆరోపించాయి. 2:55 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తిని బయటకు లాగి అతనిపై దాడి చేయడం కనబడుతుంది.

వీడియోతో వైరల్ అవుతున్న వాదన ఇలా ఉంది:

ആഘോഷം ഗംഭീരമാക്കാൻ നാട്ടുകാരുടെ കയ്യിൽ നിന്നും ബലമായി പിരിവെടുക്കുന്നു അതും നമ്മുടെ കേരളത്തിൽ എങ്ങോട്ടാണ് നാടിൻറെ ഈ പോക്ക് മദ്യവും മയക്കുമരുന്നുമായി ഒരുപറ്റം ചെറുപ്പക്കാർ നാട്ടുകാരെ ഭീതിയിലാഴ്ത്തുന്ന അവസ്ഥ കാണുക😞😞😞😞😞🙏 ദൈവത്തിന്റെ സ്വന്തം നാട്

(తెలుగు అనువాదం: వేడుకను గ్రాండ్‌గా చేయడానికి స్థానికుల చేతుల నుండి బలవంతంగా సేకరించారు, అది కూడా మన కేరళలో, ఈ దేశానికి ఏమైంది? మద్యం, మాదక ద్రవ్యాలతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఎందరో యువకుల పరిస్థితి చూడండి😞😞😞😞😞🙏 దేవుడు నెలకొన్న/కొలువున్న దేశం)

వాట్సాప్‌లో ఈ వీడియోని వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye Indiaకి అభ్యర్థన వచ్చింది.

X (గతంలో, Twitter)లో కూడా ఇదే వాదన /దావాతో షేర్ చేయబడిన ఈ వీడియోను మేము గమనించాము.

FACT CHECK

వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి బృందం inVID(video verification tool/వీడియో ధృవీకరణ సాధనం) ఉపయోగించి,ఆ ఫ్రేమ్‌లను Googleలో రివర్స్ ఇమేజ్ లో పరిశిలన చేయగా, సుజిత్ రామచంద్రన్ అనే వినియోగదారుడు అదే వీడియోను డిసెంబర్ 26న Facebookలో షేర్ చేస్తూ క్రింది విధంగా పోస్ట్ చేయడం గమనించాము.

നാടൊട്ടുക്കു പിരിവ്!
കടക്കൽ നിന്ന് കുളത്തുപ്പുഴക്ക് കുടുംബവുമായി സഞ്ചരിച്ച യുവാവിന് ഓന്തുപച്ച എന്ന സ്ഥലത്തു വെച്ച് സംഭവിച്ചത്
അരങ്ങിൽ : ജിഷ്ണു മഴവില്ല് , സുർജിത്, ബൈജു, സിദ്ധീഖ്, നൗഷാദ്, മഹേഷ്‌, വിജയൻ കടക്കൽ, ജ്യോതിഷ് & പിച്ചു
അണിയറയിൽ :സുജിത് രാമചന്ദ്രൻ
(తెలుగు అనువాదం: దేశవ్యాప్తంగా సేకరణ! కుటుంబ సమేతంగా కటకల్ నుంచి కులతుపూజకు వెళ్తున్న ఓ యువకుడికి ఈ సంఘటన జరిగింది.
తారాగణం:Jishnu Mazhavil, Surjit, Baiju, Siddique, Naushad, Mahesh, Vijayan Katakal, Jyotish & Pichu,Sujith Ramachandran.
Disclaimer/డిస్క్లైమర్: అవగాహన కోసం వీడియో సృష్టించబడింది.)

మొదట్లో, డిసెంబర్ 26న వీడియోను షేర్ చేసినప్పుడు, “దేశవ్యాప్త సేకరణ! కటకుట్ నుండి కులతుపూజకు కుటుంబంతో ప్రయాణిస్తున్న యువకుడి పరిస్థితి ఏమైంది” అనే క్యాప్షన్ మాత్రమే ఉంది. అయితే క్యాప్షన్ డిసెంబర్ 27న సవరించబడింది.. సవరించ క్యాప్షన్‌లో వీడియోలోని వ్యక్తుల పేరు మరియు డిస్‌క్లైమర్ జత చేయబడింది. (మొదట్లో షేర్ బడిన వీడియో క్రింద మరియు డిస్‌క్లైమర్ జత చేసి సవరించిన వీడియో పైన చూడవచ్చును.|)

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact checks:

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన

 

 

ఇటీవల కాలంలో రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబు ప్రూఫ్ బస్సులను బహుమతిగా ఇచ్చారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇటీవలే టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబు ప్రూఫ్ బస్సులను విరాళంగా ఇచ్చారు.

నిర్ధారణ/Conclusion: తప్పు. గతం లో ఈ బస్సులను మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) 2017లో CRPFకి అందించింది.

రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం

వాస్తవ పరిశీలన వివరాలు

టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా యొక్క ఫోటోతో పాటు సాయుధ బస్సు(సాయుధ బస్సు అనేది ఒక రకమైన బస్సు , ఇది ప్రయాణీకులకు/సైన్యానికి, సాధారణంగా చిన్న ఆయుధాలు మరియు పేలుడు పరికరాల నుండి ఎక్కువ రక్షణను కల్పిస్తుంది) ఫోటోను చూపించే దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రతన్ టాటా ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తన దాతృత్వ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందారు. ఇటీవల  ఆయన భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబు ప్రూఫ్ బస్సులను బహుమతిగా ఇచ్చారని ఒక వాదన సోషల్ మీడియా లో షేర్ చేయబడింది.

ఫేస్ బుక్ లో షేర్ చేసిన పోస్ట్‌ను ఇక్కడ చూడండి.

ఇది సోషల్ మీడియాలో ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

Digiteye India బృందం వారు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా, ఈ సాయుధ బస్సు హైదరాబాద్‌కు చెందిన మెటల్ తయారీ గ్రూప్ ‘మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI)’ 2017లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి అందించినట్లు గమనించారు.

సెప్టెంబరు 7, 2017న ఒక ట్వీట్‌లో CRPF ఈ విషయం  తెలియజేసారు.
ఈ బస్సుల బాడీని టాటా మోటార్స్ తయారు చేయగా,భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ(Public Sector Undertaking ) అయిన MIDHANI ద్వారా పూర్తి సాయుధ వాహనంగా  తయారు చేయబడి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు అందించబడినది.

ట్వీట్‌లో ఈ విధంగా ఉంది: “మిధాని తయారు చేసిన ఆర్మర్డ్ బస్సు మరియు భాభా కవాచ్, తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను #మేక్‌ఇన్‌ఇండియా కింద ఈరోజు సీఆర్‌పీఎఫ్‌ డీజీ కి అందజేశారు.
మరియు, MIDHANI లిమిటెడ్ తన వార్షిక నివేదిక 2017-18లో, దిగువ చూపిన విధంగా దీనిని ధృవీకరించింది.

బుల్లెట్ ప్రూఫ్ బస్సును ప్రధానంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉపయోగించేందుకు మిధానీ రూపొందించింది.అదనంగా, మిధానీ లిమిటెడ్ CRPFకి భాభా కవాచ్ (లైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్) మరియు కొన్ని ఆయుధాలను కూడా బహుమతిగా ఇచ్చింది. అందువల్ల, ఈ వాదన/దావా తప్పు.

అయితే, టాటా మోటార్స్ వారు ఇటీవల కాలం లో కాకుండా, గతంలో(ఫిబ్రవరి 2019లో) CRPFకు ఒక బస్సును తయారు చేసి బహుమతిగా ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఫిబ్రవరి 2019లో CRPF జవాన్లపై జరిగిన ఘోరమైన పుల్వామా దాడి తరువాత, టాటా గ్రూప్ జవాన్లకు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సును బహుమతిగా అందించింది, మరియు ఇక్కడ Instagramలో షేర్ చేయబడింది.

 

మరి కొన్ని Fact Checks:

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check

పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check