Tag Archives: modi

BJP West Bengal Unit shares Singapore Metro image as Modi's contribution to India: Fact Check

సింగపూర్ మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్ను, ప్రధాని మోదీ సాధించిన ఘనతగా పశ్చిమ బెంగాల్ బీజేపీ వాళ్ళు షేర్ చేసారు: వాస్తవ పరిశీలన

వాదన/Claim: మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్, ప్రధాని మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగము వారిచే చేయబడిన వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. సింగపూర్‌లోని జురాంగ్ మెట్రో ఇమేజ్ను/చిత్రాన్ని, మోదీ సాధించిన ఘనతగా చూపబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బిజెపి సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారతదేశం యొక్క మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషికి అభినందనలు తెలిపారు.

బెంగాలీలో దావా ఇలా ఉంది: কর্মসংস্থান না বাড়লে কীভাবে ভারতের শহরে শহরে পৌঁছে গেল মেট্রো পরিষেবা? কংগ্রেস বলবে, বিজেপি করবে!” [బెంగాలీ అనువాదం ఇలా ఉంది: “ఉపాధిని పెంచకుండా మెట్రో సేవలు భారతదేశంలోని నగరాలకు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ మాటలు చెబుతుంది, బీజేపీ చేసి చూపిస్తుంది!”]

భారత్‌లో మోడీ సాధించిన విజయానికి సంబంధించి,ఈ ఇమేజ్ ను ఆయనకు ఆపాదించడం గురించి వినియోగదారులు ప్రశ్నిస్తూన్న ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.  పోస్టర్‌లో ఉపయోగించిన రైల్వే లైన్ సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ MRT చిత్రమని, భారతదేశంలోనిది కాదని పలువురు X వినియోగదారులు సూచించారు.

FACT CHECK

Digiteye India టీం జురాంగ్ ఈస్ట్ MRT చిత్రాల కోసం వెతకగా, BJP యొక్క పశ్చిమ బెంగాల్ విభాగము  వికీపీడియాలో ఉపయోగించిన చిత్రాన్ని తీసుకొని అది మోడీచే నిర్మించబడిందని వాదన/దావా చేయడం జరిగిందని గుర్తించాము. జురాంగ్ ఈస్ట్ MRT స్టేషన్ అనేది సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్‌లో ఒక ఎత్తైన కూడలి, ఇది సింగపూర్ యొక్క SMRT ట్రైన్స్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది.

మరిన్ని వివరాల కోసం Digiteye India టీం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని పరిశీలించగా,ఇదే చిత్రాన్నిఫిబ్రవరి 13, 2020న సింగపూర్‌కు చెందిన “ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లో”  ప్రచురించబడిందని మేము గుర్తించాము.
“ట్రాక్ లోపం వల్ల చోవా చు కాంగ్ మరియు జురాంగ్ ఈస్ట్ మధ్య MRT ప్రయాణానికి అంతరాయం” ఏర్పడిందనే శీర్షికతో ప్రచురించబడింది.

మౌలిక సదుపాయాల పరంగా సాధించిన విజయాన్ని క్లెయిమ్ చేయడానికి బిజెపి విభాగము తప్పు చిత్రాన్ని ఉపయోగించడం ఇదేం మొదటిసారి కాదు. 2021లో ఉత్తరప్రదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌వే గురించి ఇదే విధమైన వాదనను Digiteye India బృందం తప్పని నిరూపించింది.

అందువల్ల, సంబంధం లేని ఫోటోతో చేసిన వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారా? వాస్తవ పరిశీలన

SC/ST/OBC రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా తెలంగాణ బహిరంగ సభలో చెప్పారా; వాస్తవ పరిశీలన

 

 

మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: ఈ వాదన తప్పు. రాహుల్ గాంధీ ‘మోదీ మళ్లీ ప్రధాని అవుతారని’ చెపుతున్నట్లుగా ఆయన గొంతు/వాయిస్ మార్చబడింది.

రేటింగ్: పూర్తిగా తప్పు

వాస్తవ పరిశీలన వివరాలు:

నరేంద్ర మోడీ మళ్లీ భారత ప్రధాని కాబోతున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ ర్యాలీలో చెప్పినట్లుగా వాట్సాప్‌లో సంచలనాత్మక వీడియో షేర్ చేయబడుతోంది.దిగువ చూపిన విధంగా ఇది Xలో కూడా షేర్ చేయబడింది:

FACT-CHECK

మొత్తం ఏడు దశలలో నాలుగు దశల లోక్‌సభ ఎన్నికలు జరిగిన తర్వాత ఇది సంచలనం కావడంతో Digiteye India టీమ్ ఈ పోస్ట్ యొక్క వాస్తవ పరిశీలన చేపట్టింది.

మొదట, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మోదీకి అనుకూలంగా మాట్లాడటం అసంభవం మరియు అహేతుకం. రెండవది,పెదవి-సమకాలీకరణ దృశ్యం భిన్నంగా కనిపిస్తుండడంతో,ఇది వాయిస్ ట్రాక్ మార్చబడిందని సూచిస్తుంది.ఇంకా,మేము ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) అధికారిక వెబ్‌సైట్ మరియు ట్విట్టర్‌లోని సోషల్ మీడియా హ్యాండిల్‌ను పరిశీలించాము.

ఈ వీడియోకు ప్రతిస్పందనగా, INCఈ వాదనను వెంటనే ఖండించింది మరియు ఇక్కడ చూసినట్లుగా వీడియో యొక్క నకిలీ మరియు నిజమైన వీడియోను అందుబాటులో ఉంచింది.

ఇంకా, INC ఇలా పేర్కొంది,  “डूबती हुई BJP और नरेंद्र मोदी की फेक न्यूज फैक्ट्री को अब फेक वीडियो का ही सहारा है। आदतन राहुल गांधी जी के भाषण को कांट-छांटकर झूठा वीडियो बनाया और फिर रंगे हाथों पकड़े गए। आप खुद देख लें  [తెలుగులో అనువాదం:మునిగిపోతున్న బీజేపీ మరియు నరేంద్ర మోదీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఇప్పుడు కేవలం ఫేక్ వీడియోలపైనే ఆధారపడాల్సి వస్తోంది. అలవాటు ప్రకారం రాహుల్ గాంధీ ప్రసంగాన్ని ఎడిట్ చేసి ఫేక్ వీడియో చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.మీరే స్వయంగా చూడవచ్చు.👇”.]

కాబట్టి, వీడియో వాదన/దావా పూర్తిగా తప్పు.

మరి కొన్ని Fact checks:

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన

భారత కూటమికి రికార్డు స్థాయిలో ఓటు వేసినందుకు ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారా? వాస్తవ పరిశీలన


					

ఈ వీడియోలో 26 ఏళ్ల వయసు ఉన్న ప్రధాని మోదీ కేదార్‌నాథ్ వద్ద యోగా ముద్రలో ఉన్నట్టు కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:ప్రధాని మోదీ తన 26 ఏళ్ల వయసులో కేదార్‌నాథ్ ఆలయంలో హ్యాండ్‌స్టాండ్ యోగా ముద్రను ప్రదర్శించారని, ఇది మోదీజీకి సంబంధించిన అరుదైన వీడియో అనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వీడియోలో హ్యాండ్‌స్టాండ్ యోగా చేస్తున్న వ్యక్తి “ఆచార్య సంతోష్ త్రివేది”గారిది, 26 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ప్రధాని మోదీగారిది కాదు.

రేటింగ్: పూర్తిగా తప్పు —

ఒక యోగి తన చేతులపై తలక్రిందులుగా నడుస్తున్నవీడియోలో, ఇతను ఏదో ఒక రోజు భారత ప్రధాని అవుతారని ఎవరూ అనుకోలేదు, పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని ప్రస్తావిస్తూ చేస్తున్న దావా/వాదన సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.

ఇదే వాదన/దావాతో పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ హిందీ భాషలో షేర్ చేయబడింది. అనువాదం ఇలా ఉంది:
“ఈ వీడియో తీసినప్పుడు ఈ యోగి ఏదో ఒకరోజు దేశానికి ప్రధాని అవుతారని ఊహించి ఉండరు.అటువంటి దివ్యమైన ఆత్మ. మంచు(హిమపాతం) మధ్య తలక్రిందులుగా చేతులతో నడుస్తూ కేదార్‌నాథ్‌కు ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాంటి ఆత్మలు భూమిపైకి వచ్చినప్పుడల్లా చాలా మంది వారిని దుర్భాషలాడారు. కానీ ఈరోజు ఆయన పూజలందుకుంటున్నారు.”

ఇదే వీడియోని  ఏడాది క్రితం ప్రధాని మోదీకి 26 ఏళ్ల వయసులో యోగ చేస్తుండగా తీసిన వీడియో అని నేరుగా క్లెయిమ్ చేస్తూ షేర్ చేసినట్లు గమనించాము.తెలుగు అనువాదం ఇలా ఉంది: “రిషికేశ్‌లోని సాధు దయానంద్ జీ ఆశ్రమంలో యోగా నేర్చుకున్నప్పుడు అతని వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు. ఈరోజు మన ప్రధానమంత్రి అయిన ఈ సన్యాసి/యోగిని గుర్తించండి. మోదీజీకి సంబంధించిన అరుదైన వీడియో ఇది.”

FACT-CHECK:

వీడియోలో ఉన్న వ్యక్తి ప్రధాని మోదీని పోలి లేనందున, Digiteye ఇండియా బృందం , వీడియో నుండి కొన్ని ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో తనిఖీ చేసి, వీడియో యొక్క ప్రామాణికతను పరిశీలించగా, శ్రీ కేదార్ 360 ట్రస్ట్ వారి అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో జూన్ 21,2021న అప్‌లోడ్ చేసిన అసలైన వీడియోను గమనించాము.

వీడియో క్యాప్షన్‌ ఈ విధంగా ఉంది:
“తీర్థ పురోహిత్ ‘ఆచార్య శ్రీ సంతోష్ త్రివేది’ కేదార్‌నాథ్ ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శ్రీ ఆచార్య జీ కలిగి ఉన్న నైపుణ్యం మరియు యోగ్యత ఆదర్శప్రాయమైనది మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులకు ప్రేరేపణ కలిగిస్తుంది. జై శ్రీ కేదార్నాథ్.”

2021న వైరల్ చిత్రం సోషల్ మీడియా సర్కిల్‌లలో కనిపించడానికి ఒక సంవత్సరం ముందే, అనగా మార్చి 24, 2020న వార్తా సంస్థ ANI, ఆచార్య శ్రీ సంతోష్ త్రివేది కేదార్‌నాథ్ ఆలయంలో హ్యాండ్‌స్టాండ్(తలక్రిందులుగా) యోగా ముద్రను ప్రదర్శించిన నివేదికను ప్రచురించిందని తదుపరి పరిశోధనలో వెల్లడైయింది.
అందుకే, ప్రధాని మోదీ 26 ఏళ్ల వయసులో హ్యాండ్‌స్టాండ్ యోగా ముద్రను ప్రదర్శిస్తున్నట్లు వీడియోలో కనబడుతుందనే వాదన తప్పు.

మరి కొన్ని Fact Checks:

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

మోడీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారా?నకిలీ చిత్రం మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/claim:మోడీ స్వయంగా టోపీ పెట్టుకోరు కానీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారనేది వాదన/claim.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ అయిన చిత్రం ఫోటోషాప్ చేయబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

కాషాయ వస్త్రాలు ధరించిన అబుదాబి పాలకుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘MBZ’తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగిన చిత్రం వాట్సాప్‌లో షేర్ చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: “ఈయన మోడీ! ఆయనే టోపీ ధరించరు, కానీ షేక్‌ను దేవుని చిత్రాలు కలిగి ఉన్న కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారు.”ప్రస్తుతం (ఫిబ్రవరి 2024) యుఎఇలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఇది వైరల్ అవుతోంది.

FACT CHECK

Digiteye India బృందం WhatsAppలో వాస్తవ పరిశీలన కోసం ఈ అభ్యర్థనను అందుకుంది.మా బృందం Google ఇమేజ్ సెర్చ్‌లో చిత్రం కోసం చూడగా, ఇది 2021లో షేర్ చేయబడిన పాత చిత్రం అని మరియు సోషల్ మీడియాలో కనిపించిన ప్రతిసారీ వాస్తవం పరిశీలించే వారిచే తప్పుగా నిరూపించబడినట్లు గమనించాము. మరింత పరిశీలించగా, ఈ సందర్భం 2021న ప్రధాని మోడీ UAEని సందర్శించినప్పటిదని,అక్కడ ఆయనకి UAE యొక్క ప్రతిష్టాత్మక జాయెద్ మెడల్ లభించింది.

మేము ఒరిజినల్(అసలు) చిత్రం కోసం వెతకగా, అధికారిక PIB వెబ్ సైట్లో ఒక చిత్రాన్ని గుర్తించగలిగాము. అక్కడ ఇద్దరు నాయకులు కరచాలనం చేసుకుంటున్న  మరియు భారత ప్రధానికి UAE పతకాన్ని అందించిన చిత్రమని తెలుస్తుంది.

ఒరిజినల్(అసలు) క్లెయిమ్ ప్రకారం UAE పాలకుడు కాషాయ వస్త్రాలలో కనిపించటం లేదు, కానీ మోడీ మెడల్ మాత్రం రెండు చిత్రాలలో స్పష్టమైన పోలిక కలిగి ఉంది. క్యాప్షన్ ఇలా ఉంది: “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కి ఆగస్ట్ 24,2019న UAEలోని అబుదాబిలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వారా UAE యొక్క అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ అందజేయబడింది.” ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన చిత్రాన్ని క్రింద చూడవచ్చు:

The Prime Minister, Shri Narendra Modi being conferred with the UAE’s highest civilian award ‘Order of Zayed’ by the Crown Prince of Abu Dhabi, Sheikh Mohammed Bin Zayed Al Nahyan, at Abu Dhabi, in UAE on August 24, 2019. (PIB)

కావున, చిత్రం నకిలీది,మరియు UAE పాలకున్నీ కాషాయ వస్త్రాలలో చూపించడానికి ఫోటోషాప్ చేయబడింది.

మరి కొన్ని Fact Checks

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల అధ్యక్షుడు భారత ప్రధాని మోడీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారా?; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత ప్రధాని మోదీపై తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారతీయులకు క్షమాపణలు చెప్పారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ట్వీట్ చేయలేదు.

రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం –

వాస్తవ పరిశీలన యొక్క వివరాలు:

మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు,పర్యాటకం కోసం లక్షద్వీప్ దీవులను ప్రోత్సహిస్తున్న మోడీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నసందేశం/మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపధ్యంలో,మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ,ఆయన ముగ్గురు మంత్రులు మోదీపై అలాంటి అవమానకర వ్యాఖ్యలను చేసినందుకు భారతీయులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారంటూ X ప్లాట్ఫారం లో (గతంలో ట్విట్టర్) సందేశం వైరల్ అవుతోంది.

తొలగించబడిన సందేశం యొక్క స్క్రీన్ షాట్ కింద చూడవచ్చు:

ప్రెసిడెంట్ ముయిజ్జూ అధికారిక ‘X’ ఖాతాలో ట్వీట్ ఇలా పేర్కొంది:
“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలకు మా మంత్రుల తరపున, నేను భారతీయ మిత్రులకు చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాను.భారతదేశం నుండి స్నేహితులకు స్వాగతం పలికేందుకు మరియు మన దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంచేయడాన్ని ఆకాంషిస్తున్నాను.”

ఈ ట్వీట్ జనవరి 7న పోస్ట్ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఇక్కడ మరియు ఇక్కడ అనేక వ్యాఖ్యలతో దీనిని రీట్వీట్ చేశారు.
అయితే, మోదీని “ఉగ్రవాది” మరియు “ఇజ్రాయెల్ తోలుబొమ్మ” అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకుగాను ముగ్గురు మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేశారు.

FACT CHECK

Digiteye India టీమ్‌కు వాస్తవాన్ని పరిశీలన చేయమని అభ్యర్థన వచ్చినప్పుడు,వారు మొదట మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ అధికారిక ‘X’ ఖాతాను సందర్శించి, ట్వీట్ కోసం వెతకగా అది ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదు.వాస్తవానికి, అతను తన చివరి సందేశాన్ని జనవరి 5, 2024న తన అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేసారు.

సోషల్ మీడియా మానిటరింగ్ టూల్ ‘Social Blade’ ద్వారా, జనవరి 5, 2024 తర్వాత ప్రెసిడెంట్ ముయిజ్జూ వైపు నుండి ఎటువంటి సందేశం తొలగించబడలేదని మేము తెలుసుకున్నాము,కాబట్టి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ‘తొలగించబడిన ట్వీట్‘ అనే అవకాశమే లేదు.మరియు క్షమాపణకు సంబంధించిన వార్తల కోసం పరిశీలించగా, ఇప్పటివరకు విశ్వసనీయ వర్గాలనుండి ఎలాంటి సమాచారం కనపడలేదు.

అందువల్ల, ప్రెసిడెంట్ ముయిజ్జూ ‘X’లో (గతంలో ట్విట్టర్‌)వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతూ చేసిన ట్వీట్ మార్ఫింగ్ చేయబడింది లేదా డిజిటల్‌గా మార్చబడింది.అయితే, ప్రధాని మోదీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు సస్పెండ్ అయిన మాట మాత్రం వాస్తవం.

మరి కొన్ని Fact checks:

లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్ బ్లాక్ ఫ్రైడే రోజున చోరీకి గురైందా? వాస్తవ పరిశీలన

ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ నిరసనకారులపై కారు దూసుకెళ్లిందనే వాదన; వాస్తవ పరిశీలన

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: 25,000 హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య గురించి కాకుండా, డిసెంబర్ 2023లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ కి సంబంధించిన వీడియో.

రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

జనవరి 22, 2024న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు దాదాపు ఇరవై ఐదు వేల(25,000) హోమ గుండాలు సిద్ధమవుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో చూపిన విధంగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోమ గుండాలను ఏర్పాటు చేస్తున్నట్లు దావా పేర్కొంది.హిందీలో ఈ విధంగా పోస్ట్ చేసారు:“इन 25000 हजार हवन कुंडो से होगा “राम मंदिर” का उद्घाटन… जय श्री राम” [తెలుగు అనువాదం:ఈ ఇరవై ఐదు వేల(25,000)హోమ గుండాలు “రామమందిర్” ప్రారంభోత్సవానికి ఉపయోగించబడతాయి … జై శ్రీరామ్ ]

FACT CHECK

Digiteye India బృందం ఈ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలించగా, 2023 డిసెంబర్‌లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ మహోత్సవానికి సంబంధించిన వీడియో అని,అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధం లేదని గమనించాము.

ఈ వార్త/మహాత్సవాన్ని, పై వీడియో చూపినట్లుగా స్థానిక ఛానెల్ “అరుణ్ విలేజ్ బాయ్ వ్లాగ్” ద్వారా డిసెంబర్ 16, 2023న యూట్యూబ్లో (You Tube)అప్‌లోడ్ చేయబడింది.వీడియో శీర్షిక హిందీ లో ఇలా ఉంది:स्वर्वेद महामंदिर धाम वाराणसी 25 हजार हवन कुंड | एक साथ सभी को जगाया जाएगा ! Swarved Maha Mandir Dham” [తెలుగు అనువాదం: స్వర్వేద్ మహామందిర్ ధామ్ వారణాసి 25 వేల హోమ గుండాలు . అవన్నీ ఒకేసారి వెలిగించబడతాయి”.]

మేము మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా, క్రింద చూపినట్లుగా మరొక వీడియోను గమనించాము.

స్వర్వేద్ మహామందిర్ ధామ్‌లోని హోమ గుండాలలో అనేక మంది వ్యక్తులు యజ్ఞం చేస్తున్నట్టు చూపించే ఇలాంటి వీడియోలను అనేకం చూడవచ్చు.వారణాసిలోని ఉమ్రాహా ప్రాంతంలో ఉన్న అతి పెద్ద ఆలయమైన స్వర్వేద్ మహామందిర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు వార్తా నివేదికలు ధృవీకరిస్తున్నాయి.

కాబట్టి,హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించినదనే వాదన తప్పు.

మరి కొన్నిFact Checks:

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన