వాదన/Claim: ఇటీవలే టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబు ప్రూఫ్ బస్సులను విరాళంగా ఇచ్చారు.
నిర్ధారణ/Conclusion: తప్పు. గతం లో ఈ బస్సులను మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) 2017లో CRPFకి అందించింది.
రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం–
వాస్తవ పరిశీలన వివరాలు
టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా యొక్క ఫోటోతో పాటు సాయుధ బస్సు(సాయుధ బస్సు అనేది ఒక రకమైన బస్సు , ఇది ప్రయాణీకులకు/సైన్యానికి, సాధారణంగా చిన్న ఆయుధాలు మరియు పేలుడు పరికరాల నుండి ఎక్కువ రక్షణను కల్పిస్తుంది) ఫోటోను చూపించే దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రతన్ టాటా ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తన దాతృత్వ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందారు. ఇటీవల ఆయన భారత సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ మరియు బాంబు ప్రూఫ్ బస్సులను బహుమతిగా ఇచ్చారని ఒక వాదన సోషల్ మీడియా లో షేర్ చేయబడింది.
ఫేస్ బుక్ లో షేర్ చేసిన పోస్ట్‌ను ఇక్కడ చూడండి.
ఇది సోషల్ మీడియాలో ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.
FACT CHECK
Digiteye India బృందం వారు గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా, ఈ సాయుధ బస్సు హైదరాబాద్‌కు చెందిన మెటల్ తయారీ గ్రూప్ ‘మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (MIDHANI)’ 2017లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కి అందించినట్లు గమనించారు.
సెప్టెంబరు 7, 2017న ఒక ట్వీట్‌లో CRPF ఈ విషయం తెలియజేసారు.
ఈ బస్సుల బాడీని టాటా మోటార్స్ తయారు చేయగా,భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ సంస్థ(Public Sector Undertaking ) అయిన MIDHANI ద్వారా పూర్తి సాయుధ వాహనంగా తయారు చేయబడి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)కు అందించబడినది.
Armored Bus and Bhabha Kavach, light weight BP jacket manufactured under #MakeInIndia by MIDHANI handed over to DG CRPF today. pic.twitter.com/QTnWLdCquc
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) September 7, 2017
ట్వీట్‌లో ఈ విధంగా ఉంది: “మిధాని తయారు చేసిన ఆర్మర్డ్ బస్సు మరియు భాభా కవాచ్, తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను #మేక్‌ఇన్‌ఇండియా కింద ఈరోజు సీఆర్‌పీఎఫ్ డీజీ కి అందజేశారు.
మరియు, MIDHANI లిమిటెడ్ తన వార్షిక నివేదిక 2017-18లో, దిగువ చూపిన విధంగా దీనిని ధృవీకరించింది.
బుల్లెట్ ప్రూఫ్ బస్సును ప్రధానంగా జమ్మూ కాశ్మీర్‌లో ఉపయోగించేందుకు మిధానీ రూపొందించింది.అదనంగా, మిధానీ లిమిటెడ్ CRPFకి భాభా కవాచ్ (లైట్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్) మరియు కొన్ని ఆయుధాలను కూడా బహుమతిగా ఇచ్చింది. అందువల్ల, ఈ వాదన/దావా తప్పు.
అయితే, టాటా మోటార్స్ వారు ఇటీవల కాలం లో కాకుండా, గతంలో(ఫిబ్రవరి 2019లో) CRPFకు ఒక బస్సును తయారు చేసి బహుమతిగా ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఫిబ్రవరి 2019లో CRPF జవాన్లపై జరిగిన ఘోరమైన పుల్వామా దాడి తరువాత, టాటా గ్రూప్ జవాన్లకు ఒక బుల్లెట్ ప్రూఫ్ బస్సును బహుమతిగా అందించింది, మరియు ఇక్కడ Instagramలో షేర్ చేయబడింది.
మరి కొన్ని Fact Checks:
శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check
MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check
పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్ కణాలను నాశనం చేయగలదా? Fact Check