Tag Archives: china

Is Rahul Gandhi carrying a copy of Chinese Constitution instead of Indian constitution in public rallies? Fact Check

రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని తీసుకువెళుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో భారత రాజ్యాంగానికి బదులు చైనా రాజ్యాంగం కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.రాహుల్ గాంధీ చైనా రాజ్యాంగాన్ని కాకుండా గోపాల్ శంకరనారాయణన్ (EBC ద్వారా ప్రచురించబడింది) వ్రాసిన భారత రాజ్యాంగంతో (కోటు పాకెట్ పుస్తకం) కనిపిస్తున్నారు.

రేటింగ్: పూర్తిగా తప్పు

Fact Check వివరాలు:

ఇటీవల అనేక ర్యాలీలలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత రాజ్యాంగం యొక్క ఎరుపు రంగు కాపీని ప్రదర్శిస్తూ కనిపిస్తుండంతో,అతని ప్రత్యర్థులు ఆ కాపీ చైనా రాజ్యాంగం కాపీ అని, భారత రాజ్యాంగం కాదని పేర్కొనడం జరిగింది.

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాస్ శర్మ పోస్ట్ చేసిన దావాను క్రింద చూడండి:

భారత రాజ్యాంగం కవర్ నీలం రంగులో ఉంది. చైనా రాజ్యాంగం కవర్ ఎరుపు రంగులో ఉంది. రాహుల్ చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తూ కనిపిస్తున్నారా? ధృవీకరించవలసిన అవసరం ఉంది.

“రాహుల్ తన సమావేశాలకు హాజరయ్యే ప్రజలకు ఎరుపు రంగులో ఉన్న చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారు.నీలి రంగులో ఉన్న మన రాజ్యాంగం, ‘రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు’ అనే అధ్యాయాన్ని కలిగి ఉంది.ఈ అధ్యాయం మన దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ని అమలు చేయడం ఒక విధి అని సూచిస్తుంది.దీన్ని ఇప్పుడు రాహుల్ వ్యతిరేకిస్తున్నారు.అందుకే అతని చేతిలో ఉన్న రాజ్యాంగం తప్పనిసరిగా చైనాదేనని నేను ఖచ్చితంగా భావిస్తున్నానని”ఆయన మరుసటి రోజు,మే 18, 2024న సమర్ధించుకున్నారు.

పైన ట్వీట్‌లో చూసినట్లుగా, ఎరుపు రంగు కవర్‌తో ఉన్న చైనా రాజ్యాంగం మరియు మరొకటి నీలం రంగు కవర్‌తో ఉన్న భారత రాజ్యాంగం చూడవచ్చు.ఈ ట్వీట్ వైరల్‌గా మారి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

FACT-CHECK

తన ఇటీవలి బహిరంగ ర్యాలీలన్నింటిలో, రాహుల్ గాంధీ ఎరుపు రంగు కవర్‌తో ఉన్న పుస్తకంతో కనిపించారు.భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు,ఒకే విధమైన ప్రాథమిక హక్కులతో పేదలు మరియు ధనికుల మధ్య సమానత్వాన్ని నిర్ధారించిన రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.మేము పుస్తకాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు, ఎరుపు కాపీపై “భారత రాజ్యాంగం” అని స్పష్టంగా వ్రాయబడిందని మేము గ్రహించాము.Digiteye బృందం పుస్తకాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు,ఎరుపురంగు కాపీపై “భారత రాజ్యాంగం” అని స్పష్టంగా వ్రాయబడిందని మేము గమనించాము.

ఆంగ్లంలో మరియు చేతితో వ్రాసిన అసలు భారత రాజ్యాంగం ఇక్కడ చూడవచ్చు:

అయితే, ఎరుపు రంగు కవర్‌తో ఉన్న భారత రాజ్యాంగం పుస్తకం, గోపాల్ శంకరనారాయణన్ వ్రాసిన ‘కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (కోట్ పాకెట్ ఎడిషన్)’ అనే ప్రత్యేక సంచికను ఈస్టర్న్ బుక్ కంపెనీ (EBC) ప్రచురించింది, ఇది EBC వెబ్‌స్టోర్‌లో మరియు అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ లో కూడా అందుబాటులో ఉంది:

కావున,రాహుల్ గాంధీ బహిరంగ సభల్లో ప్రదర్శిస్తున్న కాపీ,గోపాల్ శంకరనారాయణన్ వ్రాసిన EBC ఎడిషనని తెలుస్తుంది.
చైనీస్ రాజ్యాంగం కూడా ఎరుపు రంగులో కనిపిస్తుంది, కానీ కవర్ పైన అక్షరాలు దివువన ఉండడం చూడవచ్చు.

కాబట్టి, ఈ వాదన తప్పుడు వాదన.
మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన

చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో తమ అభ్యర్థులను నిలబెట్టటంలేదా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: చైనాకు భయపడి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో అభ్యర్థులను నిలబెట్టటంలేదనేది వాదన.

నిర్ధారణ/Conclusion: పోస్ట్‌లో చేసిన వాదన/దావా తప్పు. మరియు దీనికి విరుద్ధంగా,రాబోయే అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను నిలబెడుతోంది.అదనంగా, భారత ఎన్నికల సంఘం డేటా 2004 నుండి కాంగ్రెస్ పార్లమెంటరీ ఎన్నికలలో స్థిరంగా పాల్గొంటుందని నిర్ధారిస్తుంది.

రేటింగ్: పూర్తిగా తప్పు -- 

వాస్తవ పరిశీలన వివరాలు:

చైనా కలవరపడుతుందనే ఆందోళన కారణంగా రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఎవరినీ నామినేట్ చేయలేదనే వాదనతో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది.రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇలాంటి కారణాల వల్ల అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించకుండా తప్పించుకుందని పరోక్షంగా ఆరోపించబడింది.

పోస్ట్‌ ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

గతంలో అరుణాచల్ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర నివారించిందని వచ్చిన వాదనను Digiteye India బృందం తప్పు అని నిరూపించింది.

అరుణాచల్ ప్రదేశ్లో 60 అసెంబ్లీ మరియు 2 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19, 2024న ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి.
నిజానికి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలబెట్టింది. అభ్యర్థుల ప్రకటనను ఇక్కడ చూడవచ్చు.

 

ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న డేటా కాంగ్రెస్ రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నామినేట్ చేసిందని మరియు వారి అభ్యర్థిత్వం ఆమోదించబడిందని నిర్ధారిస్తుంది.

 

అంతేకాకుండా, అరుణాచల్ ప్రదేశ్‌లో పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించిన చారిత్రక డేటాను కూడా ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో చూడవచ్చు.అభ్యర్థుల అఫిడవిట్‌లను చూస్తే 2004 నుండి ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ స్థిరంగా పాల్గొంటుందని తెలుస్తుంది.

“రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర” యొక్క దావాకు సంబంధించి, నిజానికి ఆ యాత్ర జనవరి 2024లో అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందని రికార్డులు చూపిస్తున్నాయి.
రాహుల్ గాంధీ దృశ్యలు చూస్తే ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లో యాత్ర సాగించారని తెలుస్తుంది. ఈ దావాపై Digiteye India బృందం చేసిన వాస్తవ పరిశీలన ఇక్కడ చూడవచ్చు.

కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని అసెంబ్లీ మరియు పార్లమెంటరీ నియోజకవర్గాలకు అభ్యర్థులను నామినేట్ చేసినందున, చైనాకు భయపడి కాంగ్రెస్ అరుణాచల్ ప్రదేశ్‌లో అభ్యర్థులను నిలబెట్టలేదనే వాదన అబద్ధం.


మరి కొన్ని Fact Checks:

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ ఇటలీ దేశానికి వెళ్లేందుకు తన భారత్ జోడో న్యాయ్ యాత్రను 10 రోజుల పాటు నిలిపివేశారా? వాస్తవ పరిశీలన

అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభించారని మరియు దానికి భారత మన  రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుపెట్టారనేది ఒక వాదన.

నిర్ధారణ/Conclusion:వాదనలో పేర్కొన్న విధంగా, అమెరికాలో ఎటువంటి లైబ్రరీ ప్రారంభించబడలేదు మరియు అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టబడలేదు.వైరల్ అవుతున్న చిత్రం మార్చి 2018లో ప్రారంభించబడిన చైనాలోని ఒక లైబ్రరీ చిత్రం.

రేటింగ్: పూర్తిగా తప్పు —

వాస్తవ పరిశీలన వివరాలు:

యునైటెడ్ స్టేట్స్(అమెరికా) ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని ప్రారంభించిందని మరియు దానికి మన  భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక పోస్ట్ పేర్కొంది.

“भारत देश के मसीहा डॉ .भीम राव अम्बेदकर जी के नाम अमेरिका ने खोलाविश्व का सबसे बडा पुस्तकालय , नमस्ते अमेरिका , जय भीम, जय भारत, जय संविधान.”[తెలుగు అనువాదం:యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని ప్రారంభించింది మరియు దానికి మన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టారు. నమస్తే అమెరికా, జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.]

 

వాదన/దావాకు మద్దతుగా, అరలో అనేక పుస్తకాలు అమర్చబడిన తెల్లటి భవనాన్ని కూడా చూడవచ్చు.

Fact Check

గతంలో ఇదే విధమైన వాదనని తప్పని నిరూపించినందున,ఈ వాదనని కూడా Digiteye India team వారు పరిశీలించారు. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో తెలుపు భవనం యొక్క చిత్రంని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, అమెరికాలో కాకుండా చైనాలో ఉన్న అసలు భవనాన్ని కనుగొన్నాము. ఈ భవనం చైనాలోని టియాంజిన్‌లోని బిన్‌హై లైబ్రరీకి చెందినది. క్రింద చూపిన విధంగా అనేక వార్తా నివేదికలు (CNN)  కూడా ఇదే సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి:

టియాంజిన్ బిన్హై లైబ్రరీ MVRDV నిర్మించిన అత్యంత వేగవంతమైన ప్రాజెక్ట్ అని ఇతర నివేదికలు ధృవీకరించాయి, దీనిని పూర్తి చేయడానికి కేవలం మూడు సంవత్సరాలు పట్టింది. క్రింద జిన్హువా వార్తా సంస్థ అందించిన వీడియోను చూడండి:

 

నవంబర్ 2, 2017న అప్‌లోడ్ చేయబడిన పై వీడియో, ఉత్తర చైనీస్ పోర్ట్ సిటీ టియాంజిన్‌లో ఉన్న’టియాంజిన్ బిన్‌హై’ లైబ్రరీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది, మరియు అనేక రకాల పుస్తకాలు ఉన్నందున ఈ లైబ్రరీ పాఠకులకు ఒక మంచి అనుభూతి/అనుభవాన్ని ఇస్తుంది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద అమెరికాలో ఎలాంటి లైబ్రరీ లేదు.ఈ వాదన/వార్తాకు సంబంధించిన నివేదికలు కూడా ఎక్కడ కనబడలేదు.కాబట్టి, ఈ వాదన/దావా పూర్తిగా తప్పు

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన