Tag Archives: social media

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: X ప్లాట్‌ఫారమ్‌ను మూసివేయాలని(షట్ డౌన్) కమలా హారిస్ అన్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. ట్రంప్ యొక్క ట్విట్టర్ ఖాతా రద్దుపై చేసిన పాత ఇంటర్వ్యూ వీడియోను, హారిస్ Xని మూసివేయాలని కోరుతున్నట్లు తప్పుగా షేర్ చేయబడింది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం–

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎక్స్ ఓనర్ ఎలోన్ మస్క్ గురించి మాట్లాడుతూ ఆయన తన ఎక్స్ షట్ డౌన్ చేయాలని చెప్పినట్లు ఒక వీడియో షేర్ చేయబడుతోంది.

“ఆయన తన అధికారాలను కోల్పోయారు మరియు తన Xని షట్ డౌన్ చేయాలి. ముఖ్యమైన విషయం ఏమిటంటే, Facebook కోసం ఒక నియమం మరియు Twitter కోసం వేరే నియమం ఉంది. ఈ సోషల్ మీడియా సైట్‌ల యొక్క శక్తి సామర్ధ్యాలని అర్థం చేసుకోవడానికి వాటిపై ఒక బాధ్యత ఉంచబడాలి.వారు ఎటువంటి విధమైన పర్యవేక్షణ లేదా నియంత్రణ లేకుండా లక్షలాది వ్యక్తులతో నేరుగా మాట్లాడుతున్నారు, అది ఆపివేయాలి” అని హారిస్ వీడియోలో చెప్పడం చూడవచ్చు.

“ఇది X ప్లాట్ఫారం లో వాక్ స్వాతంత్య్రాన్ని నియంత్రించే ప్రయత్నమంటూ” ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

మేము కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, X (గతంలో ట్విట్టర్)నుండి అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను తీసివేయడంపై CNN హోస్ట్ జేక్ తాపర్‌తో హారిస్ 2019లో మాట్లాడుతున్నప్పటి వీడియో అని కనుగొన్నాము, మరియు అది కమల హారిస్ CNNకు ఇచ్చిన అక్టోబర్ 2019 నాటి ఇంటర్వ్యూలో ట్రంప్ యొక్క X అధికారిక ఖాతాను సస్పెండ్ చేసిన సందర్భంలో మాట్లాడిన వీడియో క్లిప్ అని ఫలితాలు వెల్లడయ్యాయి. అసలు/ఒరిజినల్ ఇంటర్వ్యూని ఇక్కడ చూడండి:

ఇంటర్వ్యూలో చిన్న మార్పులు చేయబడి, హారిస్ ఎన్నికైన తర్వాత ఆమె Xని మూసివేస్తారని వాదన చేయబడింది. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియో క్లిప్, అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్‌ను(ప్రస్తుతం X ప్లాట్‌ఫారమ్) ఉపయోగించడం గురించి హారిస్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన 2019 నాటి ఇంటర్వ్యూ వీడియో క్లిప్ నుండి తీసుకోబడింది. అందువల్ల, హారిస్ తన ప్రచారంలో ఇప్పటివరకు Xని మూసివేయడం గురించి ఎటువంటి ప్రకటనలు చేయలేదు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

VPనామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండి77యా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

 

 

96 ఏళ్ల అనుభవజ్ఞుడైన BJP నాయకుడు LK అద్వానీ గురించి తప్పుడు వాదనలు వెలువడ్డాయి; వాస్తవ పరిశీలన

వాదన/Claim: బీజేపీ ప్రముఖ నేత ఎల్.కే. అద్వానీ కన్నుమూశారు.

నిర్ధారణ/Conclusion:  తప్పుడు వాదన/దావా. ఎల్.కె. అద్వానీని జూలై 3,2024న న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు మరియు అతని పరిస్థితి ‘స్థిరంగా’ మెరుగుపడటంతో మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యారు.

రేటింగ్/Rating: పూర్తిగా తప్పు  — .

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

భాజపాకు చెందిన ప్రముఖ నాయకుడు, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ 6 జూలై 2024న మరణించారని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పేర్కొంది.

96 ఏళ్ల అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు 2002 నుండి 2004 వరకు భారతదేశ 7వ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు.ఆయన భారతీయ జనతా పార్టీ (BJP) సహ వ్యవస్థాపకులలో ఒకరు మరియు 1998 నుండి 2004 వరకు సుదీర్ఘకాలం పాటు హోం వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఘనతను సాధించారు.

దిగువ పోస్ట్ చూడండి:

తెలుగు అనువాదం ఇలా ఉంది: “బిజెపి యొక్క ప్రముఖ నాయకుడు భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ విచారకరమైన మరణం. ప్రగాఢ సంతాపం.
శ్రీ ఎల్.కె. అద్వానీ
భారతదేశ మాజీ ఉప ప్రధాని.
మరణం: 06 జూలై 2024”

సోషల్ మీడియాలో షేర్ చేయబడిన పోస్ట్ నమ్మదగిన విధంగా ఉంది మరియు తుమకూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక కేంద్ర మంత్రి ప్రముఖ నాయకుడికి నివాళులు కూడా అర్పించారు.

Fact Check:

Digiteye India బృందం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని పరిశీలించగా,ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అనేక వార్తలు వెలువడ్డాయని గమనించాము.
96 ఏళ్ల అనుభవజ్ఞుడు,బీజేపీ నాయకుడు వృద్ధాప్య సంబంధిత సమస్యల కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో బుధవారం, జూలై 3, 2024న చేరారు మరియు మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు డిశ్చార్జ్ అయ్యారు.ఆయన పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. వార్తా కథనాలు ధృవీకరించడంతో కేంద్ర మంత్రి కూడా తన తప్పిదానికి క్షమాపణలు చెప్పారు.

 

మరి కొన్ని వాస్తవ పరిశీలన కథనాలు :

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/దావా: హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నాడనేది వాదన/దావా.

నిర్ధారణ:తప్పుడు వాదన. యువకుడు రోడ్డుపై ఈ చర్య చేస్తున్నట్టు చూపించడానికి వీడియో ఎడిట్ చేసి సవరించబడింది.

రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

****************************************************************************************************************************

వాస్తవ పరిశీలన వివరాలు:

హైదరాబాద్‌లో ఓ యువకుడు రీళ్లు (Reel) తయారు చేసేందుకు వేగంగా వస్తున్న బస్సు ముందు హఠాత్తుగా పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్టంట్ వీడియోను చాలా మంది సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేశారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఈ యువకుడు ప్రమాదకరమైన స్టంట్‌ చేస్తున్నాడని వాదన/దవా పేర్కొంది.

దావా ఇలా ఉంది: “హైదరాబాద్‌లో వేగంగా వస్తున్న బస్సు ముందు రోడ్డుపై అకస్మాత్తుగా పడుకుని ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ ఒక యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఈ స్టంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నెటిజన్లలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. .(sic)”

దిగువ  వాదన/దవాలను చూడండి:

అసలు వాస్తవం ఏమిటి

DigitEye India బృందం వైరల్ వీడియోను నిశితంగా పరిశీలించినప్పుడు అది మార్చబడిన వీడియో అని మేము గమనించాము, ఒక వ్యక్తి రోడ్డు దాటుతున్నట్లు చూపుతున్న వీడియోలోని చిత్రాన్ని మార్ఫింగ్ చేశారు. ఇక్కడ, ఈ వీడియో గ్రాబ్‌లో, యువకుడు రోడ్డుపై నడుస్తూ, బస్సు దగ్గరకు వచ్చినప్పుడు, అతను బస్సు వైపు తిరిగి రోడ్డుపై పడుకోవడం చూడవచ్చు. రోడ్డు మధ్యలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఏ బస్సు డ్రైవర్ అయినా వెంటనే బస్సు వేగాన్ని తగ్గించడం లేదా బ్రేక్ వేయడం చేస్తాడు కానీ నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళడు.

దిగువ చిత్రాల్లో మీరు దీన్ని గమనించవచ్చు:

ఈ సంఘటనపై తెలంగాణ పోలీసు లేదా రవాణా శాఖ నుండి ఏదైనా పోస్ట్/వివరణ ఉందా అని మేము పరిశీలించినప్పుడు, అది ఫేక్ వీడియో అని స్పష్టం చేస్తూ MD,తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, VC సజ్జనార్ తన X అధికారిక హ్యాండిల్‌లో ఒక వివరణను గమనించాము.

ఆయన ఇచ్చిన వివరణ ఇలా ఉంది.

అలాంటి ఎడిటింగ్ టెక్నిక్‌లను అనుమతించే అత్యాధునిక టెక్నాలజీలతో, కొంతమంది వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, చాలా మంది, అవి ఎడిట్ చేసిన వీడియోలనే విషయం తెలియక, సోషల్ మీడియాలో తక్షణమే పాపులర్ కావడానికి అలాంటి స్టంట్‌లను పునరావృతం చేయడం లేదా అనుకరించడం వంటివి చేస్తూ తమ ప్రాణాలకు తెగిస్తున్నారు.

కాబట్టి, హైదరాబాద్‌లో ప్రమాదకరమైన రీల్ కోసం ఈ యువకుడు వేగంగా వస్తున్న బస్సు ముందు పడుకున్నాడనే వాదన/దవా తప్పు.

 

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

IRCTCలో స్నేహితులకు లేదా బంధువుల కోసం రైలు టికెట్లును బుక్ చేస్తే జరిమానా విధించబడుతుందా? వాస్తవ పరిశీలన

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:నాగార్జున సిమెంట్స్ తన ప్రకటనలో ‘కనికరం’ లేకుండా 9/11 థీమ్‌ను(9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసింది) ఉపయోగించిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నాగార్జున సిమెంట్స్‌వారు అలాంటి ప్రకటన ఏదీ చూపలేదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిమెంట్ తయారీదారు నాగార్జున సిమెంట్ యొక్క ప్రకటన అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. యానిమేషన్‌లో విమానం న్యూయార్క్ నగరంలోని టవర్ను డీ-కొంటున్నట్లు కానీ టవర్స్ లోకి చొచ్చుకుపోలేక, త్వరగా వెనక్కి వెళ్లి అవతలి వైపుకు వెళ్లి ఎగిరిపోతున్నట్లు చూడవచ్చును.ఇది 9/11 దాడిని గుర్తుచేస్తుంది.ఈ వీడియోలో తెలుగు నటుడు వరుణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తారు. “భారతీయ ప్రకటనలు దయ(కనికరం) లేనివి” అనే శీర్షికతో దీనిని సెర్గీ కిరియానోవ్ అనే ట్విటర్ వినియోగదారు షేర్ చేసారు.

వీడియోను ఇక్కడ చూడండి:

FACT CHECK

Digiteye India బృందం వాట్సాప్ టిప్‌లైన్‌లో అభ్యర్థనను స్వీకరించి, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసిద్ధ సిమెంట్ అయిన నాగార్జున సిమెంట్స్‌ వారు అటువంటి ప్రకటనేమైనా తయారుచేశారని పరిశీలించింది.వరుణ్ తేజ్ దాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై 9/11 విమాన దాడుల నేపధ్యాన్ని ఉపయోగించి తీసిన వీడియో ఏదీ లేదు. వరుణ్ తేజ్ నటించిన నాగార్జున సిమెంట్స్ యొక్క తాజా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు:

https://www.youtube.com/@nagarjunacement3145

9/11 దాడుల నేపథ్య ప్రకటనకు సంబంధించి నాగార్జున సిమెంట్స్‌ గురించి మరింత శోధన చేయగా ఎటువంటి సమాచారం మరియు వీడియో అందుబాటులో లేదు. Digiteye India బృందం నాగార్జున సిమెంట్స్‌కి ఈ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలంటూ ఒక ఇమెయిల్ పంపింది.

మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా,అది నకిలీ వీడియో అని వినియోగదారు స్వయంగా అంగీకరించారని మరియు ట్విట్టర్‌లోని సంభాషణను ఇక్కడ చూడండి:

కాబట్టి,ఈ వీడియో ఫేక్ (నకిలీది).

మరి కొన్ని Fact Checks:

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

కల్తీ పాల వల్ల 2025 నాటికి 87% భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO హెచ్చరిక జారీ చేసిందా? వాస్తవ పరిశీలన

 

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

 వాదన/Claim : మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:వాదన లేదా ఆరోపించిన విధంగా తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేసే ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు.

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా-

తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రజాపాలన’ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించినందున,వారి రేషన్ కార్డుల చెల్లుబాటు గురించి మండలాల వారీగా వివరాలను ఇస్తూ, ప్రజలలో భయాందోళనలను కలిగించే విధంగా పోస్ట్ చేయబడింది. పోస్ట్ ని ఇక్కడ చూడండి.

ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 కార్డులు రద్దయ్యాయి.

“ఇతర జిల్లాల్లో కూడా రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంటుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.”

ఇది తెలుగు స్క్రైబ్ ద్వారా పోస్ట్ చేయబడింది, మరియు తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను పరిష్కరించే ప్రధాన ప్రక్రియను చేపట్టడం వలన,అలాగే దాని సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను కూడా “ప్రజాపాలన” కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోవాలని కోరడం వలన ఇది X ప్లాట్‌ఫారమ్‌లో అనేక విమర్శలను అందుకుంది.

FACT CHECK

Digiteye India టీమ్‌ ఈ క్లెయిమ్/దవా లోని వాస్తవం పరిశీలించినప్పుడు,AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో సమస్యను లేవనెత్తారని మరియు దావాపై సమాధానం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ట్యాగ్ చేశారని మేము గమనించాము.దీనిపై సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ ఆ వాదనలో వాస్తవం లేదన్నారు.”అసాద్, రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రేషన్ కార్డును మా ప్రభుత్వం రద్దు చేయలేదని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని రాశారు.

ఆయన సమాధానం ఇక్కడ ఉంది:

Here's his reply:

ఇంకా,మేము ఇతర వార్తా సంస్థలను పరిశీలించినప్పుడు,ఇలాంటి వార్తలు ఎక్కడా ప్రచురించలేదు మరియు ఏ టీవీ న్యూస్ ఛానెల్‌ కూడా ఈ సమస్యను ప్రసారం చేయలేదు.ఇలాంటి ప్రతికూల చర్య అనేక విమర్శలను ఆకర్షించి ఉండేది ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా లక్ష మంది లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను కోల్పోవడమనేది పెద్ద వార్త.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన

వాదన/Claim: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం.

నిర్ధారణ/Conclusion: ఆ వికలాంగ వ్యక్తి తన చేతిని రాహుల్ గాంధీకి అందిస్తున్నట్లు, దానిని రాహుల్ గాంధీ సహృదయంతో పట్టుకుని అతన్ని కౌగిలించుకున్నట్లు వీడియోలో చూడవచ్చు.

రేటింగ్:  Misleading —

Fact Check వివరాలు:

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బహిరంగ సభలో వికలాంగ వ్యక్తికి (చేతులు లేని వ్యక్తి) కరచాలనం చేయడం కనిపించిందనే వాదనతో ఒక వీడియో క్లిప్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వాదన రాహుల్ గాంధీని వీల్-ఛైర్‌పై ఉన్న వికలాంగ వ్యక్తి పట్ల “సున్నితంగా”ప్రవర్తించలేదని చిత్రీకరించడానికి ప్రయత్నిస్తుంది.

ఈ పోస్ట్‌ను బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఇతరులతో షేర్ చేసుకున్నారు, రాహుల్ గాంధీని “సహృదయం లేనివాడని” పిలిచి అతనిపై విరుచుకుపడ్డాడు మరియు అతని అభిప్రాయాలను మూడు లక్షల మంది వీక్షకులతో  షేర్ చేసుకున్నారు.

మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, “తెలివిలేని వ్యక్తి! @రాహుల్ గాంధీ , దివ్యాంగ వ్యక్తితో( (చేతులు లేని వ్యక్తి) )కరచాలనం చేయడానికి ప్రయత్నిస్తున్నారా?”

మరొక వినియోగదారుడు @erbmjha ఇలా పేర్కొన్నారు: ఇలాంటి మూర్కుడిని నేను ఏక్కడ చూడలేదు.వీల్ చైర్‌పై చేతులు లేని శారీరక వికలాంగుడితో రాహుల్ గాంధీ కరచాలనం చేయడానికి ప్రయత్నించారు… నమ్మశక్యంగా లేదు! ”.

FACT CHECK

ఏప్రిల్ 11న రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన ఒరిజినల్ వీడియో క్లిప్‌ను Digiteye India team బృందం పరిశీలించినప్పుడు, ఆ వికలాంగుడు తానే స్వయంగా ముందుకు వచ్చినప్పుడు, రాహుల్ గాంధీ ప్రతిస్పందించి అతనిని కౌగిలించుకున్నారు.

వికలాంగుడైన వ్యక్తి 30 సెకన్ల వ్యవధిలో రెండుసార్లు రాహుల్ గాంధీని పలకరించడానికి తన కుడి చేయి చాచినట్లు, మరియు అతని ఎడమ చేయి రాహుల్ గాంధీ చిత్రంతో ముద్రించిన ప్లకార్డ్‌ను (“మేము రాహుల్‌తో ఉన్నాము” అనే కాప్షన్తో ఉన్న ప్లకార్డ్‌) పట్టుకుని ఉన్నట్లు గమనించవచ్చు.

కాబట్టి వాదన/దావా పూర్తిగా తప్పు.

ఈ వీడియోలోని వాదన గతంలో US ప్రెసిడెంట్ జో బిడెన్‌ను వృద్ధుడిగా మరియు మతిమరుపు వ్యక్తిగా చూపించడానికి అతనిపై చేసిన మరొక వీడియోను పోలి ఉంది. కానీ Digiteye India ద్వారా అది పూర్తిగా తప్పు అని ఇక్కడ నిరూపించబడింది. వాస్తవానికి, నాయకుడిపై నకిలీ మరియు తప్పుడు అభిప్రాయాన్ని/అవగాహనను వ్యాప్తి చేయడానికి ఇటువంటి వీడియోలు చేయడం అవతలి వాళ్లకు అలవాటుగా మారింది.

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

ఇందిరా గాంధీ vs సర్దార్ పటేల్ పాత చిత్రం?

అక్టోబర్ 31సర్దార్ వల్లభాయి పటేల్ యొక్క జయంతి జరుపుకునే దినం దేశం మొత్తంలో ఈరోజు సమైక్యత దినంగా పాటిస్తారు అదే రోజు ప్రధాని ఇందిరాగాంధీని  స్వంత రక్షణ బట్టలే కాల్చిచంపిన దురదృష్టకరమైన దినం.

కానీ రాజకీయాల్లో దీన్ని ఎలా హలో అందరికీ చాలా బాగా తెలుసు. అక్టోబరు 31, 2018 న కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కేరళలోని తిరుపతిపురంలో ఉన్నారు. ఆయన ఐదారు కార్యక్రమాల్లో పాల్గొని ఇందిరాగాంధీకి పుష్పార్చన చేశారు.  ఈ కార్యక్రమాల్లో అన్ని చోట్ల ఇందిరాగాంధీ పటం మీద అర్చన జరిగింది.

కానీ ఒక పురాతన  ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సర్దార్ పటేల్ ఫోటో పెట్టి పుష్పార్చన నిర్వహించారు.  ఇందిరా గాంధీ ఫోటో చాలా పెద్దగా ఉంది,  సర్దార్ పటేల్ ఫోటో చాలా చిన్నగా ఉంది అని ఎవరు గమనించలేదు.

ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమంలో,  అక్టోబర్ 31న సర్దార్ పటేల్ యూనిటీ statue  ఆవిర్భవించిన సందర్భంలో,  పాత ఫోటోవెలికి తీసి ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోను పెట్టి,  కాంగ్రెస్ ఈ విధంగా వేరే సైజులలో ఫోటోలు పెట్టి సర్దార్ పటేల్ ను అవమానిస్తున్నారు అని పేర్కొనడం జరిగింది.  పటేల్ యొక్క statue ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ  వారికి కలిసి వచ్చింది.

కానీ రెండు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించిన ఫోటోలు.  2018 లోపసుపు రంగులో ఉన్న కుర్తా ధరించి, అదే దుస్తులలో అనేక విధాలుగా థరూర్ కనిపించాడు,  కాబట్టి ఇది ఈ సంవత్సరం ఫోటో కాదు. పురాతన ఫోటో.  ఈ విధంగా,  ప్రజల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా  సోషల్ మీడియాలో  వదంతులు వ్యాపించడం జరిగింది.