Tag Archives: fact check

Has Agnipath Scheme for recruitment of soldiers (Agniveers) been relaunched? Fact Check

సైనికుల (అగ్నివీర్స్) రిక్రూట్ కోసం అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో మళ్లీ ప్రారంభించబడిందా? వాస్తవ పరిశీలన-వీడియో

వాదన/Claim: సైనికులు లేదా అగ్నివీర్లను రిక్రూట్ చేసుకునేందుకు అగ్నిపథ్ పథకం కొన్ని మార్పులతో పునఃప్రారంభించబడిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ప్రభుత్వ అధికారిక PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వాదన/దావాను తిరస్కరించింది మరియు దానిని నకిలీగా పేర్కొంది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

************************************************************************

వివరాలు:

అగ్నిపథ్ పథకాన్ని ఎన్‌.డి.ఎ ప్రభుత్వం ‘సైనిక్ సమాన్’ స్కీమ్‌గా మళ్లీ ప్రారంభిస్తోందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ షేర్ అవుతోంది.

 

సందర్భం ఏమిటంటే, ప్రతిపక్ష భారత కూటమి(INDIA bloc) ఈ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది మరియు 2022 సెప్టెంబరులో “నాలుగు సంవత్సరాల పాటు రక్షణ దళాలలోని మూడు సర్వీసుల్లోకి సైనికులను నియమించడానికి అమలు చేసిన అగ్నిపథ్” పథకాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.ఈ విధానంలో నియమించబడిన సిబ్బందిని అగ్నివీర్స్ అంటారు. సందేశం/పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

అగ్నిపథ్ (అగ్నివీర్) పథకంపై సమీక్ష కోసం ఎన్‌.డి.ఎ వారే మనవి చేయడంతో ఈ సందేశం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది.

అసలు వాస్తవం ఏమిటి

వాస్తవ పరిశీలనకై సమాచారం కోసం వెతకగా, అధికారిక వర్గాలు అలాంటి నివేదిక ఏది జారీ చేయలేదని తెలిసింది. అదే ప్రకటించి ఉంటె, అన్ని పార్టీల అభిప్రాయాలను కోరుతూ వార్త ఛానళ్లలో ముఖ్యాంశాలుగా ఉండేవి. ప్రభుత్వ అధికారిక PIB ఆదివారం నాడు అగ్నిపథ్ పథకం పునఃప్రారంభించబడిందనే వార్తలను తోసిపుచ్చింది, మరియు సోషల్ మీడియా సందేశాన్ని నకిలీ వార్తగా పేర్కొంది. ”
సమీక్ష తర్వాత “విధి నిర్వహణ వ్యవధిని 7 సంవత్సరాలకు పొడిగించడం, 60 శాతం శాశ్వత సిబ్బంది & పెరిగిన ఆదాయంతో సహా అనేక మార్పులతో అగ్నిపథ్ పథకం ‘సైనిక్ సమాన్ పథకం’గా మళ్లీ ప్రారంభించబడిందని # నకిలీ వాట్సాప్ సందేశం పేర్కొంది. భారత ప్రభుత్వం (GOI) అలాంటి నిర్ణయం తీసుకోలేదు” అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తన X హ్యాండిల్‌లో స్పష్టం చేసింది.

మరియు, నకిలీ సందేశంలో అనేక స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి, ఇది ప్రభుత్వ ప్రకటన అనేది సందేహాస్పదంగా ఉంది. కాబట్టి, దావా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కథనాలు :

అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన

రేపటి నుంచి ఉచిత విద్యుత్ సబ్సిడీ ఆగిపోతుందని ఢిల్లీ మంత్రి అతిషి వెల్లడించారా? వాస్తవ పరిశీలన

 

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: 25,000 హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య గురించి కాకుండా, డిసెంబర్ 2023లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ కి సంబంధించిన వీడియో.

రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

జనవరి 22, 2024న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు దాదాపు ఇరవై ఐదు వేల(25,000) హోమ గుండాలు సిద్ధమవుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో చూపిన విధంగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోమ గుండాలను ఏర్పాటు చేస్తున్నట్లు దావా పేర్కొంది.హిందీలో ఈ విధంగా పోస్ట్ చేసారు:“इन 25000 हजार हवन कुंडो से होगा “राम मंदिर” का उद्घाटन… जय श्री राम” [తెలుగు అనువాదం:ఈ ఇరవై ఐదు వేల(25,000)హోమ గుండాలు “రామమందిర్” ప్రారంభోత్సవానికి ఉపయోగించబడతాయి … జై శ్రీరామ్ ]

FACT CHECK

Digiteye India బృందం ఈ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలించగా, 2023 డిసెంబర్‌లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ మహోత్సవానికి సంబంధించిన వీడియో అని,అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధం లేదని గమనించాము.

ఈ వార్త/మహాత్సవాన్ని, పై వీడియో చూపినట్లుగా స్థానిక ఛానెల్ “అరుణ్ విలేజ్ బాయ్ వ్లాగ్” ద్వారా డిసెంబర్ 16, 2023న యూట్యూబ్లో (You Tube)అప్‌లోడ్ చేయబడింది.వీడియో శీర్షిక హిందీ లో ఇలా ఉంది:स्वर्वेद महामंदिर धाम वाराणसी 25 हजार हवन कुंड | एक साथ सभी को जगाया जाएगा ! Swarved Maha Mandir Dham” [తెలుగు అనువాదం: స్వర్వేద్ మహామందిర్ ధామ్ వారణాసి 25 వేల హోమ గుండాలు . అవన్నీ ఒకేసారి వెలిగించబడతాయి”.]

మేము మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా, క్రింద చూపినట్లుగా మరొక వీడియోను గమనించాము.

స్వర్వేద్ మహామందిర్ ధామ్‌లోని హోమ గుండాలలో అనేక మంది వ్యక్తులు యజ్ఞం చేస్తున్నట్టు చూపించే ఇలాంటి వీడియోలను అనేకం చూడవచ్చు.వారణాసిలోని ఉమ్రాహా ప్రాంతంలో ఉన్న అతి పెద్ద ఆలయమైన స్వర్వేద్ మహామందిర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు వార్తా నివేదికలు ధృవీకరిస్తున్నాయి.

కాబట్టి,హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించినదనే వాదన తప్పు.

మరి కొన్నిFact Checks:

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

 

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

నవంబర్ 19, 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లోని దోనీ పోలో విమానాశ్రయమని సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

క్లెయిమ్/వాదన ఈ విధంగా ఉంది: “అరుణాచల్ ప్రదేశ్ ఈ విమానాశ్రయాన్ని ఎక్కువగా BAMBU(Bamboo)తో తయారు చేసి రాష్ట్రానికి అందించారు, వావ్… నమ్మలేకపోతున్నాను… వారు ఇక్కడ భారతదేశంలో చేస్తున్నారు. అద్భుతమైన భారత్.”వీడియోలో పైకప్పు నుండి వేలాడుతున్న అలంకరణలతో కూడిన పెద్ద, ఆధునిక విమానాశ్రయ టెర్మినల్ కనపడుతుంది.

FACT CHECK

వీడియోలో ఉన్న విమానాశ్రయం ఇటీవలి బెంగుళూరు టెర్మినల్ 2 అలంకరణలను పోలి ఉన్నందున, Digiteye India బృందం దానిని పరిశీలించగా, ఆ వీడియో అరుణాచల్ ప్రదేశ్‌లోని విమానాశ్రయానికి చెందినది కాదని, బెంగుళూరులోనిదని కనుగొన్నారు.

నవంబర్ 11, 2022న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు టెర్మినల్ 2ను ప్రారంభించినప్పుడు, దిగువ చూపిన విధంగా వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది:

వాస్తవానికి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క డోనీ పోలో విమానాశ్రయం చిత్రాలు(దిగువ చిత్రాలు) అక్టోబర్ 19, 2022న DGCA ద్వారా అధికారికంగా విడుదల చేయబడ్డాయి:

కావున, ఈ వార్త సరైనదే కావచ్చు, అయితే ఈ చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి చెందినదనే వాదన తప్పు.చిత్రం బెంగళూరులోని టెర్మినల్ 2 విమానాశ్రయం చెందినది.

వాదన/Claim: చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయంలోని bamboo అలంకరణలతో ఉన్న లోపలి భాగము.

నిర్ధారణ/Conclusion:బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 2 చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని దోనీ పోలో విమానాశ్రయం అని తప్పుగా తీసుకోబడింది.

Rating: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks: ఎత్తైన రైల్వే వంతెనపై వెలుతున్న రైలు వీడియో భారతదేశంలోనిది కాదు, చైనా దేశంలోని వీడియో: Fact Check ; 

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check]

ISRO చీఫ్ చంద్రయాన్-3 విజయాన్ని డ్యాన్స్ చేస్తు సంబరాలు చేసుకుంటున్నట్లు ఈ వీడియో చూపిస్తుందా? Fact Check

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో చీఫ్ – ఎస్ సోమనాథ్ – మరియు ఇతర శాస్త్రవేత్తలు ఒక పార్టీలో డ్యాన్స్ చేస్తూ మరియు ఆనందిస్తున్నట్లు చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.

ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 విజయాన్ని జరుపుకుంటున్నట్లు చాలా మంది ట్విటర్ వినియోగదారులు తమ ప్రొఫైల్‌లలో వీడియోను షేర్ చేస్తు, అది తాజా వీడియోగా పేర్కొన్నారు. భారతదేశం యొక్క మూడవ చంద్ర మిషన్ రోవర్ చంద్రునిపై విజయవంతంగా ల్యాండ్ అయిన రోజు ఆగస్టు 23 నుండి ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో వైరల్‌గా మారింది.

ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా షేర్ చేయబడింది.

వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందో తనిఖీ చేయమని Digiteye Indiaకి WhatsApp అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఈ వైరల్ వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను పరిశీలించినప్పుడు, చాలా మంది వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేసినట్లు కనుగొన్నాము. ట్విట్టర్‌లో కూడా పరిశీలించినప్పుడు, సిద్ధార్థ్ MP అనే వినియోగదారు ఈ ట్వీట్‌ చేశాడని తెలుసుకున్నాము.WION న్యూస్‌కి చెందిన జర్నలిస్ట్ ఈ వీడియోను క్యాప్షన్‌తో ఇలా పోస్ట్ చేసారు: “Dr S. Somanath & team #isro…గర్వంగా,ఆనందంగా సంబరాలు చేసుకోండి.1.4+bn హృదయాలను గర్వంతో మరియు ఆనందంతో ఉబ్బిపోయేలా చేసే శక్తి మరియు జ్ఞానం ప్రపంచంలో ఎంత మందికి ఉంది!#Chandrayaan3 #Chandrayaan3Landing #Chandrayaan3Mission #india #space #tech.”

అయితే, తరువాతి ట్వీట్‌లో ట్వీట్‌లో, వినియోగదారుడు వీడియో తాజాది కాదని పేర్కొన్నారు. అతను ట్వీట్ చేసాడు, “దయచేసి గమనించండి: ఇది ఈ సంవత్సరం ప్రారంభంలోని వీడియో మరియు ఈ మొత్తం ఈవెంట్‌కు నాకు అధికారిక అనుమతి ఉంది.ఈ వీడియో ఈ రోజుది కాదు!”

ఈ వీడియో యొక్క వాస్తవికతను మరింత పరిశీలించడానికి, మేము ఆగస్టు 23 నుండి ISRO శాస్త్రవేత్తల ఇతర వీడియోలను చూశాము.చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారంలో, S సోమనాథ్ గారు భిన్నమైన వేషధారణలో ఉన్నారు.విజయవంతంగా ల్యాండింగ్ తర్వాత ఇస్రో చీఫ్ ప్రసంగాన్ని మేము చూసినప్పుడు అతను నల్లటి వెయిస్ట్‌కోట్‌తో అదే ఆకాశ-నీలం చొక్కా ధరించారు.

[See Also: Split Moon image goes viral on WhatsApp; Fact Check]

Here is a video of S Somanath’s speech.

ఎస్ సోమనాథ్ గారి ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఉంది.

మేము S సోమనాథ్ యొక్క మరికొన్ని వీడియోల కోసం Googleని పరిశీలించినప్పుడు, అది నెల క్రితం యొక్క పాత వీడియో అని కనుగొన్నాము.కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన G20 స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్‌లో ఇస్రో చీఫ్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్న వీడియో అని తెలుస్తుంది.

S సోమనాథ్ గారు G20 సమావేశం వీడియోలోను మరియు డ్యాన్స్ వైరల్ వీడియోలోను ఒకే వేషధారణలో ఉన్నారు.మరియు రెండు వీడియోలలో మెడలో ఒకే ట్యాగ్ ఉంది.

Claim/వాదన: చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ డ్యాన్స్ చేస్తు సంబరాలు చేసుకున్నారని ఆగస్టు 23న పోస్ట్ చేసిన పలు వీడియోలు పేర్కొన్నాయి.

నిర్ధారణ: ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులో జరిగిన G20 సమావేశానికి సంబంధించిన పాత వీడియో.

Rating: Misrepresentation – ???

మరికొన్ని Fact checks:

Split Moon image goes viral on WhatsApp; Fact Check , 

 Fake claim attributed to Chief Justice Chandrachud is going viral on social media; Fact Check]

సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆపాదించబడిన తప్పుడు దావా/వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది; Fact Check

భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది.

“భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది.

“మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ముఖ్యం. దీని కోసం ప్రజలందరూ సంఘటితమై వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని అడగాలి. ఈ నియంతృత్వ ప్రభుత్వం ప్రజలను భయపెడుతుంది మరియు బెదిరిస్తుంది, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి మరియు ప్రభుత్వాన్ని అడగండి, నేను మీతో ఉన్నాను.”

భారతదేశ సుప్రీం కోర్టు యొక్క అత్యున్నత పదవిని కలిగి ఉన్న అత్యున్నత న్యాయమూర్తి అయిన CJIకి సంబంధించిన పోస్ట్‌లోని విషయాల యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయడానికి Digiteye India బృందం వాట్సాప్ అభ్యర్థనను(WhatsApp request) స్వీకరించింది.

FACT CHECK

Digiteye India బృందం అనేక అంశాలలో కోట్/Claim నకిలీదని గుర్తించింది. ఏ సీజేఐ(CJI) కూడా ఇలాంటి అప్పీలు చేయరు.వ్యాకరణం మరియు వాక్యాలలో తప్పులు చూస్తే ఆ పోస్ట్ CJI నుండి వచ్చింది కాదని వెల్లడవుతుంది.“ఇది ఫేక్ ఫార్వార్డ్”. సీజేఐ చంద్రచూడ్ లాంటి వారు అలాంటి పని చేయరు. భారత ప్రధాన న్యాయమూర్తి పైన చేసిన ఇటువంటి తీవ్రమైన దుశ్చర్యలకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ” అని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పునరుద్ఘాటించారు.

వెంటనే CJI మరియు సుప్రీం కోర్ట్ కార్యాలయాలు సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసి, సుప్రీం కోర్ట్ యొక్క ఉన్నత న్యాయమూర్తి అటువంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదని మరియు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న సందేశాలు(Messages) తప్పుడు సందేశాలని పేర్కొంది. వారిచ్చిన ప్రకటన కాపీని ఇక్కడ చూడండి:

పై ప్రకటన అనువాదం: ఈ సందేశం(Message) యొక్క వాస్తవికతను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, “సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ యొక్క ఫైల్ ఫోటోను ఉపయోగించి ఆయనను తప్పుగా ఉటంకిస్తూ( Quote చేస్తు) ప్రచారం చేస్తున్నారనే పోస్ట్ చేయడం భారత సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.ఇది నకిలీ మరియు దురుద్దేశం కలిగిన పోస్ట్. భారత ప్రధాన న్యాయమూర్తి అటువంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అటువంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసే అధికారులతో తగిన చర్యలు తీసుకుంటున్నాం.”

Claim/వాదన: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రజలు ఏకమై తమ హక్కుల కోసం అధికారులపై పోరాడాలని కోరారు.

నిర్ధారణ: లేదు, జస్టిస్ చంద్రచూడ్ ఎప్పుడూ అలాంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అలాంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు.

Rating: Totally False —

[మరి కొన్ని Fact Checks: Did laser beam weapons from space cause Hawaii wildfires? Fact Check]

No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]

 

ఆంధ్రా తీరం ఒడ్డుకు కొట్టుకొచ్చిన రథం బంగారంతో చేసింది కాదు, బంగారు రంగులో మాత్రమే ఉంది; Fact Check

ఆసాని తుఫాను మే 10, 2022న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం (‘SONE का रथ’)” గురించిన వైరల్ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.దాదాపు అన్ని వార్తా కేంద్రాలు ఈ వార్తను కవర్ చేశాయి మరియు టీవీ ఛానెల్‌లు స్థానిక ప్రజలు దానిని సముద్రం నుండి ఒడ్డుకు ఎలా లాగడానికి ప్రయత్నిస్తున్నారో చూపించాయి.

వెంటనే, ఇది బంగారు రథం అనే వాదనతో వాట్సాప్ మరియు ట్విట్టర్ సందేశాలులో హోరెత్తినాయి.

समंदर में मिला सोने का रथ:

चक्रवात असानी की वजह से आंध्र प्रदेश के श्रीकाकुलम जिले के एक तट पर समुद्री लहरें एक ‘सोने का रथ’ बहा ले आई हैं,
इस रथ की बनावट किसी मोनेस्ट्री जैसी है,

माना जा रहा है कि ये रथ थाइलैंड या म्यांमार से बहकर आंध्र के तट तक पहुंच गया है!

Video: ABP news pic.twitter.com/HpjS7dERmj

— !!…शिवम…!! ??RED_2.0?? (@Aaaru_Prem) May 11, 2022

పైన హిందీ యొక్క అనువాదం ఇది: సముద్రంలో దొరికిన బంగారంతో చేసిన రథం.ఆసాని తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకినప్పుడు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చిన “బంగారు రథం”. రథం ఒక మఠం ఆకారంలో ఉంది. బహుశా ఇది థాయ్‌లాండ్ లేదా మయన్మార్ నుండి తేలుతూ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరి ఉండవచ్చు.

తుఫానులో ఈ “రథం” బీచ్ ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఇది కేవలం బంగారంతో తయారు చేయబడింది…
మన హిందూ నాగరికత ఎంత సుసంపన్నంగా, ధనికంగా ఉందో చెప్పడానికి ఇది ప్రతీక… #GoldenChariot pic.twitter.com/CWaKdLKR8T

— Nick (@Nickonlyfru) May 11, 2022

#Goldenchariot: ಶ್ರೀಕಾಕುಳಂ ಸಮುದ್ರದಲ್ಲಿ ತೇಲಿ ಬಂದ ಗೋಲ್ಡನ್ ರಥದ ಲೇಟೆಸ್ಟ್ ದೃಶ್ಯ
ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ► https://t.co/I3omngLlis

Video Link►https://t.co/RycA87x9pL#TV9Kannada #goldenchariot #mysteriouschariot #SrikakulamCostal #AndhraPradesh pic.twitter.com/NoBt3skt8Q

— TV9 Kannada (@tv9kannada) May 11, 2022

ఇది ట్విట్టర్ మరియు వాట్సాప్‌లలో విస్తృతంగా షేర్ చేయబడింది.

golden chariot

[ఇది కూడా చదవండి: పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check ]

FACT CHECK

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ Shrikesh B Lathakar గారు మీడియాతో మాట్లాడుతూ రథం బంగారంతో చేసింది కాదని, బంగారు రంగులో మాత్రమే ఉందని స్పష్టం చేశారు. “రథం ఇప్పుడు స్థానిక పోలీసుల అదుపులో ఉంది.”

“ఇది వేరే దేశం నుండి వచ్చి ఉండవచ్చు. మేము ఇంటెలిజెన్స్ మరియు ఉన్నతాధికారులకు సమాచారం అందించాము అని నౌపడ గ్రామం (శ్రీకాకుళం జిల్లా) యొక్క SI Saikumar గారు ANI వార్తా సంస్థతో నిర్ధారించారు.

#WATCH | Andhra Pradesh: A mysterious gold-coloured chariot washed ashore at Sunnapalli Sea Harbour in Srikakulam y’day, as the sea remained turbulent due to #CycloneAsani

SI Naupada says, “It might’ve come from another country. We’ve informed Intelligence & higher officials.” pic.twitter.com/XunW5cNy6O

— ANI (@ANI) May 11, 2022

శ్రీకాకుళంలోని టెక్కలి సర్కిల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం వెంకట గణేష్ ఏఎన్‌ఐ(ANI)తో మాట్లాడుతూ, “రథంలో బంగారం వంటి విలువైన లోహం పోలీసులకు లభించలేదని అన్నారు. ఇది ఉక్కు మరియు చెక్కతో తయారు చేయబడింది. కానీ దాని రంగు బంగారు రంగు.”

జిల్లా యంత్రాంగం తర్వాత రథంపై బర్మీస్‌లో లిపిలో వ్రాసిన స్క్రిప్ట్‌ను మరియు దానిపై జనవరి 16, 2022 అని తేదీని కనుకొన్నారు,కాబట్టి దాని మూలం మయన్మార్ అని ఆధారం కనిపించింది,కాని మయన్మార్ అధికారుల ఇంకా నిర్ధారణ చేయలేదు.

బంగారు రంగు వేసినప్పటికీ,ఇది బంగారు రథం కాదని చెక్క, ఇనుప లోహంతో తయారు చేసినట్లు జిల్లా యంత్రాంగం కూడా స్పష్టం చేసింది. అందువల్ల, “రథం” బంగారంతో తయారు చేయబడలేదు, కానీ బంగారు రంగులో ఉన్న బౌద్ధ మఠంకి చెందిన రథంగా ప్రతిబింబిస్తుంది.

వాదన/Claim:మే 10న ఆసాని తుపాను సమయంలో స్వర్ణరథం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం తీరంలో కొట్టుకొచ్చింది.

Conclusion: రథం బంగారు రంగుతో పెయింట్ చేయబడ్డది కానీ బంగారంతో తయారు చేయలేదు.

Rating: Misinterpretation —

[ఇది కూడా చదవండి: పాత రూ.2 నాణెం ఆన్‌లైన్‌లో లక్షల రూపాయలకు అమ్ముడుపోతోందా? వాట్సాప్‌లో వీడియో వైరల్; Fact Check]

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

ప్రసిద్ధిచెందిన తిరుపతి లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా టెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు తిరస్కరించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి.

ఈ వార్త వైరల్‌గా మారింది, మరియు అనేక వార్తా సంస్థల ద్వారా కవర్ చేయబడింది. ఇదిలా ఉండగా, 2023 మేలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశాన్ని వేలు ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, KMF మరియు నందిని నెయ్యి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపిస్తూ అనేక వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్విట్టర్‌లోని సందేశాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు

FACT CHECK

ఈ సమస్య పై తీవ్ర వివాదం చెలరేగడం వలన, 50 సంవత్సరాల సరఫరా తర్వాత TTD ఎందుకు నందిని నెయ్యి సరఫరాను నిలిపివేసిందనే దానిపై వాస్తవాలను Digiteye India పరిశీలన చేసింది. టీటీడీకి నందిని నెయ్యి 50 ఏళ్లుగా నిరంతరాయంగా సరఫరా కావడం లేదని పరిశోధనలో వెల్లడైంది. 2019లోనే KMF యొక్క టెండర్ తిరస్కరించబడింది మరియు తమిళనాడు పాల బ్రాండ్ ఆవిన్‌కి ఆ కాంట్రాక్టు ఇవ్వబడింది. ప్రతి ఆరు నెలలకోసారి బిడ్డింగ్/టెండర్ జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతి లడ్డూలలో నందిని నెయ్యి మాయమైందన్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ” గత 20 ఏళ్లుగా కూడా KMF నెయ్యి సరఫరా చేస్తుందనడంలో వాస్తవం లేదన్నారు.అందువల్ల, 50 సంవత్సరాల వరకు “అంతరాయం లేకుండా” KMF సరఫరా చేస్తుందనడంలో వాస్తవం లేదు. టెండర్, వాస్తవానికి, తక్కువ బిడ్డర్‌కు వెళుతుంది, అయితే మార్చి 2023లో కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉన్న సమయంలో జరిగిన తాజా టెండర్‌లో KMF పాల్గొనలేదని TTD ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) స్పష్టం చేశారు.

కాబట్టి KMF “ఇప్పుడు” కాంట్రాక్ట్ పొందలేదనే వాదన నిజం కాదు.

అంతేకాకుండా, వార్తల్లో పేర్కొన్నట్లుగా నెయ్యి సేకరణ కేవలం ఒక సరఫరాదారుకు మాత్రమే పరిమితం కాదు. భారీ మొత్తంలో నెయ్యి అవసరం కావున ఒక సరఫరాదారు సరఫరా చెయ్యడం కష్టం. నందినితో పాటు ఆవిన్ వంటి ఇతర నెయ్యి బ్రాండ్‌లు కూడా గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు భారీ కాంట్రాక్టులను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కర్ణాటక ప్రభుత్వ వివరణ:

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై వెంటనే స్పందిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంకి (టిటిడి) కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నుండి నందిని నెయ్యి సరఫరా బిజెపి హయాంలోనే ఆగిపోయిందని అన్నారు, మరియు టిటిడికి నందిని నెయ్యి సరఫరాను నిలిపివేయడం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న “హిందూ వ్యతిరేక” విధానానికి ఫలితం అని బిజెపి చేసిన ఆరోపణను కూడా ఖండించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నందిని నెయ్యి సరఫరా నిలిపివేయడం ఈరోజు నిన్న జరిగిన విషయం కాదని సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి సరఫరా నిలిచిపోయిదని ట్వీట్ చేశారు:”ಆಂಧ್ರಪ್ರದೇಶದ ತಿರುಪತಿಗೆ ನಂದಿನಿ ತುಪ್ಪ ಪೂರೈಕೆ ಸ್ಥಗಿತಗೊಂಡಿರುವುದು ಇಂದು, ನಿನ್ನೆಯ ವಿಚಾರವಲ್ಲ. ಕಳೆದ ಒಂದೂವರೆ ವರ್ಷದ ಹಿಂದೆಯೇ @BJP4Karnataka ಸರ್ಕಾರದ ಅವಧಿಯಲ್ಲಿ ತಿರುಪತಿಗೆ ತುಪ್ಪ ಪೂರೈಕೆಯನ್ನು ಸ್ಥಗಿತಗೊಳಿಸಲಾಗಿದೆ.” [ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నందిని నెయ్యి సరఫరా ఈరోజూ, నిన్నా ఆగలేదు, గత ఏడాదిన్నర క్రితం ఆగిపోయింది @BJP4Karnataka Govt.”] ఒరిజినల్ ట్వీట్ ఇక్కడ చూడండి:

ఇదే విషయాన్ని KMF అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే భీమా నాయక్  స్పష్టం చేశారు. KMF ప్రధాన సరఫరాదారు కాదని, వరుసగా మూడవ స్థానంలో ఉందని, L1 మరియు L2 బిడ్డర్‌ల తర్వాతనే సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు.
ప్రసిద్ధిచెందిన GI-ట్యాగ్ చేయబడిన లడ్డూలను తయారు చేయడానికి 1,400 టన్నుల నెయ్యిని సరఫరా చేయడానికి ప్రతి ఆరు నెలలకోసారి TTD టెండర్‌ను ఆహ్వానిస్తుంది, అందువల్ల డిమాండ్‌ను KMF మాత్రమే చెయ్యలేదు.

‘కేఎంఎఫ్ (KMF)2005 నుంచి 2020 వరకు తిరుపతికి నందిని నెయ్యి సరఫరా చేసింది… డిమాండ్‌లో 45 శాతం మాత్రమే మేం సరఫరా చేస్తాము.. 2020 నుంచి ఎల్‌3 సరఫరాదారులం.ఎల్1, ఎల్2 బిడ్డర్ల సరఫరా చేసిన తర్వాత మేము సరఫరా చేస్తాము. 2021లో 2022 లో TTD వారు సరఫరా కోసం లేఖ రాశారు, తదనుగూనంగా KMF 345 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేసింది,” అని నాయక్ మీడియాకు తెలిపారు. కాబట్టి, తిరుపతి లడ్డు ఇప్పుడు మాత్రమే నందిని నెయ్యి  లేకుండా తయారవుతుందనే వాదన కూడా తప్పు.

Claim/వాదన: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నందిని అంశాన్ని రాజకీయం చేసి అమూల్‌పై దుష్ప్రచారం చేసి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం KMF బిడ్‌ను TTD తిరస్కరించింది.

నిర్ధారణ: KMF అంతకుముందు కూడా బిడ్‌ను కోల్పోయింది, తద్వారా నెయ్యి సరఫరా నిలిపివేయబడింది. 2023 మార్చిలో BJP అధికారంలో ఉన్నప్పుడు KMF అసలు వేలంపాటలో పాల్గొనలేదు.

Rating: Misrepresentation —

మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి?

వాదన/Claim:మణిపూర్‌ హింసాకాండలో సెయింట్ జోసెఫ్ చర్చికి బిజెపి కార్యకర్తలు నిప్పంటించారని ఒక వీడియో వైరల్ అయింది.

నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. ఫ్రెంచ్ చర్చి దహనం చూపుతున్న వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటనగా ప్రచారం చేయబడింది.

రేటింగ్: పూర్తిగా తప్పు నిరూపణ —

Fact Check వివరాలు:

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ముఖ్యాంశాలు అవుతున్న నేపథ్యంలో, మణిపూర్‌లోని చర్చిని బిజెపి మద్దతుదారులే తగులబెట్టారనే వాదనతో చర్చిని తగలబెట్టే ఒక వీడియో వైరల్ అవుతోంది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: #मणिपुर सुग्नू इंफाल नही थम रही हिंसा आगजनी भाजपा समर्थक उग्रवादियो ने 300 साल से ज्यादा पुरानी St. Joseph’s चर्च जलाई 74 दिनो से मणिपुर जल रहा है [అనువాదం:  “మణిపూర్- ఇంఫాల్ హింస ఆగటం లేదు. 300 ఏళ్ల నాటి సెయింట్ జోసెఫ్ చర్చిని బీజేపీ కార్యకర్తలు తగులబెట్టారు. మణిపూర్ 74 రోజులుగా మండుతోంది.]

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

మణిపూర్ యొక్క జాతి రూపురేఖలు రాష్ట్రంలో రెచ్చిపోతున్న హింస గురించి తెలుపుతుంది.మణిపురిలలో సగం మంది హిందువులైన మెయిటీస్, కుకీలు మరియు నాగాలు మిగిలిన జనాభాలో 90 శాతం ఉన్నారు మరియు వారు క్రైస్తవులు. మిగిలిన 10 శాతం జనాభా ముస్లింలు లేదా ఇతర మతాలను అనుసరిస్తున్నారు.

మే 3, 2023న ప్రారంభమైన జాతి హింస ఇప్పటివరకు 140 మంది మరణానికి దారి తీసింది. ఈ నేప‌థ్యంలో, రాష్ట్రంలోని ప్ర‌జ‌ల మ‌ధ్య మ‌రింత మతపరమైన హింసను రేపేందుకు చ‌ర్చి దహనం అయిన వీడియోను షేర్ చేయబడుతోంది.

వాస్తవం ఏంటి?

Digiteye India బృందం వారు చర్చ్‌ను కాల్చేస్తున్న వీడియోలోని కొన్ని ఫ్రేమ్‌లు తీసుకొని పరిశీలించగా, అది మార్నేలోని ‘L’église Notre-Dame-de Drosnay‘చర్చి అగ్నికి ఆహుతై కుప్పకూలిన చారిత్రాత్మక చర్చి యొక్క విజువల్స్కు కు అని తెలిసింది.మంటల్లో కాలిపోయిన 16వ శతాబ్దపు ఫ్రెంచ్ చర్చి వీడియో నుండి 25 సెకన్ల క్లిప్‌ను ఉపయోగించి, మణిపూర్‌ రాష్ట్రంలోని మెజారిటీ కమ్యూనిటీలు చర్చికి నిప్పంటించారని ఒక దావా/వాదన పేర్కొంది.

 




జూలై 7, 2023న అగ్నికి ఆహుతైన ఫ్రెంచ్ చర్చి యొక్క అసలైన వీడియోను చూడండి. మార్నే ప్రిఫెక్చర్ పత్రికా ప్రకటన ప్రకారం, అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోంది మరియు దానికి సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం జరుగుతోంది.పారిస్‌లోని లౌవ్రే మ్యూజియంలోని(Louvre Museum) క్యూరేటర్ నికోలస్ మిలోవనోవిక్ కూడా అగ్నిప్రమాదం “కోలుకోలేని నష్టం” అంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసారు.ఈ సంఘటన ఇక్కడ మరియు ఇక్కడ ప్రధాన వార్తా సంస్థల్లో కూడా నివేదించబడింది.

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

హమాస్ ఇజ్రాయెల్ ట్యాంకులను స్వాధీనం చేసుకుని వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేయడం వీడియోలో కనిపిస్తుంది; Fact Check