Tag Archives: false news

గోవా తీరంలో పడవ బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బోల్తా పడిన పడవ, భారతదేశంలోని గోవా తీరంలో జరిగిన ప్రమాదమనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వీడియోలోని పడవ భారతదేశంలోని గోవాలో కాకుండా ఆఫ్రికాలోని గోమాలో బోల్తాపడి పెద్దప్రమాదం జరిగింది.

రేటింగ్/Rating:తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి..

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

‘గోవా’లో ఓవర్‌లోడెడ్ స్ట్రీమర్ బోట్ బోల్తా పడి చాలా మంది చనిపోయినట్లు, ఇంకా చాలా మంది గల్లంతయ్యారంటూ పేర్కొంటున్న వీడియోను పలువురు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పోస్టులను చూడండి:

వాస్తవ పరిశీలన వివరాలు:

DigitEye India బృందం వీడియో యొక్క కొన్ని కీఫ్రేమ్‌లను తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించినప్పుడు, ఈ విషాద సంఘటన భారతదేశంలో జరగలేదని కనుగొనబడింది, అయితే ఈ ప్రయాణీకుల పడవ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్రికాలోని కివు సరస్సు నీటిలో ప్రయాణించడం గమనించాము.

సోషల్ మీడియా పోస్ట్‌లలో పేర్కొన్నట్లుగా ఓవర్‌లోడ్ అయిన పడవ సౌత్ కివులోని మినోవా పట్టణం నుండి గోమాకు ప్రయాణిస్తోంది, భారతదేశంలోని గోవా పట్టణానికి కాదు.  స్థానిక వార్తా నివేదికల ప్రకారం, విషాదకరమైన పడవ ప్రమాదంలో కనీసం 78 మంది మరణించారు, మరియు ఇంకా చాలా మంది గల్లంతయ్యారు.

కాంగోలోని కిటుకు ఓడరేవు నుండి ఒక కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఉన్నప్పటికీ, ఓడరేవుకు చేరుకునేలోపే, అధిక బరువు మరియు అధిక వేగవంతమైన నీటి ప్రవాహాలను తట్టుకోలేక పడవ మునిగిపోయిందనే వివరాలను తెలియజేస్తూ  NewsOnAir వార్త నివేదికను భారతదేశంలో ప్రసారం చేసింది. ఆ పడవ కేవలం 80-90 మంది మాత్రమే ప్రయాణించేలా నిర్మించబడిందని, అయితే 278 మంది ఓవర్‌లోడ్‌తో పడవ మునిగిపోయిందని నివేదికలు వెల్లడించాయి.

 

 

గోవా పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు:

కాబట్టి, బోల్తా పడిన పడవ భారతదేశంలోని గోవా తీరంలో జరిగిన సంఘటనేది తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

 

సింగపూర్ మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్ను, ప్రధాని మోదీ సాధించిన ఘనతగా పశ్చిమ బెంగాల్ బీజేపీ వాళ్ళు షేర్ చేసారు: వాస్తవ పరిశీలన

వాదన/Claim: మెట్రో ఫోటోతో ఉన్న పోస్టర్, ప్రధాని మోదీ సాధించిన విజయాల్లో ఒకటిగా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగము వారిచే చేయబడిన వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. సింగపూర్‌లోని జురాంగ్ మెట్రో ఇమేజ్ను/చిత్రాన్ని, మోదీ సాధించిన ఘనతగా చూపబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ బిజెపి సోషల్ మీడియాలో పోస్టర్‌ను విడుదల చేసింది, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో భారతదేశం యొక్క మెట్రో రైలు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషికి అభినందనలు తెలిపారు.

బెంగాలీలో దావా ఇలా ఉంది: কর্মসংস্থান না বাড়লে কীভাবে ভারতের শহরে শহরে পৌঁছে গেল মেট্রো পরিষেবা? কংগ্রেস বলবে, বিজেপি করবে!” [బెంగాలీ అనువాదం ఇలా ఉంది: “ఉపాధిని పెంచకుండా మెట్రో సేవలు భారతదేశంలోని నగరాలకు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ మాటలు చెబుతుంది, బీజేపీ చేసి చూపిస్తుంది!”]

భారత్‌లో మోడీ సాధించిన విజయానికి సంబంధించి,ఈ ఇమేజ్ ను ఆయనకు ఆపాదించడం గురించి వినియోగదారులు ప్రశ్నిస్తూన్న ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.  పోస్టర్‌లో ఉపయోగించిన రైల్వే లైన్ సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ MRT చిత్రమని, భారతదేశంలోనిది కాదని పలువురు X వినియోగదారులు సూచించారు.

FACT CHECK

Digiteye India టీం జురాంగ్ ఈస్ట్ MRT చిత్రాల కోసం వెతకగా, BJP యొక్క పశ్చిమ బెంగాల్ విభాగము  వికీపీడియాలో ఉపయోగించిన చిత్రాన్ని తీసుకొని అది మోడీచే నిర్మించబడిందని వాదన/దావా చేయడం జరిగిందని గుర్తించాము. జురాంగ్ ఈస్ట్ MRT స్టేషన్ అనేది సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్‌లో ఒక ఎత్తైన కూడలి, ఇది సింగపూర్ యొక్క SMRT ట్రైన్స్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతుంది.

మరిన్ని వివరాల కోసం Digiteye India టీం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాన్ని పరిశీలించగా,ఇదే చిత్రాన్నిఫిబ్రవరి 13, 2020న సింగపూర్‌కు చెందిన “ది స్ట్రెయిట్స్ టైమ్స్‌లో”  ప్రచురించబడిందని మేము గుర్తించాము.
“ట్రాక్ లోపం వల్ల చోవా చు కాంగ్ మరియు జురాంగ్ ఈస్ట్ మధ్య MRT ప్రయాణానికి అంతరాయం” ఏర్పడిందనే శీర్షికతో ప్రచురించబడింది.

మౌలిక సదుపాయాల పరంగా సాధించిన విజయాన్ని క్లెయిమ్ చేయడానికి బిజెపి విభాగము తప్పు చిత్రాన్ని ఉపయోగించడం ఇదేం మొదటిసారి కాదు. 2021లో ఉత్తరప్రదేశ్‌లో ఎక్స్‌ప్రెస్‌వే గురించి ఇదే విధమైన వాదనను Digiteye India బృందం తప్పని నిరూపించింది.

అందువల్ల, సంబంధం లేని ఫోటోతో చేసిన వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

మోదీ మళ్లీ ప్రధాని అవుతారని రాహుల్ గాంధీ చెప్పారా? వాస్తవ పరిశీలన

SC/ST/OBC రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేస్తుందని అమిత్ షా తెలంగాణ బహిరంగ సభలో చెప్పారా; వాస్తవ పరిశీలన

 

 

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో బబియా అనే శాఖాహార మొసలిని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది, మరియు మొసలి గుడిలోని ప్రసాదం మాత్రమే తింటుందనేదొక వాదన.

నిర్ధారణ/Conclusion: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో శాకాహార మొసలి బబియా నివసిస్తుందనేది నిజం. అయితే, బబియా 2022లో మరణించింది మరియు ఒక సంవత్సరం తర్వాత సరస్సులో కొత్త మొసలి కనిపించింది.వైరల్ వీడియోలో బాబియా యొక్క కొన్ని చిత్రాలు మాత్రం కనబడుతాయి, అన్నీ కాదు. చిత్రాలలో ఒకటి కోస్టారికాకు చెందిన వ్యక్తి, గాయపడిన మొసలికి వైద్యం చేసి తిరిగి ఆరోగ్యవంతంగా చేసి, దాంతో అతనికి మొసలితో అనుబంధం ఏర్పడడం వంటి నేపథ్యంలో తీసిన డాక్యుమెంటరీ నుండి తీసుకోబడింది.

రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

కేరళ దేవాలయంలోని చెరువులో శాకాహార మొసలి నివసిస్తోందని తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయ సరస్సులో మొసలి నివసిస్తోందని ఆ వీడియో పేర్కొంది. వీడియోలో మొసలి ముక్కుపై ఒక వ్యక్తి తన తలను ఉంచే దృశ్యాలను చూడవచ్చు మరియు మొసలి పేరు బబియా అని, ఆలయ పూజారి మొసలికి ఆలయం నుండి బియ్యం ప్రసాదం కూడా అందజేస్తారని ఒక వాదన.

ఈ వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందొ పరిశీలన చేయమని Digiteye Indiaకి వాట్సాప్‌లో అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు Googleలో Babiya కోసం వెతకగా అనేక ఆన్‌లైన్ వార్తాపత్రికలు నుంచి సమాచారం కనిపించగా, అందులో ఒకటి అక్టోబర్ 10,2022న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించబడిన కథనానికి దారితీసింది. ఏడు దశాబ్దాలకు పైగా ఆలయ చెరువులో నివసిస్తున్న బబియా మరణించినట్లు మరియు మొసలి “ఆలయం వారు సమర్పించే బియ్యం, బెల్లం ప్రసాదాలను మాత్రమే తినేదని” అని నివేదిక పేర్కొంది.

బాబియా మరణించిన ఒక సంవత్సరం తర్వాత, ఆలయ సరస్సులో మరొక మొసలి కనిపించిందని నవంబరు 13, 2023న ప్రచురించబడిన ‘ది హిందూ’ యొక్క మరొక నివేదిక పేర్కొంది. సరస్సులోకనిపించడం ఇది మూడో మొసలి అని ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది.

అయితే, వైరల్ వీడియోలో ఉపయోగించిన అన్ని విజువల్స్ బాబియాకి సంబంధించినవి కావు.

మేము అన్ని విజువల్స్‌పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా, మొసలి ముక్కుపై ఒక వ్యక్తి తల ఉంచిన చిత్రం కేరళలోని దేవాలయం నుండి కాదని గమనించాము.ఇది 2013లో “ది మ్యాన్ హూ స్విమ్స్ విత్ క్రోకోడైల్స్” అనే డాక్యుమెంటరీ సంబంధిచిన వీడియో. వైరల్ చిత్రం 20:57 మార్క్ వద్ద చూడవచ్చు.

“ది మ్యాన్ హూ స్విమ్స్ విత్ క్రోకోడైల్స్”అనే డాక్యుమెంటరీ కోస్టారికాకు చెందిన గిల్బర్టో ‘చిటో’ షెడ్డెన్ అనే వ్యక్తి జీవితాన్ని సంబంధించింది.చేపలు పట్టే సమయంలో చీటో
కి ఈ మొసలిని కంట పడింది. గాయపడిన మొసలికి అతను వైద్యం చేసి తిరిగి ఆరోగ్యవంతంగా చేశాడు.అదే సమయంలో అతనికి మొసలితో అనుబంధం ఏర్పడడంతో దానికి ‘పోచో’ అని పేరు పెట్టాడు.డాక్యుమెంటరీ వివరణలో, “ఈ జీవికి(మొసలి) వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మొసలి తనను విడిచిపెట్టడానికి నిరాకరించడం చూసి చిటో ఆశ్చర్యపోయాడు. వారి స్నేహం దశాబ్దాలుగా కొనసాగింది, చిటో ప్రపంచంలో మొసలిని విజయవంతంగా మచ్చిక చేసుకున్న కొద్దిమంది వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.”

కాబట్టి, ఈ వాదన/దావా, తప్పు.

మరి కొన్ని Fact checks:

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన

 

వాట్సాప్‌లో షేర్ అవుతున్న చిత్రం టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం అని వైరల్ అవుతోంది; Fact Check

ఇటీవల, టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం వాట్సాప్‌లో వైరల్‌గా మారింది, నలుపు మరియు తెలుపు ఫోటో 18 వ శతాబ్దపు కర్ణాటక పాలకుడు నిజమైన టిప్పు సుల్తాన్‌ను యొక్క చిత్రం అని ఒక వాదన. ఈ చిత్రాన్ని రంగుల చిత్రంతో పోలుస్తూ, ఇన్నాళ్లుగా భారత పాఠశాల పాఠ్య పుస్తకాలలో కాంగ్రెస్ ముద్రిస్తూ వస్తున్నది ఈ రంగుల చిత్రం.

క్యాప్షన్ ఈ విధంగా ఉంది: “ప్రచార ఐసా ఫైలావో కి పంక్చర్ వాలే షకల్ వాలా లూటేరా భీ సుల్తాన్ దిఖే”,
(తెలుగు అనువాదం:ముఖం కూడా సరిగాలేని దొంగని, సుల్తాన్ అనిపించే విధంగా ప్రచారం చేయండి)

వాస్తవ పరిశీలన కోసం Digiteye Indiaకి పంపిన WhatsApp చిత్రాన్ని క్రింద చూడండి.

టిప్పు సుల్తాన్, 18వ శతాబ్దంలో మైసూర్ రాజ్యానికి (ప్రస్తుత కర్ణాటకలో భాగం) పూర్వపు పాలకుడు. అతను మైసూర్ టైగర్ అని కూడా పిలువబడ్డాడు.అయితే,కొంత కాలం క్రితం,సాంప్రదాయవాద సమూహాల(conservative groups) వాదనల ప్రకారం,అతను చాలా మంది హిందువులను వధించిన క్రూరమైన, హిందూ వ్యతిరేక నాయకుడని అతని పేరు వివాదాస్పదంగా మారింది.మరో వైపు చాలా మంది అతను ఒక దేశభక్తుడు అని నమ్ముతారు.

Fact Check

ఈ చిత్రం 2018 నుండి చెలామణిలో ఉందని Digiteye India తేలుకొంది. దీనిని భారత ప్రభుత్వ అధికారిక తపాలా స్టాంప్ మరియు ఇతర పాఠ్యపుస్తకాల నుండి టిప్పు సుల్తాన్ యొక్క సుపరిచితం చిత్రంతో ఇండోర్‌కు చెందిన బిజెపి నాయకుడు రమేష్ మెండోలా మొదట ట్వీట్ చేశారు.

Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా ఈ చిత్రం(నలుపు మరియు తెలుపులో ఉన్న ఫోటో) పిక్సెల్స్‌లోని ఆర్కైవ్‌లలో అందుబాటులో ఉందని మరియు ఇది 18వ శతాబ్దపు వ్యాపారి హమద్ బిన్ ముహమ్మద్ అల్-ముర్జాబి అనే వ్యక్తి చిత్రమని వెల్లడైంది.అతనిని టిప్పు టిప్ అనే మారుపేరుతో పిలుస్తారు. ఆక్స్‌ఫర్డ్ రీసెర్చ్ ఎన్‌సైక్లోపీడియాస్(Oxford Research Encyclopaedias) ప్రకారం, అతను జాంజిబార్‌లో ఏనుగు దంతాలు మరియు బానిస వ్యాపారి, 19వ శతాబ్దంలో, టాంగన్యికా సరస్సుకి పశ్చిమాన “అరబ్ జోన్”లో ఎంతో పలుకుబడి మరియు బలమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు.

మరియు టిప్పు టిప్ ఉబ్బిన ముక్కు వలన అతనికి ఆ పేరు తెచ్చి పెట్టింది. కావున, సోషల్ మీడియాలో వైరల్ అయిన చిత్రం టిప్పు సుల్తాన్ చిత్రం కాదు, 18 వ శతాబ్దంలో తూర్పు మధ్య భాగంకు చెందిన బానిస వ్యాపారి టిప్పు టిప్ యొక్క చిత్రం.

వాదన/Claim: “టిప్పు సుల్తాన్ యొక్క నిజమైన ఫోటో” మరియు భారతీయ పాఠశాల పాఠ్య పుస్తకాలలో కాంగ్రెస్‌ ముద్రిస్తూవస్తున్న చిత్రంతో పోలిక అనేది ఒక వాదన.

నిర్ధారణ/Conclusion: నలుపు మరియు తెలుపు చిత్రం టిప్పు సుల్తాన్ యొక్క చిత్రం కాదు, 18వ శతాబ్దంలో మధ్యప్రాచ్యాని(Middle East)కి చెందిన బానిస వ్యాపారి టిప్పు టిప్ యొక్క చిత్రం.

Rating: Totally False —

మరి కొన్ని Fact checks:

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

 

 

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:

దుబాయ్ అధినేత షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్(Sheikh Mohammed bin Rashid Al Maktoum) జనవరి 29న దుబాయ్ లోని ఒక జిల్లాకు “హింద్ సిటీ”గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించినప్పుడు,భారతదేశం మరియు హిందువులను గౌరవించాలనే ఉద్దేశంతోనే పేరు మార్చారని సోషల్ మీడియా సందడి చేసింది.వాదనను క్రింద చూడవచ్చును.

“దుబాయ్ అధినేత మరియు యుఎఇ ప్రధానమంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఎమిరేట్‌లోని ఒక జిల్లా పేరు మార్చాలని ఆదేశించారు.అల్ మిన్‌హాద్ మరియు దాని చుట్టుపక్కల 84 చదరపు కిలోమీటర్ల ప్రాంతాలు ఇప్పుడు భారతదేశం మరియు హిందువులు మానవాళికి అందించిన సహకారాన్ని గౌరవించేందుకు “హింద్ సిటీ”గా పిలువబడతాయి.

ఇలాంటి వాదనలతో సోషల్ మీడియాలో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

దుబాయ్ నుండి వచ్చిన వార్తల ప్రకారం,షేక్ తన భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం జిల్లా పేరును మార్చినట్లు దుబాయ్ ‘ప్రభుత్వ మీడియా కార్యాలయం’ పేర్కొంది. వాదన/దావా ప్రకారం భారతదేశం వలన కాదు. క్రింది విధంగా ప్రకటించారు:

 

“ప్రధాన మంత్రి మరియు దుబాయ్ అధినేత హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, అతని భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం అల్ మిన్‌హాద్ ప్రాంతాన్ని ‘హింద్ సిటీ’గా మార్చారు” అని షేక్ మీడియా కార్యాలయం వార్తా సంస్థలకు తెలిపింది.’హింద్’ అనేది అరబిక్ పేరు,మరియు ఈ ప్రాంతం యొక్క పురాతన నాగరికతలో దాని మూలాలను కలిగి ఉంది,” అని వివరణను ఇచ్చింది.

భారతదేశం గురించి ఎటువంటి ప్రస్తావన లేకుండా నిజమైన ప్రకటన క్రింది విధంగా ఉంది:

కావున, అల్ మిన్‌హాద్ జిల్లా పేరును ‘హింద్ సిటీ’గా మార్చడంలో భారతదేశ ప్రస్తావన కానీ సంబంధం కానీ లేదు. ఈ దావా/వాదన తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

Claim: భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్ ‘అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారు.
Conclusion: భారతదేశ గౌరవార్థం కాకుండా షేక్ భార్య షేఖా హింద్ బింట్ మక్తూమ్(Sheikha Hind bint Maktoum) గౌరవార్థం అల్ మిన్‌హాద్ ప్రాంతాన్ని ‘హింద్ సిటీ’గా మార్చబడింది”.
Rating: Misleading —

మరి కొన్ని Fact checks:

ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

Fact Check: సుడాన్‌లో డ్రోన్ దాడికి సంబంధించిన పాత వీడియో ప్రస్తుతం గాజాపై జరుగుతున్న దాడులలో ఒకటని క్లెయిమ్

సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు ఆపాదించబడిన తప్పుడు దావా/వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది; Fact Check

భారత ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ ‘ప్రజలను వీధుల్లోకి రావాలని మరియు వారి హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని’ కోరుతున్నట్టు ఆయన ఫోటోతో ఉన్న ఒక సందేశం వాట్సాప్‌లో షేర్ చేయబడుతోంది.

“భారత ప్రజాస్వామ్యం సుప్రీం కోర్ట్ జిందాబాద్” అని రాసి ఉన్న శీర్షికతో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ ఫోటోను షేర్ చేయబడింది. ఫోటో మీద క్రింద విధంగా వ్రాసీ ఉంది.

“మేము భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాము. అయితే మీ సహకారం కూడా చాలా ముఖ్యం. దీని కోసం ప్రజలందరూ సంఘటితమై వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని అడగాలి. ఈ నియంతృత్వ ప్రభుత్వం ప్రజలను భయపెడుతుంది మరియు బెదిరిస్తుంది, కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి మరియు ప్రభుత్వాన్ని అడగండి, నేను మీతో ఉన్నాను.”

భారతదేశ సుప్రీం కోర్టు యొక్క అత్యున్నత పదవిని కలిగి ఉన్న అత్యున్నత న్యాయమూర్తి అయిన CJIకి సంబంధించిన పోస్ట్‌లోని విషయాల యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయడానికి Digiteye India బృందం వాట్సాప్ అభ్యర్థనను(WhatsApp request) స్వీకరించింది.

FACT CHECK

Digiteye India బృందం అనేక అంశాలలో కోట్/Claim నకిలీదని గుర్తించింది. ఏ సీజేఐ(CJI) కూడా ఇలాంటి అప్పీలు చేయరు.వ్యాకరణం మరియు వాక్యాలలో తప్పులు చూస్తే ఆ పోస్ట్ CJI నుండి వచ్చింది కాదని వెల్లడవుతుంది.“ఇది ఫేక్ ఫార్వార్డ్”. సీజేఐ చంద్రచూడ్ లాంటి వారు అలాంటి పని చేయరు. భారత ప్రధాన న్యాయమూర్తి పైన చేసిన ఇటువంటి తీవ్రమైన దుశ్చర్యలకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి ” అని భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పునరుద్ఘాటించారు.

వెంటనే CJI మరియు సుప్రీం కోర్ట్ కార్యాలయాలు సోమవారం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసి, సుప్రీం కోర్ట్ యొక్క ఉన్నత న్యాయమూర్తి అటువంటి ప్రకటన ఎప్పుడూ చేయలేదని మరియు ఆన్‌లైన్‌లో ప్రసారం అవుతున్న సందేశాలు(Messages) తప్పుడు సందేశాలని పేర్కొంది. వారిచ్చిన ప్రకటన కాపీని ఇక్కడ చూడండి:

పై ప్రకటన అనువాదం: ఈ సందేశం(Message) యొక్క వాస్తవికతను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది, “సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ యొక్క ఫైల్ ఫోటోను ఉపయోగించి ఆయనను తప్పుగా ఉటంకిస్తూ( Quote చేస్తు) ప్రచారం చేస్తున్నారనే పోస్ట్ చేయడం భారత సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.ఇది నకిలీ మరియు దురుద్దేశం కలిగిన పోస్ట్. భారత ప్రధాన న్యాయమూర్తి అటువంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అటువంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో చట్టాన్ని అమలు చేసే అధికారులతో తగిన చర్యలు తీసుకుంటున్నాం.”

Claim/వాదన: భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ప్రజలు ఏకమై తమ హక్కుల కోసం అధికారులపై పోరాడాలని కోరారు.

నిర్ధారణ: లేదు, జస్టిస్ చంద్రచూడ్ ఎప్పుడూ అలాంటి పోస్ట్‌ను జారీ చేయలేదు మరియు అలాంటి పోస్ట్‌కు అధికారిక అనుమతి ఇవ్వలేదు.

Rating: Totally False —

[మరి కొన్ని Fact Checks: Did laser beam weapons from space cause Hawaii wildfires? Fact Check]

No, Rs.500 Indian currency notes with ‘*’ symbol are NOT FAKE but genuine; Fact Check]