Claim/వాదన: వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.
Conclusion/నిర్ధారణ: నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి మాత్రమే సంబంధించినది, నిషేధం అన్ని బాణసంచాలపై కాదు.
Rating: Misleading —
Fact Check వివరాలు:
వాదన ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi-NCR)ప్రాంతం మాత్రమే కాకుండా, భారతదేశం అంతటా బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని, సుప్రీం కోర్టును ఉద్దేశించి తప్పుదారి పట్టించే పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.
వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.దీనిపై శ్రీ విష్ణు శంకర్ జైన్ అభిప్రాయాలను తప్పక వినండి.”
క్రింద ట్వీట్ చూడండి:
SC declared a ban on the sale and use of firecrackers, previously confined to Delhi-NCR is now applicable nation-wide. Must Listen to Mr.Vishnu Shankar Jain’s views on this. pic.twitter.com/2oqPuLP0p0
— Stranger (@amarDgreat) November 10, 2023
FACT CHECK
ఈ వాదనలోని వాస్తవం పరిశీలించే క్రమంలో మొదట సుప్రీంకోర్టు అటువంటి తీర్పు ఏమైనా ఇచ్చిందా అని వెతకగా, గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్(Delhi-NCR)ప్రాంతంకు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది మరియు దానిపై ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చిందని కనుగొన్నము. 2018 తీర్పును స్పష్టం చేసే వార్తా నివేదికలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
బాణసంచాలో బేరియం మరియు నిషేధిత రసాయనాల వాడకంపై నిషేధం దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, అన్ని రాష్ట్రాలకు కట్టుబడి ఉంటుందని సుప్రీం కోర్టు ఒక రివ్యూ పిటిషన్‌లో తన ఆదేశాలపై స్పష్టత ఇచ్చింది.రాజస్థాన్‌కు సంబంధించి, న్యాయమూర్తులు A.S బోపన్న మరియు M.M సుందరేష్ 7 నవంబర్ 2023న వివరణ ఇచ్చారు, ఈ ఉత్తర్వులు ఇప్పుడు రాజస్థాన్‌తో సహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని అపెక్స్ కోర్టు(apex court)పేర్కొంది.
2018 తీర్పు ప్రకారం, “గ్రీన్ క్రాకర్స్” పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు బాణాసంచా పర్యావరణ, గాలి నాణ్యతను ప్రభావితం చేయకూడదని నిర్దేశించింది మరియు తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేసే మరియు విపరీతమైన శబ్దాన్ని నివారించే ‘పర్యావరణ అనుకూలమైన’ లేదా “గ్రీన్” బాణసంచా తయారీని “బాణసంచా కర్మాగారాలకు” తప్పనిసరి చేసింది.
దీపావళి బాణసంచాలో నిషేధిత రసాయనాలు ‘బేరియం సాల్ట్’ వంటివి మరియు ఈ రసాయనాలతో కూడిన బాణాసంచా వాడకాన్ని నిషేధించబడ్డాయి మరియు “గ్రీన్ క్రాకర్స్” అనుమతించబడతాయని సుప్రీం కోర్ట్ 2021 నాటి తీర్పులో పేర్కొంది.
అందువల్ల, నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి సంబంధించినది మరియు పోస్ట్‌లో పేర్కొన్నట్లు దేశవ్యాప్తంగా అన్ని బాణసంచాలపై నిషేధం కాదు. వాస్తవానికి, తయారీదారులు సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ పటాకులు/బాణసంచా ఉత్పత్తి చేస్తున్నచో అవి అనుమతించబడతాయి. అందువల్ల, దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది.
మరి కొన్ని fact Checks:
10 లో 9 పట్టణ ప్రైవేటు పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ చదవలేరట! ఎంతవరకు నిజం?