ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణలో రెండు వైపులా వేలాది మందిని చనిపోయారు. ఈ వార్త మరణాల సంఖ్యపై అనేక వాదనలకు పుష్కలమైన అవకాశాలను ఇచ్చింది.ఈ వాదనల మధ్య, హమాస్ తమ ట్యాంకులతో ఇజ్రాయెల్ వైపు కదులుతూ యుద్ధంలో ముందుకెళుతున్నట్లు ఒక వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.
ఈ వాదన/క్లెయిమ్‌లతో కూడిన వీడియో క్లిప్‌లో పాలస్తీనా జెండాతో కూడిన ట్యాంకులు సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని మరియు హమాస్ అనేక ఇజ్రాయెల్ ట్యాంకులను ధ్వంసం చేసి వాటిపై పాలస్తీనా జెండాలను ఎగురవేసినట్లు కనిపిస్తుంది.
క్యాప్షన్ ఈ విధంగా ఉంది:”हम गाजा को तुम्हारे लिए जन्नुम बना देगा । हमास ने कई इजरायली टैंकों को नष्ट कर दिया, सैनिकों को पकड़ लिया… मुजाहिद्दीन ने दुश्मन के टैंको पर फलस्तीनि के झंडे लहरा दिए।। शुक्र अलहमदुलिलाह”.[తెలుగు అనువాదం:మేము మీ కోసం గాజాను నరకంగా తయారు చేస్తాము.హమాస్ అనేక ఇజ్రాయెలీ ట్యాంకులను ధ్వంసం చేసింది మరియు సైనికులను బంధీ చేసుకున్నారు… శత్రువు ట్యాంకులపై పాలస్తీనా జెండాలు ఎగురవేశారు.]
” हम गाजा को तुम्हारे लिए जन्नुम बना देगा”
हमास ने कई इजरायली टैंकों को नष्ट कर दिया, सैनिकों को पकड़ लिया..
मुजाहिद्दीन ने दुश्मन के टैंको पर फलस्तीनि के झंडे लहरा दिए।।
शुक्र अलहमदुलिलाह✌️ pic.twitter.com/l2OuxyCshO
— Wajidkhan (@realwajidkhan) October 29, 2023
ఇలాంటి వాదన/దావాతో పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.
FACT CHECK
Digiteye India వాదన/క్లెయిమ్ యొక్క వాస్తవం పరిశీలించినప్పుడు, అది పూర్తిగా తప్పు అని తేలింది. మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసి,Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాల కోసం అన్వేషించగా, అది డిసెంబర్ 30, 2020న ప్రచురించిన మిడిల్ ఈస్ట్ మానిటర్‌లో వార్తా నివేదికకు దారితీశాయి.ముఖ్య శీర్షిక ఇలా ఉంది: “పాలస్తీనా వర్గాలు గాజాలో సంయుక్త సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి.” ఇది 29 డిసెంబర్ 2020న దక్షిణ గాజా స్ట్రిప్‌లోని రఫాలో హమాస్, ఇస్లామిక్ జిహాద్ మరియు ఇతర PLO సభ్యులతో సహా పాలస్తీనా వర్గాల మిలటరీ విభాగాల మధ్య నిర్వహించిన మాక్ డ్రిల్ అని నివేదిక స్పష్టంగా వివరించింది.
మరింత అన్వేషించగా, డిసెంబర్ 30, 2020 తేదీన Facebookలో ఈ లింక్‌ని గమనించాము.
ఈ వార్తను డిసెంబర్ 30, 2020న అల్జజీరా కవర్ చేసింది: “2008లో గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ యుద్ధ వార్షికోత్సవం రోజున పాలస్తీనా వర్గాలు ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించాయి. గాజా స్ట్రిప్ అంతటా అనేక రక్షణ దృశ్యాలు విన్యాసాలలో కనిపించాయి”.
కావున, వాదన/దావా తప్పు.వీడియో డిసెంబర్ 2020కి చెందినది మరియు హమాస్ మరియు ఇజ్రాయెల్ మధ్య ప్రస్తుత వివాదానికి సంబంధించినది కాదు.
వాదనClaim:హమాస్ ఇజ్రాయెల్ వైపు ముందుకు సాగుతోంది మరియు స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ ట్యాంకులపై పాలస్తీనా జెండాలను ఎగురవేసింది.
నిర్ధారణ/Conclusion:వీడియోక్లిప్ డిసెంబర్ 29, 2020న జరిగిన హమాస్‌తో సహా పాలస్తీనా గ్రూపుల సంయుక్త ‘సైనిక డ్రిల్ల్’ కు చెందినది.
Rating: Misrepresentation —
మరి కొన్ని fact checks:
ఇజ్రాయెల్ గాజాలో సూపర్-ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ 10G పరీక్షలు నిర్వహిస్తోంది? Fact Check
భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check
Pingback: మణిపూర్‌లోని పురాతనమైన ఈ చర్చిని బిజెపి మద్దతుదారులు తగులబెట్టారా? నిజమేంటి? - Digiteye Telugu
Pingback: ఇజ్రాయెల్-హమాస్వి దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ నిరసనకారులపై కారు దూసుకెళ్లిందనే వాదన; వాస్తవ పర