Tag Archives: ban

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claimట్రంప్ పరిపాలనను విమర్శించే అన్ని ట్వీట్లను నిలిపివేస్తామని ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. ట్రంప్ పరిపాలనను విమర్శించే X ఖాతాలను సస్పెండ్ చేస్తామని/నిలిపివేస్తామని ఎలోన్ మస్క్ పోస్ట్‌ను షేర్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

*****************************************************************************

X యజమాని మరియు బిలియనీర్ ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ఖాతాలను/అకౌంట్లను X ప్లాట్‌ఫామ్ నుండి సస్పెండ్ చేయడం/నిలిపివేయడం జరుగుతుందనే సందేశాన్ని పోస్ట్ చేశారని ఒక క్లెయిమ్/వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

దావా/వాదన ఈ విధంగా ఉంది: ” ట్రంప్ పరిపాలనను నిరసిస్తున్న ఎవరైనా X నుండి సస్పెండ్ చేయబడతారు. ట్రంప్ వ్యతిరేక డ్రామా అంతా థ్రెడ్స్, రెడ్డిట్, బ్లూస్కై, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి లిబరల్ ఎకో చాంబర్లలో ((liberal echo chamber) పోస్ట్ చేసుకోవచ్చు”.

FACT-CHECK

ఈ వాదన ఆందోళనకరంగా ఉండటం మరియు అమెరికా వాక్ స్వేచ్ఛ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో, Digiteye India బృందం ఆ వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించింది. ముందుగా చిత్రంలోని పోస్ట్‌లో టైమ్‌స్టాంప్ లేదు, కానీ మస్క్ ప్రొఫైల్ ఇమేజ్ మరియు హ్యాండిల్ “@elonmusk” ఉండటం గమనించాము.

ఇంకా, వాదన/క్లెయిమ్ చేయబడిన చిత్రంలో “ఫాలో” బటన్ మాత్రమే ఉంది, కానీ మస్క్ అసలైన (Original)పోస్ట్ ఎగువ కుడి మూలలో xAI లోగోతో పాటు “సబ్‌స్క్రైబ్” బటన్‌ కూడా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని ఇక్కడ క్రింది చిత్రాలలో స్పష్టంగా చూడవచ్చు:

మేము ఎలోన్ మస్క్ అధికారిక హ్యాండిల్‌ను పరిశీలించినప్పుడు, అతని X ఖాతాలో అలాంటి పోస్ట్ ఏది లేదు, మరియు ఈ పోస్ట్ పై ఎటువంటి వార్తా నివేదికలు లేవు. మస్క్ అటువంటి పోస్ట్‌ను X లో అధికారికంగా షేర్ చేసి ఉంటే అది వేగంగా వార్తల్లోకి వచ్చేది. కాబట్టి, ఆ వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

భారతదేశ వ్యాప్తంగా అన్ని బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీంకోర్టు నిషేధించిందా? వాస్తవ పరిశీలన

Claim/వాదన: వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.

Conclusion/నిర్ధారణ: నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి మాత్రమే సంబంధించినది, నిషేధం అన్ని బాణసంచాలపై కాదు.

Rating: Misleading —

Fact Check వివరాలు:

వాదన ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం మాత్రమే కాకుండా, భారతదేశం అంతటా బాణసంచా అమ్మకాలు మరియు వాటి వాడకాన్ని సుప్రీం కోర్టు నిషేధించిందని, సుప్రీం కోర్టును ఉద్దేశించి తప్పుదారి పట్టించే పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

వాదన ఈ విధంగా ఉంది: “గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతం కు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది, కాని అది ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్తిస్తుంది.దీనిపై శ్రీ విష్ణు శంకర్ జైన్ అభిప్రాయాలను తప్పక వినండి.”

క్రింద ట్వీట్ చూడండి:

FACT CHECK

ఈ వాదనలోని వాస్తవం పరిశీలించే క్రమంలో మొదట సుప్రీంకోర్టు అటువంటి తీర్పు ఏమైనా ఇచ్చిందా అని వెతకగా, గతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌(Delhi-NCR)ప్రాంతంకు మాత్రమే పరిమితమైన బాణాసంచా అమ్మకాలు మరియు వాటి వినియోగంపై సుప్రీంకోర్టు నిషేధాన్ని ప్రకటించింది మరియు దానిపై ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చిందని కనుగొన్నము. 2018 తీర్పును స్పష్టం చేసే వార్తా నివేదికలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

బాణసంచాలో బేరియం మరియు నిషేధిత రసాయనాల వాడకంపై నిషేధం దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, అన్ని రాష్ట్రాలకు కట్టుబడి ఉంటుందని సుప్రీం కోర్టు ఒక రివ్యూ పిటిషన్‌లో తన ఆదేశాలపై స్పష్టత ఇచ్చింది.రాజస్థాన్‌కు సంబంధించి, న్యాయమూర్తులు A.S బోపన్న మరియు M.M సుందరేష్ 7 నవంబర్ 2023న వివరణ ఇచ్చారు, ఈ ఉత్తర్వులు ఇప్పుడు రాజస్థాన్‌తో సహా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని అపెక్స్ కోర్టు(apex court)పేర్కొంది.

2018 తీర్పు ప్రకారం, “గ్రీన్ క్రాకర్స్” పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు బాణాసంచా పర్యావరణ, గాలి నాణ్యతను ప్రభావితం చేయకూడదని నిర్దేశించింది మరియు తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేసే మరియు విపరీతమైన శబ్దాన్ని నివారించే ‘పర్యావరణ అనుకూలమైన’ లేదా “గ్రీన్” బాణసంచా తయారీని “బాణసంచా కర్మాగారాలకు” తప్పనిసరి చేసింది.

దీపావళి బాణసంచాలో నిషేధిత రసాయనాలు ‘బేరియం సాల్ట్’ వంటివి మరియు ఈ రసాయనాలతో కూడిన బాణాసంచా వాడకాన్ని నిషేధించబడ్డాయి మరియు “గ్రీన్ క్రాకర్స్” అనుమతించబడతాయని సుప్రీం కోర్ట్ 2021 నాటి తీర్పులో పేర్కొంది.

అందువల్ల, నిషేధం దేశవ్యాప్తంగా బాణసంచా తయారీలో బేరియం వంటి హానికరమైన రసాయనాల వినియోగానికి సంబంధించినది మరియు పోస్ట్‌లో పేర్కొన్నట్లు దేశవ్యాప్తంగా అన్ని బాణసంచాలపై నిషేధం కాదు. వాస్తవానికి, తయారీదారులు సుప్రీం కోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం గ్రీన్ పటాకులు/బాణసంచా ఉత్పత్తి చేస్తున్నచో అవి అనుమతించబడతాయి. అందువల్ల, దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది.

మరి కొన్ని fact Checks:

10 లో 9 పట్టణ ప్రైవేటు పాఠశాల పిల్లలు ఇంగ్లీష్ చదవలేరట! ఎంతవరకు నిజం?

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check