Tag Archives: telugu fact

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

వాదన/Claim:“ఈ భారత మాత ఎవరు” అని రాహుల్ గాంధీ అడుగుతున్నట్లు ఒక వీడియో క్లిప్‌ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

నిర్ధారణ/Conclusion:ప్రసంగాన్ని తప్పుగా సూచించడానికి వీడియోని పూర్తిగా చూపించకుండా,  సంక్షిప్తంగా(వీడియోని కుదించి) చేయబడింది.

రేటింగ్: Misleading —

Fact check వివరాలు:

రాజస్థాన్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ మాత’ ఎవరని ప్రశ్నిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో క్లిప్‌ని ఇక్కడ చూడండి:

ఈ వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “అందరూ ఈ నినాదాన్ని పలుకుతారు.. ‘భారత్ మాతా కీ జై’. “అయితే ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి?” అని వీడియో క్లిప్‌లో ఆయన అడుగుతున్నారు.X ఖాతాలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు రమేష్ నాయుడు ఈ విధంగా క్లిప్‌ని షేర్ చేశారు: ““ये भारत माता है कौन, है क्या [ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి], అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. సిగ్గుచేటు.”

ఈ పోస్ట్ X ప్లాట్‌ఫారమ్‌లో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.

Fact Check

Digiteye India team వాట్సాప్‌లో అభ్యర్థనను అందుకుని, ప్రధాన/అసలు వీడియో కోసం వెతకగ, అదే క్లిప్‌ను ‘కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్’ వారు ప్రసంగం యొక్క పూర్తి సందర్భాన్ని షేర్ చేసి ఉండడం గమనించారు. నవంబర్ 20న కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల సెల్ ఛైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాట్ షేర్ చేసిన ట్వీట్ చూడండి.

ఈ వీడియోలో రాహుల్ గాంధీ “చంద్నాజీ ఇప్పుడే ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని పలికారు. ఈ నినాదం చాలా సార్లు వినబడుతుంది, అందరు అంటారు కానీ ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి?”అని మాట్లాడుతూ ఆపై ఆయన భరత్ మాత గురించి వివరించారు. పూర్తి ప్రసంగం మరియు వీడియోని చూస్తే, ఆయన భరత్ మాత గురించి క్రింది విధంగా మాట్లాడినట్లు స్పష్టమవుతుంది:

“భారత మాత అంటే ఈ భూమి, ఈ దేశ ప్రజలు. భారత మాత యొక్క స్వరం మీ సోదరులు, సోదరీమణులు, తల్లులు, తండ్రులు, పేదలు, ధనవంతులు, వృద్ధులలో ప్రతిధ్వనిస్తుంది,ఇది భారత మాత. పార్లమెంటులో కూడా నేను, ‘ఈ భరతమాత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ వ్యక్తులు ఎవరు? జనాభా ఎంత? ఎంత మంది గిరిజనులు, ఎంత మంది దళితులు, ఎంత మంది వెనుకబడిన వారు, ఎంత మంది పేదలు, ఎంత మంది ధనవంతులు ఉన్నారు? మనం‘భారత్ మాతాకీ జై’ అని నినాదిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమే. ఈ దేశంలో ఎంత మంది వెనుకబడినవారు, ఎంత మంది దళితులు, ఎంత మంది పేదలు ఉన్నారో మనకు తెలియకపోతే ‘భారత్ మాతా కీ జై’అనే నినాదంలో అర్ధం ఏముంది? అందువల్ల, ఈ దేశం ఇప్పుడు ఈ కారణాలపై జనాభా గణనను నిర్వహించవలసి అవసరం ఉంది.”

ఇంకా, పైన చూసినట్లుగా రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఖాతాలో పూర్తి వీడియో అందుబాటులో ఉంచబడింది. రాజస్థాన్‌లోని బుండీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీగారి ప్రసంగం యొక్క 35 నిమిషాల అసలైన పూర్తి వీడియో చూడవచ్చు.

మరి కొన్ని Fact checks:

ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

 

వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.

వాదన/ Claim:ప్యారిస్‌లో తమను వేధిస్తున్న పురుషులను మహిళల గుంపు అదుపు చేస్తున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది మరియు మతపరమైన కోణంతో ఈ వీడియో షేర్ చేయబడింది.

నిర్ధారణ/Conclusion: ప్రొఫెషనల్ స్టంట్‌పర్సన్‌లుగా మారడానికి వ్యక్తులకు శిక్షణనిచ్చే ఫ్రెంచ్ స్టంట్ గ్రూప్ ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను గ్రూప్ వారు ఈ నెల ప్రారంభంలో వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

RATING: Misinterpretation —

మహిళల గుంపు తమను వేధిస్తున్నపలువురు పురుషులను అదుపు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పారిస్‌లో చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో మతపరమైన కోణంతో మరియు ఇస్లామోఫోబిక్ వాదనలతో షేర్ చేయబడింది. ఫోటోతో వైరల్ అవుతున్న వాదన ఇలా ఉంది:

ఈ వీడియో చాలా శాంత పరిచేదిగా ఉంది. నిన్న ప్యారిస్‌లో ఎక్కడో మెట్రో అండర్‌పాస్‌లో, కొంతమంది వలసదారులు వారు ఏది బాగా చేయగలరో అది చేస్తున్నారు.తహర్రష్(Taharrush–సుమారుగా అనువదిస్తే: స్త్రీలపై సామూహిక వేధింపులు.) దురదృష్టవశాత్తు, ఈ ముగ్గురు మహిళలు ఫ్రెంచ్ పారా-మిలటరీకి పని చేసేవాళ్ళు.

దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో మరియు X (గతంలో, ట్విట్టర్)లో వైరల్‌ అవుతోంది.

https://twitter.com/DalviNameet/status/1724592897226686869

వీడియో ఇక్కడ,ఇక్కడ,మరియు ఇక్కడ అవే వాదనలతో షేర్ చేయబడింది.

FACT CHECK

వాట్సాప్‌లో ఈ వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందొ పరిశీలన చేయమని Digiteye India Teamకి అభ్యర్థన వచ్చింది.

వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి Team/బృందం ‘inVID’ – వీడియో ధృవీకరణ సాధనం (inVID-a video verification tool) ఉపయోగించగా, కీఫ్రేమ్‌లలో ఒకదానిలో, పురుషులు నల్లటి హూడీలు ధరించడం గమనించారు.
స్వెట్‌షర్ట్ వెనుక తెల్లటి అక్షరాలతో “CUC” అని రాసి ఉంది. మేము ఈ క్లూని ఉపయోగించి,Googleలో కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము.

కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, అది క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్(Campus Univers Cascades) యొక్క Instagram పేజీకి దారితీసింది. వారి లోగో మరియు వీడియోలో పురుషుల హూడీలపై కనిపించిన లోగో ఒకే లాగా ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వారి వెబ్‌సైట్‌ను పరిశీలించాగా, CUC తమని తాము “సినిమా మరియు ప్రదర్శనలలో స్టంట్ టెక్నిక్‌లు అందించే వృత్తిపరమైన శిక్షణా కేంద్రం అని పేర్కొంది. ఇది “క్యాంపస్ ప్రేరేపిత క్రీడాకారులు, పురుషులు మరియు మహిళలు కోసం ఉద్దేశించబడింది, దీని లక్ష్యం ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్‌గా మారడం.” ఇవి 2008లో స్థాపించబడ్డాయి మరియు ఫ్రాన్స్‌లో ఉన్నాయి.”ఈ కేంద్రం ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్‌ అవ్వాలనుకునే లక్ష్యం ఉన్న క్రీడాకారులు, పురుషులు మరియు మహిళలు కోసం ఉద్దేశించబడింది”.ఇది 2008లో ఫ్రాన్స్‌లో స్థాపించబడింది.

మేము వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలించగా నవంబర్ 2, 2023న పోస్ట్ చేసిన వైరల్ వీడియోని కనుగొన్నాము.(వీడియో క్రింద చూడ వచ్చును).

వీడియో కాప్షన్ “వీధి పోరాటం(Streetfight) ⚠️👊”, మరియు కక్టీమ్, క్యాంపస్ లైఫ్, స్ట్రీట్, ఫైట్, మార్షల్ ఆర్ట్స్, వీడియో, స్టంట్‌టీమ్, ఫైటర్, క్యాంపస్, బాక్సింగ్, కో, కంబాట్, ఫాలో, మార్షల్, బగారే, యాక్షన్, సినిమా, కొరియోగ్రఫీ, క్యాస్కేడేస్, స్టంట్‌లైఫ్” వంటి హ్యాష్‌ట్యాగ్‌లు వీడియో వివరాల్లో జత పరిచారు.

వారి పేజీలోని మరి కొన్ని వివరాలు/వీడియోలు చూస్తే, సినిమా మరియు వీడియోల కోసం స్టంట్ వ్యక్తులకు శిక్షణనిచ్చే కేంద్రమని వెల్లడవుతుంది. వైరల్ అవుతున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check

ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన

ఆర్మీ ప్రైవేట్ వాహనాలకు కూడా టోల్ ఫీజు మినహాయింపు పొడిగించారా? వైరల్ పోస్ట్‌పై వాస్తవ పరిశీలన

వాదన/Claim: రక్షణ సిబ్బంది ప్రైవేట్ వాహనాలకు కూడా టోల్ ట్యాక్స్ మినహాయించబడిందని వైరల్ అడ్వైజరీ లేఖ పేర్కొంది.

నిర్ధారణ/Conclusion: లేఖ నకిలీదని చాలా ఆధారాలు లభించాయి.
రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ “డ్యూటీ’లో ఉన్న వ్యక్తులకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.మరియు రిటైర్డ్ వ్యక్తులకు లభించదు.మరియు వ్యక్తిగత వాహనం ఏదైనా అధికారిక ప్రయోజనం మరియు విధిని నిర్వర్తించడానికి ఉపయోగించని పక్షంలో, అది విధి నిర్వహణ అధికారితో పాటు వచ్చినప్పటికీ, టోల్ మినహాయింపు అందుబాటులో ఉండదు. RTI ప్రశ్నలకు సమాధానమిస్తూ, NHAI కూడా అదే పేర్కొంది.

RATING: Misinterpretation —

రక్షణ సిబ్బంది ప్రైవేట్ వాహనాలకు టోల్ ఫీజు లేదు’ అంటూ ఓ అడ్విసోరీ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ టోల్ (సైనిక దళం, వైమానిక దళం) చట్టం, 1901కి మార్పు జరిగిందని సింగిల్ పేజీ అడ్వైజరీ ఆరోపించింది.

మార్పులు మరియు కొత్త నిబంధన ప్రకారం, ఆర్మీ సిబ్బందికి టోల్ ఫీజు మినహాయింపుతో పాటు, ఆర్మీ సిబ్బంది గుర్తింపు కార్డు చూపిస్తే వారి ప్రైవేట్ వాహనాలకు కూడా అదే మినహాయింపు అమలు చేయబడింది. ఈ సమాచారాన్ని టోల్ సిబ్బందికి త్వరగా చేరవేయాలని లేఖలో పేర్కొన్నారు.

వాట్సాప్ ఫార్వార్డెడ్ మెసేజ్‌ల ద్వారా లేఖ దావానంలా వ్యాపిస్తోంది.వాట్సాప్‌లో ఈ వాదన/క్లెయిమ్‌ యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India బృందానికి అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం లేఖను పరిశీలించగా, లేఖ నకిలీదని చాలా ఆధారాలు లభించాయి.

లేఖ యొక్క హెడర్‌లో జారీ చేయబడిన మంత్రిత్వ శాఖ గురించి ప్రస్తావించబడలేదు.తేదీ ఆగస్టు 25, 2023, చేతితోవ్రాసి, ఫోటో కాఫీ చేయబడింది. లేఖలో “service pers, reg forces, gtd on pvt vehs of def pers, come, Rks, indl, fmn channel” వంటి సంక్షిప్త పదాలు(ఎక్రోనింస్) ఉపయోగించబడ్డాయి.అధికారిక అడ్విసోరీ ప్రకారం సరైన పదాలు ఇవి: “service personnel, registered forces, granted on private vehicles of defence personnel, individual.”ప్రభుత్వం నుండి వచ్చేఎటువంటి అధికారిక ప్రకటన ఇలాంటి అర్ధంలేని సంక్షిప్త పదాలను(ఎక్రోనింస్) ఉపయోగించదు.

మేము ది ఇండియన్ టోల్ (ఆర్మీ, ఎయిర్ ఫోర్స్) చట్టం, 1901ని పరిశీలించాము.
చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం అధికారులు, సైనికులు, ఎయిర్‌మెన్‌లు మరియు వారి యొక్క కుటుంబ సబ్యులు లేదా అధీకృత అనుచరుల కుటుంబాలలోని సభ్యులందరికీ టోల్ చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.

కొన్ని అపోహలపై జూన్ 17, 2014న రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన వివరణను మేము పరిశీలించాము. సమస్యను మళ్లీ పరిశీలించిన మంత్రిత్వ శాఖ ఇప్పుడు “ఇండియన్ టోల్ (ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్) చట్టం  1901 ప్రకారం, ‘డ్యూటీ’లో ఉన్న వ్యక్తులకు మాత్రమే మినహాయింపు లభిస్తుంది.మరియు రిటైర్డ్ వ్యక్తులకు లభించదు.మరియు భారతీయ టోల్ (ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్) Ru1es,1942లో పేర్కొన్న విధంగా వ్యక్తిగత వాహనం ఏదైనా అధికారిక ప్రయోజనం మరియు విధిని నిర్వర్తించడానికి ఉపయోగించని పక్షంలో, అది విధి నిర్వహణ అధికారితో పాటు వచ్చినప్పటికీ, టోల్ మినహాయింపు అందుబాటులో ఉండదు. మరియు ‘ఆర్మీ సిబ్బంది’ గుర్తింపు కార్డు చూపిస్తేనే మినహాయింపు పొందగలరని” స్పష్టత ఇచ్చింది.

విధుల్లో ఉన్న సిబ్బందికి మాత్రమే టోల్ మినహాయింపు ఉంటుందని,రిటైర్డ్ అధికారులకు వర్తించదని మంత్రిత్వ శాఖ ఖరాఖండిగా స్పష్టం చేసింది. అధికారిక ప్రయోజనం మరియు విధి కోసం మాత్రమే ప్రైవేట్ వాహనాలపై మినహాయింపు అనుమతించబడుతుందని కూడా స్పష్టం చేసింది.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఫిబ్రవరి 20, 2020 నాటి నివేదిక ప్రకారం, RTI ప్రశ్నలకు ప్రతిస్పందనగా, రక్షణ సిబ్బంది విధి నిర్వహణలో ప్రయాణిస్తున్నప్పుడు మాత్రమే వారికి టోల్ టాక్స్ మినహాయించబడుతుందని NHAI పేర్కొంది. వారు విధి నిర్వహణలోలేనప్పుడు వారి ప్రైవేట్ వాహనాలకు ఎలాంటి మినహాయింపు ఉండదు.

వైరల్ లెటర్ కు సంబంధించిన వాదనలో నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

భారతదేశం గౌరవార్థం దుబాయ్‌లోని ‘అల్ మిన్‌హాద్’ అనే జిల్లా పేరును ‘హింద్’ గా మార్చారా? Fact Check:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check