Tag Archives: Telangana ration cards

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

 వాదన/Claim : మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:వాదన లేదా ఆరోపించిన విధంగా తెలంగాణలో రేషన్‌కార్డులను రద్దు చేసే ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు.

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా-

తెలంగాణ రాష్ట్రంలో ‘ప్రజాపాలన’ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులు రద్దయ్యాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యవస్థను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించినందున,వారి రేషన్ కార్డుల చెల్లుబాటు గురించి మండలాల వారీగా వివరాలను ఇస్తూ, ప్రజలలో భయాందోళనలను కలిగించే విధంగా పోస్ట్ చేయబడింది. పోస్ట్ ని ఇక్కడ చూడండి.

ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 కార్డులు రద్దయ్యాయి.

“ఇతర జిల్లాల్లో కూడా రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంటుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.”

ఇది తెలుగు స్క్రైబ్ ద్వారా పోస్ట్ చేయబడింది, మరియు తెలంగాణలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఫిర్యాదులను పరిష్కరించే ప్రధాన ప్రక్రియను చేపట్టడం వలన,అలాగే దాని సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులను కూడా “ప్రజాపాలన” కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకోవాలని కోరడం వలన ఇది X ప్లాట్‌ఫారమ్‌లో అనేక విమర్శలను అందుకుంది.

FACT CHECK

Digiteye India టీమ్‌ ఈ క్లెయిమ్/దవా లోని వాస్తవం పరిశీలించినప్పుడు,AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ట్విట్టర్‌లో సమస్యను లేవనెత్తారని మరియు దావాపై సమాధానం కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ట్యాగ్ చేశారని మేము గమనించాము.దీనిపై సంబంధిత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ ఆ వాదనలో వాస్తవం లేదన్నారు.”అసాద్, రేషన్ కార్డుల రద్దు వార్త పూర్తిగా అబద్ధం. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క రేషన్ కార్డును మా ప్రభుత్వం రద్దు చేయలేదని నేను మీకు హామీ ఇస్తున్నాను” అని రాశారు.

ఆయన సమాధానం ఇక్కడ ఉంది:

Here's his reply:

ఇంకా,మేము ఇతర వార్తా సంస్థలను పరిశీలించినప్పుడు,ఇలాంటి వార్తలు ఎక్కడా ప్రచురించలేదు మరియు ఏ టీవీ న్యూస్ ఛానెల్‌ కూడా ఈ సమస్యను ప్రసారం చేయలేదు.ఇలాంటి ప్రతికూల చర్య అనేక విమర్శలను ఆకర్షించి ఉండేది ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా లక్ష మంది లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను కోల్పోవడమనేది పెద్ద వార్త.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన