వాదన/Claim: అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారనేది వాదన.
నిర్ధారణ/Conclusion:సెప్టెంబరు 2023లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశాధినేతలు భారతదేశానికి చేరుకుంటున్న సంబంధిత వీడియోను జనవరి 2024లో జరిగిన రామమందిర కార్యక్రమానికి వస్తున్నట్లుగా షేర్ చేయబడింది.
రేటింగ్: సంపూర్ణంగా తప్పు–
వాస్తవ పరిశీలన వివరాలు
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇతర ప్రపంచ నేతలు, విదేశీ ప్రముఖులతో సహా జనవరి 22, 2024న రామాలయ ప్రతిష్ఠాపన లేదా ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను వీడియో క్యాప్చర్ చేసిందని దావా పేర్కొంది.
“22 జనవరి 2024న రామమందిరం,అయోధ్యకు హాజరవుతున్న అతిథులు” అనే శీర్షికతో ఇక్కడ మరియు ఇక్కడ Facebookలో షేర్ చేయబడింది.
FACT CHECK
సంబంధిత సమాచారం కోసం మేము Googleలో పరిశీలించగా, పైన పేర్కొన్న ప్రపంచ నాయకులు వేడుకకు హాజరవుతున్నట్లు పేర్కొన్న వార్తలేవీ కనిపించలేదు.మరియు, ఈ వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకుంటే, సెప్టెంబరు 2023లో భారతదేశంలో జరిగిన G20 సమ్మిట్‌కు ప్రపంచ నాయకులు హాజరైనప్పుడు,దానికి సంబంధించిన పాత వీడియో అని నిర్ధారణకు వచ్చాము.
ఈ పాత వీడియో నుండి తీసిన క్లిప్స్,ఇప్పుడు ఈ నాయకులు రామమందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యారనే వాదన/దావాకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడింది.కావున,వీడియో మరియు వాదన/దావా పూర్తిగా తప్పు.వీడియోలో చూపబడిన ప్రపంచ నాయకులెవరూ కూడా జనవరి 22,2024న జరిగిన రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కాలేదు.
వాదన/Claim: బ్రిటీష్ కాలం నుండి 2017 వరకు యుపిలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ హయాంలో 24 ఉన్నాయనేది వాదన.
నిర్ధారణ/Conclusion: విమానయాన మంత్రి ప్రకటన ప్రకారం, 2017కి ముందు, ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు ప్రస్తుతం 10 విమానాశ్రయాలు వినియోగంలో ఉండగా మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి.
రేటింగ్:తప్పు దారి పట్టించే వార్త —
వాస్తవ పరిశీలన వివరాలు
2017లో యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఒకటి షేర్ చేయబడింది.ప్రస్తుత యుపి ప్రభుత్వ హయాంలో 24 విమానాశ్రయాలను ప్రకటించారని, వాటిలో 10 పని చేస్తున్నాయని, మరొక 14 నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.
బ్రిటీష్ పాలన నుండి 2017 మార్చిలో అఖిలేష్ యాదవ్ పాలన ముగిసేనాటికి ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే పనిచేస్తున్నాయని వీడియో క్లిప్ లోని వార్త పేర్కొంది.నేడు యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, 24 విమానాశ్రయాలు ఉన్నాయి, వాటిలో 10 పనిచేస్తున్నాయి,మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి.బ్రిటీష్‌వారు మరియు 2017కి ముందు వరకు ఉన్న అన్ని ప్రభుత్వాలు కేవలం రెండు విమానాశ్రయాలను మాత్రమే నిర్మించగలిగారు.
వాస్తవ పరిశీలన
Digiteye India teamవారు వాస్తవాన్ని పరిశీలించడం కోసం ఉత్తరప్రదేశ్‌లోని విమానాశ్రయాలను గురించి Googleలో సెర్చ్ నిర్వహించగా,జనవరి 11, 2024న విమానయాన మంత్రి జ్యోతిరాదియా సింధియా UP విమానాశ్రయాలపై పోస్ట్ చేసిన తాజా PIB పత్రికా ప్రకటనకు దారితీసింది.ఇక్కడ 2014లో ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ప్రస్తుతం అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఉన్నాయని మంత్రి చెప్పారని పేర్కొన్నారు.
ఈ వార్త ANI యొక్క వీడియో వార్తలలో కూడా ప్రసారం చేయబడింది.“2014లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్రంలో అయోధ్య విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఉన్నాయని” మంత్రి ప్రకటించడం వీడియోలో మనం చూడవచ్చు.వచ్చే ఏడాది నాటికి యూపీలో మరో ఐదు విమానాశ్రయాలు రానున్నాయి. అజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్‌లలో ఒకొక్క విమానాశ్రయాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.ఈ ఏడాది చివరి నాటికి జెవార్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉండే విమానాశ్రయం కూడా సిద్ధం అవుతుంది.
కావున,యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు యూపీలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయన్న వాదన తప్పు. లక్నో మరియు వారణాసి విమానాశ్రయాలు నిరంతరం వినియోగంలో ఉండగా, 2014 నాటికి మాత్రం UPలో ఆరు విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు బ్రిటిష్ పాలన నుండి రాష్ట్రంలో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయనే వాదన కూడా తప్పు.
వాదన/CLAIM: చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయనేది వాదన.
నిర్ధారణ/CONCLUSION:అనేక అధ్యయనాల ప్రకారం చాక్లెట్ వినియోగానికి మరియు మొటిమల బ్రేక్అవుట్‌ల(అక్ని/acne),) మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని తేలింది.
రేటింగ్: తప్పు దారి పట్టించే వార్త
Fact check వివరాలు:
చర్మంపై మొటిమలు మరియు తీవ్రమైన పగుళ్లను కలిగించే అంశాలు అనేకం ఉన్నాయి.వీటిలో కాలుష్యం, నీరు , హార్మోన్లు, జన్యుశాస్త్రం మరియు ఆహారం ఉన్నాయి.అయితే, ఒక ఆహార పదార్థం మాత్రం మోటిమలు కలిగించడానికి కారణమౌతుంది,అదే చాక్లెట్.
అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు, స్కిన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు (skin influencers,health influencers) చాక్లెట్ తీసుకోవడం వల్ల మొటిమలు వస్తాయని పేర్కొన్నారు. కొంతకాలంగా ఇలాంటి వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వాదనలోని వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India వాట్సాప్‌లో అభ్యర్థన అందుకుంది.
FACT CHECK
ఈ వైరల్ క్లెయిమ్ యొక్క వాస్తవికతను పరిశీలించడానికి, బృందం అందుబాటులో ఉన్న వైద్య సాహిత్యాన్ని పరిశీలించి, చాక్లెట్‌కు మరియు అక్ని(acne),మొటిమలకు సంబంధం ఉందా అని పరిశీలించింది.ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మొటిమలు ఏర్పడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
యునైటెడ్ స్టేట్స్ యొక్క చాక్లెట్ తయారీదారుల సంఘం ద్వారా మద్దతందిన తొలి అధ్యయనాలలో ఒకటి, చాక్లెట్ మరియు కొవ్వును అధికంగా తీసుకోవడం వల్ల సెబమ్ యొక్క పరిమాణం మారదని కనుగొన్నారు.అధ్యయనంలో, ఒక మోస్తరు మొటిమలు ఉన్న 65 సబ్జెక్టులకు సాధారణ బార్‌లో కంటే పది రెట్లు ఎక్కువ చాక్లెట్ ఉన్న బార్ లేదా చాక్లెట్ లేని ఒకేలా కనిపించే బార్ ఇవ్వబడింది.శాస్త్రవేత్తలు బ్రేక్‌అవుట్‌లను(మొటిమలను)లెక్కించగా,రెండింటి మధ్య తేడా కనిపించలేదు.
2016 లో, పరిశోధకులు మోటిమలు మరియు డార్క్ చాక్లెట్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. సబ్జెక్టులకు(పాల్గొన్నవారికి) నాలుగు వారాల పాటు ప్రతిరోజూ తినడానికి చాక్లెట్ (99% డార్క్ చాక్లెట్ కలిగి ఉన్న) ఇవ్వబడింది. సాయివరీ వోంగ్రావియోపాప్ మరియు ప్రవిత్ అసవనోండా చేసిన అధ్యయనం ప్రకారం డార్క్ చాక్లెట్ మొటిమలను ‘తీవ్రపరుస్తుంది’ అని తేలింది.అయినప్పటికీ, “చాక్లెట్లు మొటిమలకు పూర్తి కారణమవుతాయని మేము నిర్ధారించలేదు,ఎందుకంటే మిగతా అనేక కారణాలు అక్ని(acne)/మొటిమలు కలగడానికి దోహద పడతాయి” అని వారు చెప్పారు.
2012లో నిర్వహించిన మరో అధ్యయనంలో మోటిమలు మరియు చాక్లెట్‌ల మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలింది.సబ్జెక్టులు(పాల్గొన్నవారికి) డైరీఫుడ్ని మరియు అధిక-గ్లైసెమిక్ డైట్‌ని అనుసరించాలని కోరారు.సబ్జెక్టులు పాలు మరియు ఐస్ క్రీం వంటివి తిన్నారు.వారు తిన్నఆహారం మరియు మొటిమల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉందని తేలింది.అయితే,చాక్లెట్ మరియు మోటిమలు మధ్య సంబంధం ఉందని ద్రువీకరించబడలేదు.
ఏంజెలా లాంబ్, MD, బోర్డ్-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ మరియు మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఇలా అన్నారు, “ఇది చక్కెర మరియు సాచురేటెడ్ కొవ్వు పదార్ధం మోటిమలకు దోహదం చేస్తుంది, చాకోలెటే కానక్కర్లేదు.అలాగే, చాలా చాక్లెట్లలో డైరీ పదార్థాలు ఉంటాయి,ఇది మొటిమలకు కారణమవుతున్నాయి.
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీలో సహచరుడు(fellow) డాక్టర్ ప్యాట్రిసియా ఫారిస్ ఇలా అన్నారు, “హెయిర్ ఫోలికల్ ఓపెనింగ్ వద్ద చర్మ కణాలు ఏర్పడడం వలన,సెబమ్ లోపల పేరుకుపోయి చిక్కుకుపోతుంది.సెబమ్‌లో బ్యాక్టీరియా విస్తరించి, హెయిర్ ఫోలికల్ చుట్టూ వాపు/పుండ్లు ఏర్పడానికి కారణమవుతుంది.కానీ పోషకాహారం కుడా ఒక కారణం. చాక్లెట్‌ను నివారించడం అన్ని కారణాలలోకెల్లా ఒక కారణం మాత్రమే సూచిస్తుందని నేను నిర్భయంగా చెప్పగలను.
చర్మ రంధ్రాలు బ్యాక్టీరియా,ఆయిల్,డెడ్ స్కిన్ సెల్స్ మరియు మురికి వల్ల మూసుకుపోయినప్పుడు మొటిమలు(అక్ని/acne) వస్తాయి.డైరీ, ప్రాసెస్డ్ షుగర్, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలు మరియు కొవ్వు పదార్థాలు సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి.అధిక సెబమ్ మొటిమలకు దారి తీస్తుంది.హార్మోన్ల మార్పులు, పిసిఒడి, ఒత్తిడి, సిగరెట్లు, ఔషధాలు మరియు జన్యుశాస్త్రం కూడా మొటిమల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.
వాదన/CLAIM: మార్కెట్‌లో విక్రయించబడుతున్న’గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం యొక్క వాదన.
నిర్ధారణ/CONCLUSION: పసుపు మరింత గాఢమైన పసుపురంగులో కనిపించడానికి పసుపులో లెడ్ క్రోమేట్ అనే పదార్థం ఉపయోగించబడుతుంది. పసుపులో లెడ్ క్రోమేట్ ఉండకూడదని FSSAI పేర్కొంది, అదనంగా,పసుపులో కల్తీని పరీక్షించడానికి ప్రజలు తమ ఇళ్లలోనే సాధారణ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. పసుపును మార్కెట్‌లో ‘సర్టిఫైడ్ మరియు నాణ్యమైన’ విక్రేయదారుడి నుండి కొనుగోలు చేయాలని సూచించబడింది.
రేటింగ్: వాదనలో నిజం ఉంది–
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలు:
ఆహారంలో ఉపయోగించే పసుపులో ‘లెడ్ క్రోమేట్’ ఉందని, ఇది పసుపు రంగుని గాఢమైన పసుపు రంగులోకి మారుస్తుందని వైరల్ సందేశం పేర్కొంది. ఫార్వార్డ్ చేయబడిన సందేశంలో పసుపులో లెడ్ క్రోమేట్ వాడకాన్ని వివరించే ఇన్ఫోగ్రాఫిక్ వివరాలు కూడా కలిగి ఉంది.
చిత్రంతో ఉన్నవాదన ఇలా పేర్కొంది,
“ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపే లెడ్ క్రోమేట్ ‘ఆఫ్ ది షెల్ఫ్’ పసుపు పొడి ప్యాకెట్లలో కలపబడుతుంది. సమీపంలోని పౌడర్ మిల్లుల నుండి కొనుగోలు చేయడం మంచిది.”
(‘ఆఫ్ ది షెల్ఫ్’అనగా ఎలాంటి నాణ్యత లేని పదార్థం లేదా నాణ్యత పరీక్ష చేయని పదార్థం లేదా FSSAI ముద్ర లేని పదార్థం)
ఈ వాదనలోని వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye Indiaకి వాట్సాప్‌లో అభ్యర్థన వచ్చింది.
FACT CHECK
Digiteye India బృందం చిత్రం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి Googleలో రివర్స్ ఇమేజ్ ను ఉపయోగించి చూడగా ‘సైన్స్ డైరెక్’అనే వెబ్ సైట్ ప్రచురించిన పరిశోధనా పత్రానికి దారితీసింది.”Real or fake yellow in the vibrant colour craze: Rapid detection of lead chromate in turmeric” అనే పేపర్‌ను ‘సారా డబ్ల్యు ఎరాస్మస్’, ‘లిసాన్నె వాన్ హాసెల్ట్’, ‘లిండా ఎమ్ ఎబింగే’ మరియు సాస్కియా ఎమ్. వాన్ రూత్ ప్రచురించారు. లెడ్ క్రోమేట్‌తో కూడిన పసుపు చాలా తయారీ యూనిట్లలో కలిగి ఉందని వారి అధ్యయనం వెల్లడించింది.
పసుపును మరింత గాఢమైన పసుపు రంగులోకి మార్చేందుకు లెడ్ క్రోమేట్ వాడతారని వారి అధ్యయనంలో వెల్లడైంది. కల్తీ పసుపు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా వెల్లడించింది.
పసుపు కోసం నిర్దేశించిన మార్గదర్శకాలను తెలుసుకోవడానికి Digiteye India టీమ్ ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ వెబ్‌సైట్‌ను సందర్శించగా, వారు అందులో ఇలా పేర్కొన్నారు, “ఉత్పత్తులు ఆకుపచ్చని బూజు, జీవించి లేదా చనిపోయిన కీటకాలు, ఎలుకల లేదా కీటకాల శకలాలు లేకుండా ఉండాలి. లెడ్ క్రోమేట్, విదేశీ స్టార్చ్, అదనపు పదార్థంతో మార్చబడిన పదార్థం, లేదా ఏదైనా అదనపు రంగు పదార్థం లేకుండా ఉండాలి”. పసుపులో లెడ్ క్రోమేట్ లేకుండా ఉండాలని ఫుడ్ అథారిటీ పేర్కొంది.
అదనంగా, FSSAI ఒక వీడియోలో, ప్రజలు ఇంట్లోనే పసుపు పొడిలోని కల్తీని ఎలా పరీక్షించవచ్చో పేర్కొంది. స్వచ్ఛమైన పసుపు పూర్తిగా నీటిలో కరిగిపోతుందని, అయితే కల్తీ పసుపు పొడి మాత్రం నీటిలో దిగువన పసుపు రంగు మట్టి మాదిరి ఉండిపోతుందని వారు పేర్కొన్నారు.
కింద వీడియోలో చూడవచ్చును.
ఇంట్లోనే కల్తీ పసుపుకొమ్ములను ఎలా పరీక్షించాలో కూడా FSSAI పేర్కొంది.
స్వచ్ఛమైన పసుపుకొమ్ము నీటి రంగును మార్చదని,లెడ్ క్రోమేట్‌తో కూడిన పసుపుకొమ్ము నీటి రంగును మారుస్తుందని వారు వెల్లడించారు.
కింద వీడియోలో చూడవచ్చును.
లెడ్ క్రోమేట్ ఆస్తమా లాంటి లక్షణాలు, చర్మ సమస్యలు మరియు జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. కావున,ప్రజలు మార్కెట్‌లో నాణ్యమైన మరియు పరీక్షించిన విక్రేయదారుల నుండి పసుపును కొనుగోలు చేయాలని సూచించారు.
వాదన/Claim: పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.
నిర్ధారణ/Conclusion: ప్రస్తుత కోవిడ్-19 కేసులకు సంబంధించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేదు. మార్చి 2020లోని పాత వీడియో ఇప్పుడు షేర్ చేయబడుతోంది.
రేటింగ్: తప్పు దారి పట్టించే వార్త–
Fact Check వివరాలు:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో JN.1 వేరియంట్‌కి సంబంధించిన కొత్త కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది.
ఇదే విషయాన్ని తెలియజేసే ‘టీవీ9 వార్తా కథనం’ కూడా సందేశంలో జత చేసి ఉంది. వార్తా కథనంలో స్పష్టంగా కనబడుతుంది: “తెలంగాణ సెలవులు 28/12/23 నుండి 18/01/24 వరకు.” ఈ వీడియో వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India వాట్సాప్‌లో అభ్యర్థన అందుకుంది.
FACT CHECK
వాదన/క్లెయిమ్ లోని వాస్తవాన్ని పరిశీలించగా, ఇది అప్పటికే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడిందని గమనించాము.షేర్ చేయబడుతున్న వీడియో తాజా వీడియోగా కనిపించేలా వీడియోపై కొన్ని తేదీలు సూపర్మోస్(superimposed) చేయబడ్డాయి. కానీ డిసెంబర్ 2023 నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో JN.1 కరోనా వేరియంట్ కేసులు నమోదైన తర్వాత TV9 వార్తా ఛానల్ మాత్రం ఇటీవలి కాలంలో ఇలాంటి వార్తలను ప్రసారం చేయలేదు.
TV9 న్యూస్ ఆర్కైవ్‌లను మరింత పరిశీలించగా,ఇది భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందడం మరియు మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించబడిన సమయంలో అనగా 2020 మార్చి 18న ప్రచురించబడిన వార్తా నివేదిక.
తెలుగు వార్తాకథనం ఇలా పేర్కొంది: ““ఏపీ కీలక నిర్ణయం.. విద్యాసంస్థలు బంద్”
JN.1 వేరియంట్ కరోనావైరస్ లేదా కోవిడ్-19 కారణంగా ఇటీవలి రోజుల్లో AP మరియు తెలంగాణలో పాఠశాలలు మూసివేయబడుతున్నాయా అని ఇతర వార్తా నివేదికలను పరిశీలించినప్పుడు, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రకటన ఏది కూడా చేయలేదని తెలుసుకున్నాము.ఈ వార్త ఏ టీవీ న్యూస్ ఛానెల్ లేదా TV9 తెలుగు లేదా స్థానిక వార్తాపత్రిక కూడా నివేదింలేదు.
ప్రస్తుతం, దేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల చాలా తక్కువగా ఉంది మరియు అటువంటి కేసులపై అప్రమత్తంగా ఉండాలని,కేసుల సంఖ్య పెరిగితే ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని కేంద్రం , రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.దీని ప్రకారం, కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా ఆసుపత్రులను అప్రమత్తం చేస్తూ AP మరియు తెలంగాణ ప్రభుత్వాలు అనేక సూచనలను జారీ చేశాయి.
అందువలన, కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయన్న వాదన తప్పు, మరియు ఈ వాదన/దావాకు మద్దతుగా 2020 పాతలోని వీడియో షేర్ చేయబడుతోంది.
వాదన/Claim: భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తున్నారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పు సందేశం.జూలై 2023లో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ‘భగవత్ కథ’ కోసం 3 కిలోమీటర్ల పొడవైన కలశ యాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొన్న ఒక పాత వీడియోను, జనవరి 2024లో అయోధ్యలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’కోసం తరలి వస్తున్న నేపాల్ భక్తుల యాత్రగా షేర్ చేయబడింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
Fact Check వివరాలు:
జనవరి 22, 2024న అయోధ్యలోని రామమందిరంలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక తప్పుడు వీడియోలు షేర్ చేయ బడుతున్నాయి.ఈ కార్యక్రమానికి నేపాల్ నుండి భారతదేశానికి ‘జై శ్రీ రామ్’ అని నినాదాలు చేస్తు వస్తున్న భక్తుల ఊరేగింపని ఒక వాదనతో షేర్ చేయ బడుతున్న వీడియో చూడవచ్చు.
జనవరి 22, 2024న ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మరియు రెండు లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యలో జరిగే వేడుకను చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ వైరల్ సందేశం దేశంలోని చాలా మంది వీక్షకుల దృష్టిని ఆకర్షించింది.
పోస్ట్ యొక్క శీర్షిక ఇలా ఉంది:”భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తారు”.
అదే వీడియోతో కూడిన మరొక సందేశం వేరొక శీర్షికతో ఇలా ఉంది:
బ్రాహ్మణులు కారు, ‘క్షత్రియులు కారు ‘వైశ్యులు’ కారు ‘శూద్రులు’కారు, కేవలం ఒక మహాసముద్రం లాగా హిందువులంతా నేపాల్ నుండి అయోధ్యకు #రామమందిరప్రాణప్రతిష్ట కోసం చేరుకుంటున్నారు”.
వీడియో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.
FACT CHECK
అదే వీడియో చాలా సందర్భాలలో షేర్ చేయడంతో Digiteye India టీమ్ దాన్ని వాస్తావ పరిశీలన కోసం స్వీకరించింది.మేము వీడియోను కీలక ఫ్రేమ్‌లుగా విభజించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి పరిశీలించగా,9 జూలై 2023న ట్విట్టర్లో పోస్ట్ చేసిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి భక్తుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో అని తెలుకున్నాము.
“నోయిడాలోని బాగేశ్వర్ ధామ్ సర్కార్ కలాష్ యాత్ర” అని పిలువ బడే ఇది, విస్తృతంగా షేర్ చేయబడింది.గూగుల్‌లో మరిన్ని వివరాల కోసం చూడగా, అది “జైత్‌పూర్ గ్రేటర్ నోయిడా శోభా యాత్ర మరియు కలాష్ యాత్ర” అని తెలుసుకున్నాము. వీడియోను ఇక్కడ చూడండి:
గ్రేటర్ నోయిడాలో దివ్య దర్బార్ వేడుకలకు ముందు పెద్ద కలశ యాత్ర నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.మూడు కిలోమీటర్ల మేర జరిగిన ఈ కలశ యాత్రలో వేలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రిచే నిర్వహించబడిన’భగవత్ కథ’ జూలై 10 మరియు జూలై 16 మధ్య జరిగింది.
కావున, జనవరి 22, 2024న జరగబోయే రామమందిర ప్రాణ ప్రతిష్ట ఘటనకోసం నేపాల్ భక్తులు బహుమతులు తీసుకువస్తున్నట్లుగా 2023 జూలై నాటి ఒక పాత తప్పుడు వీడియో షేర్ చేయబడింది.
వాదన/CLAIM: ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తోందనేది వాదన.
నిర్ధారణ/CONCLUSION: వాదన/దావా పూర్తిగా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమ ఏ ప్రాజెక్టుల కింద అలాంటి పథకాన్ని ఏది కూడా ప్రారంభించలేదు.
రేటింగ్:పూర్తిగా తప్పు
Fact Check వివరాలు:
ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తోందన్న సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఉచిత పథకాన్ని ప్రారంభించిందని వైరల్ సందేశం పేర్కొంది.
వైరల్ సందేశం ఈ విధంగా ఉంది:
“విద్యార్థుల ల్యాప్‌టాప్ పథకం 2024′ కోసం దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి
ఆర్థిక కారణాల వల్ల సొంతంగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే పరిస్థితిలో లేనివారు మరియు వారి విద్యా స్థాయిలో ల్యాప్‌టాప్ అవసరమయ్యే విద్యార్థులందరికీ ఈ పథకం అమలు చేయబడుతుంది
2024లో 960,000 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉచిత ల్యాప్‌టాప్ ఇవ్వబడుతుంది
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మరియు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ల్యాప్‌టాప్‌లను అందుకోవడం జరుగుతోంది
ఇక్కడ నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.”
మెసేజ్/సందేశానికి లింక్ కూడా జత చేయబడింది.ఈ వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది.వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వాదనని యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye Indiaకి అభ్యర్థన వచ్చింది.
FACT CHECK/వాస్తవ పరిశీలన
Digiteye India బృందం అటువంటి పథకం ఏదైనా ప్రారంభించబడిందా అని అనేక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను పరిశీలించగా, ప్రభుత్వం నుండి అటువంటి సమాచారం ఏది కూడా పోస్ట్ చేయబడలేదు.
Digiteye India బృందం సందేశం లో జత పరిచిన వెబ్‌సైట్ లింక్‌ను పరిశీలించగా, లింక్ వినియోగదారుని “https://lii.ke/STUDENTS-FREE-LAPT0PS” కి మళ్లిస్తుంది, మరియు కుదించబడిన లింక్ ఇవ్వబడింది.
స్కామర్‌లు తమ ఫిషింగ్ స్కామ్‌లను కొనసాగించడానికి తరచుగా కుదించబడిన లింక్లను ఇస్తారు. లింకుని గమనిస్తే, లింక్‌లోని ‘ల్యాప్‌టాప్’ అనే పదం ‘lapt0ps’ అని వ్రాయబడింది, ఇక్కడ Oకి బదులుగా 0 (సున్నా) ఉపయోగించబడింది.
ఈ స్కామ్‌పై మరిన్ని ఆధారాల కోసం మేము సోషల్ మీడియా మరియు ఇతర వార్తా సంస్థలను పరిశీలించగా, ఆగస్ట్ 31, 2023న PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ బృందం వారు చేసిన ట్వీట్ మా దృష్టికి వచ్చింది. వారు తమ ట్వీట్‌లో ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్‌టాప్ పథకాలను ప్రారంభించలేదని పేర్కొన్నారు.
“ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2023 కింద భారత ప్రభుత్వం యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందనే ఆరోపణ సోషల్ మీడియాలో ఒక నోటీసు ద్వారా ప్రచారం జరుగుతోందని, వారు పేర్కొన్నారు.అది #ఫేక్ నోటీసు . @EduMinOfIndia,GOI ద్వారా అలాంటి పథకం ఏదీ అమలు చేయబడటం లేదు.”
A notice is circulating on social media that claims that the Government Of India is offering free laptops to youth under the Prime Minister Free Laptop Scheme 2023#PIBFactCheck:
కింద ఇచ్చిన విధంగా,మార్చి 16, 2023న ఇదే విధమైన దావాను PIB ఫాక్ట్ చెక్ కొట్టిపారేసింది.
“ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2023 కింద భారత ప్రభుత్వం యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందనే ఆరోపణ సోషల్ మీడియాలో ఒక నోటీసు ద్వారా ప్రచారం జరుగుతోంది,కానీ అది #ఫేక్ నోటీసు . @EduMinOfIndia,GOI ద్వారా అలాంటి పథకం ఏదీ అమలు చేయబడటం లేదని”,వారు తమ ట్వీట్‌లో పేర్కొన్నారు.
A notice is circulating on social media that claims that the Government Of India is offering free laptops to youth under the Prime Minister Free Laptop Scheme 2023#PIBFactCheck
‘Digiteye India’ బృందం వారు వాట్సాప్ ఫార్వార్డ్‌లలో అందుకున్న ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయవద్దని దాని పాఠకులను హెచ్చరిస్తుంది. ఇటువంటి లింక్‌లు ఫిషింగ్ మరియు వినియోగదారుడి ఫోన్ నంబర్, IP చిరునామా ద్వారా వారి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించవచ్చు.
వాదన/Claim:తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను చేసిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion:నిజానికి ఈ గంటలు అయోధ్య రామమందిరం కోసం తయారు చేయబడినవే,కానీ క్లెయిమ్ చేసినట్లుగా BHEL(త్రిచ్చి) కాకుండా, తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్ ” వారు వీటిని తయారు చేసారు.
రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు:
తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థ – భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్) -భారీ గుడి గంటలను తయారు చేసి ట్రక్కులో అయోధ్య రామ మందిరానికి తరలిస్తుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది.
వాదన ఇలా ఉంది:भारत हैवी इलेक्ट्रिकल्स, त्रिचुरापल्ली में निर्माण कर अयोध्या मंदिर को भेजे जा रहे हैं ये सभी घंटे जय श्री राम लिख कर शेयर करें (తెలుగు అనువాదం: “BHEL తిరుచ్చి సంస్థ అయోధ్య ఆలయం కోసం ఈ గంటలను తయారు చేసి అయోధ్యాధామానికి (రామ మందిరం)కి తరలిస్తోంది.కామెంట్ బాక్స్‌లో జై శ్రీ రామ్ అని వ్రాసి, దానిని భక్తుడిగా షేర్ చేయండి”).
FACT CHECK
BHEL ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU) మరియు అటువంటి నివేదిక ఏ వార్తా సంస్థలలో కనిపించలేదు కావున Digiteye India బృందం వాస్తవ పరిశీలన ప్రక్రియ చేపట్టింది.గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వీడియో దృశ్యాల కీలక ఫ్రేములు పరిశీలించినప్పుడు, ఒరిజినల్ వీడియో గత నెలలో ‘మోజో స్టోరీ’ అనే వీడియో పబ్లిషర్ ద్వారా అప్‌లోడ్ చేయబడిందని, మరియు తమిళనాడు నుండి ‘నలభై రెండు(42) గుడి గంటలు’ రవాణా చేయబడినట్లు తెలుసుకున్నాము.
గూగుల్ న్యూస్‌లో మరింత సమాచారం కోసం చూడగా, బెంగళూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే భక్తుడు అయోధ్య రామ మందిరం కోసం నమక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్”కి “48 గుడి గంటల తయారీ” ఆర్డర్ ఇచ్చాడని తెలిసింది.మొదటి బ్యాచ్ 42 గంటలు పూర్తయ్యాయని, బెంగళూరుకు రవాణా చేయడానికి ముందు పూజించడం కోసం నామక్కల్‌లోని ఆంజనేయర్ ఆలయంలో ఉంచామని నివేదిక పేర్కొంది.వార్తా నివేదికలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU)అయిన BHEL,ఈ గుడి గంటలు తయారు చేసిందని ఏ వార్తా సంస్థలు నివేదించలేదు.ఒకవేళ BHELకి అటువంటి ఆర్డర్ ఏదైనా వచ్చి ఉంటె, వార్తా నివేదికలలో విస్తృతంగా కవర్ చేయబడి ఉండేది. కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.
వాదన/Claim: భారత ప్రధాని మోదీపై తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారతీయులకు క్షమాపణలు చెప్పారనేది వాదన.
నిర్ధారణ/Conclusion:మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ట్వీట్ చేయలేదు.
రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం –
వాస్తవ పరిశీలన యొక్క వివరాలు:
మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు,పర్యాటకం కోసం లక్షద్వీప్ దీవులను ప్రోత్సహిస్తున్న మోడీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నసందేశం/మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపధ్యంలో,మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ,ఆయన ముగ్గురు మంత్రులు మోదీపై అలాంటి అవమానకర వ్యాఖ్యలను చేసినందుకు భారతీయులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారంటూ X ప్లాట్ఫారం లో (గతంలో ట్విట్టర్) సందేశం వైరల్ అవుతోంది.
తొలగించబడిన సందేశం యొక్క స్క్రీన్ షాట్ కింద చూడవచ్చు:
ప్రెసిడెంట్ ముయిజ్జూ అధికారిక ‘X’ ఖాతాలో ట్వీట్ ఇలా పేర్కొంది:
“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలకు మా మంత్రుల తరపున, నేను భారతీయ మిత్రులకు చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాను.భారతదేశం నుండి స్నేహితులకు స్వాగతం పలికేందుకు మరియు మన దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంచేయడాన్ని ఆకాంషిస్తున్నాను.”
ఈ ట్వీట్ జనవరి 7న పోస్ట్ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఇక్కడ మరియు ఇక్కడ అనేక వ్యాఖ్యలతో దీనిని రీట్వీట్ చేశారు.
అయితే, మోదీని “ఉగ్రవాది” మరియు “ఇజ్రాయెల్ తోలుబొమ్మ” అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకుగాను ముగ్గురు మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేశారు.
FACT CHECK
Digiteye India టీమ్‌కు వాస్తవాన్ని పరిశీలన చేయమని అభ్యర్థన వచ్చినప్పుడు,వారు మొదట మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ అధికారిక ‘X’ ఖాతాను సందర్శించి, ట్వీట్ కోసం వెతకగా అది ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదు.వాస్తవానికి, అతను తన చివరి సందేశాన్ని జనవరి 5, 2024న తన అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేసారు.
సోషల్ మీడియా మానిటరింగ్ టూల్ ‘Social Blade’ ద్వారా, జనవరి 5, 2024 తర్వాత ప్రెసిడెంట్ ముయిజ్జూ వైపు నుండి ఎటువంటి సందేశం తొలగించబడలేదని మేము తెలుసుకున్నాము,కాబట్టి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ‘తొలగించబడిన ట్వీట్‘ అనే అవకాశమే లేదు.మరియు క్షమాపణకు సంబంధించిన వార్తల కోసం పరిశీలించగా, ఇప్పటివరకు విశ్వసనీయ వర్గాలనుండి ఎలాంటి సమాచారం కనపడలేదు.
అందువల్ల, ప్రెసిడెంట్ ముయిజ్జూ ‘X’లో (గతంలో ట్విట్టర్)వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతూ చేసిన ట్వీట్ మార్ఫింగ్ చేయబడింది లేదా డిజిటల్‌గా మార్చబడింది.అయితే, ప్రధాని మోదీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు సస్పెండ్ అయిన మాట మాత్రం వాస్తవం.
వాదన/CLAIM: కేరళలో డబ్బు దోపిడీకి సంబంధించిన స్క్రిప్ట్ చేయబడిన వీడియో తప్పుడు మతపరమైన వాదనలతో వైరల్ అవుతుంది.
నిర్ధారణ/CONCLUSION:ఈ వీడియోను డిసెంబర్ 26న సుజిత్ రామచంద్రన్ అనే వినియోగదారుడు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. వినియోగదారుడు వీడియో/స్కెచ్ యొక్క తారాగణాన్ని, Disclaimer/డిస్క్లైమర్ని జత చేసి, వీడియో పూర్తిగా అవగాహన కోసం చిత్రీకరించబడింది అనిపేర్కొన్నారు.
రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన యొక్క వివరాలు:
కొందరు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తి నుంచి డబ్బు వసూలు చేస్తున్న వీడియో ఒకటి మతపరమైన వాదనలతో వైరల్ అవుతోంది.
ఈ వీడియో కేరళలో చిత్రీకరించబడిందని, మరియు క్రిస్మస్ వేడుకకి విరాళం ఇవ్వడానికి ఇష్టపడని వ్యక్తి నుండి కొందరు వ్యక్తులు బలవంతంగా డబ్బు అడుగుతున్నట్లు చూపుతుందని వాదనలు ఆరోపించాయి. 2:55 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తిని బయటకు లాగి అతనిపై దాడి చేయడం కనబడుతుంది.
వీడియోతో వైరల్ అవుతున్న వాదన ఇలా ఉంది:
ആഘോഷം ഗംഭീരമാക്കാൻ നാട്ടുകാരുടെ കയ്യിൽ നിന്നും ബലമായി പിരിവെടുക്കുന്നു അതും നമ്മുടെ കേരളത്തിൽ എങ്ങോട്ടാണ് നാടിൻറെ ഈ പോക്ക് മദ്യവും മയക്കുമരുന്നുമായി ഒരുപറ്റം ചെറുപ്പക്കാർ നാട്ടുകാരെ ഭീതിയിലാഴ്ത്തുന്ന അവസ്ഥ കാണുക😞😞😞😞😞🙏 ദൈവത്തിന്റെ സ്വന്തം നാട്
(తెలుగు అనువాదం: వేడుకను గ్రాండ్‌గా చేయడానికి స్థానికుల చేతుల నుండి బలవంతంగా సేకరించారు, అది కూడా మన కేరళలో, ఈ దేశానికి ఏమైంది? మద్యం, మాదక ద్రవ్యాలతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఎందరో యువకుల పరిస్థితి చూడండి😞😞😞😞😞🙏 దేవుడు నెలకొన్న/కొలువున్న దేశం)
వాట్సాప్‌లో ఈ వీడియోని వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye Indiaకి అభ్యర్థన వచ్చింది.
X (గతంలో, Twitter)లో కూడా ఇదే వాదన /దావాతో షేర్ చేయబడిన ఈ వీడియోను మేము గమనించాము.
Christmas spirit choked by extortion rackets fostered by Kerala's Left ecosystem.
High on drugs and alchohol, goons are forcefully extorting money in the name of Christmas donation!
Kerala turned into a hub of drugs by the Left, holding the youth captive for their political… pic.twitter.com/0t1D566hXR
— Anoop Antony (Modi Ka Parivar) (@AnoopKaippalli) December 27, 2023
FACT CHECK
వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి బృందం inVID(video verification tool/వీడియో ధృవీకరణ సాధనం) ఉపయోగించి,ఆ ఫ్రేమ్‌లను Googleలో రివర్స్ ఇమేజ్ లో పరిశిలన చేయగా, సుజిత్ రామచంద్రన్ అనే వినియోగదారుడు అదే వీడియోను డిసెంబర్ 26న Facebookలో షేర్ చేస్తూ క్రింది విధంగా పోస్ట్ చేయడం గమనించాము.
നാടൊട്ടുക്കു പിരിവ്!
കടക്കൽ നിന്ന് കുളത്തുപ്പുഴക്ക് കുടുംബവുമായി സഞ്ചരിച്ച യുവാവിന് ഓന്തുപച്ച എന്ന സ്ഥലത്തു വെച്ച് സംഭവിച്ചത്
(తెలుగు అనువాదం: దేశవ్యాప్తంగా సేకరణ! కుటుంబ సమేతంగా కటకల్ నుంచి కులతుపూజకు వెళ్తున్న ఓ యువకుడికి ఈ సంఘటన జరిగింది.
తారాగణం:Jishnu Mazhavil, Surjit, Baiju, Siddique, Naushad, Mahesh, Vijayan Katakal, Jyotish & Pichu,Sujith Ramachandran.
Disclaimer/డిస్క్లైమర్: అవగాహన కోసం వీడియో సృష్టించబడింది.)
మొదట్లో, డిసెంబర్ 26న వీడియోను షేర్ చేసినప్పుడు, “దేశవ్యాప్త సేకరణ! కటకుట్ నుండి కులతుపూజకు కుటుంబంతో ప్రయాణిస్తున్న యువకుడి పరిస్థితి ఏమైంది” అనే క్యాప్షన్ మాత్రమే ఉంది. అయితే క్యాప్షన్ డిసెంబర్ 27న సవరించబడింది.. సవరించ క్యాప్షన్‌లో వీడియోలోని వ్యక్తుల పేరు మరియు డిస్‌క్లైమర్ జత చేయబడింది. (మొదట్లో షేర్ బడిన వీడియో క్రింద మరియు డిస్‌క్లైమర్ జత చేసి సవరించిన వీడియో పైన చూడవచ్చును.|)