Tag Archives: ayodhya ram mandir

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు సందేశం.జూలై 2023లో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ‘భగవత్ కథ’ కోసం 3 కిలోమీటర్ల పొడవైన కలశ యాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొన్న ఒక పాత వీడియోను, జనవరి 2024లో అయోధ్యలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’కోసం తరలి వస్తున్న నేపాల్ భక్తుల యాత్రగా షేర్ చేయబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

జనవరి 22, 2024న అయోధ్యలోని రామమందిరంలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక తప్పుడు వీడియోలు షేర్ చేయ బడుతున్నాయి.ఈ కార్యక్రమానికి నేపాల్ నుండి భారతదేశానికి ‘జై శ్రీ రామ్’ అని నినాదాలు చేస్తు వస్తున్న భక్తుల ఊరేగింపని ఒక వాదనతో షేర్ చేయ బడుతున్న  వీడియో చూడవచ్చు.

వీడియో చూడండి:

జనవరి 22, 2024న ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మరియు రెండు లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యలో జరిగే వేడుకను చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ వైరల్ సందేశం దేశంలోని చాలా మంది వీక్షకుల దృష్టిని ఆకర్షించింది.

పోస్ట్ యొక్క శీర్షిక ఇలా ఉంది:”భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తారు”.

అదే వీడియోతో కూడిన మరొక సందేశం వేరొక శీర్షికతో ఇలా ఉంది:
బ్రాహ్మణులు కారు, ‘క్షత్రియులు కారు ‘వైశ్యులు’ కారు ‘శూద్రులు’కారు, కేవలం ఒక మహాసముద్రం లాగా హిందువులంతా నేపాల్ నుండి అయోధ్యకు #రామమందిరప్రాణప్రతిష్ట కోసం చేరుకుంటున్నారు”.

వీడియో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.


FACT CHECK

అదే వీడియో చాలా సందర్భాలలో షేర్ చేయడంతో Digiteye India టీమ్ దాన్ని వాస్తావ పరిశీలన కోసం స్వీకరించింది.మేము వీడియోను కీలక ఫ్రేమ్‌లుగా విభజించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ ఉపయోగించి పరిశీలించగా,9 జూలై 2023న ట్విట్టర్లో పోస్ట్ చేసిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి భక్తుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో అని తెలుకున్నాము.

“నోయిడాలోని బాగేశ్వర్ ధామ్ సర్కార్ కలాష్ యాత్ర” అని పిలువ బడే ఇది, విస్తృతంగా షేర్ చేయబడింది.గూగుల్‌లో మరిన్ని వివరాల కోసం చూడగా, అది “జైత్‌పూర్ గ్రేటర్ నోయిడా శోభా యాత్ర మరియు కలాష్ యాత్ర” అని తెలుసుకున్నాము. వీడియోను ఇక్కడ చూడండి:

సంఘటన ఇక్కడ మరియు ఇక్కడ నివేదించబడింది.

గ్రేటర్ నోయిడాలో దివ్య దర్బార్ వేడుకలకు ముందు పెద్ద కలశ యాత్ర నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.మూడు కిలోమీటర్ల మేర జరిగిన ఈ కలశ యాత్రలో వేలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రిచే నిర్వహించబడిన’భగవత్ కథ’ జూలై 10 మరియు జూలై 16 మధ్య జరిగింది.

కావున, జనవరి 22, 2024న జరగబోయే రామమందిర ప్రాణ ప్రతిష్ట   ఘటన కోసం నేపాల్ భక్తులు బహుమతులు తీసుకువస్తున్నట్లుగా 2023 జూలై నాటి ఒక పాత తప్పుడు వీడియో షేర్ చేయబడింది.

 

మరి కొన్ని Fact Checks:

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

 

తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను తయారు చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను చేసిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion:నిజానికి ఈ గంటలు అయోధ్య రామమందిరం కోసం తయారు చేయబడినవే,కానీ క్లెయిమ్ చేసినట్లుగా BHEL(త్రిచ్చి) కాకుండా, తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్ ” వారు వీటిని తయారు చేసారు.

రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రభుత్వ రంగ సంస్థ – భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బిహెచ్‌ఇఎల్) -భారీ గుడి గంటలను తయారు చేసి ట్రక్కులో అయోధ్య రామ మందిరానికి తరలిస్తుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది.

వాదన ఇలా ఉంది:भारत हैवी इलेक्ट्रिकल्स, त्रिचुरापल्ली में निर्माण कर अयोध्या मंदिर को भेजे जा रहे हैं ये सभी घंटे जय श्री राम लिख कर शेयर करें (తెలుగు అనువాదం: “BHEL తిరుచ్చి సంస్థ అయోధ్య ఆలయం కోసం ఈ గంటలను తయారు చేసి అయోధ్యాధామానికి (రామ మందిరం)కి తరలిస్తోంది.కామెంట్ బాక్స్‌లో జై శ్రీ రామ్ అని వ్రాసి, దానిని భక్తుడిగా షేర్ చేయండి”).

FACT CHECK

BHEL ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU) మరియు అటువంటి నివేదిక ఏ వార్తా సంస్థలలో కనిపించలేదు కావున Digiteye India బృందం వాస్తవ పరిశీలన ప్రక్రియ చేపట్టింది.గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వీడియో దృశ్యాల కీలక ఫ్రేములు పరిశీలించినప్పుడు, ఒరిజినల్ వీడియో గత నెలలో ‘మోజో స్టోరీ’ అనే వీడియో పబ్లిషర్ ద్వారా అప్‌లోడ్ చేయబడిందని, మరియు తమిళనాడు నుండి ‘నలభై రెండు(42) గుడి గంటలు’ రవాణా చేయబడినట్లు తెలుసుకున్నాము.

గూగుల్ న్యూస్‌లో మరింత సమాచారం కోసం చూడగా, బెంగళూరుకు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే భక్తుడు అయోధ్య రామ మందిరం కోసం నమక్కల్ జిల్లాలోని మోహనూర్ రోడ్‌లోని “ఆండాల్ మోల్డింగ్ వర్క్స్”‌కి “48 గుడి గంటల తయారీ” ఆర్డర్ ఇచ్చాడని తెలిసింది.మొదటి బ్యాచ్ 42 గంటలు పూర్తయ్యాయని, బెంగళూరుకు రవాణా చేయడానికి ముందు పూజించడం కోసం నామక్కల్‌లోని ఆంజనేయర్ ఆలయంలో ఉంచామని నివేదిక పేర్కొంది.వార్తా నివేదికలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఒక ప్రభుత్వ రంగ సంస్థ (PSU)అయిన BHEL,ఈ గుడి గంటలు తయారు చేసిందని ఏ వార్తా సంస్థలు నివేదించలేదు.ఒకవేళ BHELకి అటువంటి ఆర్డర్ ఏదైనా వచ్చి ఉంటె, వార్తా నివేదికలలో విస్తృతంగా కవర్ చేయబడి ఉండేది. కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact checks:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

జాతీయ వైద్య కమిషన్ తన లోగోను రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రంతో మార్చేసిందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: 25,000 హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య గురించి కాకుండా, డిసెంబర్ 2023లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ కి సంబంధించిన వీడియో.

రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

జనవరి 22, 2024న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు దాదాపు ఇరవై ఐదు వేల(25,000) హోమ గుండాలు సిద్ధమవుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో చూపిన విధంగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోమ గుండాలను ఏర్పాటు చేస్తున్నట్లు దావా పేర్కొంది.హిందీలో ఈ విధంగా పోస్ట్ చేసారు:“इन 25000 हजार हवन कुंडो से होगा “राम मंदिर” का उद्घाटन… जय श्री राम” [తెలుగు అనువాదం:ఈ ఇరవై ఐదు వేల(25,000)హోమ గుండాలు “రామమందిర్” ప్రారంభోత్సవానికి ఉపయోగించబడతాయి … జై శ్రీరామ్ ]

FACT CHECK

Digiteye India బృందం ఈ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలించగా, 2023 డిసెంబర్‌లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ మహోత్సవానికి సంబంధించిన వీడియో అని,అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధం లేదని గమనించాము.

ఈ వార్త/మహాత్సవాన్ని, పై వీడియో చూపినట్లుగా స్థానిక ఛానెల్ “అరుణ్ విలేజ్ బాయ్ వ్లాగ్” ద్వారా డిసెంబర్ 16, 2023న యూట్యూబ్లో (You Tube)అప్‌లోడ్ చేయబడింది.వీడియో శీర్షిక హిందీ లో ఇలా ఉంది:स्वर्वेद महामंदिर धाम वाराणसी 25 हजार हवन कुंड | एक साथ सभी को जगाया जाएगा ! Swarved Maha Mandir Dham” [తెలుగు అనువాదం: స్వర్వేద్ మహామందిర్ ధామ్ వారణాసి 25 వేల హోమ గుండాలు . అవన్నీ ఒకేసారి వెలిగించబడతాయి”.]

మేము మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా, క్రింద చూపినట్లుగా మరొక వీడియోను గమనించాము.

స్వర్వేద్ మహామందిర్ ధామ్‌లోని హోమ గుండాలలో అనేక మంది వ్యక్తులు యజ్ఞం చేస్తున్నట్టు చూపించే ఇలాంటి వీడియోలను అనేకం చూడవచ్చు.వారణాసిలోని ఉమ్రాహా ప్రాంతంలో ఉన్న అతి పెద్ద ఆలయమైన స్వర్వేద్ మహామందిర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు వార్తా నివేదికలు ధృవీకరిస్తున్నాయి.

కాబట్టి,హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించినదనే వాదన తప్పు.

మరి కొన్నిFact Checks:

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన