వాదన/Claim:అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: 25,000 హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య గురించి కాకుండా, డిసెంబర్ 2023లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ కి సంబంధించిన వీడియో.
రేటింగ్: తప్పుగా సూచించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు:
జనవరి 22, 2024న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించేందుకు దాదాపు ఇరవై ఐదు వేల(25,000) హోమ గుండాలు సిద్ధమవుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
इन 25000 हजार हवन कुंडो से होगा
“राम मंदिर”🛕 का उद्घाटन…❣️👏जय श्रीराम 🚩🙏 pic.twitter.com/n2DtRrXUcO
— अमरेंदर बाहुबली 🇮🇳 (@TheBahubali_IND) December 24, 2023
వీడియోలో చూపిన విధంగా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోమ గుండాలను ఏర్పాటు చేస్తున్నట్లు దావా పేర్కొంది.హిందీలో ఈ విధంగా పోస్ట్ చేసారు:“इन 25000 हजार हवन कुंडो से होगा “राम मंदिर” का उद्घाटन… जय श्री राम” [తెలుగు అనువాదం:ఈ ఇరవై ఐదు వేల(25,000)హోమ గుండాలు “రామమందిర్” ప్రారంభోత్సవానికి ఉపయోగించబడతాయి … జై శ్రీరామ్ ]
FACT CHECK
Digiteye India బృందం ఈ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ లో పరిశీలించగా, 2023 డిసెంబర్‌లో జరిగిన వారణాసిలోని స్వర్వేద్ మహమందిర్ ధామ్ మహోత్సవానికి సంబంధించిన వీడియో అని,అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధం లేదని గమనించాము.
ఈ వార్త/మహాత్సవాన్ని, పై వీడియో చూపినట్లుగా స్థానిక ఛానెల్ “అరుణ్ విలేజ్ బాయ్ వ్లాగ్” ద్వారా డిసెంబర్ 16, 2023న యూట్యూబ్లో (You Tube)అప్‌లోడ్ చేయబడింది.వీడియో శీర్షిక హిందీ లో ఇలా ఉంది:स्वर्वेद महामंदिर धाम वाराणसी 25 हजार हवन कुंड | एक साथ सभी को जगाया जाएगा ! Swarved Maha Mandir Dham” [తెలుగు అనువాదం: స్వర్వేద్ మహామందిర్ ధామ్ వారణాసి 25 వేల హోమ గుండాలు . అవన్నీ ఒకేసారి వెలిగించబడతాయి”.]
మేము మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా, క్రింద చూపినట్లుగా మరొక వీడియోను గమనించాము.
స్వర్వేద్ మహామందిర్ ధామ్‌లోని హోమ గుండాలలో అనేక మంది వ్యక్తులు యజ్ఞం చేస్తున్నట్టు చూపించే ఇలాంటి వీడియోలను అనేకం చూడవచ్చు.వారణాసిలోని ఉమ్రాహా ప్రాంతంలో ఉన్న అతి పెద్ద ఆలయమైన స్వర్వేద్ మహామందిర్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినట్లు వార్తా నివేదికలు ధృవీకరిస్తున్నాయి.
కాబట్టి,హోమ గుండాలను చూపించే వీడియో అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించినదనే వాదన తప్పు.
మరి కొన్నిFact Checks:
మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన
కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన
Pingback: నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన - Digiteye Te
Pingback: అయోధ్యలో ఖాళీ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ తిరిగి ఇచ్చిన తర్వాత ₹5 మనకు అందుతుందా? వాస్తవ పరి