Tag Archives: telugu fake news

మహా కుంభమేళా ముగింపు రోజున త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: మహా కుంభమేళా ముగింపు రోజున 26 ఫిబ్రవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో ఎయిర్ షో నిర్వహించబడిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు దారి పట్టించే వాదన. వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం.

రేటింగ్/Rating : తప్పు దారి పట్టించే వాదన–

**************************************************************************

ఫిబ్రవరి 26, 2025న మహా కుంభమేళా చివరి రోజున ప్రయాగ్‌రాజ్‌లో భారత వైమానిక దళం నిర్వహించిన త్రిశూలం ఆకార నిర్మాణం యొక్క చిత్రంతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.

వాదన/దావా ఈ విధంగా ఉంది: “ఈ సంవత్సరానికే ఇది చిత్రం !!! 3 సుఖోయ్ 30 MKI విమానాలతో మహాదేవ్ త్రిశూలం ఆకార నిర్మాణం !!! #భారత వాయుసేనకు సెల్యూట్ జై మహాకాల్”.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

వాస్తవ పరిశీలన

సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో చాలా మంది ఈ చిత్రాన్ని షేర్ చేస్తున్నందున, వైరల్ క్లెయిమ్/వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించడానికి బృందం ప్రయత్నించగా, మహా కుంభమేళా ముగింపు రోజున ఎయిర్ షో సమయంలో త్రిశూలం ఆకార నిర్మాణం జరగలేదని కనుగొన్నారు. ముగింపు రోజున జరిగిన అసలు ఎయిర్ షో వీడియోని దిగువన చూడవచ్చు:

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో మరింత సమాచారం కోసం వెతకగా, అలాంటి చిత్రం ఇంటర్నెట్‌లో చాలా కాలంగా షేర్ అవుతోందని తేలింది. 2019 నుండి ఇదే చిత్రాన్ని షేర్ చేసిన పోస్ట్ ఇక్కడ ఉంది:

2025 ఫిబ్రవరి 26న మహా కుంభమేళాలో వైమానిక దళ విమానాల ద్వారా త్రిశూలం ఆకారంలో జరిగిన ఎయిర్ షోకి సంబంధించి మరిన్ని వార్తలు/నివేదికల కోసం మరింత శోధించినా, ఎటువంటి ఫలితాలు వెలువడలేదు.కాబట్టి వైరల్ అవుతున్న చిత్రం 2025 ఫిబ్రవరి 26న జరిగిన మహా కుంభమేళా ముగింపు కార్యక్రమానికి సంబంధించినది కాదు, కానీ 2019 నుండి ఇంటర్నెట్‌లో ఉన్న పాత చిత్రం.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claimట్రంప్ పరిపాలనను విమర్శించే అన్ని ట్వీట్లను నిలిపివేస్తామని ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. ట్రంప్ పరిపాలనను విమర్శించే X ఖాతాలను సస్పెండ్ చేస్తామని/నిలిపివేస్తామని ఎలోన్ మస్క్ పోస్ట్‌ను షేర్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

*****************************************************************************

X యజమాని మరియు బిలియనీర్ ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ఖాతాలను/అకౌంట్లను X ప్లాట్‌ఫామ్ నుండి సస్పెండ్ చేయడం/నిలిపివేయడం జరుగుతుందనే సందేశాన్ని పోస్ట్ చేశారని ఒక క్లెయిమ్/వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

దావా/వాదన ఈ విధంగా ఉంది: ” ట్రంప్ పరిపాలనను నిరసిస్తున్న ఎవరైనా X నుండి సస్పెండ్ చేయబడతారు. ట్రంప్ వ్యతిరేక డ్రామా అంతా థ్రెడ్స్, రెడ్డిట్, బ్లూస్కై, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి లిబరల్ ఎకో చాంబర్లలో ((liberal echo chamber) పోస్ట్ చేసుకోవచ్చు”.

FACT-CHECK

ఈ వాదన ఆందోళనకరంగా ఉండటం మరియు అమెరికా వాక్ స్వేచ్ఛ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో, Digiteye India బృందం ఆ వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించింది. ముందుగా చిత్రంలోని పోస్ట్‌లో టైమ్‌స్టాంప్ లేదు, కానీ మస్క్ ప్రొఫైల్ ఇమేజ్ మరియు హ్యాండిల్ “@elonmusk” ఉండటం గమనించాము.

ఇంకా, వాదన/క్లెయిమ్ చేయబడిన చిత్రంలో “ఫాలో” బటన్ మాత్రమే ఉంది, కానీ మస్క్ అసలైన (Original)పోస్ట్ ఎగువ కుడి మూలలో xAI లోగోతో పాటు “సబ్‌స్క్రైబ్” బటన్‌ కూడా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని ఇక్కడ క్రింది చిత్రాలలో స్పష్టంగా చూడవచ్చు:

మేము ఎలోన్ మస్క్ అధికారిక హ్యాండిల్‌ను పరిశీలించినప్పుడు, అతని X ఖాతాలో అలాంటి పోస్ట్ ఏది లేదు, మరియు ఈ పోస్ట్ పై ఎటువంటి వార్తా నివేదికలు లేవు. మస్క్ అటువంటి పోస్ట్‌ను X లో అధికారికంగా షేర్ చేసి ఉంటే అది వేగంగా వార్తల్లోకి వచ్చేది. కాబట్టి, ఆ వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

సుదర్శన చక్రం, విష్ణు మరియు శివలింగం విగ్రహాలు సంభాల్ మసీదు సర్వేలో దొరికినట్లు సాక్ష్యం ఉందని వాదన. వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీ.శ. 1500 నాటి విష్ణువు, శివ లింగం మరియు సుదర్శన చక్ర విగ్రహాల కనుగొనబడ్డాయనేది, వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. విష్ణు మరియు శివ లింగం విగ్రహాలు ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో కృష్ణ నదిపై వంతెన నిర్మాణ సమయంలో కనుగొనబడ్డాయి, సంభాల్ మసీదు సర్వే సమయంలో కాదు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ మసీదులో జరిపిన సర్వేలో క్రీస్తుశకం 1500 నాటి పురాతన హిందూ విగ్రహాలు కనుగొనబడినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.పోస్ట్ ఇక్కడ ఉంది:

పోస్ట్‌లోని నాలుగు చిత్రాలలో రెండు విష్ణువు విగ్రహాలు, ఒక శివలింగం మరియు ఒక సుదర్శన చక్రం ఉన్నాయి.ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఒక మసీదు సర్వేపై సంభాల్ హింసాత్మక ఘర్షణల సందర్భంలో ఈ వాదన/దావా చేయబడింది జరిగింది.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

వాస్తవ పరిశీలన

మేము మొదట Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో చిత్రాలను పరిశీలించగా, ఆ చిత్రాలు సంభాల్ ప్రాంతం నుండి కాకుండా ఫిబ్రవరి 2024లో కర్ణాటకలోని రాయచూర్ ప్రాంతంలోని చిత్రాలని ఫలితాలు వెల్లండించాయి.ఫిబ్రవరి 2024లో ఈ విగ్రహాలు వెలికితీసినప్పుడు ప్రచురించబడిన నివేదికలు ఇక్కడ ఉన్నాయి.

కర్నాటకలోని రాయచూర్ జిల్లాలోని దేవసుగూర్ గ్రామ సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణ సమయంలో విష్ణువు మరియు శివలింగం యొక్క విగ్రహాలను కనుగొన్నారు. ఫిబ్రవరి 2024లో సుమన్ టీవీ ద్వారా తెలుగులో ప్రసారమైన ఈ ఘటనకు సంబంధించిన వార్తా క్లిప్ ఇక్కడ ఉంది:

అందువలన,ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో మసీదులో సర్వే నిర్వహించగా విగ్రహాలు దొరికాయన్న వాదన అవాస్తవం.సంభాల్ మసీదులో ఇప్పటివరకు హిందూ దేవతల విగ్రహాలను కనుగొన్నట్లు ఎటువంటి వార్తలు కానీ ఆధారాలు కానీ లేవు.కాబట్టి,ఈ వాదన/దావా వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

 

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని అమెరికా అధికారులు అరెస్టు చేసారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:చిత్రంలో చూపిన విధంగా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని అమెరికా అధికారులు అరెస్టు చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వాదన/దావా చేయబడినట్లు, అదానీని అరెస్టు చేయలేదు. చిత్రం AI ద్వారా రూపొందించబడింది.

Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

బుధవారం US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై $ 250 మిలియన్ల లంచం పథకంలో అభియోగాలు మోపబడిందనే వార్తలపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో, US పోలీసులు అదానీని తీసుకువెళుతూ కనిపిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

క్యాప్షన్ ఈ విధంగా ఉంది: “కాన్‌మన్ అదానీ అరెస్ట్.” దీన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు, కానీ అదానీకి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిందని అదే చిత్రం ఉపయోగించి మరొక వాదన/దావా చేయబడింది.

వాస్తవ పరిశీలన

Digiteye India బృందం తన WhatsApp టిప్‌లైన్‌లోవాస్తవ పరిశీలన(Fact Check) అభ్యర్థన రాగ, మొదట అరెస్టుకు సంబంధించిన వార్తలను పరిశీలించింది. US SEC అదానీపై లంచం కేసులో అభియోగాలు మోపగా, అదానీ మరియు అతని మేనల్లుడు సాగర్ అదానీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిందనే వార్తను రాయిటర్స్ ఇక్కడ మరియు ది హిందూ ఇక్కడ వెల్లడించాయి.
US ప్రాసిక్యూటర్లు వారెంట్లను విదేశీ (భారతదేశం) చట్ట అమలు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు, మరియు ఇది విధానాలు/నిబంధనలను ప్రకారం జరగాలి కాబట్టి సమయం పట్టవచ్చు.

ఇంతలో, అదానీ గ్రూప్ ఆరోపణలను ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది:

ప్రకటన ఈ విధంగా పేర్కొంది: “US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ స్వయంగా పేర్కొన్నట్లుగా, “అభియోగపత్రంలో పేర్కొన్నవి ఆరోపణలు మాత్రమే మరియు నేరాన్ని రుజువు అయ్యేంతవరకు నిందితులు నిర్దోషులుగా భావించబడతారు.” “చట్టపరంగా సాధ్యమైన మార్గాలు ఉపయోగిస్తాము.” గురువారం, నవంబర్ 21, 2024 నాటికి, X పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా అదానీ లేదా అతని మేనల్లుడు అరెస్టు కాలేదు.

చిత్రాన్ని నిశితంగా పరిశీలించగా ఒక అధికారి ఆరు వేళ్లతో కనిపించారు, ఇది AI-రూపొందించిన చిత్రమనే అవకాశాన్ని సూచిస్తుంది.’ఇల్యూమినార్టీ’ అప్ లో క్రాస్-చెక్ చేసినప్పుడు, 92.8% ఇది AI ద్వారా రూపొందించబడిన చిత్రమనే సంభావన ఉందని తెలిపింది.

అందువల్ల, US పోలీసు అధికారులు గౌతమ్ అదానీని అరెస్టు చేసినట్లు చూపుతున్న ఫోటో AI ద్వారా రూపొందించబడింది.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

 

ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో పుష్ప-2 చిత్రం కోసం కొత్త ‘లైక్’ బటన్‌ను ప్రవేశపెట్టారా? వాస్తవ పరిశీలన

Claim: ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లో లైక్ బటన్‌ను మార్చారనేది వాదన.

Conclusion: పూర్తిగా తప్పు. ఎలోన్ మస్క్ X ప్లాట్‌ఫారమ్‌లోని లైక్ బటన్‌ను మార్చలేదు మరియు యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement) పెంచడానికి చేసే ఇటువంటి ఉపాయాలకు/కార్యకలాపాలకు X వ్యతిరేమని హెచ్చరించారు.

Rating: పూర్తిగా తప్పు —

(యూసర్ ఎంగేజ్మెంట్ (User Engagement): యూసర్ ఎంగేజ్మెంట్ అనేది వెబ్‌సైట్ లేదా యాప్‌తో వినియోగదారులు ఎలా పరస్పర చర్య చేస్తారో, తరచుగా దాన్ని ఉపయోగిస్తున్నారా మరియు ఎంతకాలం వారు దానిపై ఉంటారనేది కొలిచే మెట్రిక్. )

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

భారతీయ చలనచిత్రాలు ప్రతి చిత్రానికి ఖర్చును పెంచుతున్నందున, తెలుగు నటుడు అల్లు అర్జున్ యొక్క “పుష్ప 2 చిత్రం” చుట్టూ జరుగుతున్న ప్రచారం కొత్త స్థాయికి చేరుకుంది.ఈ తీవ్ర ప్రచారం మధ్య, ఎలోన్ మస్క్ లైక్ బటన్‌ను మార్చినట్లు సూచిస్తూ Xలో సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేయబడింది.

వాదన/దావా ఇలా ఉంది: “ఇది అబద్ధం/ఫేక్ కాదు, ఎలోన్ మస్క్ ‘లైక్’ బటన్‌ను దీనికి మార్చారు❤️‍🔥 దానిపై క్లిక్ చేసి చూడండి.”

“ఎలోన్ మస్క్ నిజంగా లైక్ బటన్‌ను మార్చారు-ఇది నిజం!”,అంటూ, మరొక వినియోగదారుడు దీనికి మద్దతు తెలిపారు.


డిసెంబర్ 5, 2024, గురువారం నాడు పాన్-ఇండియా స్థాయిలో వేర్వేరు డబ్బింగ్ వెర్షన్‌లతో తెలుగు చలనచిత్రం పుష్ప 2 విడుదలైంది. ఈ సినిమా మొదటి భాగం పెద్ద హిట్ అయ్యింది మరియు దాని సీక్వెల్ కూడా ఊపందుకుంటున్నది.

వాస్తవ పరిశీలన

ఎక్స్ పాలసీలో లైక్ బటన్‌లపై అటువంటి మార్పు కోసం బృందం పరిశీలించినప్పుడు, ఎలోన్ మస్క్ ‘పుష్ప 2’ చిత్రం కోసం లైక్ బటన్‌ను మార్చలేదని మరియు అది ఫేక్ క్లెయిమ్/వాదన అని తేలింది.

బటన్‌పై ఒకరు క్లిక్ చేసినప్పుడు, అది ఆటోమేటిక్‌గా పోస్ట్‌ను ఇష్టపడుతున్నట్టు(లైక్ చేస్తున్నట్టు) తెలుపుతుంది.అంతేకాకుండా,షేర్ చేయబడిన వీడియో, లైక్ బటన్ ద్వారా ఇష్టపడేలా చేసి యూసర్ ఎంగేజ్మెంట్ పెంచడానికి చేసే మోసపూరిత ప్రక్రియ కోసం ఉద్దేశించబడింది,ఇది x విధానానికి విరుద్ధం.

ఇలాంటి కార్యకలాపాలకు/మాయలకు వ్యతిరేకంగా ఏప్రిల్‌లో ఎలాన్ మస్క్ హెచ్చరించారు.

అందువల్ల, ఈ దావా/వాదన పూర్తిగా తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన

 

 

కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. భారత ప్రభుత్వ(PIB) అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని మరియు దావా తప్పు అని స్పష్టం చేసింది.

రేటింగ్/Rating:తప్పుదారి పట్టించే వాదన. —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

***********************************************************************

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్ని భారతీయ భాషల్లో వైరల్ పోస్ట్ షేర్ అవుతోంది. క్యాబినెట్ ఆమోదించిన విధంగా పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలు పెరిగినట్లు దావా/వాదన పేర్కొంది.

దేశంలోని యువ ఉద్యోగార్ధులపై దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఇక్కడ  షేర్ చేయబడింది.

హిందీ పోస్ట్ యొక్క తెలుగు అనువాదం: “పదవీ విరమణ వయస్సును రెండేళ్లు పెంచడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటికే నిరుద్యోగులుగా ఉన్న యువత సంగతేంటి? అది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇప్పటికే రిక్రూట్‌మెంట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీని వల్ల రెండేళ్లపాటు కొత్త రిక్రూట్‌మెంట్లు కూడా తగ్గుతాయి మరియు మిగిలిన ఉద్యోగులకు కూడా ప్రమోషన్లలో జాప్యం జరుగుతుంది.”

పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ అందుబాటులో ఉంది.

వాస్తవ పరిశీలన

భారత ప్రభుత్వం ఈ విషయంలో ఏమైనా ప్రకటన జారీ చేసిందా అని పరిశీలించగా,ఇటీవలి రోజుల్లో భారత ప్రభుత్వం నుండి అలాంటి ప్రకటన ఏది లేదని కనుగొన్నాము.
ఈ వాదన వలన, ఉద్యోగంలో కొనసాగడానికి లేదా ప్రమోషన్ అవకాశల్లో తగ్గుదల లాంటి ప్రభావం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై చూపుతుంది కాబట్టి,ఇది వార్తల్లో ముఖ్యాంశాలుగా ఉండేది. కానీ అలాంటి ప్రకటనేమీ చేయలేదు.

మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచడానికి ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పష్టం చేసింది.

తదుపరి పరిశోధనలో, 2023 ఆగస్టులో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ఏదీ తన పరిశీలనలో లేదని ప్రభుత్వం లోక్‌సభలో ధృవీకరించిందని , మరియు కేసుల వారీగా పరిగణించబడే మినహాయింపులను పరిశీలిస్తుందని కనుగొన్నాము.

అందువల్ల, వాదన/దావా తప్పు మరియు తప్పుదారి పట్టించే విధంగా ఉంది..

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

 

సునీతా విలియమ్స్ ISS నుండి భూమికి తిరిగి వచ్చేశారని ఒక వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: విజయవంతంగా 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.ISSలో సునీతా విలియమ్స్ యొక్క పాత (2012 నాటి) వీడియో ఉపయోగించబడింది. ఆమె ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి రావాల్సి ఉంది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన.

అంతరిక్ష కేంద్రం (ISS)లో నాలుగు నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి వస్తున్నారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఒక వీడియోను షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలోని కొన్ని పోస్ట్‌లను ఇక్కడ చూడండి:

ఒక వాదన ఈ విధంగా ఉంది: “విజయవంతమైన 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, “సునీతా విలియమ్స్” సురక్షితంగా భూమికి తిరిగి వస్తున్నారు. ఇది నిజంగా మనసుకు హత్తుకునే వీడియో మరియు చూడటానికి అద్భుతంగా ఉంది.”

వాస్తవ పరిశీలన వివరాలు:

అనేక క్లెయిమ్‌/వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం, DigitEye India బృందం వాస్తవ-పరిశీలనకు పూనుకుంది.
వీడియో నుండి కొన్ని ఫ్రేమ్‌లను తీసుకొని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా ఇది నవంబర్ 2012 నాటి పాత వీడియో అని తేలింది. సునీతా విలియమ్స్ “32/33 అంతరిక్ష యాత్ర”లో భాగంగా జూలై 15, 2012న బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను పర్యటించిన సందర్భంలో ISS యొక్క కక్ష్య ప్రయోగశాల, వంటగది, టాయిలెట్, స్లీపింగ్ బెడ్‌, స్పేస్ సూట్ తో సహా అన్ని సౌకర్యాలను మరియు ప్రాంతాలను వీడియోలో రికార్డు చేసారు. ఈ వీడియోను NASA యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

ఆమె, ఆమె తోటి వ్యోమగాములు యూరి మాలెన్‌చెంకో మరియు అకిహికో హోషిడ్‌లతో కలిసి రష్యన్ అంతరిక్ష నౌక సోయుజ్ TMA-05Mలో నాలుగు నెలల పాటు ISS దగ్గర నిలిపివేయబడింది(డాక్ చేయబడింది).తిరిగి నవంబర్ 19, 2012న భూమికి తిరిగి వచ్చారు.

అయితే, మళ్లీ జూన్ 5, 2024న, బుచ్ విల్మోర్‌తో పాటు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపబడ్డారు మరియు వారు బోయింగ్ స్టార్‌లైనర్‌ను ISSతో విజయవంతంగా డాక్ చేయగలిగారు.వాస్తవానికి ఈ మిషన్‌ను వారం రోజుల పాటు టెస్ట్ ఫ్లైట్‌గా ప్లాన్ చేశారు, కానీ బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారు తిరిగి రాలేక అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 2025లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో వారిని తిరిగి భూమికి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాబట్టి, సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చేశారనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

 

 

 

 

గోవా తీరంలో పడవ బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బోల్తా పడిన పడవ, భారతదేశంలోని గోవా తీరంలో జరిగిన ప్రమాదమనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వీడియోలోని పడవ భారతదేశంలోని గోవాలో కాకుండా ఆఫ్రికాలోని గోమాలో బోల్తాపడి పెద్దప్రమాదం జరిగింది.

రేటింగ్/Rating:తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి..

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

‘గోవా’లో ఓవర్‌లోడెడ్ స్ట్రీమర్ బోట్ బోల్తా పడి చాలా మంది చనిపోయినట్లు, ఇంకా చాలా మంది గల్లంతయ్యారంటూ పేర్కొంటున్న వీడియోను పలువురు సోషల్ మీడియా యూజర్లు షేర్ చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని పోస్టులను చూడండి:

వాస్తవ పరిశీలన వివరాలు:

DigitEye India బృందం వీడియో యొక్క కొన్ని కీఫ్రేమ్‌లను తీసుకొని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించినప్పుడు, ఈ విషాద సంఘటన భారతదేశంలో జరగలేదని కనుగొనబడింది, అయితే ఈ ప్రయాణీకుల పడవ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఆఫ్రికాలోని కివు సరస్సు నీటిలో ప్రయాణించడం గమనించాము.

సోషల్ మీడియా పోస్ట్‌లలో పేర్కొన్నట్లుగా ఓవర్‌లోడ్ అయిన పడవ సౌత్ కివులోని మినోవా పట్టణం నుండి గోమాకు ప్రయాణిస్తోంది, భారతదేశంలోని గోవా పట్టణానికి కాదు.  స్థానిక వార్తా నివేదికల ప్రకారం, విషాదకరమైన పడవ ప్రమాదంలో కనీసం 78 మంది మరణించారు, మరియు ఇంకా చాలా మంది గల్లంతయ్యారు.

కాంగోలోని కిటుకు ఓడరేవు నుండి ఒక కిలోమీటరు కంటే తక్కువ దూరంలో ఉన్నప్పటికీ, ఓడరేవుకు చేరుకునేలోపే, అధిక బరువు మరియు అధిక వేగవంతమైన నీటి ప్రవాహాలను తట్టుకోలేక పడవ మునిగిపోయిందనే వివరాలను తెలియజేస్తూ  NewsOnAir వార్త నివేదికను భారతదేశంలో ప్రసారం చేసింది. ఆ పడవ కేవలం 80-90 మంది మాత్రమే ప్రయాణించేలా నిర్మించబడిందని, అయితే 278 మంది ఓవర్‌లోడ్‌తో పడవ మునిగిపోయిందని నివేదికలు వెల్లడించాయి.

 

 

గోవా పోలీసులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు:

కాబట్టి, బోల్తా పడిన పడవ భారతదేశంలోని గోవా తీరంలో జరిగిన సంఘటనేది తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

 

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: హారిస్‌కు మద్దతు తెలిపినందుకు, కంట్రీ మ్యూజిక్ టేలర్ స్విఫ్ట్‌ను నిషేధించారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.అటువంటి నిషేధం ఏమి జరగలేదు మరియు వ్యంగ్య వెబ్‌సైట్ ద్వారా ఈ తప్పుడు/దావా చేయబడింది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన. —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి..

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను సమర్థించిన తర్వాత టేలర్ స్విఫ్ట్‌ను కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించారనే వాదనతో కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయి.

X లో పోస్ట్ చేయబడిన ఒక వైరల్ మిమ్(meme) ఇలా పేర్కొంది: “గట్టి మద్దతు తెలిపిన తర్వాత టేలర్ స్విఫ్ట్ కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించబడింది: “ఆమె పాడటానికి కట్టుబడి ఉండాలి, రాజకీయాలకు కాదు”.

పాప్ మ్యూజిక్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్, ఇంతకు ముందు రిపబ్లికన్ యొక్క ట్రంప్ గట్టి మద్దతుదారు అయిన ఆమె తన మద్దతును సెప్టెంబర్ 10, 2024న హారిస్‌కు మార్చడంతో వార్తల్లోకి ఎక్కింది.ఆమె హారిస్‌కు బహిరంగగా మద్దతు ఇవ్వడం చూసి, కొత్త ఆరోపణలతో సహా అనేక మీమ్స్ మరియు తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి.

పోస్ట్‌కు 2,400 కంటే ఎక్కువ స్పందనలు మరియు 1,000 వ్యాఖ్యలు వచ్చాయి మరియు స్విఫ్ట్ మద్దతుపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్ర చర్చను రేకెత్తించింది.

వాస్తవ పరిశీల వివరాలు:

DigitEye బృందం పరిశీలించగా అసలు/ఒరిజినల్ పోస్ట్ ఫేస్‌బుక్‌లో ఉంది, మరియు ఆ సందేశాన్ని వ్యంగ్యంగా పేర్కొన్నట్లు తెలిసింది.అందులో వ్యంగ్య వెబ్‌సైట్ అయిన SpaceXMania.com వెబ్‌సైట్‌కి లింక్‌ ఇవ్వబడింది. కాకపోతే,నాష్‌విల్లే యొక్క కంట్రీ మ్యూజిక్ ఎలైట్ యొక్క ప్రతిచర్యలు లేదా స్టేట్‌మెంట్‌ల ద్వార పాప్ స్టార్ కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించబడిందనడానికి ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్, SpaceXMania.com కథనానికి లింక్ ఇవ్వబడింది. మేము దాని ప్రామాణికత కోసం పరిశీలించినప్పుడు, అది వ్యంగ్య వెబ్‌సైట్ అని స్పష్టంగా చూపుతూ, కథనాలు కల్పితం మరియు నిజమైనవి కావని డిస్క్లైమర్స్లో/disclaimers పేర్కొన్నారు. కమలా హారిస్‌కు మద్దతు తెలిపినందుకు టేలర్ స్విఫ్ట్ ను టార్గెట్ చేయడం ఇదేం మొదటిసారి కాదు.
కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.
హారిస్‌కు మద్దతు తెలిపినందుకు ఆమె మిలియన్ల కొద్దీ సోషల్ మీడియా ఫాలోవర్లను కోల్పోయారని మునుపటి పుకార్లు పేర్కొనడం జరిగింది లేదా ఇలాంటి కారణాల వల్ల కోకా-కోలా ఆమెతో తన భాగస్వామ్యాన్ని ముగించిందని కూడా వాదనలు వచ్చాయి కానీ అవి తప్పుగా నిరూపణ చేయబడ్డాయి.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన

కమలా హారిస్‌ అమెరికా యొక్క సహజసిద్దమైన పౌరురాలు కాదా? US ప్రెసిడెంట్ అభ్యర్థి యొక్క అర్హతపై వాదన మళ్లీ తెరపైకి వచ్చింది; వాస్తవ పరిశీలన

 

ఇరాన్ క్షిపణి దాడుల సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బంకర్ వద్దకు పరిగెత్తుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇరాన్ క్షిపణి దాడుల నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరిగెడుతున్నట్లు వీడియోలోని వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా నెతన్యాహు పారిపోతున్నట్లు చూపుతున్న వీడియో తప్పు.ఇది నెస్సెట్‌లో కీలకమైన పార్లమెంటరీ ఓటు కోసం పరిగెడుతున్నట్లు,నెతన్యాహు స్వయంగా పోస్ట్ చేసిన 2021 నాటి వీడియో ఫుటేజ్.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణి దాడులు టెల్ అవీవ్‌ను ఢీకొన్న తర్వాత,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడులకు ప్రతిస్పందనగా కారిడార్‌లో పరుగెత్తుతు బంకర్‌కు పారిపోతున్నాడని వినియోగదారులు పేర్కొంటున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోస్ట్‌తో ఉన్న క్యాప్షన్ ఇలా ఉంది: “ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిరికివాడిలా పరిగెత్తుతున్నారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడులతో తన ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటున్నాడు.” మరో పోస్ట్ ఇలా ఉంది, “ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాడు. అతను ఎన్ని రోజులు బంకర్‌లో దాక్కుంటాడు?”

ఇలాంటి వాదన/దావలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలన వివరాలు:

వీడియోలోని యొక్క కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Digiteye India బృందం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో అన్వేషించగా ఈ వీడియో మూడేళ్ల పాతదని మరియు వేరే సందర్భంలో తీసినదని గమనించాము. క్రింద చూసినట్లుగా దీనిని నెతన్యాహు స్వయంగా తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో హీబ్రూ భాషలో డిసెంబర్ 14, 2021న పోస్ట్ చేసారు:

తెలుగులోకి అనువదించగా, నెతన్యాహు ఇలా పోస్ట్ చేసారు: “మీ కోసం పరిగెత్తడానికి నేను ఎల్లప్పుడూ గర్వపడుతున్నాను. ఇది నెస్సెట్‌లో అరగంట క్రితం తీయబడింది.” నెతన్యాహు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోని నెస్సెట్‌లో ఉన్నప్పుడు, ఆ సమయంలో ప్రతిపక్ష అధిపతిగా సమావేశానికి హాజరయ్యేందుకు నడుస్తున్నప్పుడు వీడియో తీయబడిందని ఇది నిర్ధారిస్తుంది.
డిసెంబరు 2021 నాటి కొన్ని హిబ్రూ వార్తా నివేదికలు ఆయన నెస్సెట్ ప్లీనంలో ఓటు సమయానికి చేరాలని పరుగెత్తుతున్నట్లు కూడా సూచిస్తున్నాయి. అందువల్ల, ఆయన ఇరాన్ క్షిపణి దాడి నుండి పారిపోతున్నాడనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన