Category Archives: GENERAL

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

వాదన/CLAIM:COVID-19ని గుర్తించడానికి కొత్త లక్షణాలున్న జాబితాని AIIMS ఒక సలహా/ప్రకటన ద్వారా జారీ చేసింనేది వాదన.

నిర్ధారణ/CONCLUSION: AIIMS తన అధికారిక వెబ్‌సైట్‌లో అలాంటి సమాచారం ఏదీ కూడా షేర్ చేయలేదు.సాధారణ జలుబు, ఫ్లూ మరియు వైరల్ జ్వరం యొక్క లక్షణాలు COVID-19 మాదిరిగానే ఉంటాయి.దేశంలోని అనేక ప్రాంతాల్లో COVID-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగా ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించడం అత్యంత అవసరం.

రేటింగ్: తప్పుదోవ పట్టించే వార్త.–

వాస్తవ పరిశీలన వివరాలు

కోవిడ్-19ని గుర్తించేందుకు ‘ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)’ ఒక ప్రకటన ద్వారా కోవిడ్ యొక్క కొత్త లక్షణాల జాబితాను విడుదల చేసిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో సోషల్ మీడియా ఈ  సందేశం విస్తృతంగా షేర్ చేయబడుతోంది.ప్రకటన/సందేశం ప్రకారం, AIIMS యొక్క పాథాలజీ విభాగం ఇంట్లోనే కరోనా వైరసును ఎలా గుర్తించవచ్చో తెలిపారు.

వైరల్ మెసేజ్/సందేశం ఆరోపణ క్రింది విధంగా ఉంది:

1) పొడి దగ్గు + తుమ్ములు = వాయు కాలుష్యం
2) దగ్గు + శ్లేష్మం/చీమిడి + తుమ్ములు + ముక్కు కారడం = జలుబు/రొంప
3) దగ్గు + శ్లేష్మం/చీమిడి +తుమ్ములు + ముక్కు కారడం + ఒళ్లు/శరీర నొప్పులు + శరీర బలహీనత + తేలికపాటి జ్వరం = ఫ్లూ
4) పొడి దగ్గు + తుమ్ములు + ఒళ్లు/శరీర నొప్పులు + శరీర బలహీనత + తీవ్ర జ్వరం + శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది = కరోనా వైరస్

Digiteye India బృందం వారికి ఈ వైరల్ మెసేజ్ గురించి వాస్తవ పరిశీలన చేయమని వాట్సాప్‌లో అభ్యర్థనను వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం AIIMS వెబ్‌సైట్‌లో వైరల్ మెసేజ్ కి సంబంధించి ఏదైనా సలహా లేదా ప్రకటన జారీ చేసిందా లేదా అని పరిశిలన చేసింది.కోవిడ్-19ని ఈ విధంగా గుర్తించగలమని పేర్కొన్న నోటీసు లేదా మెమోరాండం ఏదీ మాకు కనపడలేదు.
ఈ విషయంపై గూగుల్లో కీవర్డ్ఉపయోగించి వెతకగా, డిసెంబర్ 27, 2023న హిందూస్తాన్ టైమ్స్ ప్రచురించిన ఒక వార్తా కథనానికి దారితీసింది.
“C6 వార్డులో 12 పడకలు తీవ్ర అనారోగ్యంతో ఉన్న COVID-19 రోగులను ఆసుపత్రిలో చేర్చడానికి కేటాయించబడతాయి” అని మాత్రమే పేర్కొన్న ఒక మెమోరాండంని AIIMS జారీ చేసింది.

మేము మరింత వెతకగా, AIIMS ద్వారా అప్‌లోడ్ చేయబడిన COVID-19 బుక్‌లెట్‌ మా దృష్టికి వచ్చింది. బుక్‌లెట్‌లో, వారు COVID-19 లక్షణాలని ఈ విధంగా పేర్కొన్నారు – “జ్వరం, గొంతు నొప్పి, దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం. ఇవి జలుబు, ఇన్‌ఫ్లుఎంజా మొదలైన ఏదైనా వైరల్ ఇన్‌ఫెక్షన్ యొక్క లక్షణాలను పోలి ఉంటాయి.”

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ప్రకటనను ఎయిమ్స్(AIIMS ) విడుదల చేయలేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఇవి COVID-19 యొక్క లక్షణాలు : జ్వరం, దగ్గు, అలసట, రుచి లేదా వాసన యొక్క లక్షణాన్ని కోల్పోవడం, గొంతు నొప్పి, తలనొప్పి, నొప్పులు , అతిసారం, చర్మంపై దద్దుర్లు , చేతి లేదా కాలివేళ్ళ రంగు మారడం, మరియు ఎరుపెక్కిన కళ్ళు.

Digiteye India బృందం వారు ఢిల్లీకి చెందిన డాక్టర్ షగున్ గోవిల్‌తో మాట్లాడగా, అతను “COVID-19 యొక్క లక్షణాలు, ఫ్లూ మరియు సాధారణ జలుబుతో పోలి ఉన్నప్పటికీ, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే, వారు సరైన మార్గనిర్దేశం చేయగల వైద్యుడిని సంప్రదించాలి.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check

పైనాపిల్‌తో కూడుకున్న వేడినీరు క్యాన్సర్‌ కణాలను నాశనం చేయగలదా? Fact Check

 

 

రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ వారి వివాహాన్ని చర్చిలో నమోదు చేసుకున్నట్లు ఈ చిత్రంలో కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: సోనియాగాంధీ, రాజీవ్‌గాంధీ క్రిస్టియన్‌ పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్లు ఓ ఫోటో వైరల్‌గా మారింది.

నిర్ధారణ/Conclusion: సోనియా గాంధీ మరియు రాజీవ్ గాంధీల వివాహానికి సంబంధించిన ఒరిజినల్ వీడియోలో, ఈ జంట సాంప్రదాయ హిందూ వివాహ దుస్తులను ధరించి వివాహం చేసుకోవడం మరియు వారి వివాహాన్ని నమోదు చేసుకోవడం కనిపిస్తుంది.

రేటింగ్: Misrepresentation —

వాస్తవ పరిశీలన వివరాలు

రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఒక క్రైస్తవ మతగురువు ముందు కూర్చుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ జంట తమ వివాహాన్ని ఢిల్లీలోని చర్చిలో రిజిస్టర్ చేసుకున్నట్లు చిత్రం ఆరోపించింది.చిత్రంలో పెన్ను మరియు కాగితంతో ఒక టేబుల్ ముందు జంట కూర్చున్నట్లు చూడవచ్చు.

వైరల్ అవుతున్న చిత్రంతో ఉన్న దావా ఇలా పేర్కొంది:

“ఒక యువ జంట ఢిల్లీ చర్చిలో తమ వివాహాన్ని నమోదు చేసుకున్నారు. వారి కుమారుడు భారతీయులకు… హిందూ వర్సెస్ హిందుత్వను బోధించడంలో వ్యస్తంగా ఉన్నారు.:) #IBatheAlone Jai Ho”.

Digiteye India బృందం వారు ఈ వైరల్ చిత్రం యొక్క వాస్తవ పరిశీలన చేయమని వాట్సాప్‌లో అభ్యర్థనను అందుకుంది.

FACT CHECK

Digiteye India వారు బృందం గూగుల్‌ రివర్స్ ఇమేజ్ లో చిత్రం కోసం వెతకగా,అదే క్లెయిమ్‌/దావాతో 2018 నుండి చెలామణిలో ఉందని గమనించాము.

రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీల వివాహానికి సంబంధించిన మరిన్ని చిత్రాల కోసం మేము కీవర్డ్ ఉపయోగించి వెతకగా, 2015లో NDTV ప్రచురించిన ఒక వార్తా నివేదిక దృష్టికి వచ్చింది.వార్తా కథనం నలుపు మరియు తెలుపులో వారి వివాహ క్షణాలను కలిగి ఉన్న వీడియో గురించి ప్రస్తావించింది.ఈ వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ ప్రచురించింది.మొదటగా ఈ వీడియోను బ్రిటిష్ మూవీటోన్ అప్‌లోడ్ చేసిందని కథనం పేర్కొంది.ప్రముఖ అతిథులు ఇందిరా గాంధీ, జాకీర్ హుస్సేన్, సంజయ్ గాంధీ మరియు విజయ లక్ష్మి పండిట్ ఉన్నారు.

అసోసియేటెడ్ ప్రెస్ పోస్ట్ చేసిన వీడియోలో 1:03 మార్క్ వద్ద,ఇందిరా గాంధీ చూస్తుండగా సోనియా మరియు రాజీవ్ తమ వివాహం రిజిస్టర్ చేసుకోవడం కనిపిస్తుంది.వారు హిందూ వివాహ వస్త్రధారణలో హిందూ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నట్లు,మరియు తమ వివాహం నమోదు చేసుకున్నట్లు నిర్ధారిస్తుంది.

సోనియా గాంధీ పింక్ డ్రెస్‌లో కనిపించారు, పెళ్లి దుస్తులలో కాదు. కాబట్టి ఈ వాదనలో నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీల

 

స్క్రిప్ట్ చేసిన వీడియోలో ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది ప్రయాణీకుల పర్సు నుండి డబ్బు దొంగిలిస్తున్నట్లు కనపడుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది విమాన ప్రయాణికుడి పర్స్‌లో ఉన్న నగదును దొంగిలిస్తున్నట్లు వీడియోలో కనపడుతుంది.

నిర్ధారణ/Conclusion:ప్రచురణకర్త(పబ్లిషర్) అప్‌లోడ్ చేసిన అనేక వీడియోలలో ఒకే నటీనటులు చేస్తున్న ప్రక్రియను చూపించే స్క్రిప్ట్ చేసిన వీడియో.

రేటింగ్: Misrepresentation —

Fact Check వివరాలు

ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికుడి పర్సులోంచి డబ్బు దొంగిలిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది.
ఇది విమానాశ్రయ భద్రతా సిబ్బందికి వ్యతిరేకంగా హెచ్చరికతో దిగువ చూపిన విధంగా Twitterలో అనేక వినియోగదారుల దృష్టిని
ఆకర్షించింది.

హిందీలో ఉన్న పోస్ట్ :Airport se safar karne wale pessenger is video ko khas karke zaroor dekho… airport k andar ka staff passenger ka rupya Paisa kis tarah se chori karte hain zara dekh Lo… is video ko apne sabhi group mein share karo… (తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది:విమానంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ వీడియో తప్పక చూడండి. విమానాశ్రయ సిబ్బంది ప్రయాణీకుల డబ్బును ఎలా దోచుకున్నారో చూడండి. ఈ వీడియోని మీ అన్ని గ్రూప్‌లలో షేర్ చేయండి…)

పోస్ట్ ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చును.

FACT CHECK

Digiteye India బృందం వాట్సాప్ అభ్యర్థన ఆధారంగా వాస్తవ పరిశీలన చేస్తుండగా ఇది అప్పటికే ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడిందని కనుగొన్నారు.బృందం ఇన్‌విడ్ సాధనాన్ని ఉపయోగించి వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకుని, వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా, ఆ వీడియో నవంబర్ 1, 2023న PaulVu TV ద్వారా YouTubeలో అప్‌లోడ్ చేయబడిందని గమనించారు. అసలు వీడియో యొక్క శీర్షిక ఇలా ఉంది, ‘దురాశపరుడైన ఉద్యోగి ప్రయాణీకుడి డబ్బులు తీస్తున్నాడు!’

మేము ప్రచురణకర్త హోమ్ పేజీని పరిశీలించగా, బాధితులుగా లేదా నేరస్థులుగా ఒకే నటీనటులను కలిగి ఉన్న అనేక స్క్రిప్ట్ వీడియోలు ఉన్నాయని మేము గమనించాము.PaulVu TV హోమ్ పేజీని ఇక్కడ చూడండి: ఒక నెల క్రితం అప్‌లోడ్ చేసిన మూడు వీడియోలలో ఒకే వ్యక్తి కనపడతాడు(సర్కిల్ చేయబడిన వ్యక్తి).

కాబట్టి, ఇది స్క్రిప్ట్ చేయబడిన వీడియో,నిజమైనది కాదు.

మరి కొన్ని Fact Checks:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని యునైటెడ్ స్టేట్స్ లో ప్రారంభించారని మరియు దానికి భారత మన  రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుపెట్టారనేది ఒక వాదన.

నిర్ధారణ/Conclusion:వాదనలో పేర్కొన్న విధంగా, అమెరికాలో ఎటువంటి లైబ్రరీ ప్రారంభించబడలేదు మరియు అంబేద్కర్ గారి పేరు కూడా పెట్టబడలేదు.వైరల్ అవుతున్న చిత్రం మార్చి 2018లో ప్రారంభించబడిన చైనాలోని ఒక లైబ్రరీ చిత్రం.

రేటింగ్: పూర్తిగా తప్పు —

వాస్తవ పరిశీలన వివరాలు:

యునైటెడ్ స్టేట్స్(అమెరికా) ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని ప్రారంభించిందని మరియు దానికి మన  భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఒక పోస్ట్ పేర్కొంది.

“भारत देश के मसीहा डॉ .भीम राव अम्बेदकर जी के नाम अमेरिका ने खोलाविश्व का सबसे बडा पुस्तकालय , नमस्ते अमेरिका , जय भीम, जय भारत, जय संविधान.”[తెలుగు అనువాదం:యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని ప్రారంభించింది మరియు దానికి మన భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పేరు పెట్టారు. నమస్తే అమెరికా, జై భీమ్, జై భారత్, జై రాజ్యాంగం.]

 

వాదన/దావాకు మద్దతుగా, అరలో అనేక పుస్తకాలు అమర్చబడిన తెల్లటి భవనాన్ని కూడా చూడవచ్చు.

Fact Check

గతంలో ఇదే విధమైన వాదనని తప్పని నిరూపించినందున,ఈ వాదనని కూడా Digiteye India team వారు పరిశీలించారు. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో తెలుపు భవనం యొక్క చిత్రంని ఉపయోగించి సెర్చ్ చేసినప్పుడు, అమెరికాలో కాకుండా చైనాలో ఉన్న అసలు భవనాన్ని కనుగొన్నాము. ఈ భవనం చైనాలోని టియాంజిన్‌లోని బిన్‌హై లైబ్రరీకి చెందినది. క్రింద చూపిన విధంగా అనేక వార్తా నివేదికలు (CNN)  కూడా ఇదే సమాచారాన్ని వెల్లడిస్తున్నాయి:

టియాంజిన్ బిన్హై లైబ్రరీ MVRDV నిర్మించిన అత్యంత వేగవంతమైన ప్రాజెక్ట్ అని ఇతర నివేదికలు ధృవీకరించాయి, దీనిని పూర్తి చేయడానికి కేవలం మూడు సంవత్సరాలు పట్టింది. క్రింద జిన్హువా వార్తా సంస్థ అందించిన వీడియోను చూడండి:

 

నవంబర్ 2, 2017న అప్‌లోడ్ చేయబడిన పై వీడియో, ఉత్తర చైనీస్ పోర్ట్ సిటీ టియాంజిన్‌లో ఉన్న’టియాంజిన్ బిన్‌హై’ లైబ్రరీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తుంది, మరియు అనేక రకాల పుస్తకాలు ఉన్నందున ఈ లైబ్రరీ పాఠకులకు ఒక మంచి అనుభూతి/అనుభవాన్ని ఇస్తుంది.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు మీద అమెరికాలో ఎలాంటి లైబ్రరీ లేదు.ఈ వాదన/వార్తాకు సంబంధించిన నివేదికలు కూడా ఎక్కడ కనబడలేదు.కాబట్టి, ఈ వాదన/దావా పూర్తిగా తప్పు

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

 

 

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో బబియా అనే శాఖాహార మొసలిని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది, మరియు మొసలి గుడిలోని ప్రసాదం మాత్రమే తింటుందనేదొక వాదన.

నిర్ధారణ/Conclusion: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో శాకాహార మొసలి బబియా నివసిస్తుందనేది నిజం. అయితే, బబియా 2022లో మరణించింది మరియు ఒక సంవత్సరం తర్వాత సరస్సులో కొత్త మొసలి కనిపించింది.వైరల్ వీడియోలో బాబియా యొక్క కొన్ని చిత్రాలు మాత్రం కనబడుతాయి, అన్నీ కాదు. చిత్రాలలో ఒకటి కోస్టారికాకు చెందిన వ్యక్తి, గాయపడిన మొసలికి వైద్యం చేసి తిరిగి ఆరోగ్యవంతంగా చేసి, దాంతో అతనికి మొసలితో అనుబంధం ఏర్పడడం వంటి నేపథ్యంలో తీసిన డాక్యుమెంటరీ నుండి తీసుకోబడింది.

రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

కేరళ దేవాలయంలోని చెరువులో శాకాహార మొసలి నివసిస్తోందని తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయ సరస్సులో మొసలి నివసిస్తోందని ఆ వీడియో పేర్కొంది. వీడియోలో మొసలి ముక్కుపై ఒక వ్యక్తి తన తలను ఉంచే దృశ్యాలను చూడవచ్చు మరియు మొసలి పేరు బబియా అని, ఆలయ పూజారి మొసలికి ఆలయం నుండి బియ్యం ప్రసాదం కూడా అందజేస్తారని ఒక వాదన.

ఈ వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందొ పరిశీలన చేయమని Digiteye Indiaకి వాట్సాప్‌లో అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు Googleలో Babiya కోసం వెతకగా అనేక ఆన్‌లైన్ వార్తాపత్రికలు నుంచి సమాచారం కనిపించగా, అందులో ఒకటి అక్టోబర్ 10,2022న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించబడిన కథనానికి దారితీసింది. ఏడు దశాబ్దాలకు పైగా ఆలయ చెరువులో నివసిస్తున్న బబియా మరణించినట్లు మరియు మొసలి “ఆలయం వారు సమర్పించే బియ్యం, బెల్లం ప్రసాదాలను మాత్రమే తినేదని” అని నివేదిక పేర్కొంది.

బాబియా మరణించిన ఒక సంవత్సరం తర్వాత, ఆలయ సరస్సులో మరొక మొసలి కనిపించిందని నవంబరు 13, 2023న ప్రచురించబడిన ‘ది హిందూ’ యొక్క మరొక నివేదిక పేర్కొంది. సరస్సులోకనిపించడం ఇది మూడో మొసలి అని ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది.

అయితే, వైరల్ వీడియోలో ఉపయోగించిన అన్ని విజువల్స్ బాబియాకి సంబంధించినవి కావు.

మేము అన్ని విజువల్స్‌పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా, మొసలి ముక్కుపై ఒక వ్యక్తి తల ఉంచిన చిత్రం కేరళలోని దేవాలయం నుండి కాదని గమనించాము.ఇది 2013లో “ది మ్యాన్ హూ స్విమ్స్ విత్ క్రోకోడైల్స్” అనే డాక్యుమెంటరీ సంబంధిచిన వీడియో. వైరల్ చిత్రం 20:57 మార్క్ వద్ద చూడవచ్చు.

“ది మ్యాన్ హూ స్విమ్స్ విత్ క్రోకోడైల్స్”అనే డాక్యుమెంటరీ కోస్టారికాకు చెందిన గిల్బర్టో ‘చిటో’ షెడ్డెన్ అనే వ్యక్తి జీవితాన్ని సంబంధించింది.చేపలు పట్టే సమయంలో చీటో
కి ఈ మొసలిని కంట పడింది. గాయపడిన మొసలికి అతను వైద్యం చేసి తిరిగి ఆరోగ్యవంతంగా చేశాడు.అదే సమయంలో అతనికి మొసలితో అనుబంధం ఏర్పడడంతో దానికి ‘పోచో’ అని పేరు పెట్టాడు.డాక్యుమెంటరీ వివరణలో, “ఈ జీవికి(మొసలి) వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మొసలి తనను విడిచిపెట్టడానికి నిరాకరించడం చూసి చిటో ఆశ్చర్యపోయాడు. వారి స్నేహం దశాబ్దాలుగా కొనసాగింది, చిటో ప్రపంచంలో మొసలిని విజయవంతంగా మచ్చిక చేసుకున్న కొద్దిమంది వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.”

కాబట్టి, ఈ వాదన/దావా, తప్పు.

మరి కొన్ని Fact checks:

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన

 

మోర్బీ బ్రిడ్జి కూలిన అనంతరం రాహుల్ గాంధీ తెలంగాణలో ఆనందంగా డ్యాన్స్ చేశారా?వాస్తవ పరిశీలన

వాదన/Claim: గుజరాత్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన అనంతరం కాంగ్రెస్ నేతలు ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు. వంతెన కూలిన దుర్ఘటనకు ముందు అప్‌లోడ్ చేసిన వీడియో.వంతెన సాయంత్రం కూలిపోగా, శ్రీ రాహుల్ గాంధీగారు ఉదయం ‘బతుకమ్మ నృత్యం’లో పాల్గొన్నారు.

రేటింగ్: తప్పుదారి పట్టించడం.

Fact Check వివరాలు:

గుజరాత్‌లోని మోర్బీలో బ్రిడ్జి కూలిన అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, కె.సి వేణుగోపాల్‌లు స్థానికులతో కలిసి సంతోషంగా డ్యాన్స్‌లు చేస్తున్నారనే వాదన(వీడియో) విస్తృతంగా షేర్ అవుతోంది.

ఒక కథనం ప్రకారం, గుజరాత్‌లో 150 మందికి పైగా మరణించిన దుర్ఘటనపై కాంగ్రెస్ నాయకులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, సంతాపం తెలిపే బదులు కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో వారు నృత్యం చేశారు.ఇలాంటి అనేక పోస్ట్‌లు Xలో(గతంలో ట్విట్టర్‌) షేర్ చేయబడ్డాయి మరియు లక్షలకు పైగా రీట్వీట్‌లు వచ్చాయి.

FACT CHECK

మేము వీడియో యొక్క మూలాన్ని పరిశీలించినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధికారికంగా అక్టోబర్ 30న తెలంగాణ భారత్ జోడో యాత్రలోని కొన్ని సంఘటనలను(నాయకులు స్థానికులతో గ్రూప్ డ్యాన్స్‌చేస్తున్న వీడియో) తీసుకొని వీడియోని అప్‌లోడ్ చేసారు.

మోర్బిలో వంతెన కూలి కనీసం 141 మంది ప్రాణాలను బలిగొన్న ఘటనకు ఈ వీడియోకు సంబంధం లేదు.

మరియు తెలంగాణ భారత్ జోడో యాత్ర సంఘటన అక్టోబర్ 30న ఉదయం జరిగింది, అయితే అదే రోజు అక్టోబర్ 30న సాయంత్రం సరిగ్గా 6:32 గంటలకు వంతెన కూలిపోయింది.

కాంగ్రెస్ @INC India వారు అప్లోడ్ చేసిన”శ్రీ రాహుల్ గాంధీ మరియు భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న ఇతరులు చేస్తున్న ‘బతుకమ్మ నృత్యం’ యొక్క వీడియో పైన చూడొచ్చు.

వాస్తవం ఏమిటంటే, కాంగ్రెస్ తన సంతాపాన్ని వ్యక్తం చేసింది మరియు ఎవరు బాధ్యత వహిస్తారనే దానిపై రాజకీయ దుమారం చేయడానికి నిరాకరించారు. రాహుల్ గాంధీ వీడియో ఇక్కడ చూడండి:

ఫైజర్ కోవిడ్-19 టీకాలు మంకీపాక్స్ వ్యాప్తికి కారణమైందని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఫైజర్ కోవిడ్-19 టీకాలు ఉపయోగించిన దేశాలు మాత్రమే మంకీపాక్స్ కేసులను నివేదించాయనేది వాదన .

నిర్ధారణ/Conclusion: తప్పు, నాన్-ఫైజర్ టీకాలు ఉపయోగించని దేశాలు కూడా మంకీపాక్స్‌ని నివేదించాయి.

రేటింగ్: తప్పు వ్యాఖ్యానం —

Fact Check వివరాలు:

ఫైజర్-బయోఎన్‌టెక్ యొక్క కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను తీసుకున్న దేశాలలో మాత్రమే తాజాగా మంకీపాక్స్ యొక్క వ్యాప్తి సంభవిస్తుందని ట్విట్టర్ మరియు వాట్సాప్‌లో అనేక పోస్ట్‌లు పేర్కొన్నాయి.

ఫైజర్ వ్యాక్సిన్ పంపిణీ చేయబడిన దేశాలలో మాత్రమే “‘మంకీపాక్స్’ సంభవిస్తుందని పోస్ట్‌లు పేర్కొన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, మరియు ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ను తీసుకోని దేశాల నుండి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మంకీపాక్స్ గురించి ఒక్క నివేదిక కూడా అందుకోలేదు.

ఈ దావా/వాదనను సమర్ధించుకోవడానికి ‘ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్’ తీసుకోని భారతదేశం, రష్యా మరియు వెనిజులా లేదా చైనాలలో ఎక్కడ కూడా మంకీపాక్స్ కేసులు నమోదు కాలేదని పేర్కొంది. ఇక్కడ ఆ సందేశాన్ని/మెసేజ్ చూడండి:

ది డైలీ ఎక్స్‌పోజ్ వెబ్‌సైట్‌లో జూన్ 24న ప్రచురించిన కథనం నుండి తీసిన మ్యాప్‌లతో ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

మంకీపాక్స్, మొట్టమొదట కోతిలో కనుగొనబడింది, ఇది ప్రాణాంతకమైన మశూచి వైరస్, కానీ 1980లో నిర్మూలించబడింది. అధిక జ్వరం, వాపు శోషరస గ్రంథులు మరియు చికెన్‌పాక్స్ లాంటి దద్దుర్లు మనుషుల్లో కనిపించే వ్యాధి లక్షణాలు.

మే 2022లో, ప్రయాణ ప్రాంతాలతో సంబంధం లేకుండా మరియు ఆఫ్రికా కాకుండా మిగతా దేశాలలో అనేక మంకీపాక్స్ కేసులు గుర్తించబడ్డాయి. అనేక దేశాలలో వ్యాప్తి చెందుతున్న కారణంగా జూలైలో WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) దీనిని ‘ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ఏమి చెబుతుంది?

WHO ప్రకారం, మంకీపాక్స్ కోవిడ్-19 వంటి తీవ్ర అంటువ్యాధి కాదు, కానీ “గాయాలు, శరీర ద్రవాలు, శ్వాసకోశ ద్రవాలు మరియు పరుపు వంటి వాటి ద్వారా ఒక వ్యక్తి నుండి మరొకరికి వ్యాపిస్తుంది.”

ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌ని ఉపయోగించని దేశాల నుండి మంకీపాక్స్ కేసుల నివేదికలను WHO అందుకోలేదనే వాదన కూడా తప్పు. ఫైజర్ వ్యాక్సిన్ వాడని భారతదేశం మరియు రష్యాలలో కూడా మంకీపాక్స్ వ్యాధి కేసులు నమోదయ్యాయి.

జూన్ 27, 2022న WHO కింది మ్యాప్ ప్రచురించింది. ప్రక్కన క్లెయిమ్‌లో ఉపయోగించిన మ్యాప్.

మే 16,2021 నాటికి ఫైజర్ వ్యాక్సిన్‌ల పంపిణీని చూపుతూ ఆగస్టు 2021లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ జర్నల్‌లో ఒక కథనం ప్రచురించబడినది(కింద అసలైన మ్యాప్ చూడవచ్చును). ఈ కథనం నుండి మ్యాప్ తీసుకొని, ఈ దేశాలలో ‘మంకీపాక్స్’ సంభవిస్తుందని వాదన పేర్కొంది.

అందువల్ల, ఫైజర్ టీకాలు ఉపయోగించిన దేశాలు మంకీపాక్స్‌ను నివేదించాయని మరియు ఫైజర్ టీకాలు ఉపయోగించని దేశాలు మంకీపాక్స్ కేసులను నివేదించలేదనే వాదన తప్పు.

మరి కొన్ని Fact checks:

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check

శానిటైజర్ వాడటం వలన చేతులు కాలి గాయలవుతాయ? Fact check

లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్ బ్లాక్ ఫ్రైడే రోజున చోరీకి గురైందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆఫ్రికన్ అమెరికన్లు LAలోని నైక్ షూ రిటైల్ దుకాణాన్ని దోచుకున్నారని వాదన.

నిర్ధారణ/Conclusion:ఈ సంఘటన వాస్తవమే అయినప్పటికీ, ఇది మూడేళ్ల క్రితం నాటి జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరిగిన సంఘటన. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్‌కు సంబంధించిన సంఘటనగా చిత్రీకరించబడింది.

రేటింగ్: దారి తప్పించే ప్రయత్నం —

Fact check వివరాలు:

బ్లాక్ ఫ్రైడే అనగా థాంక్స్ గివింగ్ డే షాపింగ్ సంబరాలు గుర్తుకొచ్చే రోజు. ఈ రోజు రిటైలర్‌ల నుండి అనేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు మరియు కూపన్‌లతో యునైటెడ్ స్టేట్స్ సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది.ఈ షాపింగ్ సంబరాల మధ్య, లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్‌ను ఆఫ్రికన్-అమెరికన్లు దోచుకున్నారని పేర్కొంటూ వీడియో వైరల్ అయ్యింది. అదే వీడియో సోషల్ మీడియాలో విభిన్నమైన శీర్షికలు/క్యాప్షన్స్ లేదా క్లెయిమ్‌లతో షేర్ చేయబడింది.వాటిని ఇక్కడ చూడవచ్చును:

ఇది ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

వాస్తవ పరిశిమలన కోసం Digiteye India ఈ అభ్యర్ధనను వాట్సప్ లో అందుకుంది.మేము కీలక ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సెర్చ్ చేసినప్పుడు, అది 31 మే 2020న ‘Buzz News YouTube’ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన పాత వీడియో అని గమనించాము. వీడియో క్యాప్షన్‌లో ‘NIKE స్టోర్ కొల్లగొట్టి పూర్తిగా లూటీ చేయబడింది’అని ఉంది.

ఈ సంఘటన వాస్తవమేనని స్థానిక వార్తాసంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి.NBC చికాగో మే 30, 2020న దీనిని ప్రచురించింది, మరియు 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా చికాగోలోని మిచిగాన్ అవెన్యూలో ఆగ్రహంతో ఉన్న గుంపు అనేక రిటైల్ దుకాణాలను ధ్వంసం చేసిన సంఘటన గురించి నివేదించింది.

మే 25, 2020న ఫ్లాయిడ్ నకిలీ $20 బిల్లు ఇచ్చాడని స్టోర్ క్లర్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిన్నియాపాలిస్‌లో శ్వేతజాతి పోలీసు అధికారి ఆఫ్రికన్-అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ ని చంపాడని అని వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన #BlacklivesMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.

మరి కొన్ని fact checks:

వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check