Tag Archives: students

విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తుందా? గతంలోని వాదన మళ్లీ షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తోందనేది వాదన.

నిర్ధారణ/CONCLUSION: వాదన/దావా పూర్తిగా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమ ఏ ప్రాజెక్టుల కింద అలాంటి పథకాన్ని ఏది కూడా ప్రారంభించలేదు.

రేటింగ్:పూర్తిగా తప్పు

Fact Check వివరాలు:

ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తోందన్న సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఉచిత పథకాన్ని ప్రారంభించిందని వైరల్ సందేశం పేర్కొంది.

వైరల్ సందేశం ఈ విధంగా ఉంది:

“విద్యార్థుల ల్యాప్‌టాప్ పథకం 2024′ కోసం దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి

ఆర్థిక కారణాల వల్ల సొంతంగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే పరిస్థితిలో లేనివారు మరియు వారి విద్యా స్థాయిలో ల్యాప్‌టాప్ అవసరమయ్యే విద్యార్థులందరికీ ఈ పథకం అమలు చేయబడుతుంది

2024లో 960,000 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉచిత ల్యాప్‌టాప్ ఇవ్వబడుతుంది

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మరియు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ల్యాప్‌టాప్‌లను అందుకోవడం జరుగుతోంది

ఇక్కడ నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.”

మెసేజ్/సందేశానికి లింక్ కూడా జత చేయబడింది.ఈ వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది.వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వాదనని యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye Indiaకి అభ్యర్థన వచ్చింది.

FACT CHECK/వాస్తవ పరిశీలన

Digiteye India బృందం అటువంటి పథకం ఏదైనా ప్రారంభించబడిందా అని అనేక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను పరిశీలించగా, ప్రభుత్వం నుండి అటువంటి సమాచారం ఏది కూడా పోస్ట్ చేయబడలేదు.

Digiteye India బృందం సందేశం లో జత పరిచిన వెబ్‌సైట్ లింక్‌ను పరిశీలించగా, లింక్ వినియోగదారుని “https://lii.ke/STUDENTS-FREE-LAPT0PS” కి మళ్లిస్తుంది, మరియు కుదించబడిన లింక్ ఇవ్వబడింది.

స్కామర్‌లు తమ ఫిషింగ్ స్కామ్‌లను కొనసాగించడానికి తరచుగా కుదించబడిన లింక్లను ఇస్తారు. లింకుని గమనిస్తే, లింక్‌లోని ‘ల్యాప్‌టాప్’ అనే పదం ‘lapt0ps’ అని వ్రాయబడింది, ఇక్కడ Oకి బదులుగా 0 (సున్నా) ఉపయోగించబడింది.

ఈ స్కామ్‌పై మరిన్ని ఆధారాల కోసం మేము సోషల్ మీడియా మరియు ఇతర వార్తా సంస్థలను పరిశీలించగా, ఆగస్ట్ 31, 2023న PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ బృందం వారు చేసిన ట్వీట్‌ మా దృష్టికి వచ్చింది. వారు తమ ట్వీట్‌లో ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్‌టాప్ పథకాలను ప్రారంభించలేదని పేర్కొన్నారు.

“ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2023 కింద భారత ప్రభుత్వం యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందనే ఆరోపణ సోషల్ మీడియాలో ఒక నోటీసు ద్వారా ప్రచారం జరుగుతోందని, వారు పేర్కొన్నారు.అది #ఫేక్ నోటీసు . @EduMinOfIndia,GOI ద్వారా అలాంటి పథకం ఏదీ అమలు చేయబడటం లేదు.”

కింద ఇచ్చిన విధంగా,మార్చి 16, 2023న ఇదే విధమైన దావాను PIB ఫాక్ట్ చెక్ కొట్టిపారేసింది.
ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2023 కింద భారత ప్రభుత్వం యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందనే ఆరోపణ సోషల్ మీడియాలో ఒక నోటీసు ద్వారా ప్రచారం జరుగుతోంది,కానీ అది #ఫేక్ నోటీసు . @EduMinOfIndia,GOI ద్వారా అలాంటి పథకం ఏదీ అమలు చేయబడటం లేదని”,వారు తమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘Digiteye India’ బృందం వారు వాట్సాప్ ఫార్వార్డ్‌లలో అందుకున్న ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయవద్దని దాని పాఠకులను హెచ్చరిస్తుంది. ఇటువంటి లింక్‌లు ఫిషింగ్ మరియు వినియోగదారుడి ఫోన్ నంబర్, IP చిరునామా ద్వారా వారి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించవచ్చు.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేయటంలేదు; Fact Check