Tag Archives: nepal hindus

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తున్నారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పు సందేశం.జూలై 2023లో ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ‘భగవత్ కథ’ కోసం 3 కిలోమీటర్ల పొడవైన కలశ యాత్రలో వేలాది మంది మహిళలు పాల్గొన్న ఒక పాత వీడియోను, జనవరి 2024లో అయోధ్యలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’కోసం తరలి వస్తున్న నేపాల్ భక్తుల యాత్రగా షేర్ చేయబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

జనవరి 22, 2024న అయోధ్యలోని రామమందిరంలో జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం సమీపిస్తున్న తరుణంలో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అనేక తప్పుడు వీడియోలు షేర్ చేయ బడుతున్నాయి.ఈ కార్యక్రమానికి నేపాల్ నుండి భారతదేశానికి ‘జై శ్రీ రామ్’ అని నినాదాలు చేస్తు వస్తున్న భక్తుల ఊరేగింపని ఒక వాదనతో షేర్ చేయ బడుతున్న  వీడియో చూడవచ్చు.

వీడియో చూడండి:

జనవరి 22, 2024న ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మరియు రెండు లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యలో జరిగే వేడుకను చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ఈ వైరల్ సందేశం దేశంలోని చాలా మంది వీక్షకుల దృష్టిని ఆకర్షించింది.

పోస్ట్ యొక్క శీర్షిక ఇలా ఉంది:”భగవాన్ రామ్ మరియు సీతమ్మ తల్లి వివాహ కానుక వేడుకను నేపాల్‌లోని సీత పుట్టింటి నుండి అయోధ్యలోని భగవాన్ రామ మందిరం వరకు పెద్ద ఊరేగింపుగా నిర్వహిస్తారు”.

అదే వీడియోతో కూడిన మరొక సందేశం వేరొక శీర్షికతో ఇలా ఉంది:
బ్రాహ్మణులు కారు, ‘క్షత్రియులు కారు ‘వైశ్యులు’ కారు ‘శూద్రులు’కారు, కేవలం ఒక మహాసముద్రం లాగా హిందువులంతా నేపాల్ నుండి అయోధ్యకు #రామమందిరప్రాణప్రతిష్ట కోసం చేరుకుంటున్నారు”.

వీడియో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.


FACT CHECK

అదే వీడియో చాలా సందర్భాలలో షేర్ చేయడంతో Digiteye India టీమ్ దాన్ని వాస్తావ పరిశీలన కోసం స్వీకరించింది.మేము వీడియోను కీలక ఫ్రేమ్‌లుగా విభజించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ ఉపయోగించి పరిశీలించగా,9 జూలై 2023న ట్విట్టర్లో పోస్ట్ చేసిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రి భక్తుల ఊరేగింపుకు సంబంధించిన వీడియో అని తెలుకున్నాము.

“నోయిడాలోని బాగేశ్వర్ ధామ్ సర్కార్ కలాష్ యాత్ర” అని పిలువ బడే ఇది, విస్తృతంగా షేర్ చేయబడింది.గూగుల్‌లో మరిన్ని వివరాల కోసం చూడగా, అది “జైత్‌పూర్ గ్రేటర్ నోయిడా శోభా యాత్ర మరియు కలాష్ యాత్ర” అని తెలుసుకున్నాము. వీడియోను ఇక్కడ చూడండి:

సంఘటన ఇక్కడ మరియు ఇక్కడ నివేదించబడింది.

గ్రేటర్ నోయిడాలో దివ్య దర్బార్ వేడుకలకు ముందు పెద్ద కలశ యాత్ర నిర్వహించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.మూడు కిలోమీటర్ల మేర జరిగిన ఈ కలశ యాత్రలో వేలాది మంది ప్రజలు ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు. ధీరేంద్ర కృష్ణ శాస్త్రిచే నిర్వహించబడిన’భగవత్ కథ’ జూలై 10 మరియు జూలై 16 మధ్య జరిగింది.

కావున, జనవరి 22, 2024న జరగబోయే రామమందిర ప్రాణ ప్రతిష్ట   ఘటన కోసం నేపాల్ భక్తులు బహుమతులు తీసుకువస్తున్నట్లుగా 2023 జూలై నాటి ఒక పాత తప్పుడు వీడియో షేర్ చేయబడింది.

 

మరి కొన్ని Fact Checks:

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా 25,000 హోమ గుండాలను ఏర్పాటు చేశారా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన