Tag Archives: derogatory remarks

మాల్దీవుల అధ్యక్షుడు భారత ప్రధాని మోడీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారా?; వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత ప్రధాని మోదీపై తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలకు మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ భారతీయులకు క్షమాపణలు చెప్పారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ తన ముగ్గురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై భారతీయులకు క్షమాపణలు చెబుతూ ఎలాంటి ట్వీట్ చేయలేదు.

రేటింగ్ :తప్పుగా చూపించే ప్రయత్నం –

వాస్తవ పరిశీలన యొక్క వివరాలు:

మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రులు,పర్యాటకం కోసం లక్షద్వీప్ దీవులను ప్రోత్సహిస్తున్న మోడీపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్నసందేశం/మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపధ్యంలో,మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ,ఆయన ముగ్గురు మంత్రులు మోదీపై అలాంటి అవమానకర వ్యాఖ్యలను చేసినందుకు భారతీయులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారంటూ X ప్లాట్ఫారం లో (గతంలో ట్విట్టర్) సందేశం వైరల్ అవుతోంది.

తొలగించబడిన సందేశం యొక్క స్క్రీన్ షాట్ కింద చూడవచ్చు:

ప్రెసిడెంట్ ముయిజ్జూ అధికారిక ‘X’ ఖాతాలో ట్వీట్ ఇలా పేర్కొంది:
“ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బాధ్యతారహితంగా చేసిన వ్యాఖ్యలకు మా మంత్రుల తరపున, నేను భారతీయ మిత్రులకు చేతులు జోడించి క్షమాపణలు చెబుతున్నాను.భారతదేశం నుండి స్నేహితులకు స్వాగతం పలికేందుకు మరియు మన దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతంచేయడాన్ని ఆకాంషిస్తున్నాను.”

ఈ ట్వీట్ జనవరి 7న పోస్ట్ చేయబడింది. చాలా మంది వినియోగదారులు ఇక్కడ మరియు ఇక్కడ అనేక వ్యాఖ్యలతో దీనిని రీట్వీట్ చేశారు.
అయితే, మోదీని “ఉగ్రవాది” మరియు “ఇజ్రాయెల్ తోలుబొమ్మ” అంటూ కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకుగాను ముగ్గురు మాల్దీవుల మంత్రులను సస్పెండ్ చేశారు.

FACT CHECK

Digiteye India టీమ్‌కు వాస్తవాన్ని పరిశీలన చేయమని అభ్యర్థన వచ్చినప్పుడు,వారు మొదట మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ అధికారిక ‘X’ ఖాతాను సందర్శించి, ట్వీట్ కోసం వెతకగా అది ఎక్కడ కూడా మా దృష్టికి రాలేదు.వాస్తవానికి, అతను తన చివరి సందేశాన్ని జనవరి 5, 2024న తన అధికారిక ‘X’ ఖాతాలో పోస్ట్ చేసారు.

సోషల్ మీడియా మానిటరింగ్ టూల్ ‘Social Blade’ ద్వారా, జనవరి 5, 2024 తర్వాత ప్రెసిడెంట్ ముయిజ్జూ వైపు నుండి ఎటువంటి సందేశం తొలగించబడలేదని మేము తెలుసుకున్నాము,కాబట్టి మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ‘తొలగించబడిన ట్వీట్‘ అనే అవకాశమే లేదు.మరియు క్షమాపణకు సంబంధించిన వార్తల కోసం పరిశీలించగా, ఇప్పటివరకు విశ్వసనీయ వర్గాలనుండి ఎలాంటి సమాచారం కనపడలేదు.

అందువల్ల, ప్రెసిడెంట్ ముయిజ్జూ ‘X’లో (గతంలో ట్విట్టర్‌)వ్యక్తిగతంగా క్షమాపణలు కోరుతూ చేసిన ట్వీట్ మార్ఫింగ్ చేయబడింది లేదా డిజిటల్‌గా మార్చబడింది.అయితే, ప్రధాని మోదీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులు సస్పెండ్ అయిన మాట మాత్రం వాస్తవం.

మరి కొన్ని Fact checks:

లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్ బ్లాక్ ఫ్రైడే రోజున చోరీకి గురైందా? వాస్తవ పరిశీలన

ఇజ్రాయెల్-హమాస్ దాడుల నేపథ్యంలో, ఇజ్రాయెల్ నిరసనకారులపై కారు దూసుకెళ్లిందనే వాదన; వాస్తవ పరిశీలన