ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా AP, తెలంగాణలలో పాఠశాలలు మూసివేయబడ్డాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి.

నిర్ధారణ/Conclusion: ప్రస్తుత కోవిడ్-19 కేసులకు సంబంధించి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించలేదు. మార్చి 2020లోని పాత వీడియో ఇప్పుడు షేర్ చేయబడుతోంది.

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్త–

Fact Check వివరాలు:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో JN.1 వేరియంట్‌కి సంబంధించిన కొత్త కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది.

ఇదే విషయాన్ని తెలియజేసే ‘టీవీ9 వార్తా కథనం’ కూడా సందేశంలో జత చేసి ఉంది. వార్తా కథనంలో స్పష్టంగా కనబడుతుంది: “తెలంగాణ సెలవులు 28/12/23 నుండి 18/01/24 వరకు.” ఈ వీడియో వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India వాట్సాప్‌లో అభ్యర్థన అందుకుంది.

 

FACT CHECK

వాదన/క్లెయిమ్ లోని వాస్తవాన్ని పరిశీలించగా, ఇది అప్పటికే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయబడిందని గమనించాము.షేర్ చేయబడుతున్న వీడియో తాజా వీడియోగా కనిపించేలా వీడియోపై కొన్ని తేదీలు సూపర్మోస్(superimposed) చేయబడ్డాయి. కానీ డిసెంబర్ 2023 నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో JN.1 కరోనా వేరియంట్ కేసులు నమోదైన తర్వాత TV9 వార్తా ఛానల్ మాత్రం ఇటీవలి కాలంలో ఇలాంటి వార్తలను ప్రసారం చేయలేదు.

TV9 న్యూస్ ఆర్కైవ్‌లను మరింత పరిశీలించగా,ఇది భారతదేశంలో కరోనా వ్యాప్తి చెందడం మరియు మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించబడిన సమయంలో అనగా 2020 మార్చి 18న ప్రచురించబడిన వార్తా నివేదిక.

తెలుగు వార్తాకథనం ఇలా పేర్కొంది: ““ఏపీ కీలక నిర్ణయం.. విద్యాసంస్థలు బంద్”

JN.1 వేరియంట్ కరోనావైరస్ లేదా కోవిడ్-19 కారణంగా ఇటీవలి రోజుల్లో AP మరియు తెలంగాణలో పాఠశాలలు మూసివేయబడుతున్నాయా అని ఇతర వార్తా నివేదికలను పరిశీలించినప్పుడు, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటి ప్రకటన ఏది కూడా చేయలేదని తెలుసుకున్నాము.ఈ వార్త ఏ టీవీ న్యూస్ ఛానెల్ లేదా TV9 తెలుగు లేదా స్థానిక వార్తాపత్రిక  కూడా నివేదింలేదు.

ప్రస్తుతం, దేశంలో కోవిడ్ -19 కేసుల పెరుగుదల చాలా తక్కువగా ఉంది మరియు అటువంటి కేసులపై అప్రమత్తంగా ఉండాలని,కేసుల సంఖ్య పెరిగితే ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని కేంద్రం , రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీ చేసింది.దీని ప్రకారం, కోవిడ్ -19 కేసుల పెరుగుదల దృష్ట్యా ఆసుపత్రులను అప్రమత్తం చేస్తూ AP మరియు తెలంగాణ ప్రభుత్వాలు అనేక సూచనలను జారీ చేశాయి.

అందువలన, కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయన్న వాదన తప్పు, మరియు ఈ వాదన/దావాకు మద్దతుగా  2020 పాతలోని వీడియో షేర్ చేయబడుతోంది.

 

మరి కొన్ని Fact Checks:

కరోనా వైరసును ఎలా గుర్తించాలో AIIMS ఒక ప్రకటనను విడుదల చేసిందా? వాస్తవ పరిశీలన

ఫైజర్ కోవిడ్-19 టీకాలు మంకీపాక్స్ వ్యాప్తికి కారణమైందని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check

 

2 thoughts on “ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా AP, తెలంగాణలలో పాఠశాలలు మూసివేయబడ్డాయా? వాస్తవ పరిశీలన

  1. Pingback: 2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎం కాకముందు యూపీలో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయా? వాస్తవ పరిశీలన

  2. Pingback: 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *