వాదన/Claim: ఆఫ్రికన్ అమెరికన్లు LAలోని నైక్ షూ రిటైల్ దుకాణాన్ని దోచుకున్నారని వాదన.
నిర్ధారణ/Conclusion:ఈ సంఘటన వాస్తవమే అయినప్పటికీ, ఇది మూడేళ్ల క్రితం నాటి జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరిగిన సంఘటన. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్‌కు సంబంధించిన సంఘటనగా చిత్రీకరించబడింది.
రేటింగ్: దారి తప్పించే ప్రయత్నం —
Fact check వివరాలు:
బ్లాక్ ఫ్రైడే అనగా థాంక్స్ గివింగ్ డే షాపింగ్ సంబరాలు గుర్తుకొచ్చే రోజు. ఈ రోజు రిటైలర్‌ల నుండి అనేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు మరియు కూపన్‌లతో యునైటెడ్ స్టేట్స్ సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది.ఈ షాపింగ్ సంబరాల మధ్య, లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్‌ను ఆఫ్రికన్-అమెరికన్లు దోచుకున్నారని పేర్కొంటూ వీడియో వైరల్ అయ్యింది. అదే వీడియో సోషల్ మీడియాలో విభిన్నమైన శీర్షికలు/క్యాప్షన్స్ లేదా క్లెయిమ్‌లతో షేర్ చేయబడింది.వాటిని ఇక్కడ చూడవచ్చును:
Best Black Friday ever!
Most of the offer was at 100% “off” and only for blacks!
Way to go Nike! pic.twitter.com/gcpxbeMssE— Csaba 🇭🇺 (@cybakk) December 1, 2023
BREAKING: Nike had a “Black” Friday sale that will make you want to run. Everything’s free if you’re the right person.
Will this behavior ever end?
How should it be stopped?
— ᴊᴀᴄᴋ ᴅᴀɴɢᴇʀ (@AmericazOutlaw) November 27, 2023
ఇది ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.
FACT CHECK
వాస్తవ పరిశిమలన కోసం Digiteye India ఈ అభ్యర్ధనను వాట్సప్ లో అందుకుంది.మేము కీలక ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సెర్చ్ చేసినప్పుడు, అది 31 మే 2020న ‘Buzz News YouTube’ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన పాత వీడియో అని గమనించాము. వీడియో క్యాప్షన్‌లో ‘NIKE స్టోర్ కొల్లగొట్టి పూర్తిగా లూటీ చేయబడింది’అని ఉంది.
ఈ సంఘటన వాస్తవమేనని స్థానిక వార్తాసంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి.NBC చికాగో మే 30, 2020న దీనిని ప్రచురించింది, మరియు 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా చికాగోలోని మిచిగాన్ అవెన్యూలో ఆగ్రహంతో ఉన్న గుంపు అనేక రిటైల్ దుకాణాలను ధ్వంసం చేసిన సంఘటన గురించి నివేదించింది.
మే 25, 2020న ఫ్లాయిడ్ నకిలీ $20 బిల్లు ఇచ్చాడని స్టోర్ క్లర్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిన్నియాపాలిస్‌లో శ్వేతజాతి పోలీసు అధికారి ఆఫ్రికన్-అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ ని చంపాడని అని వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన #BlacklivesMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.
మరి కొన్ని fact checks:
క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check