వాదన/Claim: నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఇటీవల హిందూ దేవుడు ధన్వంతరిని కలిగి ఉన్న లోగోతో తన అధికారిక లోగోను మార్చిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: నిజం. గత సంవత్సరం రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రంతో మరియు ‘ఇండియా’ పదం స్థానంలో ‘భారత్’ పదంతో లోగో మార్చబడింది.
రేటింగ్: నిజం/వాస్తవం–
Fact check వివరాలు
నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) ఇటీవల హిందూ దేవుడు ధన్వంతరిని కలిగి ఉన్న లోగోతో తన అధికారిక లోగోను మార్చిందని పేర్కొంటూ ఒక దావా/వాదన వైరల్ అవుతోంది. లోగో మధ్యలో ఉన్నది ధన్వంతరి దేవుడని స్పష్టంగా కనబడుతుంది మరియు ప్రభుత్వ చిహ్నాలపై మతపరమైన చిహ్నాలు ఉపయోగించబడుతున్నాయని వాదన పేర్కొంది.
లోగోలోని ‘ఇండియా’ పదాన్ని కూడా ‘భారత్’గా మార్చింది.
#UpholdSecularism pic.twitter.com/kw4L9urpgP
— esSENSE GLOBAL (@esSENSEGlobal) November 30, 2023
ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడుతోంది.
FACT CHECK
Digiteye India బృందం NMC యొక్క అధికారిక లోగో కోసం వారి వెబ్సైట్ని పరిశీలించగా, చివరిగా డిసెంబర్ 2022లో మార్చబడిందని మరియు లోగో నలుపు రంగు(సిల్హౌట్) నుండి రంగులోకి(Black to colour)మారినట్లు గమనించారు. చిత్రంలో చూపిన విధంగా దన్వంతరిని కలిగి ఉంది మరియు మార్పు 2022లోనే ఆమోదించబడిందని NMC డిసెంబర్ 6, 2023న తెలిపారు.
‘ధన్వంతరి’ ఆయుర్వేదం మరియు ఔషధం యొక్క దేవుడిగా పరిగణించబడుతున్నందున, NMC అధికారులు వైద్య సంస్థ కోసం ధన్వంతరి చిత్రంని లోగోలో చేర్చడం తగినదే అని తెలిపారు.
వైద్యులకు సంబంధించిన లోగో గ్రీకు పురాణాలలోని కాడ్యూసియస్ ఉన్నప్పుడ్డు (రెండు సర్పాలు చుట్టుముట్టబడిన కర్ర లాంటి లోగో), మనం మన సొంత పురాణాల నుండి చిహ్నాలను ఎందుకు ఉపయోగించకూడదు?” అని NMC అధికారులు ప్రశ్నించారు?
కొత్త లోగో మరియు పాత లోగోలను ఇక్కడ చూడండి:
జాతీయ వైద్య కమిషన్ (NMC) లోగో మధ్యలో వైద్య భగవానుడు(దేవుడు) ధన్వంతరి యొక్క రంగురంగుల చిత్రం 2022లోనే నిర్ణయించబడిందని IMA అధికారులు తెలిపారని వార్తా నివేదికలు పేర్కొన్నాయి. ధన్వంతరి చిత్రం ఎప్పుడూ లోగోలో భాగమేనని, డార్క్ సిల్హౌట్గా(dark silhouette)ఉండేది, కానీ ఇప్పుడు కొత్త లోగో రంగులతో ఉండి, మరియు’ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’తో భర్తీ చేయబడిందని NMC పేర్కొంది.
కావున,NMC లోగోలో రంగులతో ఉన్న ధన్వంతరి చిత్రం ఉపయోగించారనే వాదన నిజం.
మరి కొన్ని Fact Checks:
ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన
ఫైజర్ కోవిడ్-19 టీకాలు మంకీపాక్స్ వ్యాప్తికి కారణమైందని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన
Pingback: తమిళనాడులోని బీహెచ్ఈఎల్ (తిరుచ్చి యూనిట్) రామమందిరం కోసం ఈ భారీ గంటలను తయారు చేసిందా? వాస్తవ పర