ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check

ప్లాస్టిక్‌ నుంచి గోధుమలు తయారవుతున్నట్లు ఒక వైరల్‌ వీడియో చూపుతోంది.
1: 15 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో కార్మికులు ‘ఉపయోగించిన ప్లాస్టిక్‌ను’ఫ్యాక్టరీలో డంప్ చేయడం,అక్కడ నుండి ప్లాస్టిక్‌ను చిన్న ముక్కలుగా విభజించి, అనేకసార్లు కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై గోధుమ గింజల వలె కనిపించేలా తయారు చేయడం కనిపిస్తుంది.ఈ వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ వైరల్ వీడియో యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India టీమ్‌ వారికీ వాట్సాప్‌లో రిక్వెస్ట్ వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందం వారు వీడియో అంతటా మధ్య దిగువన ‘స్మార్టెస్ట్ వర్కర్స్’ అనే వాటర్‌మార్క్‌ను గుర్తించారు. మేము ఈ క్లూని తీసుకొని,Googleలో కీవర్డ్ searchలో ఉపయోగించగా,’స్మార్టెస్ట్ వర్కర్స్’ యొక్క YouTube పేజీకి దారితీశాయి, అక్కడ మేము ఈ వైరల్ వీడియోను కనుగొన్నాము.

వైరల్ వీడియో సెప్టెంబరు 24, 2023న ప్రచురించబడింది మరియు దాని శీర్షిక – ప్లాస్టిక్ యొక్క కొత్త ప్రయోజనం: రీసైక్లింగ్ జర్నీని ఆవిష్కరించడం.

స్మార్టెస్ట్ వర్కర్స్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్ వెంచర్ యొక్క తుది ఉత్పత్తి వాస్తవానికి ఏమిటో గుర్తించడానికి మేము ఈ ఆధారాలు ఉపయోగించాము. ఇదే విధమైన ప్రక్రియను అనుసరించే వీడియోలలో ఒకదానిలో, వీడియో తుది ఉత్పత్తి ప్లాస్టిక్ LLDPE అని పేర్కొంది, అంటే, ‘లీనియర్ తక్కువ-సాంద్రత’ కలిగిన పాలిథిలిన్.ఈ ఉత్పత్తులు ప్రాథమికంగా ప్లాస్టిక్-గుళికలు(plastic-pellets), వీటిని ప్లాస్టిక్ సీసాలు, ఆటోమొబైల్స్, నిత్యావసర వినియోగ వస్తువులు మొదలైన వాటి తయారీ వంటి బహుళ పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే ప్లాస్టిక్ గుళికలను(plastic pellets) తయారు చేయడానికి అదే ప్రక్రియను/పద్దతిని ఉపయోగించే మరొక వీడియోను మేము గుర్తించాము.

Digiteye India బృందం వారు ఉజ్జయినిలో ఉన్న వ్యాపారి నిరుపమ్ అగర్వాల్‌తో మాట్లాడినప్పుడు, ఆయన ఈ వైరల్ వీడియోలోని ఈ గుళికలు(pellets) బియ్యం లేదా గోధుమ గింజలు కాదని నిర్ధారించారు.ఈ గుళికలు (pellets)రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసినవని మరియు వాటిని పరిశ్రమల్లో వాడతాం, మనుషుల వినియోగానికి కాదని’ అగర్వాల్ అన్నారు.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

వాదన/CLAIM: ప్లాస్టిక్‌తో గోధుమ గింజలను తయారు చేస్తున్న ఒక ఫ్యాక్టరీ వైరల్ వీడియో కనిపిస్తుంది.

నిర్ధారణ/CONCLUSION: వైరల్ వీడియో ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే ఫ్యాక్టరీని చూపిస్తుంది.ప్లాస్టిక్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి, కడిగి, ప్లాస్టిక్ దారాలుగా చేసి, ఆపై చిన్న గుళికలగా(pellets)ఏర్పరుస్తుంది.ఈ గుళికలను(pellets) పరిశ్రమలలో ఉపయోగిస్తారు మరియు అవి మనుషుల వినియోగానికి ఉద్దేశించినవి కావు. అవి ఏ రకమైన ఆహార ధాన్యాలు కావు.

RATING: – Totally False–?????

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]