Tag Archives: uttar pradesh

Deposit Refund System

అయోధ్యలో ఖాళీ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ను తిరిగి ఇస్తే ₹5 మనకు అందుతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అయోధ్యలో ఖాళీ వాటర్ బాటిల్‌ను తిరిగి ఇస్తే మీకు ₹5 లభిస్తుందనేది వాదన

నిర్ధారణ/Conclusion:డిపాజిట్ రీఫండ్ స్కీమ్ యొక్క QR కోడ్ స్టిక్కర్‌ ఉన్న ఖాళీ బాటిల్‌ను మాత్రమే అయోధ్యలో తిరిగి ఇస్తే ₹5 తిరిగి లభిస్తుంది.
ఏదైనా ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇస్తే ఇచ్చే చెల్లింపు పథకం కాదు

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా — 

Fact Check వివరాలు

జనవరి 22, 2024న రామాలయాన్ని ప్రారంభించిన తర్వాత అయోధ్య ఇటీవల వార్తల్లోకి వచ్చిన నేపధ్యంలో, క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌తో కూడిన ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్ చిత్రం మరియు బాటిల్ తిరిగి ఇచ్చినచో ప్రజలు ₹5 వాపసు పొందవచ్చుననే’ వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

క్లెయిమ్/వాదనలో వాస్తవం పరిశీలించడానికి Digiteye India Team ఈ అభ్యర్థనను అందుకుంది. మొదట బాటిల్ పై ఉన్న స్టిక్కర్‌ యొక్క సమాచారం కోసం చూడగా, ఇది ‘ది కబాడీవాలా‘ పేరుతో లోగోను కలిగి ఉంది. దీని వెబ్‌సైట్ ఈ పథకానికి సంబంధించిన వివరాలను క్రింది విధంగా లభ్యపరిచారు.

ముఖ్యంగా, ఇది ఖాళీ బాటిల్‌ను అయోధ్య నగరంలో ఎక్కడా పడేయకుండా, తిరిగి ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించడానికి సంస్థ ప్రారంభించిన ‘డిపాజిట్ రీఫండ్ సిస్టమ్’ .
అయితే, నిబంధన ఏమిటంటే, బాటిల్‌ను కొనుగోలు చేసేటప్పుడు ₹5 ముందుగానే వసూలు చేయబడుతుంది మరియు ఖాళీ బాటిల్‌ను  ఇచ్చిన తర్వాత తిరిగి ₹5 ఇవ్వబడుతుంది.

ఉదాహరణకి మినరల్ వాటర్ బాటిల్ ధర ₹10 అయితే, మీరు ₹15 చెల్లిస్తారు మరియు ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇచ్చిన తర్వాత, మీ డిపాజిట్ ₹5 తిరిగి ఇవ్వబడుతుంది. మేము QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, అయోధ్యలోని కలెక్షన్ పాయింట్‌ల జాబితా చూపబడింది. ‘ది కబాడీవాలా’ వెబ్ పేజీ కూడా ‘డిపాజిట్ రీఫండ్ స్కీమ్’ అని స్పష్టం చేసింది. కాబట్టి, ఇది ప్రతి ఖాళీ బాటిల్‌కు(కోడ్ స్టిక్కర్‌ లేని బాటిల్ కూడా) తిరిగి ఇచ్చినప్పుడు ₹5 పొందే ఏకపక్ష పథకం కాదు.

రానున్న భవిష్యత్తులో వేలాది మంది భక్తులు అయోధ్య నగరాన్ని సందర్శిస్తారని భావిస్తున్నందున పరిశుభ్రంగా ఉంచడానికి భోపాల్‌కు చెందిన స్టార్టప్ ‘ది కబాడీవాలా’, మరియు అయోధ్య నగర్ నిగమ్ మధ్య పరస్పర సహకారంతో ఈ పథకం జరిగిందని ఇతర వివరాలు ద్వారా తెలుస్తుంది.

ఇంకా, ‘ది కబాడీవాలా’ వెబ్‌సైట్ ఈ వీడియోలో ఈ పధకం గురించి స్పష్టంగా వివరిస్తుంది:

అందువలన, అయోధ్యలో క్లీన్‌నెస్ డ్రైవ్‌లో భాగంగా, ఈ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే వ్యక్తులు డిపాజిట్‌గా ₹5 అదనంగా చెల్లించి, ఖాళీ బాటిల్‌ను ఇచ్చి డిపాజిట్ ని తిరిగి పొందవచ్చు.

మరి కొన్ని Fact Checks:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

 

2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: బ్రిటీష్ కాలం నుండి 2017 వరకు యుపిలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ హయాంలో 24 ఉన్నాయనేది వాదన.

నిర్ధారణ/Conclusion: విమానయాన మంత్రి ప్రకటన ప్రకారం, 2017కి ముందు, ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు ప్రస్తుతం 10 విమానాశ్రయాలు వినియోగంలో ఉండగా మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి.

రేటింగ్:తప్పు దారి పట్టించే వార్త —

వాస్తవ పరిశీలన వివరాలు

2017లో యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ వీడియో ఒకటి షేర్ చేయబడింది.ప్రస్తుత యుపి ప్రభుత్వ హయాంలో 24 విమానాశ్రయాలను ప్రకటించారని, వాటిలో 10 పని చేస్తున్నాయని, మరొక 14 నిర్మాణంలో ఉన్నాయని పేర్కొంది.

ట్విట్టర్‌లో వీడియో ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

బ్రిటీష్ పాలన నుండి 2017 మార్చిలో అఖిలేష్ యాదవ్ పాలన ముగిసేనాటికి ఉత్తరప్రదేశ్‌లో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే పనిచేస్తున్నాయని వీడియో క్లిప్ లోని వార్త పేర్కొంది.నేడు యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, 24 విమానాశ్రయాలు ఉన్నాయి, వాటిలో 10 పనిచేస్తున్నాయి,మరొక 14 నిర్మాణంలో ఉన్నాయి.బ్రిటీష్‌వారు మరియు 2017కి ముందు వరకు ఉన్న అన్ని ప్రభుత్వాలు కేవలం రెండు విమానాశ్రయాలను మాత్రమే నిర్మించగలిగారు.

వాస్తవ పరిశీలన

Digiteye India teamవారు వాస్తవాన్ని పరిశీలించడం కోసం ఉత్తరప్రదేశ్‌లోని విమానాశ్రయాలను గురించి Googleలో సెర్చ్ నిర్వహించగా,జనవరి 11, 2024న విమానయాన మంత్రి జ్యోతిరాదియా సింధియా UP విమానాశ్రయాలపై పోస్ట్ చేసిన తాజా PIB పత్రికా ప్రకటనకు దారితీసింది.ఇక్కడ 2014లో ఉత్తరప్రదేశ్‌లో 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయని,ప్రస్తుతం అయోధ్యలో కొత్తగా ప్రారంభించిన విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఉన్నాయని మంత్రి చెప్పారని పేర్కొన్నారు.

ఈ వార్త ANI యొక్క వీడియో వార్తలలో కూడా ప్రసారం చేయబడింది.“2014లో ఉత్తరప్రదేశ్‌లో కేవలం 6 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయి, ఇప్పుడు రాష్ట్రంలో అయోధ్య విమానాశ్రయంతో సహా 10 విమానాశ్రయాలు ఉన్నాయని” మంత్రి ప్రకటించడం వీడియోలో మనం చూడవచ్చు.వచ్చే ఏడాది నాటికి యూపీలో మరో ఐదు విమానాశ్రయాలు రానున్నాయి. అజంగఢ్, అలీగఢ్, మొరాదాబాద్, శ్రావస్తి, చిత్రకూట్‌లలో ఒకొక్క విమానాశ్రయాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నారు.ఈ ఏడాది చివరి నాటికి జెవార్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉండే విమానాశ్రయం కూడా సిద్ధం అవుతుంది.

కావున,యోగి ఆదిత్యనాథ్ కంటే ముందు యూపీలో కేవలం రెండు విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయన్న వాదన తప్పు. లక్నో మరియు వారణాసి విమానాశ్రయాలు నిరంతరం వినియోగంలో ఉండగా, 2014 నాటికి మాత్రం UPలో ఆరు విమానాశ్రయాలు రికార్డులో ఉన్నాయి మరియు బ్రిటిష్ పాలన నుండి రాష్ట్రంలో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయనే వాదన కూడా తప్పు.

మరి కొన్ని Fact Checks:

ప్రస్తుతం పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల కారణంగా AP, తెలంగాణలలో పాఠశాలలు మూసివేయబడ్డాయా? వాస్తవ పరిశీలన

విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తుందా? గతంలోని వాదన మళ్లీ షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన