వాదన/CLAIM: మార్కెట్‌లో విక్రయించబడుతున్న’గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం యొక్క వాదన.
నిర్ధారణ/CONCLUSION: పసుపు మరింత గాఢమైన పసుపురంగులో కనిపించడానికి పసుపులో లెడ్ క్రోమేట్ అనే పదార్థం ఉపయోగించబడుతుంది. పసుపులో లెడ్ క్రోమేట్ ఉండకూడదని FSSAI పేర్కొంది, అదనంగా,పసుపులో కల్తీని పరీక్షించడానికి ప్రజలు తమ ఇళ్లలోనే సాధారణ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. పసుపును మార్కెట్‌లో ‘సర్టిఫైడ్ మరియు నాణ్యమైన’ విక్రేయదారుడి నుండి కొనుగోలు చేయాలని సూచించబడింది.
రేటింగ్: వాదనలో నిజం ఉంది–
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలు:
ఆహారంలో ఉపయోగించే పసుపులో ‘లెడ్ క్రోమేట్’ ఉందని, ఇది పసుపు రంగుని గాఢమైన పసుపు రంగులోకి మారుస్తుందని వైరల్ సందేశం పేర్కొంది. ఫార్వార్డ్ చేయబడిన సందేశంలో పసుపులో లెడ్ క్రోమేట్ వాడకాన్ని వివరించే ఇన్ఫోగ్రాఫిక్ వివరాలు కూడా కలిగి ఉంది.
చిత్రంతో ఉన్నవాదన ఇలా పేర్కొంది,
“ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపే లెడ్ క్రోమేట్ ‘ఆఫ్ ది షెల్ఫ్’ పసుపు పొడి ప్యాకెట్లలో కలపబడుతుంది. సమీపంలోని పౌడర్ మిల్లుల నుండి కొనుగోలు చేయడం మంచిది.”
(‘ఆఫ్ ది షెల్ఫ్’అనగా ఎలాంటి నాణ్యత లేని పదార్థం లేదా నాణ్యత పరీక్ష చేయని పదార్థం లేదా FSSAI ముద్ర లేని పదార్థం)
ఈ వాదనలోని వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye Indiaకి వాట్సాప్‌లో అభ్యర్థన వచ్చింది.
FACT CHECK
Digiteye India బృందం చిత్రం యొక్క మూలాన్ని తెలుసుకోవడానికి Googleలో రివర్స్ ఇమేజ్ ను ఉపయోగించి చూడగా ‘సైన్స్ డైరెక్’అనే వెబ్ సైట్ ప్రచురించిన పరిశోధనా పత్రానికి దారితీసింది.”Real or fake yellow in the vibrant colour craze: Rapid detection of lead chromate in turmeric” అనే పేపర్‌ను ‘సారా డబ్ల్యు ఎరాస్మస్’, ‘లిసాన్నె వాన్ హాసెల్ట్’, ‘లిండా ఎమ్ ఎబింగే’ మరియు సాస్కియా ఎమ్. వాన్ రూత్ ప్రచురించారు. లెడ్ క్రోమేట్‌తో కూడిన పసుపు చాలా తయారీ యూనిట్లలో కలిగి ఉందని వారి అధ్యయనం వెల్లడించింది.
పసుపును మరింత గాఢమైన పసుపు రంగులోకి మార్చేందుకు లెడ్ క్రోమేట్ వాడతారని వారి అధ్యయనంలో వెల్లడైంది. కల్తీ పసుపు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా వెల్లడించింది.
పసుపు కోసం నిర్దేశించిన మార్గదర్శకాలను తెలుసుకోవడానికి Digiteye India టీమ్ ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ వెబ్‌సైట్‌ను సందర్శించగా, వారు అందులో ఇలా పేర్కొన్నారు, “ఉత్పత్తులు ఆకుపచ్చని బూజు, జీవించి లేదా చనిపోయిన కీటకాలు, ఎలుకల లేదా కీటకాల శకలాలు లేకుండా ఉండాలి. లెడ్ క్రోమేట్, విదేశీ స్టార్చ్, అదనపు పదార్థంతో మార్చబడిన పదార్థం, లేదా ఏదైనా అదనపు రంగు పదార్థం లేకుండా ఉండాలి”. పసుపులో లెడ్ క్రోమేట్ లేకుండా ఉండాలని ఫుడ్ అథారిటీ పేర్కొంది.
అదనంగా, FSSAI ఒక వీడియోలో, ప్రజలు ఇంట్లోనే పసుపు పొడిలోని కల్తీని ఎలా పరీక్షించవచ్చో పేర్కొంది. స్వచ్ఛమైన పసుపు పూర్తిగా నీటిలో కరిగిపోతుందని, అయితే కల్తీ పసుపు పొడి మాత్రం నీటిలో దిగువన పసుపు రంగు మట్టి మాదిరి ఉండిపోతుందని వారు పేర్కొన్నారు.
కింద వీడియోలో చూడవచ్చును.
ఇంట్లోనే కల్తీ పసుపుకొమ్ములను ఎలా పరీక్షించాలో కూడా FSSAI పేర్కొంది.
స్వచ్ఛమైన పసుపుకొమ్ము నీటి రంగును మార్చదని,లెడ్ క్రోమేట్‌తో కూడిన పసుపుకొమ్ము నీటి రంగును మారుస్తుందని వారు వెల్లడించారు.
కింద వీడియోలో చూడవచ్చును.
లెడ్ క్రోమేట్ ఆస్తమా లాంటి లక్షణాలు, చర్మ సమస్యలు మరియు జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. కావున,ప్రజలు మార్కెట్‌లో నాణ్యమైన మరియు పరీక్షించిన విక్రేయదారుల నుండి పసుపును కొనుగోలు చేయాలని సూచించారు.
మరి కొన్ని Fact checks:
ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన
ఈ వైరల్ వీడియో ప్లాస్టిక్ నుండి గోధుమ ఉత్పత్తిని చూపుతుందా? Fact Check
Pingback: చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయని వైరల్ పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; వాస్తవ పరిశీలన - Digiteye Telugu
Pingback: దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తోందనేది వీడియో ల