జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:  అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పలువురు ప్రపంచ నేతలు హాజరయ్యారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:సెప్టెంబరు 2023లో జరిగే G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు దేశాధినేతలు భారతదేశానికి చేరుకుంటున్న సంబంధిత వీడియోను జనవరి 2024లో జరిగిన రామమందిర కార్యక్రమానికి వస్తున్నట్లుగా షేర్ చేయబడింది.

రేటింగ్: సంపూర్ణంగా తప్పు–

వాస్తవ పరిశీలన వివరాలు

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఇతర ప్రపంచ నేతలు, విదేశీ ప్రముఖులతో సహా జనవరి 22, 2024న రామాలయ ప్రతిష్ఠాపన లేదా ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను వీడియో క్యాప్చర్ చేసిందని దావా పేర్కొంది.

“22 జనవరి 2024న రామమందిరం,అయోధ్యకు హాజరవుతున్న అతిథులు” అనే శీర్షికతో ఇక్కడ మరియు ఇక్కడ Facebookలో షేర్ చేయబడింది.

FACT CHECK

సంబంధిత సమాచారం కోసం మేము Googleలో పరిశీలించగా, పైన పేర్కొన్న ప్రపంచ నాయకులు వేడుకకు హాజరవుతున్నట్లు పేర్కొన్న వార్తలేవీ కనిపించలేదు.మరియు, ఈ వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకుంటే, సెప్టెంబరు 2023లో భారతదేశంలో జరిగిన G20 సమ్మిట్‌కు ప్రపంచ నాయకులు హాజరైనప్పుడు,దానికి సంబంధించిన పాత వీడియో అని నిర్ధారణకు వచ్చాము.

ఈ పాత వీడియో నుండి తీసిన క్లిప్స్,ఇప్పుడు ఈ నాయకులు రామమందిరం యొక్క ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యారనే వాదన/దావాకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడింది.కావున,వీడియో మరియు వాదన/దావా పూర్తిగా తప్పు.వీడియోలో చూపబడిన ప్రపంచ నాయకులెవరూ కూడా జనవరి 22,2024న జరిగిన రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరు కాలేదు.

మరి కొన్ని Fact Checks:

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

మాల్దీవుల అధ్యక్షుడు భారత ప్రధాని మోడీపై తన మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేసారా?; వాస్తవ పరిశీలన

4 thoughts on “జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

  1. Pingback: భారతదేశంలో ఇప్పుడు కొత్త రైలు ట్రాక్ యంత్రాలు ఉపయోగించబడుతున్నాయని వైరల్ వీడియో పేర్కొంది; వ

  2. Pingback: ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’ అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేసారా ; వాస్తవ పరిశీలన - Digiteye Telu

  3. Pingback: న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన - Digiteye Telugu

  4. Pingback: లేదు, “డీ.ఎం.కే ఓట్ల కోసం హిందువులను అడుక్కోదు” అని స్టాలిన్ ఎప్పుడూ చెప్పలేదు; వాస్తవ పరిశీలన -

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *