Tag Archives: nutrition

చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయని వైరల్ పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయనేది వాదన.

నిర్ధారణ/CONCLUSION:అనేక అధ్యయనాల ప్రకారం చాక్లెట్ వినియోగానికి మరియు మొటిమల బ్రేక్అవుట్‌ల(అక్ని/acne),) మధ్య ప్రత్యక్ష సంబంధం లేదని తేలింది.

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్త  

Fact check వివరాలు:

చర్మంపై మొటిమలు మరియు తీవ్రమైన పగుళ్లను కలిగించే అంశాలు అనేకం ఉన్నాయి.వీటిలో కాలుష్యం, నీరు , హార్మోన్లు, జన్యుశాస్త్రం మరియు ఆహారం ఉన్నాయి.అయితే, ఒక ఆహార పదార్థం మాత్రం మోటిమలు కలిగించడానికి కారణమౌతుంది,అదే చాక్లెట్.

అనేక సోషల్ మీడియా పోస్ట్‌లు, స్కిన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మరియు హెల్త్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు (skin influencers,health influencers) చాక్లెట్ తీసుకోవడం వల్ల మొటిమలు వస్తాయని పేర్కొన్నారు. కొంతకాలంగా ఇలాంటి వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ వాదనలోని వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye India వాట్సాప్‌లో అభ్యర్థన అందుకుంది.

FACT CHECK

ఈ వైరల్ క్లెయిమ్ యొక్క వాస్తవికతను పరిశీలించడానికి, బృందం అందుబాటులో ఉన్న వైద్య సాహిత్యాన్ని పరిశీలించి, చాక్లెట్‌కు మరియు అక్ని(acne),మొటిమలకు సంబంధం ఉందా అని పరిశీలించింది.ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మొటిమలు ఏర్పడతాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

యునైటెడ్ స్టేట్స్ యొక్క చాక్లెట్ తయారీదారుల సంఘం ద్వారా మద్దతందిన తొలి అధ్యయనాలలో ఒకటి, చాక్లెట్ మరియు కొవ్వును అధికంగా తీసుకోవడం వల్ల సెబమ్ యొక్క పరిమాణం మారదని కనుగొన్నారు.అధ్యయనంలో, ఒక మోస్తరు మొటిమలు ఉన్న 65 సబ్జెక్టులకు సాధారణ బార్‌లో కంటే పది రెట్లు ఎక్కువ చాక్లెట్ ఉన్న బార్ లేదా చాక్లెట్ లేని ఒకేలా కనిపించే బార్ ఇవ్వబడింది.శాస్త్రవేత్తలు బ్రేక్‌అవుట్‌లను(మొటిమలను)లెక్కించగా,రెండింటి మధ్య తేడా కనిపించలేదు.

2016 లో, పరిశోధకులు మోటిమలు మరియు డార్క్ చాక్లెట్ మధ్య సంబంధాన్ని అధ్యయనం చేశారు. సబ్జెక్టులకు(పాల్గొన్నవారికి) నాలుగు వారాల పాటు ప్రతిరోజూ తినడానికి చాక్లెట్ (99% డార్క్ చాక్లెట్ కలిగి ఉన్న) ఇవ్వబడింది. సాయివరీ వోంగ్రావియోపాప్ మరియు ప్రవిత్ అసవనోండా చేసిన అధ్యయనం ప్రకారం డార్క్ చాక్లెట్ మొటిమలను ‘తీవ్రపరుస్తుంది’ అని తేలింది.అయినప్పటికీ, “చాక్లెట్లు మొటిమలకు పూర్తి కారణమవుతాయని మేము నిర్ధారించలేదు,ఎందుకంటే మిగతా అనేక కారణాలు అక్ని(acne)/మొటిమలు కలగడానికి దోహద పడతాయి” అని వారు చెప్పారు.

2012లో నిర్వహించిన మరో అధ్యయనంలో మోటిమలు మరియు చాక్లెట్‌ల మధ్య ఎలాంటి సంబంధం లేదని తేలింది.సబ్జెక్టులు(పాల్గొన్నవారికి) డైరీఫుడ్ని మరియు అధిక-గ్లైసెమిక్ డైట్‌ని అనుసరించాలని కోరారు.సబ్జెక్టులు పాలు మరియు ఐస్ క్రీం వంటివి తిన్నారు.వారు తిన్నఆహారం మరియు మొటిమల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉందని తేలింది.అయితే,చాక్లెట్ మరియు మోటిమలు మధ్య సంబంధం ఉందని ద్రువీకరించబడలేదు.

ఏంజెలా లాంబ్, MD, బోర్డ్-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ మరియు మౌంట్ సినాయ్‌లోని ఇకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో డెర్మటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఇలా అన్నారు, “ఇది చక్కెర మరియు సాచురేటెడ్ కొవ్వు పదార్ధం మోటిమలకు దోహదం చేస్తుంది, చాకోలెటే కానక్కర్లేదు.అలాగే, చాలా చాక్లెట్లలో డైరీ పదార్థాలు ఉంటాయి,ఇది మొటిమలకు కారణమవుతున్నాయి.

అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీలో సహచరుడు(fellow) డాక్టర్ ప్యాట్రిసియా ఫారిస్ ఇలా అన్నారు, “హెయిర్ ఫోలికల్ ఓపెనింగ్ వద్ద చర్మ కణాలు ఏర్పడడం వలన,సెబమ్ లోపల పేరుకుపోయి చిక్కుకుపోతుంది.సెబమ్‌లో బ్యాక్టీరియా విస్తరించి, హెయిర్ ఫోలికల్ చుట్టూ వాపు/పుండ్లు ఏర్పడానికి కారణమవుతుంది.కానీ పోషకాహారం కుడా ఒక కారణం. చాక్లెట్‌ను నివారించడం అన్ని కారణాలలోకెల్లా ఒక కారణం మాత్రమే సూచిస్తుందని నేను నిర్భయంగా చెప్పగలను.

చర్మ రంధ్రాలు బ్యాక్టీరియా,ఆయిల్,డెడ్ స్కిన్ సెల్స్ మరియు మురికి వల్ల మూసుకుపోయినప్పుడు మొటిమలు(అక్ని/acne) వస్తాయి.డైరీ, ప్రాసెస్డ్ షుగర్, గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాలు మరియు కొవ్వు పదార్థాలు సెబమ్ ఉత్పత్తిని పెంచుతాయి.అధిక సెబమ్ మొటిమలకు దారి తీస్తుంది.హార్మోన్ల మార్పులు, పిసిఒడి, ఒత్తిడి, సిగరెట్లు, ఔషధాలు మరియు జన్యుశాస్త్రం కూడా మొటిమల ఉత్పత్తికి దోహదం చేస్తాయి.

మరి కొన్ని Fact Checks:

‘గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం పేర్కొంది; వాస్తవ పరిశీలన

మేడ్చల్ జిల్లాలో 95,040 రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిందా? వాస్తవ పరిశీలన