వాదన/Claim:జూలై 15న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ కన్వెన్షన్‌కు VP నామినీ J.D. వాన్స్ తన భారతీయ సంతతికి చెందిన భార్యను తీసుకువచ్చినప్పుడు “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినిపించాయనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. అసలు/ఒరిజినల్ వీడియోలో క్లెయిమ్ చేసినట్లుగా “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినపడలేదు.
రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.
లేదా దిగువ కథనాన్ని చదవండి.
************************************************************************
జూలై 15, 2024న మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ J.D. వాన్స్‌ను వైస్ ప్రెసిడెంట్ నామినీగా ప్రకటించిన వెంటనే, “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినిపించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.సమావేశానికి హాజరైన ప్రతినిధులు J.D. వాన్స్ మరియు భారత సంతకి చెందిన అతని భార్య ఉషా చిలుకూరికి స్వాగతం పలికారు.
“India India” chants as JD Vance brings soon to be second lady Usha Chilukuri into the RNC convention
The new Republican Party. It just keeps getting better 🤡 pic.twitter.com/Pdj8QhJlQQ
— White_Nation_United (@White_Tribe_) July 16, 2024
ఒక X వినియోగదారు ఇలా వ్రాశాడు, “JD వాన్స్ మరియు త్వరలో కాబోయే రెండవ మహిళ ఉషా చిలుకూరిని RNC కన్వెన్షన్‌లోకి తీసుకువస్తున్నప్పుడు ‘ఇండియా ఇండియా’ నినాదాలు.కొత్త రిపబ్లికన్ పార్టీ. ఇది నిరంతరంగా మెరుగుపడుతోంది. (Sic)”
FACT-CHECK
జూలై 15న ఫోర్బ్స్ అప్‌లోడ్ చేసిన రిపబ్లికన్ కన్వెన్షన్ వీడియోను Digiteye India బృందం పరిశీలించగా,వీడియో యొక్క 03:00 గంటల టైమ్‌స్టాంప్ వద్ద,J.D.వాన్స్ నామినేషన్ ప్రకటించినప్పుడు US బ్యాండ్ సిక్స్‌వైర్ ప్రదర్శన జరగడం (క్రింద వీడియోలో) చూడవచ్చు.
సోషల్ మీడియా పోస్ట్‌లో క్లెయిమ్ చేసినట్లుగా వీడియోలో “ఇండియా-ఇండియా” అనే నినాదాలు వినపడలేదు. అందువలన, సదస్సులోని ప్రతినిధులు ‘ఇండియా-ఇండియా’ అని నినాదాలు చేస్తున్నట్లుగా “వీడియో సౌండ్ ట్రాక్” మార్చి చూపబడింది.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:
అనేక దేశాలు భారతదేశం నుండి పండ్లు మరియు కూరగాయల దిగుమతులను నిషేధించాయా? వాస్తవ పరిశీలన