వాదన/Claim: హారిస్‌కు మద్దతు తెలిపినందుకు, కంట్రీ మ్యూజిక్ టేలర్ స్విఫ్ట్‌ను నిషేధించారనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.అటువంటి నిషేధం ఏమి జరగలేదు మరియు వ్యంగ్య వెబ్‌సైట్ ద్వారా ఈ తప్పుడు/దావా చేయబడింది.
రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన. —
వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి..
లేదా దిగువ కథనాన్ని చదవండి.
************************************************************************
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌ను సమర్థించిన తర్వాత టేలర్ స్విఫ్ట్‌ను కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించారనే వాదనతో కొన్ని పోస్ట్‌లు సోషల్ మీడియాలో షేర్ చేయబడుతున్నాయి.
Taylor Swift Banned from Country Music After Big Endorsement: “She Should Stick to Singing, Not Politics”: In a twist that could have been written in one of her own breakup ballads, country music has seemingly dumped Taylor Swift. Following her… https://t.co/PVk4Rvej3b pic.twitter.com/01hiIixrDm
— ZBreakingNewz (@ZBreakingNewz) September 20, 2024
X లో పోస్ట్ చేయబడిన ఒక వైరల్ మిమ్(meme) ఇలా పేర్కొంది: “గట్టి మద్దతు తెలిపిన తర్వాత టేలర్ స్విఫ్ట్ కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించబడింది: “ఆమె పాడటానికి కట్టుబడి ఉండాలి, రాజకీయాలకు కాదు”.
పాప్ మ్యూజిక్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్, ఇంతకు ముందు రిపబ్లికన్ యొక్క ట్రంప్ గట్టి మద్దతుదారు అయిన ఆమె తన మద్దతును సెప్టెంబర్ 10, 2024న హారిస్‌కు మార్చడంతో వార్తల్లోకి ఎక్కింది.ఆమె హారిస్‌కు బహిరంగగా మద్దతు ఇవ్వడం చూసి, కొత్త ఆరోపణలతో సహా అనేక మీమ్స్ మరియు తప్పుడు ఆరోపణలు సోషల్ మీడియాలో షేర్ చేయబడ్డాయి.
పోస్ట్‌కు 2,400 కంటే ఎక్కువ స్పందనలు మరియు 1,000 వ్యాఖ్యలు వచ్చాయి మరియు స్విఫ్ట్ మద్దతుపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తీవ్ర చర్చను రేకెత్తించింది.
వాస్తవ పరిశీల వివరాలు:
DigitEye బృందం పరిశీలించగా అసలు/ఒరిజినల్ పోస్ట్ ఫేస్‌బుక్‌లో ఉంది, మరియు ఆ సందేశాన్ని వ్యంగ్యంగా పేర్కొన్నట్లు తెలిసింది.అందులో వ్యంగ్య వెబ్‌సైట్ అయిన SpaceXMania.com వెబ్‌సైట్‌కి లింక్ ఇవ్వబడింది. కాకపోతే,నాష్‌విల్లే యొక్క కంట్రీ మ్యూజిక్ ఎలైట్ యొక్క ప్రతిచర్యలు లేదా స్టేట్‌మెంట్‌ల ద్వార పాప్ స్టార్ కంట్రీ మ్యూజిక్ నుండి నిషేధించబడిందనడానికి ఎటువంటి ఆధారాలు మాకు దొరకలేదు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్, SpaceXMania.com కథనానికి లింక్ ఇవ్వబడింది. మేము దాని ప్రామాణికత కోసం పరిశీలించినప్పుడు, అది వ్యంగ్య వెబ్‌సైట్ అని స్పష్టంగా చూపుతూ, కథనాలు కల్పితం మరియు నిజమైనవి కావని డిస్క్లైమర్స్లో/disclaimers పేర్కొన్నారు. కమలా హారిస్‌కు మద్దతు తెలిపినందుకు టేలర్ స్విఫ్ట్ ను టార్గెట్ చేయడం ఇదేం మొదటిసారి కాదు.
కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.
హారిస్‌కు మద్దతు తెలిపినందుకు ఆమె మిలియన్ల కొద్దీ సోషల్ మీడియా ఫాలోవర్లను కోల్పోయారని మునుపటి పుకార్లు పేర్కొనడం జరిగింది లేదా ఇలాంటి కారణాల వల్ల కోకా-కోలా ఆమెతో తన భాగస్వామ్యాన్ని ముగించిందని కూడా వాదనలు వచ్చాయి కానీ అవి తప్పుగా నిరూపణ చేయబడ్డాయి.
మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు: