Tag Archives: space

సునీతా విలియమ్స్ ISS నుండి భూమికి తిరిగి వచ్చేశారని ఒక వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: విజయవంతంగా 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.ISSలో సునీతా విలియమ్స్ యొక్క పాత (2012 నాటి) వీడియో ఉపయోగించబడింది. ఆమె ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి రావాల్సి ఉంది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన.

అంతరిక్ష కేంద్రం (ISS)లో నాలుగు నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి వస్తున్నారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఒక వీడియోను షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలోని కొన్ని పోస్ట్‌లను ఇక్కడ చూడండి:

ఒక వాదన ఈ విధంగా ఉంది: “విజయవంతమైన 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, “సునీతా విలియమ్స్” సురక్షితంగా భూమికి తిరిగి వస్తున్నారు. ఇది నిజంగా మనసుకు హత్తుకునే వీడియో మరియు చూడటానికి అద్భుతంగా ఉంది.”

వాస్తవ పరిశీలన వివరాలు:

అనేక క్లెయిమ్‌/వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం, DigitEye India బృందం వాస్తవ-పరిశీలనకు పూనుకుంది.
వీడియో నుండి కొన్ని ఫ్రేమ్‌లను తీసుకొని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా ఇది నవంబర్ 2012 నాటి పాత వీడియో అని తేలింది. సునీతా విలియమ్స్ “32/33 అంతరిక్ష యాత్ర”లో భాగంగా జూలై 15, 2012న బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను పర్యటించిన సందర్భంలో ISS యొక్క కక్ష్య ప్రయోగశాల, వంటగది, టాయిలెట్, స్లీపింగ్ బెడ్‌, స్పేస్ సూట్ తో సహా అన్ని సౌకర్యాలను మరియు ప్రాంతాలను వీడియోలో రికార్డు చేసారు. ఈ వీడియోను NASA యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

ఆమె, ఆమె తోటి వ్యోమగాములు యూరి మాలెన్‌చెంకో మరియు అకిహికో హోషిడ్‌లతో కలిసి రష్యన్ అంతరిక్ష నౌక సోయుజ్ TMA-05Mలో నాలుగు నెలల పాటు ISS దగ్గర నిలిపివేయబడింది(డాక్ చేయబడింది).తిరిగి నవంబర్ 19, 2012న భూమికి తిరిగి వచ్చారు.

అయితే, మళ్లీ జూన్ 5, 2024న, బుచ్ విల్మోర్‌తో పాటు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపబడ్డారు మరియు వారు బోయింగ్ స్టార్‌లైనర్‌ను ISSతో విజయవంతంగా డాక్ చేయగలిగారు.వాస్తవానికి ఈ మిషన్‌ను వారం రోజుల పాటు టెస్ట్ ఫ్లైట్‌గా ప్లాన్ చేశారు, కానీ బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారు తిరిగి రాలేక అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 2025లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో వారిని తిరిగి భూమికి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాబట్టి, సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చేశారనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన

 

 

 

 

ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

ఓ ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఫుటేజీ చంద్రయాన్-3 విజయవంతం వెనుక చేసిన కృషిని చూపుతుందని వీడియో పేర్కొంది.సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో వైరల్‌గా మారింది.

వాదన/దావాకు జోడించబడిన సందేశం ఇలా ఉంది,

“अंतरिक्ष के प्रोजेक्ट सफल बनाने मे वैज्ञानिकों के अलावा बहुत लोगो का योगदान होता है। छोटी सी भूल से ही हजारों करोड़ों रुपए स्वाहा हो सकते हैं। आप इस ट्रक ड्राइवर की मनोदशा का अंदाजा लगाएं। जब वह यह कर रहा होगा, सांसें रोक देने वाला वीडियो।”

[అనువాదం: శాస్త్రవేత్తలే కాకుండా, అంతరిక్ష ప్రాజెక్టులు విజయవంతం కావడానికి చాలా మంది సహకరిస్తారు. ఎవరైనా చిన్న పొరపాటు చేస్తే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది.ఈ ట్రక్ డ్రైవర్ మానసిక స్థితిని మీరు ఊహించవచ్చు.ఈ వీడియో చుస్తే మీ ఊపిరి బిగుసుకుపోతుంది.]

వీడియో ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ కూడా ఇలాంటి వాదనలతో ట్విట్టర్లో షేర్ చేయబడింది.

వైరల్ అయిన ఈ వీడియో యొక్క వాస్తవాన్ని తనిఖీ చేయమని Digiteye Indiaకు అభ్యర్థన వచ్చింది..

FACT CHECK

వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి Digiteye India బృందం వారు inVid -(ఒక వీడియో ధృవీకరణ సాధనం) ఉపయోగించారు.మేము ఈ కీఫ్రేమ్‌లను ఉపయోగించి, Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ను అమలు చేయగా,YouTubeలో కూడా ఇదే దావాతో పలువురు వ్యక్తులు ఈ వీడియోను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.

వీడియో ప్రామాణికమైనదా కాదా అని తెలుసుకోవడానికి క్షుణ్ణంగా పరిశీలించగా ఏప్రిల్ 2, 2023న ఒక వినియోగదారుడు షేర్ చేసిన ఈ వీడియో Facebookలో మాకు కనిపించింది. “ఎమర్జెన్సీ బ్రిడ్జ్ టెక్నాలజీ ఇలాంటి పరిస్థితిలో చాలా సహాయపడుతుంది” అని క్యాప్షన్తో ఉన్న విజువల్స్ వీడియోలో కనిపించాయి.”

కాని మరింత క్షుణ్ణంగా పరిశీలించగా వీడియోలో “జిమ్ నాటెలో” అనే వాటర్‌మార్క్ ఉంది. మేము Gim Natelo కోసం Googleలో వెతకగా అతను తన పేజీలో అనుకరణ వీడియోలను (simulation videos)పోస్ట్ చేసే గేమర్ అని కనుగొన్నాము.మేము వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లను తీసుకుని,కీవర్డ్‌లు మరియు అతని పేరును ఉపయోగించి వెతకగా, ఈ వీడియో Spintires: MudRunner అనే గేమ్‌లోనిది అని తేలింది.

మేము జిమ్ నాటెలో(Jim Natelo) ప్రొఫైల్‌లో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెతకగా, అదే గేమ్ నుండి అదే గ్రాఫిక్స్ ఉన్న ఇతర వీడియోలు దృష్టికి వచ్చాయి.అయితే, ఈ వీడియో అతని ప్రొఫైల్‌లో అందుబాటులో లేదు.మేము YouTubeలో పరిశీలించగా,వైరల్ సందేశంలో షేర్ చేసిన అవే విజువల్స్ ఉన్న వీడియోను కనుగొన్నాము.యూట్యూబ్ వీడియోలో ఇవి గేమ్‌ విజువల్స్ అని స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, వీడియోలో చూపిన రాకెట్‌పై ఇస్రో లోగో లేదా ఇండియా అని రాసి లేదు.

కావున, వైరల్ వీడియో చేసిన వాదన తప్పు.

వాదన/CLAIM: ఒక ట్రక్కు రాకెట్‌ను మోసుకెళుతూ వంతెన మీదుగా రవాణా చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. అది ఇస్రో రాకెట్ అని వీడియో పేర్కొంది.

నిర్ధారణ/CONCLUSION: వీడియో ‘Spintires: Mudrunner’ అనే గేమ్ నుండి తీసింది మరియు ఇది గేమ్‌లో ఉపయోగించగల కొత్త హ్యాక్‌ను(ట్రిక్) చూపుతుంది.

RATING: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks: MMR టీకాలు ఆటిజంకు కారణమవుతాయని వైరల్ సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; Fact Check ;

మొబైల్‌లు, టీవీలు, ఫ్రిజ్‌లపై GST 31.3% నుంచి 18%కి తగ్గిందని క్లెయిమ్/వాదన వైరల్ అవుతోంది; Fact Check]

చంద్రయాన్-3 ల్యాండింగ్ తర్వాత ఇస్రో చీఫ్ సోమనాథ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారా? Fact Check

చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన తర్వాత, ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ గురించి పలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం చేయడం ప్రారంభం అయ్యాయి.అంతకుముందు చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్-ల్యాండింగ్ అయిన సందర్భంగా ఇస్రో చీఫ్ సంబరాలు చేసుకుంటున్న పాత వీడియో వైరల్‌గా మారింది.ఈసారి ఆయనను సత్కరిస్తున్న మరో వీడియో ప్రసారం చేయడం జరిగింది.

0:09 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు తెల్లటి దుస్తులు ధరించి S సోమనాథ్‌ను సత్కరిస్తున్నట్లు చూపబడింది.వారు అతని భుజాలపై శాలువా కప్పుతుంటే,అతను చేతులు జోడించి ‘నమస్తే’చేస్తున్నట్లు చూపబడింది.ఇస్రో చీఫ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారని, ఈ వీడియో ఆ ఈవెంట్‌లోనిదేనని సోషల్ మీడియాలో పలు వీడియోలు పేర్కొంటున్నాయి.

వీడియో ఇక్కడ, ఇక్కడ, మరియు  ఇక్కడ షేర్ చేయబడ్డది.

ఈ వైరల్ వీడియోను పరిశీలన చేయమని Digiteye India కి WhatsApp అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు వీడియోని అనేక కీఫ్రేమ్‌లుగా విభజించి Googleలో రివర్స్ ఇమేజ్ ఉపయోగించి వీడియోని పరిశీలించారు.ఇలాంటి దావాతో అనేక మంది వ్యక్తులు ఈ వీడియోను భాగస్వామ్యం(share) చేయడాన్ని మేము గమనించాము.కీలక పదాలతో మరింత వెతికినప్పుడు, RSS ప్రమోషన్ అండ్ పబ్లిసిటీ హెడ్ – రాజేష్ పద్మర్ చేసిన ఈ ట్వీట్ మాకు కనిపించింది.అతని ట్వీట్‌లో మూడు చిత్రాలు మరియు అదే వైరల్ వీడియో ఉన్నాయి.

జూలై 19, 2023 నాటి తన ట్వీట్‌లో, చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా నడిపించినందుకు S సోమనాథ్‌ను RSS ప్రధాన కార్యదర్శి – దత్తాత్రేయ హోసబాలే అభినందించారు.చంద్రునిపై చంద్రయాన్-3 రోవర్ ల్యాండింగ్‌కు ముందే బెంగళూరులోని చామరాజపేటలోని రాష్ట్రోత్థాన పరిషత్‌లో ఈ సన్మానం జరిగిందని అందులో పేర్కొన్నారు. రోవర్ ఆగష్టు 23, 2023న చంద్రునిపై దిగింది.

మేము రాష్ట్రోత్థాన పరిషత్‌ గురించి గూగుల్ సెర్చ్ చేసాము. “వ్యక్తిగతంగా సమాజంలో పరివర్తన తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన మరియు స్థిరమైన సమాజాన్ని సృష్టించే దిశగా 1965 నుండి కృషి చేస్తున్న ఒక NGO అని ఫలితాలు చూపించాయి.వీడియో తేదీని ధృవీకరించడానికి మేము రాష్ట్రోత్థాన పరిషత్ యొక్క సోషల్ మీడియా హ్యాండిల్‌లను పరిశీలించాము. వారి బ్లాగ్ పోస్ట్‌లలో ఒకదానిలో, వారు ఈ ఈవెంట్ గురించి వ్రాసారు మరియు అదే చిత్రాలను షేర్ చేసారు.

అంతరిక్ష శోధనలో అతను సాధించిన విజయాలను జరుపుకోవడానికి మరియు ఇస్రో యొక్క భవిష్యత్తు మిషన్లకు తన మద్దతును తెలియజేయడానికి” ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.

మేము బహుళ కీవర్డ్‌లను ఉపయోగించి వీడియోని ధృవీకరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కర్ణాటకలోని విశ్వ సంవాద కేంద్రం చేసిన ఈ ట్వీట్‌ని చూశాము. వీడియోలో పేర్కొన్నట్లుగా ఇస్రో చీఫ్ ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు.

అతను ‘తపాస్’ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తులను కలవడానికి రాష్ట్రోత్థాన పరిషత్‌ని సందర్శించారు. ఈ NGO చేస్తున్న ప్రాజెక్ట్ సమాజంలోని అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులను IITలో చదివేలా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. కాబట్టి,ఇది తప్పుడు వాదన/claim.

CLAIM/దావా: చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో చీఫ్, ఎస్ సోమనాథ్ బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు.

నిర్ధారణ:ఈ వీడియో జూలై 2023 నాటిది, S సోమనాథ్ బెంగళూరులోని ఒక NGOని సందర్శించి, చంద్రయాన్-3 మిషన్‌కు నాయకత్వం వహించినందుకు సత్కరించారు.అంతే కాని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించలేదు.

RATING: Misrepresentation —

[మరి కొన్ని Fact Checks:: Does this video show ISRO Chief celebrating success of Chandrayaan-3? Fact Check]

సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA కనుగొందా? Fact Check

సమయం వ్యతిరేక దిశలో (సమయం వెనుకకు)వెలుతున్న సమాంతర విశ్వాన్ని NASA కనిపెట్టిందనే వాదనలతో ఇంటర్నెట్ సంచలనమైంది.అనేక వార్తాపత్రికలు మే 20 మరియు 21 తేదీలలో ఈ కథనాన్ని Google search ట్రెండ్‌లలో అగ్రస్థానంలో ప్రసారం చేశాయి, ఎక్కువగా న్యూయార్క్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ మరియు డైలీ స్టార్ వంటి టాబ్లాయిడ్‌లు ‘నాసా శాస్త్రవేత్తల వద్ద సమాంతర విశ్వం ఉందని నిరూపించగల సాక్ష్యాలు ఉన్నాయని’ కోట్ చేసారు.

మే 21న సెర్చ్ స్ట్రింగ్ ‘ప్యారలల్ యూనివర్స్’ కోసం గత 24 గంటల యొక్క Google గ్రాఫ్ని దిగువన చూడండి:

NASA ఈ సమాంతర విశ్వాన్ని కనుగొన్నట్లు అన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి మరియు Google searchలో కొన్ని ఫలితాలు క్రింద చూడగలరు:

Fact Check

న్యూ సైంటిస్ట్‌లోని ఒక వార్తా కథనం ప్రకారం,భూమి వాతావరణంలోకి cosmic-rays ప్రవేశించడం వలన కలిగె గాలి జల్లులను (air showers) గుర్తించే అంటార్కిటిక్ ఇంపల్సివ్ ట్రాన్సియెంట్ యాంటెన్నా (ANITA– 37,000 మీటర్ల ఎత్తులో ఎగురుతున్న బెలూన్‌పై అమర్చిన ఒక రేడియో డిటెక్టర్‌ను) NASA బృందం వారు ఆపరేట్ చేస్తున్నారు.అంటార్కిటికాలో రీడింగులను వక్రీకరించే రేడియో శబ్దం(radio noise) లేనందున, ANITA దానిపై హోవర్ చేయగలదు.

యాంటెన్నా ఇప్పటివరకు భౌతిక శాస్త్రంలో తెలిసినట్లుగా బాహ్య అంతరిక్షం నుండి క్రిందికి ప్రవహించకుండా భూమి లోపల నుండి పైకి ప్రయాణించే అధిక-శక్తి కణాల “గాలి”ని(“wind” of high-energy particles) కనుగొంది. దీనికి మరింత వివరణ ఇస్తు, పీటర్ గోర్హామ్ అనే ఒక పరిశోధకుడు, సమాంతర విశ్వం ఉనికిలో ఉండవచ్చని మరియు దానిలో సమయం రివర్స్‌లో( వెనుకకు ) వెలుతుందనే అనే సిద్ధాంతాన్ని ఉదహరించారు.

వాస్తవానికి, సమాంతర విశ్వం యొక్క సిద్ధాంతం పాత కల్పన కానీ ఈ ఊహ ఆధారంగా అనేక హాలీవుడ్ సినిమాలు నిర్మించబడ్డాయి. ప్రముఖ సిట్‌కామ్ ‘బిగ్ బ్యాంగ్ థియరీ’లో ప్రధాన నటుడు లియోనార్డ్, షెల్డన్ కూపర్‌తో కలిసి అంటార్కిటికాను సందర్శించి “గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ” చేస్తాడు, కానీ ప్రయత్నం ఫలించదు. ఈసారి NASAకి ఆపాదించబడిన claim/వాదన వైరల్‌గా మారింది.

Credit: NASA

2006లో మరియు 2014లో ANITA ప్రాజెక్ట్ కనుగొన్న కణాల(particles) ప్రవర్తన భౌతిక శాస్త్రంలో తెలిసిన కణాలకు బిన్నంగా ఉంది.లేదా కణాలు కనుగొనబడిన అంటార్కిటికాలోని మంచుతో కూడా సంబంధం కలిగి ఉండవచ్చు. కణాల యొక్క విచిత్రమైన తలక్రిందుల కదలిక పరిశిలిస్తే, ఎక్కడో, సమయం వెనుకకు వెలుతుందని, అందుకే, సమాంతర విశ్వం యొక్క ఆలోచన ఉద్భవించిందని, దీనిలో సమయం మరియు భౌతిక శాస్త్రం రెండూ భిన్నంగా ప్రవర్తిస్తాయనే ముందుకు తీసుకురాబడింది.

Australia’s national science ఏజెన్సీ యొక్క గౌరవ సభ్యుడు ‘Ron Ekers’ CNETతో ఇలా అన్నారు: “నాలుగు సంవత్సరాల తర్వాత ANITA కనుకొన్న అసాధారణ సంఘటనల గురించి సంతృప్తికరమైన వివరణ లేదు కాబట్టి , ఈ ప్రాజెక్ట్ లో పాల్గొన్న వారిని ఇది చాలా నిరాశపరిచింది.

కానీ కొన్ని వార్తలు పేర్కొన్నట్లు NASA ఈ సమాంతర విశ్వంని కనుగొనలేదు. NASA వెబ్‌సైట్‌లో అటువంటి దావా/వాదన గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA నిజంగా కనిపెట్టినట్లయితే, , అది పరిశోధకులకు తగిన గుర్తింపు ఇచ్చీ అధికారిక ప్రకటన చేసి ఉండెది.

Claim/వాదన: సమయం వెనుకకు నడిచే సమాంతర విశ్వంని NASA కనుగొందా? Fact Check

నిర్ధారణ: ఈ వాదనలు NASA చేసినవి కావు, సమాంతర విశ్వంని గురించి NASAకి ఆపాదించబడిన claim/వాదన తప్పు. 
Rating Misrepresentation .