Tag Archives: US SEC

అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని అమెరికా అధికారులు అరెస్టు చేసారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:చిత్రంలో చూపిన విధంగా అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీని అమెరికా అధికారులు అరెస్టు చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం. వాదన/దావా చేయబడినట్లు, అదానీని అరెస్టు చేయలేదు. చిత్రం AI ద్వారా రూపొందించబడింది.

Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన పూర్తి వివరాలను వీడియోలో చూడటానికి కింది చిత్రంపై క్లిక్ చేయండి.

లేదా దిగువ కథనాన్ని చదవండి.

************************************************************************

బుధవారం US సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై $ 250 మిలియన్ల లంచం పథకంలో అభియోగాలు మోపబడిందనే వార్తలపై దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో, US పోలీసులు అదానీని తీసుకువెళుతూ కనిపిస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

క్యాప్షన్ ఈ విధంగా ఉంది: “కాన్‌మన్ అదానీ అరెస్ట్.” దీన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు, కానీ అదానీకి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిందని అదే చిత్రం ఉపయోగించి మరొక వాదన/దావా చేయబడింది.

వాస్తవ పరిశీలన

Digiteye India బృందం తన WhatsApp టిప్‌లైన్‌లోవాస్తవ పరిశీలన(Fact Check) అభ్యర్థన రాగ, మొదట అరెస్టుకు సంబంధించిన వార్తలను పరిశీలించింది. US SEC అదానీపై లంచం కేసులో అభియోగాలు మోపగా, అదానీ మరియు అతని మేనల్లుడు సాగర్ అదానీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడిందనే వార్తను రాయిటర్స్ ఇక్కడ మరియు ది హిందూ ఇక్కడ వెల్లడించాయి.
US ప్రాసిక్యూటర్లు వారెంట్లను విదేశీ (భారతదేశం) చట్ట అమలు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు, మరియు ఇది విధానాలు/నిబంధనలను ప్రకారం జరగాలి కాబట్టి సమయం పట్టవచ్చు.

ఇంతలో, అదానీ గ్రూప్ ఆరోపణలను ఖండిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది:

ప్రకటన ఈ విధంగా పేర్కొంది: “US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ స్వయంగా పేర్కొన్నట్లుగా, “అభియోగపత్రంలో పేర్కొన్నవి ఆరోపణలు మాత్రమే మరియు నేరాన్ని రుజువు అయ్యేంతవరకు నిందితులు నిర్దోషులుగా భావించబడతారు.” “చట్టపరంగా సాధ్యమైన మార్గాలు ఉపయోగిస్తాము.” గురువారం, నవంబర్ 21, 2024 నాటికి, X పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా అదానీ లేదా అతని మేనల్లుడు అరెస్టు కాలేదు.

చిత్రాన్ని నిశితంగా పరిశీలించగా ఒక అధికారి ఆరు వేళ్లతో కనిపించారు, ఇది AI-రూపొందించిన చిత్రమనే అవకాశాన్ని సూచిస్తుంది.’ఇల్యూమినార్టీ’ అప్ లో క్రాస్-చెక్ చేసినప్పుడు, 92.8% ఇది AI ద్వారా రూపొందించబడిన చిత్రమనే సంభావన ఉందని తెలిపింది.

అందువల్ల, US పోలీసు అధికారులు గౌతమ్ అదానీని అరెస్టు చేసినట్లు చూపుతున్న ఫోటో AI ద్వారా రూపొందించబడింది.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

VP నామినీ J.D. వాన్స్ పేరు ప్రకటించినప్పుడు US రిపబ్లికన్ కన్వెన్షన్‌లో ‘ఇండియా-ఇండియా’ అన్న నినాదాలు వినిపించాయా? వాస్తవ పరిశీలన