Tag Archives: Butch Wilmore

సునీతా విలియమ్స్ ISS నుండి భూమికి తిరిగి వచ్చేశారని ఒక వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: విజయవంతంగా 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి తిరిగి వచ్చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన.ISSలో సునీతా విలియమ్స్ యొక్క పాత (2012 నాటి) వీడియో ఉపయోగించబడింది. ఆమె ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి రావాల్సి ఉంది.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన.

అంతరిక్ష కేంద్రం (ISS)లో నాలుగు నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి వస్తున్నారని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఒక వీడియోను షేర్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలోని కొన్ని పోస్ట్‌లను ఇక్కడ చూడండి:

ఒక వాదన ఈ విధంగా ఉంది: “విజయవంతమైన 127 రోజుల స్పేస్ టూర్ తర్వాత, “సునీతా విలియమ్స్” సురక్షితంగా భూమికి తిరిగి వస్తున్నారు. ఇది నిజంగా మనసుకు హత్తుకునే వీడియో మరియు చూడటానికి అద్భుతంగా ఉంది.”

వాస్తవ పరిశీలన వివరాలు:

అనేక క్లెయిమ్‌/వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం, DigitEye India బృందం వాస్తవ-పరిశీలనకు పూనుకుంది.
వీడియో నుండి కొన్ని ఫ్రేమ్‌లను తీసుకొని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయడం ద్వారా ఇది నవంబర్ 2012 నాటి పాత వీడియో అని తేలింది. సునీతా విలియమ్స్ “32/33 అంతరిక్ష యాత్ర”లో భాగంగా జూలై 15, 2012న బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను పర్యటించిన సందర్భంలో ISS యొక్క కక్ష్య ప్రయోగశాల, వంటగది, టాయిలెట్, స్లీపింగ్ బెడ్‌, స్పేస్ సూట్ తో సహా అన్ని సౌకర్యాలను మరియు ప్రాంతాలను వీడియోలో రికార్డు చేసారు. ఈ వీడియోను NASA యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది.

ఆమె, ఆమె తోటి వ్యోమగాములు యూరి మాలెన్‌చెంకో మరియు అకిహికో హోషిడ్‌లతో కలిసి రష్యన్ అంతరిక్ష నౌక సోయుజ్ TMA-05Mలో నాలుగు నెలల పాటు ISS దగ్గర నిలిపివేయబడింది(డాక్ చేయబడింది).తిరిగి నవంబర్ 19, 2012న భూమికి తిరిగి వచ్చారు.

అయితే, మళ్లీ జూన్ 5, 2024న, బుచ్ విల్మోర్‌తో పాటు సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పంపబడ్డారు మరియు వారు బోయింగ్ స్టార్‌లైనర్‌ను ISSతో విజయవంతంగా డాక్ చేయగలిగారు.వాస్తవానికి ఈ మిషన్‌ను వారం రోజుల పాటు టెస్ట్ ఫ్లైట్‌గా ప్లాన్ చేశారు, కానీ బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో, వారు తిరిగి రాలేక అంతరిక్షంలో చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 2025లో స్పేస్‌ఎక్స్ డ్రాగన్‌లో వారిని తిరిగి భూమికి తీసుకు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కాబట్టి, సునీతా విలియమ్స్ భూమికి తిరిగి వచ్చేశారనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన కధనాలు:

హారిస్‌కు మద్దతు తెలిపినందుకు కంట్రీ మ్యూజిక్ ‘టేలర్ స్విఫ్ట్‌’ను నిషేధించిందా? వాస్తవ పరిశీలన

సెప్టెంబరు 10న ట్రంప్‌తో ప్రెసిడెన్షియల్ డిబేట్ సమయంలో కమలా హారిస్ తన చెవిపోగుల్లో ‘ఇయర్‌పీస్’ పెట్టుకున్నారా? వాస్తవ పరిశీలన