Tag Archives: critical of Trump Administration

ట్రంప్ పరిపాలనను విమర్శిస్తున్న అకౌంట్ల నిలిపివేత గురించి మస్క్ Xలో పోస్ట్ చేశారా? వాస్తవ పరిశీలన

వాదన/Claimట్రంప్ పరిపాలనను విమర్శించే అన్ని ట్వీట్లను నిలిపివేస్తామని ఎలాన్ మస్క్ Xలో పోస్ట్ చేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుదారి పట్టించే వాదన. ట్రంప్ పరిపాలనను విమర్శించే X ఖాతాలను సస్పెండ్ చేస్తామని/నిలిపివేస్తామని ఎలోన్ మస్క్ పోస్ట్‌ను షేర్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు.

రేటింగ్/Rating: తప్పుదారి పట్టించే వాదన —

*****************************************************************************

X యజమాని మరియు బిలియనీర్ ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపే ఖాతాలను/అకౌంట్లను X ప్లాట్‌ఫామ్ నుండి సస్పెండ్ చేయడం/నిలిపివేయడం జరుగుతుందనే సందేశాన్ని పోస్ట్ చేశారని ఒక క్లెయిమ్/వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

దావా/వాదన ఈ విధంగా ఉంది: ” ట్రంప్ పరిపాలనను నిరసిస్తున్న ఎవరైనా X నుండి సస్పెండ్ చేయబడతారు. ట్రంప్ వ్యతిరేక డ్రామా అంతా థ్రెడ్స్, రెడ్డిట్, బ్లూస్కై, ఇన్‌స్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ వంటి లిబరల్ ఎకో చాంబర్లలో ((liberal echo chamber) పోస్ట్ చేసుకోవచ్చు”.

FACT-CHECK

ఈ వాదన ఆందోళనకరంగా ఉండటం మరియు అమెరికా వాక్ స్వేచ్ఛ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో, Digiteye India బృందం ఆ వాదన యొక్క ప్రామాణికతను పరిశీలించింది. ముందుగా చిత్రంలోని పోస్ట్‌లో టైమ్‌స్టాంప్ లేదు, కానీ మస్క్ ప్రొఫైల్ ఇమేజ్ మరియు హ్యాండిల్ “@elonmusk” ఉండటం గమనించాము.

ఇంకా, వాదన/క్లెయిమ్ చేయబడిన చిత్రంలో “ఫాలో” బటన్ మాత్రమే ఉంది, కానీ మస్క్ అసలైన (Original)పోస్ట్ ఎగువ కుడి మూలలో xAI లోగోతో పాటు “సబ్‌స్క్రైబ్” బటన్‌ కూడా ఉంటుంది. ఈ వ్యత్యాసాన్ని ఇక్కడ క్రింది చిత్రాలలో స్పష్టంగా చూడవచ్చు:

మేము ఎలోన్ మస్క్ అధికారిక హ్యాండిల్‌ను పరిశీలించినప్పుడు, అతని X ఖాతాలో అలాంటి పోస్ట్ ఏది లేదు, మరియు ఈ పోస్ట్ పై ఎటువంటి వార్తా నివేదికలు లేవు. మస్క్ అటువంటి పోస్ట్‌ను X లో అధికారికంగా షేర్ చేసి ఉంటే అది వేగంగా వార్తల్లోకి వచ్చేది. కాబట్టి, ఆ వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

బడ్జెట్ 2024-25 ప్రకారం, విదేశాలకు వెళ్లే వారందరికీ పన్ను క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరా? వాస్తవ పరిశీలన