Category Archives: POLITICS

Did Congress Manifesto mention about Inheritance Tax? Fact Check

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో,రెండు జాతీయ పార్టీలు — బిజెపి మరియు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, కాంగ్రెస్ వాగ్దానం చేసిన సంపద పునర్విభజనపై విచిత్రమైన మలుపు తిరిగింది. వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా “యుఎస్‌లో వారసత్వపు పన్ను” గురించి ప్రస్తావించినప్పుడు,ఈ అంశానికి ఆజ్యం పోసింది.

సాధారణంగా, మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు/సంపదపై వారసత్వపు పన్ను విధించబడుతుంది, అది వారి వారసుల మధ్య పంపిణీ చేయబడుతుంది. జపాన్, అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు అటువంటి పన్నును విధిస్తున్నాయి.

అయితే,భారతదేశంలో వ్యతిరేకులు కూడా ఇలాంటి పన్నుకు అభ్యంతరం చెప్పినప్పుడు, సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇది ఊపందుకుంది. అనేక మీమ్‌లు, వార్తా నివేదికలు, టీవీ చర్చలు ఈ సమస్యను ప్రసారం చేయడంతో ప్రతి వార్తా ఛానెల్‌లో ఇవి ముఖ్యాంశాలుగా మారాయి.

Digiteye India బృందం WhatsApp టిప్‌లైన్‌లో దీని గురించి అభ్యర్ధనను అందుకొని పరిశీలించగా, ఈ సమస్యపై కొన్ని క్లెయిమ్‌లను ఇక్కడ మరియు ఇక్కడ గమనించాము.

FACT CHECK

మొదట, మేము కాంగ్రెస్ మ్యానిఫెస్టోను పరిశీలించగా,  కాంగ్రెస్ “న్యాయ పాత్ర” అనే డాక్యుమెంట్‌లో వారసత్వపు పన్ను లేదా దానికి సంబంధించిన చర్య గురించి ప్రస్తావించలేదు.  ‘పన్ను మరియు పన్ను సంస్కరణలు’ సెక్షన్‌ కింద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యక్ష పన్నుల కోడ్ అమలు చేయడం, ఏంజెల్ పన్ను తొలగింపు, వ్యక్తులు మరియు భాగస్వామ్య సంస్థల యాజమాన్యంలోని MSMEలపై పన్ను భారాన్ని తగ్గించడం మరియు GST కౌన్సిల్‌ను పునఃరూపకల్పన చేయడం వంటివి ప్రస్తావించబడ్డాయి.

“వివాహం, వారసత్వం, దత్తత, సంరక్షకత్వం మొదలైన విషయాలలో స్త్రీ మరియు పురుషులకు సమాన హక్కులు ఉండాలి” అని పార్టీ వాగ్దానం చేసినప్పుడు “వారసత్వం” అనే పదం మహిళా సాధికారత అనే దృష్టికోణం నుంచీ సూచించబడింది. మేము(పార్టీ) అన్ని చట్టాలను సమీక్షిస్తాము మరియు స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని నిర్ధారిస్తాము. కాబట్టి, దీనికి వారసత్వపు పన్నుతో సంబంధం లేదు.

తర్వాత, మేము శామ్ పిట్రోడా యొక్క ANI ఇంటర్వ్యూని పరిశీలించగా, అక్కడ అతను అమెరికాలోని వారసత్వపు పన్నును గురించి ప్రస్తావించడం గమనించాము. “భారతదేశంలో వారసత్వ పన్నును కాంగ్రెస్ సమర్థిస్తున్నారా? అనే శీర్షికతో ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియో ANI యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా పెద్ద సూచనను ఇచ్చారు. దీన్ని ANI తన X హ్యాండిల్‌లో ఏప్రిల్ 24, 2024న ఇక్కడ షేర్ చేసింది:

ఈ ఇంటర్వ్యూలో,శామ్ పిట్రోడాని “దేశంలోని సంపదపై సర్వే గురించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని మరియు “ప్రజల మధ్య తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం” గురించి అడిగారు.

అతని ప్రత్యుత్తరంలో, సామ్ పిట్రోడా ఇలా అన్నారు: “అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఉదాహరణకి ఒకరి వద్ద $100 మిలియన్ల విలువైన సంపద ఉందని అనుకుందాం మరియు అతను చనిపోయినప్పుడు అతను బహుశా 45% మాత్రమే తన పిల్లలకు బదిలీ చేయగలడు. మిగిలిన 55% ప్రభుత్వం తీసుకుంటుంది.ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైన చట్టం. మీ తరంలో మీరు, సంపదను సంపాదించారు, మీరు ఇప్పుడు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదను ప్రజల కోసం వదిలివేయాలి, మొత్తం కాదు, అందులో సగం, ఇది నాకు న్యాయంగానే అనిపిస్తుంది.భారతదేశంలో, మీకు అలా లేదు. ఎవరికైనా 10 బిలియన్ల సంపద ఉంటే మరియు అతను చనిపోతే, అతని పిల్లలకు 10 బిలియన్లు వస్తాయి, ప్రజలకు ఏమీ లభించదు. అందులో సగం మీకు అందుతుందని, అందులో సగం ప్రజలకు అందుతుందని చట్టం చెబుతోంది. (sic)”

“కాబట్టి ఇవి ప్రజలు చర్చించాల్సిన సమస్యలే.ఆఖరున ఎలాంటి తీర్మానం చేస్తారో నాకు తెలియదు కానీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు, మేము కొత్త విధానాలు మరియు కొత్త కార్యక్రమాల గురించి,మరియు ఇది అతి ధనవంతుల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాము, (sic)” అని ఆయన చెప్పారు.

US నివాసిగా, శామ్ పిట్రోడా తన దేశంలో పన్నుగురించి ఒక ఉదాహరణ ఇస్తున్నారు, కానీ భారతదేశంలో అదే అమలు చేయాలని స్పష్టంగా ప్రతిపాదించటంలేదు.

ఈ ఇంటర్వ్యూపై బిజెపి నుండి విమర్శలు వచ్చినప్పుడు, శామ్ పిట్రోడా ఒక వివరణను జారీ చేసారు, “నేను టివిలో నా సంభాషణలో యుఎస్‌లో “యుఎస్ వారసత్వ పన్ను” ఉంటుందని సాధారణంగా ప్రస్తావించాను.నేను వాస్తవాలను ప్రస్తావించకూడదా? ప్రజలు చర్చించుకోవాల్సిన సమస్యలపై నేను మాట్లాడాను. దీనికి కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ విధానాలకి సంబంధం లేదు(sic).” ఆయన ఇంకా మాట్లాడుతూ, “55% తీసుకుంటామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? బీజేపీ, మీడియా ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.(sic)”

కాంగ్రెస్ పార్టీ తన వంతుగా, ఈ సమస్య నుండి దూరంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆలోచన లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. “రాజ్యాంగం ఉంది, మాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. అతని ఆలోచనలను మా పై ఎందుకు రుద్దుతున్నారు? ఓట్ల కోసమే ఈ ఆటలన్నీ ఆడుతున్నాడు…””

కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, “కాంగ్రెస్‌కు వారసత్వ పన్నును ప్రవేశపెట్టే ఆలోచన లేదు. వాస్తవానికి, ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1985లో ఎస్టేట్ డ్యూటీని రద్దు చేశారు.”

కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్  ఇలా అన్నారు, “ఎవరి బంగారాన్ని తీసుకోవాలో మరియు మహిళల మంగళసూత్రాన్ని లాక్కోవాలని (కాంగ్రెస్ మ్యానిఫెస్టో) ఎక్కడా మాట్లాడలేదు… మేనిఫెస్టో కమిటీలో శామ్ పిట్రోడా లేరు.ఇది మా ఎజెండాలో భాగం కాదు…ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఇతరుల వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకోలేరు మరియు అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం అని చెప్పలేరు.”

అందువల్ల, దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది మరియు ఇందులో నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

 

 

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

ప్రసిద్ధిచెందిన తిరుపతి లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా టెండర్ను తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు తిరస్కరించినట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారి వెల్లడించడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వచ్చాయి.

ఈ వార్త వైరల్‌గా మారింది, మరియు అనేక వార్తా సంస్థల ద్వారా కవర్ చేయబడింది. ఇదిలా ఉండగా, 2023 మేలో ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోకి అమూల్ ప్రవేశాన్ని వేలు ఎత్తి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం, KMF మరియు నందిని నెయ్యి ప్రయోజనాలను కాపాడడంలో విఫలమైందని ఆరోపిస్తూ అనేక వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ట్విట్టర్‌లోని సందేశాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు

FACT CHECK

ఈ సమస్య పై తీవ్ర వివాదం చెలరేగడం వలన, 50 సంవత్సరాల సరఫరా తర్వాత TTD ఎందుకు నందిని నెయ్యి సరఫరాను నిలిపివేసిందనే దానిపై వాస్తవాలను Digiteye India పరిశీలన చేసింది. టీటీడీకి నందిని నెయ్యి 50 ఏళ్లుగా నిరంతరాయంగా సరఫరా కావడం లేదని పరిశోధనలో వెల్లడైంది. 2019లోనే KMF యొక్క టెండర్ తిరస్కరించబడింది మరియు తమిళనాడు పాల బ్రాండ్ ఆవిన్‌కి ఆ కాంట్రాక్టు ఇవ్వబడింది. ప్రతి ఆరు నెలలకోసారి బిడ్డింగ్/టెండర్ జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుపతి లడ్డూలలో నందిని నెయ్యి మాయమైందన్న వార్తలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ” గత 20 ఏళ్లుగా కూడా KMF నెయ్యి సరఫరా చేస్తుందనడంలో వాస్తవం లేదన్నారు.అందువల్ల, 50 సంవత్సరాల వరకు “అంతరాయం లేకుండా” KMF సరఫరా చేస్తుందనడంలో వాస్తవం లేదు. టెండర్, వాస్తవానికి, తక్కువ బిడ్డర్‌కు వెళుతుంది, అయితే మార్చి 2023లో కర్ణాటకలో బిజెపి అధికారంలో ఉన్న సమయంలో జరిగిన తాజా టెండర్‌లో KMF పాల్గొనలేదని TTD ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (EO) స్పష్టం చేశారు.

కాబట్టి KMF “ఇప్పుడు” కాంట్రాక్ట్ పొందలేదనే వాదన నిజం కాదు.

అంతేకాకుండా, వార్తల్లో పేర్కొన్నట్లుగా నెయ్యి సేకరణ కేవలం ఒక సరఫరాదారుకు మాత్రమే పరిమితం కాదు. భారీ మొత్తంలో నెయ్యి అవసరం కావున ఒక సరఫరాదారు సరఫరా చెయ్యడం కష్టం. నందినితో పాటు ఆవిన్ వంటి ఇతర నెయ్యి బ్రాండ్‌లు కూడా గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు భారీ కాంట్రాక్టులను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కర్ణాటక ప్రభుత్వ వివరణ:

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషయంపై వెంటనే స్పందిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానంకి (టిటిడి) కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నుండి నందిని నెయ్యి సరఫరా బిజెపి హయాంలోనే ఆగిపోయిందని అన్నారు, మరియు టిటిడికి నందిని నెయ్యి సరఫరాను నిలిపివేయడం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న “హిందూ వ్యతిరేక” విధానానికి ఫలితం అని బిజెపి చేసిన ఆరోపణను కూడా ఖండించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని హిందూ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నందిని నెయ్యి సరఫరా నిలిపివేయడం ఈరోజు నిన్న జరిగిన విషయం కాదని సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీజేపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి సరఫరా నిలిచిపోయిదని ట్వీట్ చేశారు:”ಆಂಧ್ರಪ್ರದೇಶದ ತಿರುಪತಿಗೆ ನಂದಿನಿ ತುಪ್ಪ ಪೂರೈಕೆ ಸ್ಥಗಿತಗೊಂಡಿರುವುದು ಇಂದು, ನಿನ್ನೆಯ ವಿಚಾರವಲ್ಲ. ಕಳೆದ ಒಂದೂವರೆ ವರ್ಷದ ಹಿಂದೆಯೇ @BJP4Karnataka ಸರ್ಕಾರದ ಅವಧಿಯಲ್ಲಿ ತಿರುಪತಿಗೆ ತುಪ್ಪ ಪೂರೈಕೆಯನ್ನು ಸ್ಥಗಿತಗೊಳಿಸಲಾಗಿದೆ.” [ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నందిని నెయ్యి సరఫరా ఈరోజూ, నిన్నా ఆగలేదు, గత ఏడాదిన్నర క్రితం ఆగిపోయింది @BJP4Karnataka Govt.”] ఒరిజినల్ ట్వీట్ ఇక్కడ చూడండి:

ఇదే విషయాన్ని KMF అధ్యక్షుడు మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యే భీమా నాయక్  స్పష్టం చేశారు. KMF ప్రధాన సరఫరాదారు కాదని, వరుసగా మూడవ స్థానంలో ఉందని, L1 మరియు L2 బిడ్డర్‌ల తర్వాతనే సరఫరా చేయాల్సి ఉంటుందని వివరించారు.
ప్రసిద్ధిచెందిన GI-ట్యాగ్ చేయబడిన లడ్డూలను తయారు చేయడానికి 1,400 టన్నుల నెయ్యిని సరఫరా చేయడానికి ప్రతి ఆరు నెలలకోసారి TTD టెండర్‌ను ఆహ్వానిస్తుంది, అందువల్ల డిమాండ్‌ను KMF మాత్రమే చెయ్యలేదు.

‘కేఎంఎఫ్ (KMF)2005 నుంచి 2020 వరకు తిరుపతికి నందిని నెయ్యి సరఫరా చేసింది… డిమాండ్‌లో 45 శాతం మాత్రమే మేం సరఫరా చేస్తాము.. 2020 నుంచి ఎల్‌3 సరఫరాదారులం.ఎల్1, ఎల్2 బిడ్డర్ల సరఫరా చేసిన తర్వాత మేము సరఫరా చేస్తాము. 2021లో 2022 లో TTD వారు సరఫరా కోసం లేఖ రాశారు, తదనుగూనంగా KMF 345 మెట్రిక్ టన్నుల నందిని నెయ్యిని సరఫరా చేసింది,” అని నాయక్ మీడియాకు తెలిపారు. కాబట్టి, తిరుపతి లడ్డు ఇప్పుడు మాత్రమే నందిని నెయ్యి  లేకుండా తయారవుతుందనే వాదన కూడా తప్పు.

Claim/వాదన: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నందిని అంశాన్ని రాజకీయం చేసి అమూల్‌పై దుష్ప్రచారం చేసి కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం KMF బిడ్‌ను TTD తిరస్కరించింది.

నిర్ధారణ: KMF అంతకుముందు కూడా బిడ్‌ను కోల్పోయింది, తద్వారా నెయ్యి సరఫరా నిలిపివేయబడింది. 2023 మార్చిలో BJP అధికారంలో ఉన్నప్పుడు KMF అసలు వేలంపాటలో పాల్గొనలేదు.

Rating: Misrepresentation —

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి RRR చిత్రంలో రామ్ చరణ్‌ గురించి మాట్లాడుతున్నారా? ANI వీడియో పైన Fact Check

జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి మరియు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలుగుసినిమా ‘RRR’ పై అభిప్రాయాలను వ్యక్తం చేసిన చిన్న ANI వీడియో క్లిప్ Youtubeలో షేర్ చేయబడుతోంది.

ఇంటర్వ్యూలో, వార్తా సంస్థకు చెందిన ఇంటర్వ్యూయర్ (ఇంటర్వ్యూయర్ తన పేరు వెల్లడించలేదు)జపాన్ విదేశాంగ మంత్రికి RRR హీరో రామ్ చరణ్ పేరును సూచించి, మంత్రులిద్దరూ ఇంటర్వ్యూ పూర్తి చేసే ముందు సినిమా నుండి ఒక Dance step వేయాలని సూచించారు, దానికి జైశంకర్ వినయపూర్వకముగా , “లేదు, నేను డ్యాన్స్ చెయ్యను.” అని సమాధానమిచ్చారు.

(Film Rrr Song Naatu Naatu,जापानी विदेश मंत्री बोले- RRR फेवरेट फिल्म, जयशंकर ने कहा- नाटू नाटू पर नाचूंगा नहीं – japanese foreign minister said rrr favorite film jaishankar said i will not dance on natu natu) – https://t.co/yX7VHvE6x3#Ghaziabad365

— गाज़ियाबाद365 (@Ghaziabad365) July 29, 2023

వార్తా సంస్థలు ద్వారా అప్‌లోడ్ చేయబడిన వీడియో క్లిప్ ఇక్కడ ఉంది Zee News మరియు Ghaziabad365

FACT CHECK

భారతీయులందరికీ RRR చిత్రం గురించి సుపరిచితం, ఇందులో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్‌టి రామారావు (జూనియర్ ఎన్‌టిఆర్‌గా ప్రసిద్ధి చెందారు) ఇద్దరూ నటించారు మరియు “నాటు, నాటు” పాట ఆస్కార్ గెల్చుకున్నందువలన ఈ సంభాషణ వీక్షకుల ఉత్సాహాన్ని మరింత పెంచింది.

జపాన్ మంత్రి హయాషి నటుడి యొక్క సరైన మరియు పూర్తి పేరుని గుర్తుకు తెచ్చుకోలేకపోయారు, కానీ స్పష్టంగా రావు అని చెప్పారు మరియు ఇంటర్వ్యూలో మళ్లీ జూనియర్ అని పునరావృతం చేశారు.హీరో తనలాగే కనిపిస్తాడనే విషయాన్ని మరింత విశదీకరించడం తెలుస్తుంది.కానీ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి రామ్ చరణ్ పేరును సూచిండతో, వీడియోలో సంభాషణ అలానే కొనసాగుతుంది.

ఇవి వాస్తవాలు:

ముందుగా, మంత్రి తనలా బొద్దుగా కనిపించే వ్యక్తిని ప్రస్తావించారు. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ఇద్దరి పోలిక చూడండి.ఇద్దరి నటుల ఫోటోలను చూడండి.జూనియర్ ఎన్టీఆర్‌తో పోలిస్తే రామ్ చరణ్ సన్నగా ఉంటాడు.

రెండవది, మంత్రి రావును ప్రస్తావించి, మళ్లీ రావు జూనియర్ అని పునరావృతం చేశారు, ఈ రెండు సూచనలు ఆయన ఎన్టీఆర్‌ని ఉద్దేశించి చెబుతున్నట్లు సూచిస్తున్నాయి కాని రామ్ చరణ్‌ని కాదు.రామ్ చరణ్‌కి రావు ఇంటిపేరు లేదు. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి పేరు నందమూరి తారక రామారావు, జూనియర్.

సినిమాలోను మరియు పాటలోను ఆయన ఎన్టీఆర్‌ని ఉద్దేశించి చెబుతున్నట్లు తెలుస్తున్నప్పటికి, ఇంటర్వ్యూయర్ రామ్ చరణ్ పేరును సూచించాడు.రామ్ చరణ్‌ని ఉద్దేశించి మాట్లాడుతున్నారెమో అన్న తప్పుడు అభిప్రాయంతో సంభాషణ కొనసాగుతుంది.కాని జపాన్ విదేశాంగ మంత్రి స్పష్టంగా Jr NTRన గురించి మాట్లాడుతున్నారన్నది నిజం.మరుసటి రోజు అనేక వార్తా సంస్థలు ఇదే విషయాన్ని నివేదించాయి.

Claim/వాదన: జపాన్ విదేశాంగ మంత్రి యోషిమాసా హయాషి తన ఇంటర్వ్యూలో RRR చిత్రం నుండి రామ్ చరణ్ పేరును ప్రస్తావించారు.
నిర్ధారణ: కాదు, మంత్రి తన ఇంటర్వ్యూలో RRR చిత్రంలోని మరొక నటుడైన Jr NTR గురించి ప్రస్తావించారని స్పష్టమవుతుంది.
Rating: Misleading —

 

 

ప్రకాష్ రాజ్ అసలు పేరు ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్ అని ఆరోపించారు; నిజం ఏమిటి?

ప్రధాని నరేంద్రమోడీ, ఆర్ఎస్ఎస్ విమర్శకుల్లో ఒకరైన ప్రకాష్ రాజ్, గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా పై విపరీతమైన ద్వేషపూరిత ప్రచారాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు, ఫేస్బుక్ లో ఒక పోస్ట్ ఈ నటుడి యొక్క అసలు పేరు ‘ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్’ అని పేర్కొంది. ఇతర సోషల్ మీడియా యూజర్లు తన అసలు పేరు ‘ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్’ (RAI) అని ఆరోపించారు. తన పేరును ప్రకాష్ రాజ్ గా మార్చుకున్నాడని, తన అసలు పేరుని ఎందుకు ఉపయోగించకూడదు అని ప్రశ్నించారు.

పోస్ట్ కార్డ్ న్యూస్ ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ యొక్క అసలైన పేరు ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్ అని ఆరోపించి, ప్రకాష్ రాజ్ క్రిస్టియన్ మిషనరీలతో కలిసి దేశంలో హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పేర్కొంది. ఇంకొకరు తన అసలు పేరు ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్ అని పేర్కొంది. కాబట్టి ప్రకాష్ రాజ్ రియల్ పేరు ఏమిటి? ప్రకాష్ ఎడ్వర్డ్ రాయ్? లేదా ప్రకాష్ ఆల్బర్ట్ రాజ్?

 

మా రీసర్చ్ లో ప్రకాష్ రాజ్ మార్చి 26, 1965 న, మధ్యతరగతి కుటుంబంలో బెంగళూరులో జన్మించారు. అతని తండ్రి పేరు మన్జునాథ్ రాయ్, అతని తల్లి పేరు స్వర్ణలత. ప్రకాష్ రాజ్ ప్రారంభంలో తన తల్లిదండ్రులచే ప్రకాష్ రాయ్ గా పిలువబడ్డాడు. ప్రముఖ తమిళ దర్శకుడు కె.బాలచందర్ అతనిని ఇంట్రడ్యూస్ చేసిన పిక్చర్లో ప్రకాష్ రాజు గా మార్చాడు అని ప్రకాష్ రాజ్ తనే స్వయంగా న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఈ తమిళ చిత్రం 1994లో విడుదల అయింది దాని పేరు ‘డ్యూయెట్’. కె.బాలచందర్ దర్శకత్వం వహించాడు. ఆ సమయంలో, తమిళనాడు మరియు కర్నాటక మధ్య కావేరి నీటి సమస్యపై ఉద్రిక్తత అధికంగా ఉండింది. ప్రకాష్ యొక్క ఇంటిపేరు ‘రాయ్’ కన్నడ పేరని ఈజీగా తెలిసిపోతుందని, బాలాచందర్ దానిని రాజ్ కు మార్చాలని నిర్ణయించుకున్నాడు. దానికి ప్రకాష్ అంగీకరించాడు.

“బాలచందర్ నా మతం లేదా నా రాష్ట్రాన్ని ఎప్పుడూ చూడలేదు, అతను తన కథలను చెప్పే వ్యక్తిని కోరుకున్నాడు,” అని ప్రకాష్ రాజ్ స్వయంగా చెప్పారు. మరి ఇందులో ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు దీన్ని పెద్ద సమస్యగా పరిగణిస్తున్నారు? ప్రకాష్ రాజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ యువతకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి రూ. 3,000 కోట్లు పెట్టి పటేల్ విగ్రహం కట్టించడం తప్పని పలుచోట్ల పేర్కొన్నారు. దీనికి ఈ విధంగా ప్రకాష్ రాజ్ అనుచితంగా విమర్శించడం జరిగింది. ఇది ఫేక్ న్యూస్.

వీడియో ఎడిట్ చేసి, మోడి ప్రజల కష్టాలను హాస్యాస్పదంగా తీసుకున్నాడని ఆరోపించడం జరిగింది

ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్లో భారత కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ఒక పాత వీడియో కొన్ని భాగాలు కత్తిరించి మోడీ ప్రజల కష్టాలను హాస్యాస్పదంగా తీసుకున్నాడని ఈ వీడియో ద్వారా పట్టించడానికి తప్పుదోవ పట్టించడానికి జరిగింది.

నవంబరు 8, 2016 మోడీ ప్రభుత్వం రూ .500 మరియు 1000 రూపాయల నోట్లు నిలిపివేయాలని ప్రకటించిన వెంటనే గందరగోళానికి గురయ్యింది. 2016 నవంబర్ 12 న జపాన్ దేశంలో పర్యటన సందర్భంగా భారత కమ్యూనిటీ సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగం యొక్క భాగాలు మోడీ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను గురించి హాస్యమాడుతున్నాయని తెలిపే విధంగా చిత్రీకరించడం చేయబడింది.


జపాన్ లో మాట్లాడిన వీడియో 32 నిమిషాలు వ్యవధి అయితే  దానిని ఎడిట్ చేసి ఒక్క నిమిషంలో మోడీ మాట్లాడిన మాటలు జతచేర్చి, మోడీ ప్రజల కష్టాలను హాస్యాస్పదంగా తీసుకున్నాడని ఆరోపణ చేశారు ట్విటర్ యూజర్ @ కిలాఫెట్. 39-సెకండ్ వీడియోతో @ కిలాఫెట్ ఇలా ట్వీట్ చేశాడు: “ఇది సాధారణ వ్యక్తి కాదా? ఒక ప్రధాని ఎలా ప్రవర్తించాలి?… బిజెపికి ఓటు వేయవద్దు. #BJPKiVoteBandiడిక్లేర్ చేద్దాం.”

ఈ పోస్ట్ 200 కంటే ఎక్కువ retweets చేయబడింది మరియు 300 మంది ఇష్టపడ్డారు. @ కిలాఫెట్ యొక్క బయో అతను కాంగ్రెస్ మద్దతు దారుడు అని తెలుపుతోంది. ఒక పాత వీడియో తప్పుదోవ పట్టించే విధంగా వినియోగించడం జరిగింది. కానీ ఒరిజినల్ వీడియో ప్రకారము మోడీ  demonetisation హాస్యాస్పదంగా చేయడం జరగలేదు. ప్రజలు పడ్డ కష్టాలన్ని వర్ణించి వారికి అభివాదం చేయడం జరిగింది. కానీ ఆ విషయాన్నిదాచి పెట్టి కొత్త వీడియో సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టడం జరిగింది.

ఈ పోస్ట్ను 2018 ఆగస్టు 30 న తన వీడియోతో share చేసాడు. ట్విట్టర్, ఫేస్బుక్ పోస్టులపై వ్యాఖ్యానిస్తూ చాలామంది మోడీతో నిరాశకు గురవుతున్నారుఅని ఆరోపణ చేశారు. కానీ ఒరిజినల్ వీడియో ప్రకారము మోడీ  demonetisation హాస్యాస్పదంగా చేయడం జరగలేదు.

ఇందిరా గాంధీ vs సర్దార్ పటేల్ పాత చిత్రం?

అక్టోబర్ 31సర్దార్ వల్లభాయి పటేల్ యొక్క జయంతి జరుపుకునే దినం దేశం మొత్తంలో ఈరోజు సమైక్యత దినంగా పాటిస్తారు అదే రోజు ప్రధాని ఇందిరాగాంధీని  స్వంత రక్షణ బట్టలే కాల్చిచంపిన దురదృష్టకరమైన దినం.

కానీ రాజకీయాల్లో దీన్ని ఎలా హలో అందరికీ చాలా బాగా తెలుసు. అక్టోబరు 31, 2018 న కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కేరళలోని తిరుపతిపురంలో ఉన్నారు. ఆయన ఐదారు కార్యక్రమాల్లో పాల్గొని ఇందిరాగాంధీకి పుష్పార్చన చేశారు.  ఈ కార్యక్రమాల్లో అన్ని చోట్ల ఇందిరాగాంధీ పటం మీద అర్చన జరిగింది.

కానీ ఒక పురాతన  ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో సర్దార్ పటేల్ ఫోటో పెట్టి పుష్పార్చన నిర్వహించారు.  ఇందిరా గాంధీ ఫోటో చాలా పెద్దగా ఉంది,  సర్దార్ పటేల్ ఫోటో చాలా చిన్నగా ఉంది అని ఎవరు గమనించలేదు.

ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమంలో,  అక్టోబర్ 31న సర్దార్ పటేల్ యూనిటీ statue  ఆవిర్భవించిన సందర్భంలో,  పాత ఫోటోవెలికి తీసి ఫేస్ బుక్ లోనూ, ట్విట్టర్ లోను పెట్టి,  కాంగ్రెస్ ఈ విధంగా వేరే సైజులలో ఫోటోలు పెట్టి సర్దార్ పటేల్ ను అవమానిస్తున్నారు అని పేర్కొనడం జరిగింది.  పటేల్ యొక్క statue ఆఫ్ యూనిటీ ఆవిష్కరణ  వారికి కలిసి వచ్చింది.

కానీ రెండు వేర్వేరు సందర్భాలలో ఉపయోగించిన ఫోటోలు.  2018 లోపసుపు రంగులో ఉన్న కుర్తా ధరించి, అదే దుస్తులలో అనేక విధాలుగా థరూర్ కనిపించాడు,  కాబట్టి ఇది ఈ సంవత్సరం ఫోటో కాదు. పురాతన ఫోటో.  ఈ విధంగా,  ప్రజల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా  సోషల్ మీడియాలో  వదంతులు వ్యాపించడం జరిగింది.