ఇరాన్ క్షిపణి దాడుల సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బంకర్ వద్దకు పరిగెత్తుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఇరాన్ క్షిపణి దాడుల నుండి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పరిగెడుతున్నట్లు వీడియోలోని వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుగా చూపించే ప్రయత్నం.ఇరాన్ క్షిపణి దాడికి ప్రతిస్పందనగా నెతన్యాహు పారిపోతున్నట్లు చూపుతున్న వీడియో తప్పు.ఇది నెస్సెట్‌లో కీలకమైన పార్లమెంటరీ ఓటు కోసం పరిగెడుతున్నట్లు,నెతన్యాహు స్వయంగా పోస్ట్ చేసిన 2021 నాటి వీడియో ఫుటేజ్.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

మంగళవారం రాత్రి ఇరాన్ క్షిపణి దాడులు టెల్ అవీవ్‌ను ఢీకొన్న తర్వాత,ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడులకు ప్రతిస్పందనగా కారిడార్‌లో పరుగెత్తుతు బంకర్‌కు పారిపోతున్నాడని వినియోగదారులు పేర్కొంటున్న పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పోస్ట్‌తో ఉన్న క్యాప్షన్ ఇలా ఉంది: “ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పిరికివాడిలా పరిగెత్తుతున్నారు. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల దాడులతో తన ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటున్నాడు.” మరో పోస్ట్ ఇలా ఉంది, “ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీస్తున్నాడు. అతను ఎన్ని రోజులు బంకర్‌లో దాక్కుంటాడు?”

ఇలాంటి వాదన/దావలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

వాస్తవ పరిశీలన వివరాలు:

వీడియోలోని యొక్క కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Digiteye India బృందం Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో అన్వేషించగా ఈ వీడియో మూడేళ్ల పాతదని మరియు వేరే సందర్భంలో తీసినదని గమనించాము. క్రింద చూసినట్లుగా దీనిని నెతన్యాహు స్వయంగా తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో హీబ్రూ భాషలో డిసెంబర్ 14, 2021న పోస్ట్ చేసారు:

తెలుగులోకి అనువదించగా, నెతన్యాహు ఇలా పోస్ట్ చేసారు: “మీ కోసం పరిగెత్తడానికి నేను ఎల్లప్పుడూ గర్వపడుతున్నాను. ఇది నెస్సెట్‌లో అరగంట క్రితం తీయబడింది.” నెతన్యాహు ఇజ్రాయెల్ పార్లమెంట్‌లోని నెస్సెట్‌లో ఉన్నప్పుడు, ఆ సమయంలో ప్రతిపక్ష అధిపతిగా సమావేశానికి హాజరయ్యేందుకు నడుస్తున్నప్పుడు వీడియో తీయబడిందని ఇది నిర్ధారిస్తుంది.
డిసెంబరు 2021 నాటి కొన్ని హిబ్రూ వార్తా నివేదికలు ఆయన నెస్సెట్ ప్లీనంలో ఓటు సమయానికి చేరాలని పరుగెత్తుతున్నట్లు కూడా సూచిస్తున్నాయి. అందువల్ల, ఆయన ఇరాన్ క్షిపణి దాడి నుండి పారిపోతున్నాడనే వాదన తప్పు.

మరి కొన్ని వాస్తవ పరిశీలన  కధనాలు:

మాల్దీవుల నుంచి 28 దీవులను భారత్ కొనుగోలు చేసిందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియోలో కమలా హారిస్ ‘Xని షట్ డౌన్ చేయాలి’ అన్నారా? వాస్తవ పరిశీలన

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *