Tag Archives: telugu fact checking

భారతదేశంలో పోస్ట్ మాస్టర్ ఎంపిక ఈ విధంగా జరుగుతుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది ; వాస్తవ పరిశీలన

ఒక వ్యక్తి లైఫ్ జాకెట్ ధరించి, సన్న, పొడవాటి చెక్క ప్లాంక్ వంతెన పై చాలా జాగ్రత్తగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నట్టు చూపించే వీడియో ఫేస్‌బుక్ రీల్స్‌లో వైరల్‌గా మారింది.వాదన/దావా ఇలా ఉంది: “భారతదేశంలో పోస్ట్‌మాస్టర్‌ను ఈ విధంగా ఎంపిక చేస్తారు.”

https://www.facebook.com/reel/1460175761597788

FACT CHECK

వాస్తవాన్ని పరిశీలించడం కోసం Digiteye India team వీడియో యొక్క కీలక ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో పరిశీలించగా,వాస్తవానికి నేపాల్‌లోని కపిల్వాస్తులో జరిగిన సైకిల్ బ్యాలెన్స్ అడ్వెంచర్ గేమ్‌లోని వీడియో అని వెల్లడించే ‘అసలు వీడియో లింక్‌ని’ మేము గమనించాము.ఛానెల్ సచిన్ భట్టారాయ్ ద్వారా అప్‌లోడ్ చేయబడింది, వీడియో వివరణలో ఇలా ఉంది:

“2nd CYCLE PLANK BALANCE:’సైకిల్ ప్లాంక్ బ్యాలెన్స్ పోటీ’ రెండవ ఎడిషన్ టైటిల్‌ను మానిక్ శ్రేష్ఠ గెలుచుకున్నారు.బంగాంగ మునిసిపాలిటీ 3లోని పర్యాటక ప్రదేశమైన రాజపాని వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ కపిల్వాస్తు నిర్వహించిన పోటీలో,అతను 52 మీటర్ల ట్రాక్‌ను దాటడానికి 1 నిమిషం 56 సెకన్లు లో పూర్తి చేసి టైటిల్‌ను గెలుచుకున్నాడు.ధరన్‌కు చెందిన అనిస్ తమంగ్ రెండో స్థానంలో నిలిచాడు. అతను నిర్దేశించిన దూరాన్ని 1 నిమిషం 25 సెకన్లలో అధిగమించాడు. అదేవిధంగా కపిల్వాస్తుకు చెందిన శుభం భట్టై మూడో స్థానంలో నిలిచారు. అతను 40.86 సెకన్లు సెకన్లు లో పూర్తి చేయగా, అరుణ్ ఆర్యల్ నాలుగో స్థానంలో నిలిచాడు.”

‘సైకిల్ ప్లాంక్ బ్యాలెన్స్ అడ్వెంచర్’ గేమ్ దిగువన చూపించినట్లు YouTubeలో విస్తృతంగా షేర్ చేయబడింది:

ఆ వీడియో ఇండియాది కాక నేపాల్‌కి చెందినది.అంతేకాకుండా భారతదేశంలో పోస్టల్ సిబ్బంది ఎంపికకి మార్కులు,మరియు ఎంపిక పరీక్షలో మెరిట్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి, వాదన/దావా తప్పు.

వాదన/Claim:వీడియోలో చెక్క ప్లాంక్ వంతెన పైన చాలా జాగ్రత్తగా సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని చూపిస్తూ, భారతదేశంలో పోస్ట్‌మాస్టర్‌ను ఈ విధంగా ఎంపిక చేస్తారనేది వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. భారతదేశంలో పోస్ట్ మాస్టర్ కోసం అలాంటి ఎంపిక విధానం ఏది లేదు మరియు అది నేపాల్‌లోని కపిల్వాస్తులో జరిగిన పోటీ యొక్క వీడియో.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

మరి కొన్ని Fact Checks:

భారతదేశంలో ఇప్పుడు కొత్త రైలు ట్రాక్ యంత్రాలు ఉపయోగించబడుతున్నాయని వైరల్ వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కాకముందు ఉత్తర ప్రదేశ్ లో కేవలం 2 విమానాశ్రయాలు మాత్రమే ఉన్నాయా? వాస్తవ పరిశీలన

న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim:న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదనతో వీడియో షేర్ చేయబడింది.

నిర్ధారణ/Conclusion:తప్పు.న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వీడియో కాదు.అది బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ రోజువారీ ప్రార్థనలో ఉన్న వీడియో.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

వీడియోలో చేతులు జోడించి హిందూ ఆచారాలను నిర్వహిస్తున్న విదేశీయుడు న్యూజిలాండ్ హోం మంత్రి అని మరియు ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదన X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది.

The video had garnered over two lakh views already and can be seen here and here.

FACT CHECK

న్యూజిలాండ్‌కు సంబంధించిన హోం మంత్రి వివరాల కోసం Digiteye India బృందం పరిశీలించగా,అలాంటి మంత్రిత్వ శాఖ లేదా దానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిలు దొరకలేదు కానీ,ప్రతుస్తం బ్రూక్ వాన్ వెల్డెన్ న్యూజిలాండ్‌ అంతర్గత వ్యవహారాలు & వర్క్‌ప్లేస్ రిలేషన్స్ అండ్ సేఫ్టీ మంత్రిగా పని చేస్తున్నట్టు గమనించాము.
మరియు, వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా వీడియోలో ఉన్న వ్యక్తి బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ అని ఫలితాలు వెల్లడయ్యాయి.

సోషల్ మీడియా హ్యాండిల్ ప్రకారం, బ్రెంట్ గ్లోబ్ ప్రస్తుతం గోవాలోని అంజునాలో నివసిస్తూ, అన్ని వయసుల వారికి యోగా నేర్పిస్తున్నారు.అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించినప్పుడు, అతను నవంబర్ 2, 2023న పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోను గమనించాము.
వీడియో కాప్షన్ ఈ విధంగా ఉంది, “గత రాత్రి అలెక్స్ నామకరణ కార్యక్రమం జరిగింది. హిందూ మతం నా పెంపకంలో భాగం కానప్పటికీ, నా భార్య మరియు అత్తమామలకు ముఖ్యమైన ఆచారాలలో పాల్గొనడం నాకు చాలా ఇష్టం. నా కొడుకుకు అందమైన జీవితం ఉండాలని,అవసరమైన సవాళ్లును ఎదురుకుంటూ పోరాడాలని,మనస్ఫూర్తిగా ప్రేమించాలని కోరుకుంటున్నాను”.

 

యోగా టీచర్ వీడియో న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నట్లుగాషేర్ అవుతోంది.

మరి కొన్ని Fact Checks:

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

 

 

ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’ అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేసారా ; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేశారని ఒక వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. ఎలోన్ మస్క్ యొక్క ‘X’ లేదా Twitter ఖాతా నుండి అటువంటి ప్రత్యుత్తరం ఏదీ కూడా ఇవ్వబడలేదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం– 

వాస్తవ పరిశీలన వివరాలు

‘X’లో స్క్రీన్‌షాట్‌తో కూడిన ట్వీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలోన్ మస్క్ చేశారంటూ, ఒక వాదన షేర్ చేయబడుతోంది.

ఎవరో “నువ్వు పెడోఫిల్ అని బూటకపు ప్రచారం చేస్తున్నారని” ఒక వినియోగదారుని హెచ్చరికకు,వెంటనే “అది బూటకం కాదు. నేను పెడోఫిల్‌ని” అని మస్క్ చేసిన ప్రత్యుత్తరం కనిపించింది.

పోస్ట్‌కి ఒక్క రోజులో దాదాపు 28,000 లైక్‌లు వచ్చి వైరల్ అయ్యింది, మరియు ఎక్కువ మంది వినియోగదారులను చర్చలో పాల్గొనేలా చేసింది.

FACT CHECK

ట్విట్టర్ ఎకౌంటు చూడగానే అనుమానాస్పదంగా కనిపించడంతో Digiteye India టీమ్ వాస్తవ పరిశీలనకు పూనుకుంది.సాధారణంగా, మస్క్ అధికారిక Twitter ఖాతాలో వైలెట్ రంగులో సబ్‌స్క్రయిబ్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది, కానీ “నేను పెడోఫైల్” అని పేర్కొన్న ఖాతాలో “ఫాలో” బటన్ ఉంది.

మరియు,మేము మస్క్ ఫీడ్‌ యొక్క పరిశీలన ప్రకారం, మరియు సోషల్ బ్లేడ్ యొక్క గణాంకాల ప్రకారం కూడా అటువంటి ట్వీట్ అతని ఖాతాలో లేదని,లేదా తొలగించబడిన పోస్ట్‌లలో కూడా లేదని తెలుసుకున్నాము.

కావున ఈ వాదన తప్పు.

మరి కొన్ని Fact Checks:

జో బిడెన్, రిషి సునక్, జస్టిన్ ట్రూడో రామమందిర కార్యక్రమానికి హాజరయ్యారని ఒక వీడియో ద్వార దావా చేయబడింది; వాస్తవ పరిశీలన

అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన

 

 

విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తుందా? గతంలోని వాదన మళ్లీ షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/CLAIM: ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తోందనేది వాదన.

నిర్ధారణ/CONCLUSION: వాదన/దావా పూర్తిగా తప్పు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తమ ఏ ప్రాజెక్టుల కింద అలాంటి పథకాన్ని ఏది కూడా ప్రారంభించలేదు.

రేటింగ్:పూర్తిగా తప్పు

Fact Check వివరాలు:

ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందజేస్తోందన్న సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఉచిత పథకాన్ని ప్రారంభించిందని వైరల్ సందేశం పేర్కొంది.

వైరల్ సందేశం ఈ విధంగా ఉంది:

“విద్యార్థుల ల్యాప్‌టాప్ పథకం 2024′ కోసం దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి

ఆర్థిక కారణాల వల్ల సొంతంగా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే పరిస్థితిలో లేనివారు మరియు వారి విద్యా స్థాయిలో ల్యాప్‌టాప్ అవసరమయ్యే విద్యార్థులందరికీ ఈ పథకం అమలు చేయబడుతుంది

2024లో 960,000 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఉచిత ల్యాప్‌టాప్ ఇవ్వబడుతుంది

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది మరియు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ల్యాప్‌టాప్‌లను అందుకోవడం జరుగుతోంది

ఇక్కడ నమోదు చేసి దరఖాస్తు చేసుకోండి.”

మెసేజ్/సందేశానికి లింక్ కూడా జత చేయబడింది.ఈ వాదన సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడింది.వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వాదనని యొక్క వాస్తవాన్ని పరిశీలన చేయమని Digiteye Indiaకి అభ్యర్థన వచ్చింది.

FACT CHECK/వాస్తవ పరిశీలన

Digiteye India బృందం అటువంటి పథకం ఏదైనా ప్రారంభించబడిందా అని అనేక ప్రభుత్వ వెబ్‌సైట్‌లను పరిశీలించగా, ప్రభుత్వం నుండి అటువంటి సమాచారం ఏది కూడా పోస్ట్ చేయబడలేదు.

Digiteye India బృందం సందేశం లో జత పరిచిన వెబ్‌సైట్ లింక్‌ను పరిశీలించగా, లింక్ వినియోగదారుని “https://lii.ke/STUDENTS-FREE-LAPT0PS” కి మళ్లిస్తుంది, మరియు కుదించబడిన లింక్ ఇవ్వబడింది.

స్కామర్‌లు తమ ఫిషింగ్ స్కామ్‌లను కొనసాగించడానికి తరచుగా కుదించబడిన లింక్లను ఇస్తారు. లింకుని గమనిస్తే, లింక్‌లోని ‘ల్యాప్‌టాప్’ అనే పదం ‘lapt0ps’ అని వ్రాయబడింది, ఇక్కడ Oకి బదులుగా 0 (సున్నా) ఉపయోగించబడింది.

ఈ స్కామ్‌పై మరిన్ని ఆధారాల కోసం మేము సోషల్ మీడియా మరియు ఇతర వార్తా సంస్థలను పరిశీలించగా, ఆగస్ట్ 31, 2023న PIB(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ఫ్యాక్ట్ చెక్ బృందం వారు చేసిన ట్వీట్‌ మా దృష్టికి వచ్చింది. వారు తమ ట్వీట్‌లో ప్రభుత్వం ఎలాంటి ఉచిత ల్యాప్‌టాప్ పథకాలను ప్రారంభించలేదని పేర్కొన్నారు.

“ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2023 కింద భారత ప్రభుత్వం యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందనే ఆరోపణ సోషల్ మీడియాలో ఒక నోటీసు ద్వారా ప్రచారం జరుగుతోందని, వారు పేర్కొన్నారు.అది #ఫేక్ నోటీసు . @EduMinOfIndia,GOI ద్వారా అలాంటి పథకం ఏదీ అమలు చేయబడటం లేదు.”

కింద ఇచ్చిన విధంగా,మార్చి 16, 2023న ఇదే విధమైన దావాను PIB ఫాక్ట్ చెక్ కొట్టిపారేసింది.
ప్రధాన మంత్రి ఉచిత ల్యాప్‌టాప్ పథకం 2023 కింద భారత ప్రభుత్వం యువతకు ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందనే ఆరోపణ సోషల్ మీడియాలో ఒక నోటీసు ద్వారా ప్రచారం జరుగుతోంది,కానీ అది #ఫేక్ నోటీసు . @EduMinOfIndia,GOI ద్వారా అలాంటి పథకం ఏదీ అమలు చేయబడటం లేదని”,వారు తమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘Digiteye India’ బృందం వారు వాట్సాప్ ఫార్వార్డ్‌లలో అందుకున్న ఎలాంటి లింక్‌లను క్లిక్ చేయవద్దని దాని పాఠకులను హెచ్చరిస్తుంది. ఇటువంటి లింక్‌లు ఫిషింగ్ మరియు వినియోగదారుడి ఫోన్ నంబర్, IP చిరునామా ద్వారా వారి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించవచ్చు.

కాబట్టి, ఈ వాదన/దావా తప్పు.

మరి కొన్ని Fact Checks:

రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన

ప్రధాన మంత్రి బేరోజ్‌గార్ భట్టా యోజన కింద నిరుద్యోగ యువతకు ప్రభుత్వం నెలకు రూ. 3,000 భృతిని అందజేయటంలేదు; Fact Check

ఈ వీడియోలో కేరళ దేవాలయంలోని ప్రసిద్ధ శాఖాహార మొసలిని గురించి తెలుపుతున్నారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో బబియా అనే శాఖాహార మొసలిని చూపిస్తూ ఒక వీడియో వైరల్ అవుతోంది, మరియు మొసలి గుడిలోని ప్రసాదం మాత్రమే తింటుందనేదొక వాదన.

నిర్ధారణ/Conclusion: కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం సరస్సులో శాకాహార మొసలి బబియా నివసిస్తుందనేది నిజం. అయితే, బబియా 2022లో మరణించింది మరియు ఒక సంవత్సరం తర్వాత సరస్సులో కొత్త మొసలి కనిపించింది.వైరల్ వీడియోలో బాబియా యొక్క కొన్ని చిత్రాలు మాత్రం కనబడుతాయి, అన్నీ కాదు. చిత్రాలలో ఒకటి కోస్టారికాకు చెందిన వ్యక్తి, గాయపడిన మొసలికి వైద్యం చేసి తిరిగి ఆరోగ్యవంతంగా చేసి, దాంతో అతనికి మొసలితో అనుబంధం ఏర్పడడం వంటి నేపథ్యంలో తీసిన డాక్యుమెంటరీ నుండి తీసుకోబడింది.

రేటింగ్: తప్పు దారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు:

కేరళ దేవాలయంలోని చెరువులో శాకాహార మొసలి నివసిస్తోందని తెలిపే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయ సరస్సులో మొసలి నివసిస్తోందని ఆ వీడియో పేర్కొంది. వీడియోలో మొసలి ముక్కుపై ఒక వ్యక్తి తన తలను ఉంచే దృశ్యాలను చూడవచ్చు మరియు మొసలి పేరు బబియా అని, ఆలయ పూజారి మొసలికి ఆలయం నుండి బియ్యం ప్రసాదం కూడా అందజేస్తారని ఒక వాదన.

ఈ వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందొ పరిశీలన చేయమని Digiteye Indiaకి వాట్సాప్‌లో అభ్యర్థన వచ్చింది.

FACT CHECK

Digiteye India బృందంవారు Googleలో Babiya కోసం వెతకగా అనేక ఆన్‌లైన్ వార్తాపత్రికలు నుంచి సమాచారం కనిపించగా, అందులో ఒకటి అక్టోబర్ 10,2022న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించబడిన కథనానికి దారితీసింది. ఏడు దశాబ్దాలకు పైగా ఆలయ చెరువులో నివసిస్తున్న బబియా మరణించినట్లు మరియు మొసలి “ఆలయం వారు సమర్పించే బియ్యం, బెల్లం ప్రసాదాలను మాత్రమే తినేదని” అని నివేదిక పేర్కొంది.

బాబియా మరణించిన ఒక సంవత్సరం తర్వాత, ఆలయ సరస్సులో మరొక మొసలి కనిపించిందని నవంబరు 13, 2023న ప్రచురించబడిన ‘ది హిందూ’ యొక్క మరొక నివేదిక పేర్కొంది. సరస్సులోకనిపించడం ఇది మూడో మొసలి అని ‘ది హిందూ’ పత్రిక పేర్కొంది.

అయితే, వైరల్ వీడియోలో ఉపయోగించిన అన్ని విజువల్స్ బాబియాకి సంబంధించినవి కావు.

మేము అన్ని విజువల్స్‌పై రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించగా, మొసలి ముక్కుపై ఒక వ్యక్తి తల ఉంచిన చిత్రం కేరళలోని దేవాలయం నుండి కాదని గమనించాము.ఇది 2013లో “ది మ్యాన్ హూ స్విమ్స్ విత్ క్రోకోడైల్స్” అనే డాక్యుమెంటరీ సంబంధిచిన వీడియో. వైరల్ చిత్రం 20:57 మార్క్ వద్ద చూడవచ్చు.

“ది మ్యాన్ హూ స్విమ్స్ విత్ క్రోకోడైల్స్”అనే డాక్యుమెంటరీ కోస్టారికాకు చెందిన గిల్బర్టో ‘చిటో’ షెడ్డెన్ అనే వ్యక్తి జీవితాన్ని సంబంధించింది.చేపలు పట్టే సమయంలో చీటో
కి ఈ మొసలిని కంట పడింది. గాయపడిన మొసలికి అతను వైద్యం చేసి తిరిగి ఆరోగ్యవంతంగా చేశాడు.అదే సమయంలో అతనికి మొసలితో అనుబంధం ఏర్పడడంతో దానికి ‘పోచో’ అని పేరు పెట్టాడు.డాక్యుమెంటరీ వివరణలో, “ఈ జీవికి(మొసలి) వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మొసలి తనను విడిచిపెట్టడానికి నిరాకరించడం చూసి చిటో ఆశ్చర్యపోయాడు. వారి స్నేహం దశాబ్దాలుగా కొనసాగింది, చిటో ప్రపంచంలో మొసలిని విజయవంతంగా మచ్చిక చేసుకున్న కొద్దిమంది వ్యక్తులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.”

కాబట్టి, ఈ వాదన/దావా, తప్పు.

మరి కొన్ని Fact checks:

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన

 

లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్ బ్లాక్ ఫ్రైడే రోజున చోరీకి గురైందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఆఫ్రికన్ అమెరికన్లు LAలోని నైక్ షూ రిటైల్ దుకాణాన్ని దోచుకున్నారని వాదన.

నిర్ధారణ/Conclusion:ఈ సంఘటన వాస్తవమే అయినప్పటికీ, ఇది మూడేళ్ల క్రితం నాటి జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరిగిన సంఘటన. కానీ బ్లాక్ ఫ్రైడే సేల్‌కు సంబంధించిన సంఘటనగా చిత్రీకరించబడింది.

రేటింగ్: దారి తప్పించే ప్రయత్నం —

Fact check వివరాలు:

బ్లాక్ ఫ్రైడే అనగా థాంక్స్ గివింగ్ డే షాపింగ్ సంబరాలు గుర్తుకొచ్చే రోజు. ఈ రోజు రిటైలర్‌ల నుండి అనేక ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు మరియు కూపన్‌లతో యునైటెడ్ స్టేట్స్ సోషల్ మీడియాలో సందడి మొదలవుతుంది.ఈ షాపింగ్ సంబరాల మధ్య, లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్‌ను ఆఫ్రికన్-అమెరికన్లు దోచుకున్నారని పేర్కొంటూ వీడియో వైరల్ అయ్యింది. అదే వీడియో సోషల్ మీడియాలో విభిన్నమైన శీర్షికలు/క్యాప్షన్స్ లేదా క్లెయిమ్‌లతో షేర్ చేయబడింది.వాటిని ఇక్కడ చూడవచ్చును:

ఇది ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.

FACT CHECK

వాస్తవ పరిశిమలన కోసం Digiteye India ఈ అభ్యర్ధనను వాట్సప్ లో అందుకుంది.మేము కీలక ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో సెర్చ్ చేసినప్పుడు, అది 31 మే 2020న ‘Buzz News YouTube’ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడిన పాత వీడియో అని గమనించాము. వీడియో క్యాప్షన్‌లో ‘NIKE స్టోర్ కొల్లగొట్టి పూర్తిగా లూటీ చేయబడింది’అని ఉంది.

ఈ సంఘటన వాస్తవమేనని స్థానిక వార్తాసంస్థల్లో కూడా వార్తలు వచ్చాయి.NBC చికాగో మే 30, 2020న దీనిని ప్రచురించింది, మరియు 2020లో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా చికాగోలోని మిచిగాన్ అవెన్యూలో ఆగ్రహంతో ఉన్న గుంపు అనేక రిటైల్ దుకాణాలను ధ్వంసం చేసిన సంఘటన గురించి నివేదించింది.

మే 25, 2020న ఫ్లాయిడ్ నకిలీ $20 బిల్లు ఇచ్చాడని స్టోర్ క్లర్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిన్నియాపాలిస్‌లో శ్వేతజాతి పోలీసు అధికారి ఆఫ్రికన్-అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ ని చంపాడని అని వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటన #BlacklivesMatter అనే హ్యాష్‌ట్యాగ్‌తో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.

మరి కొన్ని fact checks:

వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.

క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check

 

రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన

వాదన/Claim:“ఈ భారత మాత ఎవరు” అని రాహుల్ గాంధీ అడుగుతున్నట్లు ఒక వీడియో క్లిప్‌ సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.

నిర్ధారణ/Conclusion:ప్రసంగాన్ని తప్పుగా సూచించడానికి వీడియోని పూర్తిగా చూపించకుండా,  సంక్షిప్తంగా(వీడియోని కుదించి) చేయబడింది.

రేటింగ్: Misleading —

Fact check వివరాలు:

రాజస్థాన్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ‘భారత్‌ మాత’ ఎవరని ప్రశ్నిస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో క్లిప్‌ని ఇక్కడ చూడండి:

ఈ వీడియోలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “అందరూ ఈ నినాదాన్ని పలుకుతారు.. ‘భారత్ మాతా కీ జై’. “అయితే ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి?” అని వీడియో క్లిప్‌లో ఆయన అడుగుతున్నారు.X ఖాతాలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు రమేష్ నాయుడు ఈ విధంగా క్లిప్‌ని షేర్ చేశారు: ““ये भारत माता है कौन, है क्या [ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి], అని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. సిగ్గుచేటు.”

ఈ పోస్ట్ X ప్లాట్‌ఫారమ్‌లో ఇక్కడ మరియు ఇక్కడ విస్తృతంగా షేర్ చేయబడింది.

Fact Check

Digiteye India team వాట్సాప్‌లో అభ్యర్థనను అందుకుని, ప్రధాన/అసలు వీడియో కోసం వెతకగ, అదే క్లిప్‌ను ‘కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్’ వారు ప్రసంగం యొక్క పూర్తి సందర్భాన్ని షేర్ చేసి ఉండడం గమనించారు. నవంబర్ 20న కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల సెల్ ఛైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాట్ షేర్ చేసిన ట్వీట్ చూడండి.

ఈ వీడియోలో రాహుల్ గాంధీ “చంద్నాజీ ఇప్పుడే ‘భారత్ మాతా కీ జై’ అనే నినాదాన్ని పలికారు. ఈ నినాదం చాలా సార్లు వినబడుతుంది, అందరు అంటారు కానీ ఈ భారత మాత ఎవరు, ఇది ఏమిటి?”అని మాట్లాడుతూ ఆపై ఆయన భరత్ మాత గురించి వివరించారు. పూర్తి ప్రసంగం మరియు వీడియోని చూస్తే, ఆయన భరత్ మాత గురించి క్రింది విధంగా మాట్లాడినట్లు స్పష్టమవుతుంది:

“భారత మాత అంటే ఈ భూమి, ఈ దేశ ప్రజలు. భారత మాత యొక్క స్వరం మీ సోదరులు, సోదరీమణులు, తల్లులు, తండ్రులు, పేదలు, ధనవంతులు, వృద్ధులలో ప్రతిధ్వనిస్తుంది,ఇది భారత మాత. పార్లమెంటులో కూడా నేను, ‘ఈ భరతమాత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ వ్యక్తులు ఎవరు? జనాభా ఎంత? ఎంత మంది గిరిజనులు, ఎంత మంది దళితులు, ఎంత మంది వెనుకబడిన వారు, ఎంత మంది పేదలు, ఎంత మంది ధనవంతులు ఉన్నారు? మనం‘భారత్ మాతాకీ జై’ అని నినాదిస్తే ప్రాణత్యాగానికైనా సిద్ధమే. ఈ దేశంలో ఎంత మంది వెనుకబడినవారు, ఎంత మంది దళితులు, ఎంత మంది పేదలు ఉన్నారో మనకు తెలియకపోతే ‘భారత్ మాతా కీ జై’అనే నినాదంలో అర్ధం ఏముంది? అందువల్ల, ఈ దేశం ఇప్పుడు ఈ కారణాలపై జనాభా గణనను నిర్వహించవలసి అవసరం ఉంది.”

ఇంకా, పైన చూసినట్లుగా రాహుల్ గాంధీ అధికారిక యూట్యూబ్ ఖాతాలో పూర్తి వీడియో అందుబాటులో ఉంచబడింది. రాజస్థాన్‌లోని బుండీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీగారి ప్రసంగం యొక్క 35 నిమిషాల అసలైన పూర్తి వీడియో చూడవచ్చు.

మరి కొన్ని Fact checks:

ట్రక్కు వంతెనని దాటుతూ రాకెట్‌ను తీసుకువెళుతున్నట్లు ఒక వాదన వైరల్ అయింది Fact Check

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

 

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఒకసారి కనిపిస్తుందని, ఆపై దీపావళి నాడు అదృశ్యమవుతుందనే ఒక వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు సంబంధించిన వీడియో క్లిప్‌.

రేటింగ్: పూర్తిగా తప్పు —

Fact Check వివరాలు:వివరాలు

దక్షిణ భారతదేశంలోని‘పిత్రి నది’నుంచి బంజరు భూమిలోకి నది నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే వీడియో వాట్సాప్‌లో షేర్ చేయబడింది.

ఇది ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి కనిపిస్తుందని, ఆపై దీపావళి అమావాస్య రోజున అదృశ్యమవుతుందని ఒక వాదన.దిగువ చూపిన విధంగా ఇది ట్విట్టర్‌లో కూడా షేర్ చేయబడింది:

హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది:“दक्षिण भारत की यह नदी पितृपक्ष की अमावस्या को प्रकट होती है और दीपावली के दिन, अमावस्या को विलीन हो जाती है ! सिर्फ एक महीना बहाव !! है न प्रकृति का अदभुत चमत्कार.” [తెలుగు అనువాదం:దక్షిణ భారతదేశంలోని ఈ నది పితృ పక్ష అమావాస్య రోజు కనిపిస్తుంది మరియు దీపావళి అమావాస్య రోజున అదృశ్యమవుతుంది… కేవలం ఒక నెల మాత్రమే ప్రవహిస్తుంది!! ఇది ప్రకృతి యొక్క అద్భుతం కాదా?]

మేము ట్విట్టర్‌లో వీడియో కోసం వెతకగా, అదే వీడియో 2020,2021,2022లో ఉపయోగించబడిందని, మరియు తాజాగా అక్టోబర్ 15, 2023న షేర్ చేయబడిందని మేము తెలుకున్నాము. అందుకే, ఇది పునరావృతమవుతున్న పాత వాదన/దావా.

FACT CHECK

మేము కీలక ఫ్రేమ్‌ల సహాయంతో Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వీడియో కోసం వెతికినప్పుడ్డు, సెప్టెంబర్ 19,2017న అప్‌లోడ్ చేయబడిన అసలైన YouTube వీడియోని గమనించాము.
ఇది తమిళనాడు మరియు కర్ణాటక మధ్య నీటి విడుదలకు/పంపకానికి సంబంధించిన వీడియో.‘తమిళనాడులోని మైవరం జిల్లాకు కావేరీ జలాలు చేరాయి’అని క్యాప్షన్ రాసి ఉంది. దిగువ యూట్యూబ్‌లో ఒరిజినల్(అసలైన) వీడియో చూడండి.

కావున, వీడియో క్లిప్‌లో కనిపించే నీరు కావేరీ నది నుండి తమిళనాడులోకి ప్రవహిస్తున్న నీరు, దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ కాదు. ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఇది కనిపిస్తుందనే వాదనలో ఏ మాత్రం నిజం లేదు.

సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 24, 2017 వరకు కర్ణాటక ప్రభుత్వం కావేరీ మహా పుష్కరాలు జరుపుకున్నట్లు మరియు వీడియో ప్రకారం ఈ సమయంలో కావేరీ నది నీటిని కూడా విడుదల చేసిందని వార్తా కథనాలు. కాబట్టి, ఇది పూర్తిగా తప్పుడు వాదన/దావా.

మరి కొన్ని fact checks:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచకప్‌ ఆఖరి మ్యాచ్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు గుమికూడి హనుమాన్ చాలీసా పఠించిన వీడియో వైరల్‌గా మారింది.

నిర్ధారణ/Conclusion: తప్పు వాదన , హనుమాన్‌ చాలీసాతో వీడియో సౌండ్ ట్రాక్ మార్చబడింది.

రేటింగ్:తప్పుగా సూచిస్తుంది. —

Fact Check వివరాలు:

నవంబర్ 19, 2023 ఆదివారం నాడు అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై హంగామా తర్వాత, చాలా వీడియోలు మరియు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించాయి. అందులో ఒక వీడియో క్లిప్ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు గుమిగూడి హనుమాన్ చాలీసా ( హనుమాన్ చాలీసా —హనుమంతుని ఆశీర్వాదాలను కోరుతూ ప్రార్థన) చేయడం ప్రారంభించారనే వాదనతో కనిపిస్తోంది.

ఇది వైరల్‌గా మారి, టీవీ ఛానెల్‌లు కూడా తమ ఛానెల్‌లో ఇలాంటి దావాతో వీడియో క్లిప్‌ను చూపించాయి. పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.

FACT CHECK

వాట్సాప్‌లో వీడియో మాకు అందినప్పుడు, మేము సోషల్ మీడియాలో వెతకగా అది ట్విట్టర్‌లో కూడా విస్తృతంగా షేర్ చేయబడిందని కనుగొన్నాము.

వీడియో క్లిప్ నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Google రివర్స్ ఇమేజ్ లో వెతకగా, అదే స్టేడియంలో గాయకుడు దర్శన్ రావల్ ప్రదర్శన ఇస్తున్న వీడియో మరియు పెద్ద స్క్రీన్‌లో అతని ప్రదర్శనని( క్రింద చిత్రంలో చూడవచ్చును) గమనించాము.

గూగుల్ సెర్చ్‌లో ఈవెంట్ కోసం వెతికినప్పుడు, సింగర్ దర్శన్ రావల్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ సమయంలో స్టేడియంలో ఉన్నభారీ ప్రేక్షకుల ముందు అతను ప్ర్రదర్శన ఇచ్చే వీడియోకి దారి తీసింది. ఈ మ్యాచ్ అక్టోబర్ 14, 2023న జరిగింది మరియు వీడియో అక్టోబర్ 16, 2023న Youtubeలో అప్‌లోడ్ చేయబడింది. అసలు వీడియోను కూడా ఇక్కడ చూడండి.

 

వీడియోను కూడా ఇక్కడ చూడవచ్చు మరియు ప్రపంచ కప్ 2023 క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా అదే స్టేడియంలో అక్టోబర్ 14, 2023న జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో గాయకుడు విరామ సమయంలో ప్రదర్శన ఇచ్చాడు, అంతే కానీ హనుమాన్ చాలీసాను పఠించలేదు. కింది Instagram పోస్ట్ దీన్ని మరింత ధృవీకరిస్తుంది:

1.5 లక్షల మంది ప్రజలు హనుమాన్ చాలీసాను జపిస్తున్నట్లు వినిపించేలా వీడియో సౌండ్ ట్రాక్‌ని మార్చారు.

మరి కొన్ని Fact Checks:

ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.