వాదన/Claim:న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదనతో వీడియో షేర్ చేయబడింది.
నిర్ధారణ/Conclusion:తప్పు.న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వీడియో కాదు.అది బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ రోజువారీ ప్రార్థనలో ఉన్న వీడియో.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు
వీడియోలో చేతులు జోడించి హిందూ ఆచారాలను నిర్వహిస్తున్న విదేశీయుడు న్యూజిలాండ్ హోం మంత్రి అని మరియు ఆయన సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారనే వాదన X (గతంలో ట్విట్టర్)లో వైరల్ అవుతోంది.
#Sanaatan
See the power of Sanatan
New Zealand’s Home Minister also adopted Sanatan Dharma…!! pic.twitter.com/Rnh9bdaK58— Ajay Dada Ayodhya Vasi (@hinduajaydada) January 25, 2024
The video had garnered over two lakh views already and can be seen here and here.
FACT CHECK
న్యూజిలాండ్‌కు సంబంధించిన హోం మంత్రి వివరాల కోసం Digiteye India బృందం పరిశీలించగా,అలాంటి మంత్రిత్వ శాఖ లేదా దానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తిలు దొరకలేదు కానీ,ప్రతుస్తం బ్రూక్ వాన్ వెల్డెన్ న్యూజిలాండ్ అంతర్గత వ్యవహారాలు & వర్క్‌ప్లేస్ రిలేషన్స్ అండ్ సేఫ్టీ మంత్రిగా పని చేస్తున్నట్టు గమనించాము.
మరియు, వీడియో నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో పరిశీలించగా వీడియోలో ఉన్న వ్యక్తి బ్రెంట్ గోబుల్ అనే అమెరికన్ యోగా టీచర్ అని ఫలితాలు వెల్లడయ్యాయి.
సోషల్ మీడియా హ్యాండిల్ ప్రకారం, బ్రెంట్ గ్లోబ్ ప్రస్తుతం గోవాలోని అంజునాలో నివసిస్తూ, అన్ని వయసుల వారికి యోగా నేర్పిస్తున్నారు.అతని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను పరిశీలించినప్పుడు, అతను నవంబర్ 2, 2023న పోస్ట్ చేసిన ఒరిజినల్ వీడియోను గమనించాము.
వీడియో కాప్షన్ ఈ విధంగా ఉంది, “గత రాత్రి అలెక్స్ నామకరణ కార్యక్రమం జరిగింది. హిందూ మతం నా పెంపకంలో భాగం కానప్పటికీ, నా భార్య మరియు అత్తమామలకు ముఖ్యమైన ఆచారాలలో పాల్గొనడం నాకు చాలా ఇష్టం. నా కొడుకుకు అందమైన జీవితం ఉండాలని,అవసరమైన సవాళ్లును ఎదురుకుంటూ పోరాడాలని,మనస్ఫూర్తిగా ప్రేమించాలని కోరుకుంటున్నాను”.
యోగా టీచర్ వీడియో న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నట్లుగాషేర్ అవుతోంది.
మరి కొన్ని Fact Checks:
నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన