Tag Archives: singer

క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 1.5 లక్షల మంది హనుమాన్ చాలీసా పఠించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచకప్‌ ఆఖరి మ్యాచ్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులు గుమికూడి హనుమాన్ చాలీసా పఠించిన వీడియో వైరల్‌గా మారింది.

నిర్ధారణ/Conclusion: తప్పు వాదన , హనుమాన్‌ చాలీసాతో వీడియో సౌండ్ ట్రాక్ మార్చబడింది.

రేటింగ్:తప్పుగా సూచిస్తుంది. —

Fact Check వివరాలు:

నవంబర్ 19, 2023 ఆదివారం నాడు అహ్మదాబాద్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై హంగామా తర్వాత, చాలా వీడియోలు మరియు మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ప్రారంభించాయి. అందులో ఒక వీడియో క్లిప్ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు గుమిగూడి హనుమాన్ చాలీసా ( హనుమాన్ చాలీసా —హనుమంతుని ఆశీర్వాదాలను కోరుతూ ప్రార్థన) చేయడం ప్రారంభించారనే వాదనతో కనిపిస్తోంది.

ఇది వైరల్‌గా మారి, టీవీ ఛానెల్‌లు కూడా తమ ఛానెల్‌లో ఇలాంటి దావాతో వీడియో క్లిప్‌ను చూపించాయి. పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ చూడండి.

FACT CHECK

వాట్సాప్‌లో వీడియో మాకు అందినప్పుడు, మేము సోషల్ మీడియాలో వెతకగా అది ట్విట్టర్‌లో కూడా విస్తృతంగా షేర్ చేయబడిందని కనుగొన్నాము.

వీడియో క్లిప్ నుండి కొన్ని కీలక ఫ్రేమ్‌లను తీసుకొని, Google రివర్స్ ఇమేజ్ లో వెతకగా, అదే స్టేడియంలో గాయకుడు దర్శన్ రావల్ ప్రదర్శన ఇస్తున్న వీడియో మరియు పెద్ద స్క్రీన్‌లో అతని ప్రదర్శనని( క్రింద చిత్రంలో చూడవచ్చును) గమనించాము.

గూగుల్ సెర్చ్‌లో ఈవెంట్ కోసం వెతికినప్పుడు, సింగర్ దర్శన్ రావల్ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ సమయంలో స్టేడియంలో ఉన్నభారీ ప్రేక్షకుల ముందు అతను ప్ర్రదర్శన ఇచ్చే వీడియోకి దారి తీసింది. ఈ మ్యాచ్ అక్టోబర్ 14, 2023న జరిగింది మరియు వీడియో అక్టోబర్ 16, 2023న Youtubeలో అప్‌లోడ్ చేయబడింది. అసలు వీడియోను కూడా ఇక్కడ చూడండి.

 

వీడియోను కూడా ఇక్కడ చూడవచ్చు మరియు ప్రపంచ కప్ 2023 క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా అదే స్టేడియంలో అక్టోబర్ 14, 2023న జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌లో గాయకుడు విరామ సమయంలో ప్రదర్శన ఇచ్చాడు, అంతే కానీ హనుమాన్ చాలీసాను పఠించలేదు. కింది Instagram పోస్ట్ దీన్ని మరింత ధృవీకరిస్తుంది:

1.5 లక్షల మంది ప్రజలు హనుమాన్ చాలీసాను జపిస్తున్నట్లు వినిపించేలా వీడియో సౌండ్ ట్రాక్‌ని మార్చారు.

మరి కొన్ని Fact Checks:

ఈ మనిషి యోగా శక్తితో గాలిలో తేలియాడుతున్నాడా? Fact Check

వాస్తవ పరిశీలన: స్టంట్ టీమ్ చేసిన స్ట్రీట్ ఫైట్ ప్రదర్శనను సోషల్ మీడియాలో మతపరమైన కోణంతో షేర్ చేయబడింది.