ఒక వ్యక్తి లైఫ్ జాకెట్ ధరించి, సన్న, పొడవాటి చెక్క ప్లాంక్ వంతెన పై చాలా జాగ్రత్తగా సైకిల్ తొక్కుకుంటూ వెళుతున్నట్టు చూపించే వీడియో ఫేస్‌బుక్ రీల్స్‌లో వైరల్‌గా మారింది.వాదన/దావా ఇలా ఉంది: “భారతదేశంలో పోస్ట్‌మాస్టర్‌ను ఈ విధంగా ఎంపిక చేస్తారు.”
https://www.facebook.com/reel/1460175761597788
FACT CHECK
వాస్తవాన్ని పరిశీలించడం కోసం Digiteye India team వీడియో యొక్క కీలక ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో పరిశీలించగా,వాస్తవానికి నేపాల్‌లోని కపిల్వాస్తులో జరిగిన సైకిల్ బ్యాలెన్స్ అడ్వెంచర్ గేమ్‌లోని వీడియో అని వెల్లడించే ‘అసలు వీడియో లింక్‌ని’ మేము గమనించాము.ఛానెల్ సచిన్ భట్టారాయ్ ద్వారా అప్‌లోడ్ చేయబడింది, వీడియో వివరణలో ఇలా ఉంది:
“2nd CYCLE PLANK BALANCE:’సైకిల్ ప్లాంక్ బ్యాలెన్స్ పోటీ’ రెండవ ఎడిషన్ టైటిల్‌ను మానిక్ శ్రేష్ఠ గెలుచుకున్నారు.బంగాంగ మునిసిపాలిటీ 3లోని పర్యాటక ప్రదేశమైన రాజపాని వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ కపిల్వాస్తు నిర్వహించిన పోటీలో,అతను 52 మీటర్ల ట్రాక్‌ను దాటడానికి 1 నిమిషం 56 సెకన్లు లో పూర్తి చేసి టైటిల్‌ను గెలుచుకున్నాడు.ధరన్‌కు చెందిన అనిస్ తమంగ్ రెండో స్థానంలో నిలిచాడు. అతను నిర్దేశించిన దూరాన్ని 1 నిమిషం 25 సెకన్లలో అధిగమించాడు. అదేవిధంగా కపిల్వాస్తుకు చెందిన శుభం భట్టై మూడో స్థానంలో నిలిచారు. అతను 40.86 సెకన్లు సెకన్లు లో పూర్తి చేయగా, అరుణ్ ఆర్యల్ నాలుగో స్థానంలో నిలిచాడు.”
‘సైకిల్ ప్లాంక్ బ్యాలెన్స్ అడ్వెంచర్’ గేమ్ దిగువన చూపించినట్లు YouTubeలో విస్తృతంగా షేర్ చేయబడింది:
ఆ వీడియో ఇండియాది కాక నేపాల్‌కి చెందినది.అంతేకాకుండా భారతదేశంలో పోస్టల్ సిబ్బంది ఎంపికకి మార్కులు,మరియు ఎంపిక పరీక్షలో మెరిట్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి, వాదన/దావా తప్పు.
వాదన/Claim:వీడియోలో చెక్క ప్లాంక్ వంతెన పైన చాలా జాగ్రత్తగా సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని చూపిస్తూ, భారతదేశంలో పోస్ట్‌మాస్టర్‌ను ఈ విధంగా ఎంపిక చేస్తారనేది వాదన.
నిర్ధారణ/Conclusion:తప్పు వాదన. భారతదేశంలో పోస్ట్ మాస్టర్ కోసం అలాంటి ఎంపిక విధానం ఏది లేదు మరియు అది నేపాల్‌లోని కపిల్వాస్తులో జరిగిన పోటీ యొక్క వీడియో.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
మరి కొన్ని Fact Checks: