వాదన/ Claim:ప్యారిస్‌లో తమను వేధిస్తున్న పురుషులను మహిళల గుంపు అదుపు చేస్తున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది మరియు మతపరమైన కోణంతో ఈ వీడియో షేర్ చేయబడింది.
నిర్ధారణ/Conclusion: ప్రొఫెషనల్ స్టంట్‌పర్సన్‌లుగా మారడానికి వ్యక్తులకు శిక్షణనిచ్చే ఫ్రెంచ్ స్టంట్ గ్రూప్ ఈ వీడియోను రూపొందించింది. ఈ వీడియోను గ్రూప్ వారు ఈ నెల ప్రారంభంలో వారి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
RATING: Misinterpretation —
మహిళల గుంపు తమను వేధిస్తున్నపలువురు పురుషులను అదుపు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఘటన పారిస్‌లో చోటుచేసుకుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియో మతపరమైన కోణంతో మరియు ఇస్లామోఫోబిక్ వాదనలతో షేర్ చేయబడింది. ఫోటోతో వైరల్ అవుతున్న వాదన ఇలా ఉంది:
ఈ వీడియో చాలా శాంత పరిచేదిగా ఉంది. నిన్న ప్యారిస్‌లో ఎక్కడో మెట్రో అండర్‌పాస్‌లో, కొంతమంది వలసదారులు వారు ఏది బాగా చేయగలరో అది చేస్తున్నారు.తహర్రష్(Taharrush–సుమారుగా అనువదిస్తే: స్త్రీలపై సామూహిక వేధింపులు.) దురదృష్టవశాత్తు, ఈ ముగ్గురు మహిళలు ఫ్రెంచ్ పారా-మిలటరీకి పని చేసేవాళ్ళు.
దీనికి సంబంధించిన వీడియో వాట్సాప్‌లో మరియు X (గతంలో, ట్విట్టర్)లో వైరల్ అవుతోంది.
https://twitter.com/DalviNameet/status/1724592897226686869
వీడియో ఇక్కడ,ఇక్కడ,మరియు ఇక్కడ అవే వాదనలతో షేర్ చేయబడింది.
FACT CHECK
వాట్సాప్‌లో ఈ వైరల్ వీడియోలో వాస్తవం ఎంత ఉందొ పరిశీలన చేయమని Digiteye India Teamకి అభ్యర్థన వచ్చింది.
వీడియోను అనేక కీఫ్రేమ్‌లుగా విభజించడానికి Team/బృందం ‘inVID’ – వీడియో ధృవీకరణ సాధనం (inVID-a video verification tool) ఉపయోగించగా, కీఫ్రేమ్‌లలో ఒకదానిలో, పురుషులు నల్లటి హూడీలు ధరించడం గమనించారు.
స్వెట్‌షర్ట్ వెనుక తెల్లటి అక్షరాలతో “CUC” అని రాసి ఉంది. మేము ఈ క్లూని ఉపయోగించి,Googleలో కీవర్డ్ సెర్చ్ నిర్వహించాము.
కీవర్డ్ సెర్చ్ నిర్వహించగా, అది క్యాంపస్ యూనివర్స్ క్యాస్కేడ్స్(Campus Univers Cascades) యొక్క Instagram పేజీకి దారితీసింది. వారి లోగో మరియు వీడియోలో పురుషుల హూడీలపై కనిపించిన లోగో ఒకే లాగా ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వారి వెబ్‌సైట్‌ను పరిశీలించాగా, CUC తమని తాము “సినిమా మరియు ప్రదర్శనలలో స్టంట్ టెక్నిక్‌లు అందించే వృత్తిపరమైన శిక్షణా కేంద్రం అని పేర్కొంది. ఇది “క్యాంపస్ ప్రేరేపిత క్రీడాకారులు, పురుషులు మరియు మహిళలు కోసం ఉద్దేశించబడింది, దీని లక్ష్యం ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్‌గా మారడం.” ఇవి 2008లో స్థాపించబడ్డాయి మరియు ఫ్రాన్స్‌లో ఉన్నాయి.”ఈ కేంద్రం ప్రొఫెషనల్ స్టంట్‌మ్యాన్ అవ్వాలనుకునే లక్ష్యం ఉన్న క్రీడాకారులు, పురుషులు మరియు మహిళలు కోసం ఉద్దేశించబడింది”.ఇది 2008లో ఫ్రాన్స్‌లో స్థాపించబడింది.
మేము వారి ఇన్‌స్టాగ్రామ్ పేజీని పరిశీలించగా నవంబర్ 2, 2023న పోస్ట్ చేసిన వైరల్ వీడియోని కనుగొన్నాము.(వీడియో క్రింద చూడ వచ్చును).
వీడియో కాప్షన్ “వీధి పోరాటం(Streetfight) ⚠️👊”, మరియు కక్టీమ్, క్యాంపస్ లైఫ్, స్ట్రీట్, ఫైట్, మార్షల్ ఆర్ట్స్, వీడియో, స్టంట్‌టీమ్, ఫైటర్, క్యాంపస్, బాక్సింగ్, కో, కంబాట్, ఫాలో, మార్షల్, బగారే, యాక్షన్, సినిమా, కొరియోగ్రఫీ, క్యాస్కేడేస్, స్టంట్‌లైఫ్” వంటి హ్యాష్‌ట్యాగ్‌లు వీడియో వివరాల్లో జత పరిచారు.
వారి పేజీలోని మరి కొన్ని వివరాలు/వీడియోలు చూస్తే, సినిమా మరియు వీడియోల కోసం స్టంట్ వ్యక్తులకు శిక్షణనిచ్చే కేంద్రమని వెల్లడవుతుంది. వైరల్ అవుతున్న వాదనలో ఏ మాత్రం నిజం లేదు.
మరి కొన్ని Fact Checks:
క్లెయిమ్ చేసినట్లుగా అంబేద్కర్ పోస్టర్‌ను అమెరికా రైలు పైన ప్రదర్శించలేదు; Fact Check
ఈ వీడియో ప్లాస్టిక్ నుంచి బియ్యం తయారీ విధానం చూపిస్తుందా?:వాస్తవ పరిశీలన
Pingback: లాస్ ఏంజిల్స్‌లోని నైక్ స్టోర్ బ్లాక్ ఫ్రైడే రోజున చోరీకి గురైందా? వాస్తవ పరిశీలన - Digiteye Telugu