Tag Archives: amavasya

వాదన/క్లెయిమ్ చేసినట్లుగా ఈ ‘పిత్ర్’ నది సంవత్సరానికి ఒకసారి కనిపిస్తుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఒకసారి కనిపిస్తుందని, ఆపై దీపావళి నాడు అదృశ్యమవుతుందనే ఒక వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నీటి విడుదలకు సంబంధించిన వీడియో క్లిప్‌.

రేటింగ్: పూర్తిగా తప్పు —

Fact Check వివరాలు:వివరాలు

దక్షిణ భారతదేశంలోని‘పిత్రి నది’నుంచి బంజరు భూమిలోకి నది నీరు ప్రవహిస్తున్నట్లు చూపించే వీడియో వాట్సాప్‌లో షేర్ చేయబడింది.

ఇది ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి కనిపిస్తుందని, ఆపై దీపావళి అమావాస్య రోజున అదృశ్యమవుతుందని ఒక వాదన.దిగువ చూపిన విధంగా ఇది ట్విట్టర్‌లో కూడా షేర్ చేయబడింది:

హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది:“दक्षिण भारत की यह नदी पितृपक्ष की अमावस्या को प्रकट होती है और दीपावली के दिन, अमावस्या को विलीन हो जाती है ! सिर्फ एक महीना बहाव !! है न प्रकृति का अदभुत चमत्कार.” [తెలుగు అనువాదం:దక్షిణ భారతదేశంలోని ఈ నది పితృ పక్ష అమావాస్య రోజు కనిపిస్తుంది మరియు దీపావళి అమావాస్య రోజున అదృశ్యమవుతుంది… కేవలం ఒక నెల మాత్రమే ప్రవహిస్తుంది!! ఇది ప్రకృతి యొక్క అద్భుతం కాదా?]

మేము ట్విట్టర్‌లో వీడియో కోసం వెతకగా, అదే వీడియో 2020,2021,2022లో ఉపయోగించబడిందని, మరియు తాజాగా అక్టోబర్ 15, 2023న షేర్ చేయబడిందని మేము తెలుకున్నాము. అందుకే, ఇది పునరావృతమవుతున్న పాత వాదన/దావా.

FACT CHECK

మేము కీలక ఫ్రేమ్‌ల సహాయంతో Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వీడియో కోసం వెతికినప్పుడ్డు, సెప్టెంబర్ 19,2017న అప్‌లోడ్ చేయబడిన అసలైన YouTube వీడియోని గమనించాము.
ఇది తమిళనాడు మరియు కర్ణాటక మధ్య నీటి విడుదలకు/పంపకానికి సంబంధించిన వీడియో.‘తమిళనాడులోని మైవరం జిల్లాకు కావేరీ జలాలు చేరాయి’అని క్యాప్షన్ రాసి ఉంది. దిగువ యూట్యూబ్‌లో ఒరిజినల్(అసలైన) వీడియో చూడండి.

కావున, వీడియో క్లిప్‌లో కనిపించే నీరు కావేరీ నది నుండి తమిళనాడులోకి ప్రవహిస్తున్న నీరు, దక్షిణ భారతదేశంలోని ‘పిత్రి నది’ కాదు. ప్రతి సంవత్సరం పితృ పక్షం రోజు రాత్రి ఇది కనిపిస్తుందనే వాదనలో ఏ మాత్రం నిజం లేదు.

సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 24, 2017 వరకు కర్ణాటక ప్రభుత్వం కావేరీ మహా పుష్కరాలు జరుపుకున్నట్లు మరియు వీడియో ప్రకారం ఈ సమయంలో కావేరీ నది నీటిని కూడా విడుదల చేసిందని వార్తా కథనాలు. కాబట్టి, ఇది పూర్తిగా తప్పుడు వాదన/దావా.

మరి కొన్ని fact checks:

బెంగళూరు టెర్మినల్ 2 చిత్రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొత్త విమానాశ్రయానికి సంబంధించినవిగా పేర్కొనబడ్డాయి; Fact Check

50 ఏళ్ల తర్వాత తిరుపతి లడ్డూల కోసం నందిని నెయ్యి సరఫరాను TTD తిరస్కరించిందా? Fact Check