వాదన/Claim:ఎలోన్ మస్క్ ‘నేను పెడోఫిల్‌ని’అని తన ప్రత్యుత్తరాన్ని Xలో పోస్ట్ చేశారని ఒక వాదన.
నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన. ఎలోన్ మస్క్ యొక్క ‘X’ లేదా Twitter ఖాతా నుండి అటువంటి ప్రత్యుత్తరం ఏదీ కూడా ఇవ్వబడలేదు.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం–
వాస్తవ పరిశీలన వివరాలు
‘X’లో స్క్రీన్‌షాట్‌తో కూడిన ట్వీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యజమాని ఎలోన్ మస్క్ చేశారంటూ, ఒక వాదన షేర్ చేయబడుతోంది.
ఎవరో “నువ్వు పెడోఫిల్ అని బూటకపు ప్రచారం చేస్తున్నారని” ఒక వినియోగదారుని హెచ్చరికకు,వెంటనే “అది బూటకం కాదు. నేను పెడోఫిల్‌ని” అని మస్క్ చేసిన ప్రత్యుత్తరం కనిపించింది.
Elon musk admits he’s a pedophile in 4k https://t.co/Q9hmA06cuW
— 🪑💖🐥🔆aki_nopants🔆🐥💖🪑 (@AkiFromTheAshes) January 29, 2024
పోస్ట్‌కి ఒక్క రోజులో దాదాపు 28,000 లైక్‌లు వచ్చి వైరల్ అయ్యింది, మరియు ఎక్కువ మంది వినియోగదారులను చర్చలో పాల్గొనేలా చేసింది.
FACT CHECK
ట్విట్టర్ ఎకౌంటు చూడగానే అనుమానాస్పదంగా కనిపించడంతో Digiteye India టీమ్ వాస్తవ పరిశీలనకు పూనుకుంది.సాధారణంగా, మస్క్ అధికారిక Twitter ఖాతాలో వైలెట్ రంగులో సబ్‌స్క్రయిబ్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది, కానీ “నేను పెడోఫైల్” అని పేర్కొన్న ఖాతాలో “ఫాలో” బటన్ ఉంది.
మరియు,మేము మస్క్ ఫీడ్ యొక్క పరిశీలన ప్రకారం, మరియు సోషల్ బ్లేడ్ యొక్క గణాంకాల ప్రకారం కూడా అటువంటి ట్వీట్ అతని ఖాతాలో లేదని,లేదా తొలగించబడిన పోస్ట్‌లలో కూడా లేదని తెలుసుకున్నాము.
కావున ఈ వాదన తప్పు.
మరి కొన్ని Fact Checks:
అంబేద్కర్ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద లైబ్రరీని అమెరికా ప్రారంభించిందా? వాస్తవ పరిశీలన