Did Congress Manifesto mention about Inheritance Tax? Fact Check

కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్ను గురించి ప్రస్తావించారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అధికారంలోకి వస్తే వారసత్వ పన్నును అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో హామీ ఇచ్చిందనేది వాదన/దావా.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. కాంగ్రెస్ మేనిఫెస్టోలో వారసత్వ పన్నును అమలు చేసే ప్రణాళిక గురించి ప్రస్తావించలేదు.ఈ పన్నుగురించి విదేశాలలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు మరియు అతను అమెరికాలో పన్నుల గురించి ఒక ఉదాహరణ ఇస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను పార్టీ ప్రణాళిక కాదని కొట్టిపారేసింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact Check వివరాలు:

లోక్‌సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న తరుణంలో,రెండు జాతీయ పార్టీలు — బిజెపి మరియు కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం, కాంగ్రెస్ వాగ్దానం చేసిన సంపద పునర్విభజనపై విచిత్రమైన మలుపు తిరిగింది. వార్తా సంస్థ ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా “యుఎస్‌లో వారసత్వపు పన్ను” గురించి ప్రస్తావించినప్పుడు,ఈ అంశానికి ఆజ్యం పోసింది.

సాధారణంగా, మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు/సంపదపై వారసత్వపు పన్ను విధించబడుతుంది, అది వారి వారసుల మధ్య పంపిణీ చేయబడుతుంది. జపాన్, అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు అటువంటి పన్నును విధిస్తున్నాయి.

అయితే,భారతదేశంలో వ్యతిరేకులు కూడా ఇలాంటి పన్నుకు అభ్యంతరం చెప్పినప్పుడు, సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇది ఊపందుకుంది. అనేక మీమ్‌లు, వార్తా నివేదికలు, టీవీ చర్చలు ఈ సమస్యను ప్రసారం చేయడంతో ప్రతి వార్తా ఛానెల్‌లో ఇవి ముఖ్యాంశాలుగా మారాయి.

Digiteye India బృందం WhatsApp టిప్‌లైన్‌లో దీని గురించి అభ్యర్ధనను అందుకొని పరిశీలించగా, ఈ సమస్యపై కొన్ని క్లెయిమ్‌లను ఇక్కడ మరియు ఇక్కడ గమనించాము.

FACT CHECK

మొదట, మేము కాంగ్రెస్ మ్యానిఫెస్టోను పరిశీలించగా,  కాంగ్రెస్ “న్యాయ పాత్ర” అనే డాక్యుమెంట్‌లో వారసత్వపు పన్ను లేదా దానికి సంబంధించిన చర్య గురించి ప్రస్తావించలేదు.  ‘పన్ను మరియు పన్ను సంస్కరణలు’ సెక్షన్‌ కింద, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రత్యక్ష పన్నుల కోడ్ అమలు చేయడం, ఏంజెల్ పన్ను తొలగింపు, వ్యక్తులు మరియు భాగస్వామ్య సంస్థల యాజమాన్యంలోని MSMEలపై పన్ను భారాన్ని తగ్గించడం మరియు GST కౌన్సిల్‌ను పునఃరూపకల్పన చేయడం వంటివి ప్రస్తావించబడ్డాయి.

“వివాహం, వారసత్వం, దత్తత, సంరక్షకత్వం మొదలైన విషయాలలో స్త్రీ మరియు పురుషులకు సమాన హక్కులు ఉండాలి” అని పార్టీ వాగ్దానం చేసినప్పుడు “వారసత్వం” అనే పదం మహిళా సాధికారత అనే దృష్టికోణం నుంచీ సూచించబడింది. మేము(పార్టీ) అన్ని చట్టాలను సమీక్షిస్తాము మరియు స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని నిర్ధారిస్తాము. కాబట్టి, దీనికి వారసత్వపు పన్నుతో సంబంధం లేదు.

తర్వాత, మేము శామ్ పిట్రోడా యొక్క ANI ఇంటర్వ్యూని పరిశీలించగా, అక్కడ అతను అమెరికాలోని వారసత్వపు పన్నును గురించి ప్రస్తావించడం గమనించాము. “భారతదేశంలో వారసత్వ పన్నును కాంగ్రెస్ సమర్థిస్తున్నారా? అనే శీర్షికతో ఇంటర్వ్యూ యొక్క పూర్తి వీడియో ANI యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. ఈ ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా పెద్ద సూచనను ఇచ్చారు. దీన్ని ANI తన X హ్యాండిల్‌లో ఏప్రిల్ 24, 2024న ఇక్కడ షేర్ చేసింది:

ఈ ఇంటర్వ్యూలో,శామ్ పిట్రోడాని “దేశంలోని సంపదపై సర్వే గురించి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాన్ని మరియు “ప్రజల మధ్య తిరిగి పంపిణీ చేసే కార్యక్రమం” గురించి అడిగారు.

అతని ప్రత్యుత్తరంలో, సామ్ పిట్రోడా ఇలా అన్నారు: “అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఉదాహరణకి ఒకరి వద్ద $100 మిలియన్ల విలువైన సంపద ఉందని అనుకుందాం మరియు అతను చనిపోయినప్పుడు అతను బహుశా 45% మాత్రమే తన పిల్లలకు బదిలీ చేయగలడు. మిగిలిన 55% ప్రభుత్వం తీసుకుంటుంది.ఇప్పుడు ఇది ఒక ఆసక్తికరమైన చట్టం. మీ తరంలో మీరు, సంపదను సంపాదించారు, మీరు ఇప్పుడు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదను ప్రజల కోసం వదిలివేయాలి, మొత్తం కాదు, అందులో సగం, ఇది నాకు న్యాయంగానే అనిపిస్తుంది.భారతదేశంలో, మీకు అలా లేదు. ఎవరికైనా 10 బిలియన్ల సంపద ఉంటే మరియు అతను చనిపోతే, అతని పిల్లలకు 10 బిలియన్లు వస్తాయి, ప్రజలకు ఏమీ లభించదు. అందులో సగం మీకు అందుతుందని, అందులో సగం ప్రజలకు అందుతుందని చట్టం చెబుతోంది. (sic)”

“కాబట్టి ఇవి ప్రజలు చర్చించాల్సిన సమస్యలే.ఆఖరున ఎలాంటి తీర్మానం చేస్తారో నాకు తెలియదు కానీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు, మేము కొత్త విధానాలు మరియు కొత్త కార్యక్రమాల గురించి,మరియు ఇది అతి ధనవంతుల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మాట్లాడుతున్నాము, (sic)” అని ఆయన చెప్పారు.

US నివాసిగా, శామ్ పిట్రోడా తన దేశంలో పన్నుగురించి ఒక ఉదాహరణ ఇస్తున్నారు, కానీ భారతదేశంలో అదే అమలు చేయాలని స్పష్టంగా ప్రతిపాదించటంలేదు.

ఈ ఇంటర్వ్యూపై బిజెపి నుండి విమర్శలు వచ్చినప్పుడు, శామ్ పిట్రోడా ఒక వివరణను జారీ చేసారు, “నేను టివిలో నా సంభాషణలో యుఎస్‌లో “యుఎస్ వారసత్వ పన్ను” ఉంటుందని సాధారణంగా ప్రస్తావించాను.నేను వాస్తవాలను ప్రస్తావించకూడదా? ప్రజలు చర్చించుకోవాల్సిన సమస్యలపై నేను మాట్లాడాను. దీనికి కాంగ్రెస్‌తో సహా ఏ పార్టీ విధానాలకి సంబంధం లేదు(sic).” ఆయన ఇంకా మాట్లాడుతూ, “55% తీసుకుంటామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? బీజేపీ, మీడియా ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు.(sic)”

కాంగ్రెస్ పార్టీ తన వంతుగా, ఈ సమస్య నుండి దూరంగా ఉంది.

కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఆలోచన లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పష్టం చేశారు. “రాజ్యాంగం ఉంది, మాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. అతని ఆలోచనలను మా పై ఎందుకు రుద్దుతున్నారు? ఓట్ల కోసమే ఈ ఆటలన్నీ ఆడుతున్నాడు…””

కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తూ, “కాంగ్రెస్‌కు వారసత్వ పన్నును ప్రవేశపెట్టే ఆలోచన లేదు. వాస్తవానికి, ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 1985లో ఎస్టేట్ డ్యూటీని రద్దు చేశారు.”

కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్  ఇలా అన్నారు, “ఎవరి బంగారాన్ని తీసుకోవాలో మరియు మహిళల మంగళసూత్రాన్ని లాక్కోవాలని (కాంగ్రెస్ మ్యానిఫెస్టో) ఎక్కడా మాట్లాడలేదు… మేనిఫెస్టో కమిటీలో శామ్ పిట్రోడా లేరు.ఇది మా ఎజెండాలో భాగం కాదు…ఇది అతని వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఇతరుల వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకోలేరు మరియు అది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యం అని చెప్పలేరు.”

అందువల్ల, దావా తప్పుదారి పట్టించే విధంగా ఉంది మరియు ఇందులో నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

వీడియోలో రాహుల్ గాంధీ తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రకటనను చదువుతున్నారా?వాస్తవ పరిశీలన

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *