వాదన/Claim: రాహుల్ గాంధీ బీజేపీ చిహ్నం ఉన్న టీ-షర్ట్ ధరించిన చిత్రం, ఆయన బీజేపీ ఏజెంట్ అనే వాదనతో షేర్ చేయబడింది
నిర్ధారణ/Conclusion: వాదన తప్పు.రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన బీజేపీ ఏజెంట్ అని తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో షేర్ చేయబడింది.
రేటింగ్: తప్పుదోవ వార్త —
వాస్తవ పరిశీలన వివరాలు:
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గుర్తు ఉన్న టీ షర్ట్ ధరించి ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
हमने तो पहले ही कहा था की यह राहुल गांधी बीजेपी का एजेंट है, आज हमने राहुल गांधी को रंगे हाथो पकड़ लिया है 😋 pic.twitter.com/pUfd16UnLt
— Harish Mali (@HarishMali06) January 15, 2024
ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ జనవరి 14, 2024న మణిపూర్‌లో ప్రారంభమైనప్పుడు ఈ వాదన చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది, “हमने तो पहले ही कहा था की यह राहुल गांधी बीजेपी का एजेंट है, आज हमने राहुल गांधी को रंगे हाथो पकड़ लिया है” [తెలుగు అనువాదం: “రాహుల్ గాంధీ బీజేపీ ఏజెంట్ అని ముందే చెప్పాము,ఈరోజు రాహుల్ గాంధీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం.”]
FACT CHECK
బీజేపీ గుర్తు ఉన్న టీ షర్టు ధరించిన రాహుల్ గాంధీ చిత్రం చాలా వింతగా కనిపిస్తుండడంతో ఒరిజినల్(అసలు) చిత్రం కోసం ప్రయత్నించాము.చివరగా, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌తో, ఒరిజినల్(అసలు) చిత్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాట్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసినట్లు మేము గమనించాము.
శ్రీనాట్ కాంగ్రెస్ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లకు హెడ్ గా ఉన్నారు మరియు ఆమె జనవరి 14, 2024న హిందీలో ఒక శీర్షికతో చిత్రాన్ని షేర్ చేసుకున్నారు, “जब ईस्ट से वेस्ट की यात्रा की बात हुई थी – तो मैंने कहा कि यह यात्रा सिर्फ़ और सिर्फ़ मणिपुर से शुरू हो सकती है” [తెలుగు అనువాదం: మేము తూర్పు నుండి పడమరకు ప్రయాణించడం గురించి మాట్లాడినప్పుడు – ఈ యాత్ర మణిపూర్ నుండి మాత్రమే ప్రారంభించాలని నేను చెప్పాను]
రాహుల్ గాంధీ ధరించిన టీ-షర్ట్‌పై బీజేపీ గుర్తును మార్ఫింగ్ చేసి,ఆయన చిత్రం మార్చివేయబడింది.
కాబట్టి ఈ వాదన తప్పు.
మరి కొన్ని Fact Checks:
రాహుల్ గాంధీ యొక్క ‘భారత్ మాత’ ప్రసంగాన్ని అసందర్భంగా ట్వీట్ చేశారు; వాస్తవ పరిశీలన
రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ప్రకటించారా? వాస్తవ పరిశీలన
Pingback: రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన - Digiteye Telugu
Pingback: ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా కర్ణాటక SSLC పరీక్ష శుక్రవారం మధ్యాహ్నం నిర్
Pingback: కులం ఆధారంగా జనాభా గణన ప్రసంగంలో రాహుల్ గాంధీ 50+15=73 అన్నారని పోస్ట్ వైరల్ అయ్యింది? వాస్తవ పరిశీ
Pingback: మోడీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారా?నకిలీ చిత్రం మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీ
Pingback: 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 142 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సర్వేలో