వాదన/claim:మోడీ స్వయంగా టోపీ పెట్టుకోరు కానీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారనేది వాదన/claim.
నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ అయిన చిత్రం ఫోటోషాప్ చేయబడింది.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు
కాషాయ వస్త్రాలు ధరించిన అబుదాబి పాలకుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘MBZ’తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగిన చిత్రం వాట్సాప్‌లో షేర్ చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: “ఈయన మోడీ! ఆయనే టోపీ ధరించరు, కానీ షేక్‌ను దేవుని చిత్రాలు కలిగి ఉన్న కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారు.”ప్రస్తుతం (ఫిబ్రవరి 2024) యుఎఇలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఇది వైరల్ అవుతోంది.
FACT CHECK
Digiteye India బృందం WhatsAppలో వాస్తవ పరిశీలన కోసం ఈ అభ్యర్థనను అందుకుంది.మా బృందం Google ఇమేజ్ సెర్చ్‌లో చిత్రం కోసం చూడగా, ఇది 2021లో షేర్ చేయబడిన పాత చిత్రం అని మరియు సోషల్ మీడియాలో కనిపించిన ప్రతిసారీ వాస్తవం పరిశీలించే వారిచే తప్పుగా నిరూపించబడినట్లు గమనించాము. మరింత పరిశీలించగా, ఈ సందర్భం 2021న ప్రధాని మోడీ UAEని సందర్శించినప్పటిదని,అక్కడ ఆయనకి UAE యొక్క ప్రతిష్టాత్మక జాయెద్ మెడల్ లభించింది.
మేము ఒరిజినల్(అసలు) చిత్రం కోసం వెతకగా, అధికారిక PIB వెబ్ సైట్లో ఒక చిత్రాన్ని గుర్తించగలిగాము. అక్కడ ఇద్దరు నాయకులు కరచాలనం చేసుకుంటున్న మరియు భారత ప్రధానికి UAE పతకాన్ని అందించిన చిత్రమని తెలుస్తుంది.
ఒరిజినల్(అసలు) క్లెయిమ్ ప్రకారం UAE పాలకుడు కాషాయ వస్త్రాలలో కనిపించటం లేదు, కానీ మోడీ మెడల్ మాత్రం రెండు చిత్రాలలో స్పష్టమైన పోలిక కలిగి ఉంది. క్యాప్షన్ ఇలా ఉంది: “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కి ఆగస్ట్ 24,2019న UAEలోని అబుదాబిలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వారా UAE యొక్క అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ అందజేయబడింది.” ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన చిత్రాన్ని క్రింద చూడవచ్చు:
కావున, చిత్రం నకిలీది,మరియు UAE పాలకున్నీ కాషాయ వస్త్రాలలో చూపించడానికి ఫోటోషాప్ చేయబడింది.
మరి కొన్ని Fact Checks
న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన