వాదన/Claim:ప్రధాని మోదీ తన 26 ఏళ్ల వయసులో కేదార్‌నాథ్ ఆలయంలో హ్యాండ్‌స్టాండ్ యోగా ముద్రను ప్రదర్శించారని, ఇది మోదీజీకి సంబంధించిన అరుదైన వీడియో అనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. వీడియోలో హ్యాండ్‌స్టాండ్ యోగా చేస్తున్న వ్యక్తి “ఆచార్య సంతోష్ త్రివేది”గారిది, 26 ఏళ్ల వయసులో ఉన్నప్పటి ప్రధాని మోదీగారిది కాదు.
రేటింగ్: పూర్తిగా తప్పు —
ఒక యోగి తన చేతులపై తలక్రిందులుగా నడుస్తున్నవీడియోలో, ఇతను ఏదో ఒక రోజు భారత ప్రధాని అవుతారని ఎవరూ అనుకోలేదు, పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోడీని ప్రస్తావిస్తూ చేస్తున్న దావా/వాదన సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది.
जब ये वीडियो बना था तो यह सोचा भी नहीं होगा कि यह योगी एक दिन देश का प्रधानमंत्री बनेगा।ऐसे दिव्य आत्मा को। बर्फबारी के बीच में हाथों के बल उल्टा चलकर केदारनाथ के परिक्रमा करते हुए। ऐसी आत्माए जब जब भी धरती पर आई है तो बहुत लोगों ने उनको गालियां दी। लेकिन आज उनकी पूजा हो रही है। pic.twitter.com/yugcSUf3SH
— Braham Jyot Satti ( मोदी का परिवार ) (@BrahamSitu) March 1, 2024
ఇదే వాదన/దావాతో పోస్ట్ ఇక్కడ మరియు ఇక్కడ హిందీ భాషలో షేర్ చేయబడింది. అనువాదం ఇలా ఉంది:
“ఈ వీడియో తీసినప్పుడు ఈ యోగి ఏదో ఒకరోజు దేశానికి ప్రధాని అవుతారని ఊహించి ఉండరు.అటువంటి దివ్యమైన ఆత్మ. మంచు(హిమపాతం) మధ్య తలక్రిందులుగా చేతులతో నడుస్తూ కేదార్‌నాథ్‌కు ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాంటి ఆత్మలు భూమిపైకి వచ్చినప్పుడల్లా చాలా మంది వారిని దుర్భాషలాడారు. కానీ ఈరోజు ఆయన పూజలందుకుంటున్నారు.”
ఇదే వీడియోని ఏడాది క్రితం ప్రధాని మోదీకి 26 ఏళ్ల వయసులో యోగ చేస్తుండగా తీసిన వీడియో అని నేరుగా క్లెయిమ్ చేస్తూ షేర్ చేసినట్లు గమనించాము.తెలుగు అనువాదం ఇలా ఉంది: “రిషికేశ్‌లోని సాధు దయానంద్ జీ ఆశ్రమంలో యోగా నేర్చుకున్నప్పుడు అతని వయస్సు ఇరవై ఆరు సంవత్సరాలు. ఈరోజు మన ప్రధానమంత్రి అయిన ఈ సన్యాసి/యోగిని గుర్తించండి. మోదీజీకి సంబంధించిన అరుదైన వీడియో ఇది.”
👆👆उम्र छब्बीस की थी, जब रिषिकेश स्थित साधु दयानंद जी के मठ में योग विद्या ग्रहण किया। पहचानिए इस तपस्वी को आज हमारे प्रधानमंत्री हैं। एक दुर्लभ विडियो मोदीजी का 👌👍 pic.twitter.com/tpt9ZC3BV6
— MissMatch! (@ShimlaHelpline) July 11, 2022
FACT-CHECK:
వీడియోలో ఉన్న వ్యక్తి ప్రధాని మోదీని పోలి లేనందున, Digiteye ఇండియా బృందం , వీడియో నుండి కొన్ని ఫ్రేమ్‌లను తీసి వాటిని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో తనిఖీ చేసి, వీడియో యొక్క ప్రామాణికతను పరిశీలించగా, శ్రీ కేదార్ 360 ట్రస్ట్ వారి అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో జూన్ 21,2021న అప్‌లోడ్ చేసిన అసలైన వీడియోను గమనించాము.
వీడియో క్యాప్షన్ ఈ విధంగా ఉంది:
“తీర్థ పురోహిత్ ‘ఆచార్య శ్రీ సంతోష్ త్రివేది’ కేదార్‌నాథ్ ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. శ్రీ ఆచార్య జీ కలిగి ఉన్న నైపుణ్యం మరియు యోగ్యత ఆదర్శప్రాయమైనది మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులకు ప్రేరేపణ కలిగిస్తుంది. జై శ్రీ కేదార్నాథ్.”
Teerth Purohit ‘Acharya Shri Santosh Trivedi’ celebrating international Yog Day at Kedarnath Temple. The skill and competency Own by Shri Acharya ji is exemplary and motivates many people across the globe.
Jai Shri Kedarnath@UN @UNinIndia @narendramodi#kedarnath #YogaDay pic.twitter.com/B7d25Owrud
— Shri Kedar 360 Trust (@Kedar360Purohit) June 21, 2021
2021న వైరల్ చిత్రం సోషల్ మీడియా సర్కిల్‌లలో కనిపించడానికి ఒక సంవత్సరం ముందే, అనగా మార్చి 24, 2020న వార్తా సంస్థ ANI, ఆచార్య శ్రీ సంతోష్ త్రివేది కేదార్‌నాథ్ ఆలయంలో హ్యాండ్‌స్టాండ్(తలక్రిందులుగా) యోగా ముద్రను ప్రదర్శించిన నివేదికను ప్రచురించిందని తదుపరి పరిశోధనలో వెల్లడైయింది.
అందుకే, ప్రధాని మోదీ 26 ఏళ్ల వయసులో హ్యాండ్‌స్టాండ్ యోగా ముద్రను ప్రదర్శిస్తున్నట్లు వీడియోలో కనబడుతుందనే వాదన తప్పు.
మరి కొన్ని Fact Checks:
ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన