Tag Archives: fact check in telugu

Does the Sun rise inside the Konark Temple in Orissa? Fact Check

ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: ఒడిశాలోని కోణార్క్ ఆలయం లోపల సూర్యుడు ఉదయిస్తాడనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. చిత్రాలు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం లోనివి కాదు, థాయ్‌లాండ్‌లోనివి.

రేటింగ్: పూర్తిగా తప్పు- 

వాస్తవ పరిశీలన వివరాలు

సోషల్ మీడియా వినియోగదారులు ఒడిశాలోని కోణార్క్ దేవాలయం ముఖ ద్వారం లోపలి నుండి ఉదయిస్తున్నసూర్యుడి చిత్రాన్ని షేర్ చేస్తున్నారు.ఆలయం లోపల నుండి సూర్యుడు ఉదయిస్తున్నట్లుగా ఆలయ నిర్మాణం జరిగింది. ఈ వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు ఉండటం షేర్ చేసిన చిత్రంలో చూడవచ్చు.

ఇది “200 సంవత్సరాలకు ఒకసారి ఎలా జరుగుతుందని” అని వినియోగదారులు షేర్ చేసుకుంటున్నారు.
Digiteye India బృందంకు వాస్తవ పరిశీలన చేయమని Whatsapp నంబర్‌లో అభ్యర్ధన అందుకుంది.
షేర్డ్ మెసేజ్ ఈ విధంగా ఉంది: “ఇది కోణార్క్ ఆలయం లోపలి సూర్యోదయం. ఈ సంఘటన 200 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని వారు చెప్పారు.”

Fact Check:

ఈ చిత్రం ఎంత పాతదో తెలుసుకోవడానికి మేము సోషల్ మీడియాను పరిశీలించినప్పుడు, ఇది 2015 నుండి ప్రచారంలో ఉందని మేము గమనించాము. YouTubeలో కూడా మేము ఇలాంటి వీడియోలు ఉన్నాయని తెలుకున్నాము.

క్షుణ్ణంగా పరిశీలిస్తే, వైరల్ చిత్రంలో ఉన్న ఆలయ నిర్మాణ శైలికి ఒడిశాలోని కోణార్క్ ఆలయ నిర్మాణ శైలికి పోలిక ఉన్నట్లు కనపడదు. ప్రధాన ఆలయం/ముఖ ద్వారం ఏకశిలా సారూప్యంగా(ఒకేలా) కనిపిస్తున్నప్పటికీ, పక్కన గోడలు మరియు ఇరువైపులా ఆలయ గోపురాలు కోణార్క్ ఆలయా ప్రధాన నిర్మాణానికి జోడించబడలేదు.

Sun Temple / Wikipedia CC

గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది థాయ్‌లాండ్‌లోని ప్రసాత్ హిన్ ఫానోమ్ రంగ్ టెంపుల్ అని తేలింది. ఫానోమ్ రంగ్ అని కూడా పిలుస్తారు, ఈ హిందూ ఖైమర్ సామ్రాజ్య దేవాలయం థాయ్‌లాండ్‌లోని ఇసాన్‌లోని బురిరామ్ ప్రావిన్స్‌లో అంతరించిపోయిన అగ్నిపర్వతం అంచులపై నిర్మించబడి ఉంది. 10వ-13వ శతాబ్దాల మధ్య నిర్మించబడి, ఇది ప్రధానంగా హిందూ దేవుడు శివుని ఆలయం.


Phanom Rung Temple / Tourism Authority of Thailand (TAT)

ఈ ఆలయం అన్ని తోరణాల/ద్వారాల గుండా సూర్యుడు ప్రకాశిస్తూ, అపురూపమైన సూర్య కిరణాలు కూడా ప్రసిద్ధి చెందింది.
“ప్రసిద్ధమైన, చారిత్రాత్మక దేవాలయం యొక్క మొత్తం పదిహేను రాతి ద్వారాల గుండా సూర్యుడు సంవత్సరంలో నాలుగు సార్లు ప్రకాశిస్తాడని బురిరామ్ టైమ్స్ పేర్కొంది.
ఇది 3 నుండి 5 ఏప్రిల్ వరకు మరియు 8 నుండి 10 సెప్టెంబర్ వరకు సూర్యోదయం సమయంలో మరియు 5 నుండి 7 మార్చి వరకు మరియు 5 నుండి 7 అక్టోబర్ వరకు సూర్యాస్తమయం సమయంలో జరుగుతుంది (కొన్ని సంవత్సరాలలో ఒక రోజు ముందు జరుగుతుంది). సూర్యుడు శివలింగాన్ని తాకుతూ వెళుతుండగా, అది చూసేవాళ్లకు అదృష్టాన్ని కలిగిస్తుందని గాఢ నమ్మకం.

బ్యాంకాక్ పోస్ట్ “సూర్యునికి సంబంధించిన ఈ సంఘటనలు(solar events)మార్చి మరియు సెప్టెంబర్‌లలో విషువత్తులకి(equinoxes)ఇరువైపులా ఏటా సుమారు 14 రోజులు ఎలా జరుగుతాయనేది” నివేదిస్తుంది.

మరి కొన్ని fact Checks:

బెంగళూరులో షాపుల సైన్ బోర్డులు కాషాయ రంగులో ఉంటె వాటిని బెంగళూరు పౌర సంస్థ(BBMP) తొలగిస్తోందా? వాస్తవ పరిశీలన

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

 

నాగార్జున సిమెంట్స్ వారు 9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసారా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:నాగార్జున సిమెంట్స్ తన ప్రకటనలో ‘కనికరం’ లేకుండా 9/11 థీమ్‌ను(9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసింది) ఉపయోగించిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నాగార్జున సిమెంట్స్‌వారు అలాంటి ప్రకటన ఏదీ చూపలేదు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిమెంట్ తయారీదారు నాగార్జున సిమెంట్ యొక్క ప్రకటన అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. యానిమేషన్‌లో విమానం న్యూయార్క్ నగరంలోని టవర్ను డీ-కొంటున్నట్లు కానీ టవర్స్ లోకి చొచ్చుకుపోలేక, త్వరగా వెనక్కి వెళ్లి అవతలి వైపుకు వెళ్లి ఎగిరిపోతున్నట్లు చూడవచ్చును.ఇది 9/11 దాడిని గుర్తుచేస్తుంది.ఈ వీడియోలో తెలుగు నటుడు వరుణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తారు. “భారతీయ ప్రకటనలు దయ(కనికరం) లేనివి” అనే శీర్షికతో దీనిని సెర్గీ కిరియానోవ్ అనే ట్విటర్ వినియోగదారు షేర్ చేసారు.

వీడియోను ఇక్కడ చూడండి:

FACT CHECK

Digiteye India బృందం వాట్సాప్ టిప్‌లైన్‌లో అభ్యర్థనను స్వీకరించి, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసిద్ధ సిమెంట్ అయిన నాగార్జున సిమెంట్స్‌ వారు అటువంటి ప్రకటనేమైనా తయారుచేశారని పరిశీలించింది.వరుణ్ తేజ్ దాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై 9/11 విమాన దాడుల నేపధ్యాన్ని ఉపయోగించి తీసిన వీడియో ఏదీ లేదు. వరుణ్ తేజ్ నటించిన నాగార్జున సిమెంట్స్ యొక్క తాజా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు:

https://www.youtube.com/@nagarjunacement3145

9/11 దాడుల నేపథ్య ప్రకటనకు సంబంధించి నాగార్జున సిమెంట్స్‌ గురించి మరింత శోధన చేయగా ఎటువంటి సమాచారం మరియు వీడియో అందుబాటులో లేదు. Digiteye India బృందం నాగార్జున సిమెంట్స్‌కి ఈ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలంటూ ఒక ఇమెయిల్ పంపింది.

మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా,అది నకిలీ వీడియో అని వినియోగదారు స్వయంగా అంగీకరించారని మరియు ట్విట్టర్‌లోని సంభాషణను ఇక్కడ చూడండి:

కాబట్టి,ఈ వీడియో ఫేక్ (నకిలీది).

మరి కొన్ని Fact Checks:

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

కల్తీ పాల వల్ల 2025 నాటికి 87% భారతీయులు క్యాన్సర్ బారిన పడతారని WHO హెచ్చరిక జారీ చేసిందా? వాస్తవ పరిశీలన

 

ఎన్నికల సంఘం 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందా? వైరల్ అవుతున్న నకిలీ సర్క్యులర్; వాస్తవ పరిశీలన

వాదన/Claim:ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిందని, మార్చి 12, 2024 నుంచి ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని సర్క్యులర్ పేర్కొంటున్నట్లు వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.భారత ఎన్నికల సంఘం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు మరియు ఈ దావా నకిలీదని కొట్టిపారేసింది.

రేటింగ్: తప్పుదారి పట్టించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

2024 సార్వత్రిక ఎన్నికల తేదీలపై భారత ఎన్నికల సంఘం (ECI) అధికారికంగా ఒక సర్క్యులర్ విడుదల చేసిందని పేర్కొంటూ వాట్సాప్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒక పోస్ట్  షేర్ చేయబడుతోంది.
Digiteye India Team తన టిప్‌లైన్‌లో వాస్తవాన్ని పరిశీలన చేయమంటూ మూడు అభ్యర్థనలను అందుకుంది.

నామినేషన్ల తేదీలు, పోలింగ్ రోజు, ఓట్ల లెక్కింపు మరియు ఫలితాల యొక్క తేదీలు ప్రచురించిన ఫోటో మరియు ప్రవర్తనా నియమావళి మార్చి 12, 2024 నుండి అమలులోకి వస్తుందని పేర్కొంటున్న ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వంటి విభిన్న శీర్షికలతో వాట్సాప్‌లో ఫోటో షేర్ చేయబడుతోంది. మరియు EC చీఫ్ అనగా ప్రధాన ఎన్నికల అధికారి కాదు, ప్రధాన ఎన్నికల కమీషనర్ కాబట్టి, మేము వైరల్ పోస్ట్ వాస్తవ పరిశీలన చేయటానికి పూనుకున్నాము.

Fact Check

లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్-మే 2024లో జరిగే అవకాశం ఉంది, అయితే ఎన్నికల సంఘం షెడ్యూల్ గురించి ఇప్పటివరకు ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.ECI అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించేవరకు, ప్రవర్తనా నియమావళి అమలులోకి రాదు,కానీ ఒక్కసారి షెడ్యూల్‌ ప్రకటిస్తే మాత్రం దేశంలోని అన్ని వార్తా సంస్థలు కవర్ చేయడానికి ఇది ఒక ప్రధాన వార్త అవుతుంది.

మేము భారత ఎన్నికల సంఘం యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో సమాచారం కోసం చూడగా, సోషల్ మీడియాలో షేర్ చేయబడిన దావాను నిరాకరిస్తూ Xలో పోస్ట్ చేయబడిన క్రింది ప్రకటనను మేము గమనించాము.

క్యాప్షన్ ఇలా ఉంది, “#LokSabhaElections2024 #FactCheck షెడ్యూల్‌కు సంబంధించి వాట్సాప్ లో నకిలీ సందేశం షేర్ చేయబడుతోంది: సందేశం #నకిలీది.  #ECI ద్వారా ఇప్పటివరకు ఎటువంటి తేదీలు ప్రకటించబడలేదు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా ప్రకటిస్తుంది. #VerifyBeforeYouAmplify”.(మీరు వ్యాపించే/విస్తరించే ముందు ధృవీకరించండి).కాబట్టి, సర్క్యులర్ మరియు దావా తప్పు.నిజం లేదు.

మరి కొన్ని ఫాక్ట్ చెక్స్

175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీకి 142 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ సర్వేలో తేలిందా? వాస్తవ పరిశీలన

భారతదేశంలో పోస్ట్ మాస్టర్ ఎంపిక ఈ విధంగా జరుగుతుందనే వాదనతో ఒక వీడియో వైరల్ అవుతోంది ; వాస్తవ పరిశీలన

 

డీ.ఎం.కే ఎమ్మెల్యే మన్సూర్ మహ్మద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టారా? వీడియో వైరల్ అవుతుంది; వాస్తవ పరిశీలన

వాదన/Claim: డీ.ఎం.కే నాయకుడు యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని కొటుతున్నటు చూపించే వీడియో, తమిళనాడులో అధ్వానమైన పరిస్థితిని సూచిస్తుందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన.మీరట్ బిజెపి కౌన్సిలర్ మునీష్ కుమార్ యొక్క పాత 2018 వీడియో, తమిళనాడులోని డి.ఎం.కె నాయకుడి వీడియోగా చూపించబడింది.

రేటింగ్: పూర్తిగా తప్పు–

వాస్తవ పరిశీలన వివరాలు

యూనిఫాంలో ఉన్న పోలీసు అధికారిని ఒక వ్యక్తి కొడుతున్నట్టు మరియు ఆ వ్యక్తి డీ.ఎం.కే నాయకుడన్న వాదనతో ఉన్న ఒక వీడియో అన్ని వార్తల్లో మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్యాప్షన్ ఇలా ఉంది: “DMK ఎమ్మెల్యే మన్సూర్ మహ్మద్ తమిళనాడులో డ్యూటీలో ఉన్న పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ను కొట్టాడు.మీరు కులాలు,మతాలు మరియు భాషల ఆధారంగా ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఇలా జరుగుతుంది.తమిళనాడు పశ్చిమ బెంగాల్ బాటలో ఉంది.

ఇది తెలుగుతో సహా అన్ని భాషలలోని ప్రధాన టీవీ వార్తల్లో ప్రసారం చేయబడింది.

Fact Check

మన్సూర్ మహమ్మద్ అనే తమిళనాడు ఎమ్మెల్యే (DMK) గురించి వివరాలు సేకరించడానికి ప్రయత్నించగా, మాకు ఆ పేరుతో ఉన్న వ్యక్తి సమాచారం లభించలేదు.మేము వీడియో నుండి కీలక ఫ్రేమ్‌లను తీసుకొని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో ఒరిజినల్(అసలు) వీడియో కోసం ప్రయత్నించగా, ట్విట్టర్‌లో ANI ద్వారా షేర్ చేయబడిన పాత వార్త వీడియోను గమనించాము:

తరువాత, నివేదికలో బిజెపి కౌన్సిలర్ పేరు మునీష్ కుమార్(మనీష్ కుమార్ అని కాకుండా) అని సరిచేయబడి, అతనిపై కేసు నమోదు చేయబడింది:

ఈ సంఘటన విస్తృతంగా నివేదించబడిందని దిగువ Google సెర్చ్ ఫలితాల ద్వారా తెలుస్తుంది.

అక్టోబర్ 20, 2018 నాటి డెక్కన్ క్రానికల్‌లోని ఒక నివేదిక, “ఒక మహిళా న్యాయవాదైనా స్నేహితురాలితో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన సబ్-ఇన్‌స్పెక్టర్‌ను ఆహారం అందించడంలో జాప్యం గురించి జరిగిన వాగ్వాదంలో దాని యజమాని మరియు మీరట్ వార్డ్ నంబర్ 40 బిజెపి కౌన్సిలర్ మునీష్ కుమార్ కొట్టారని” పేర్కొంది.

అంతేకాకుండా, ఈ సంఘటన 2018 అక్టోబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా కంకర్‌ఖేడాలో జరిగింది మరియు తమిళనాడులో జరిగినది కాదు. ఈ సంఘటనకి డీ.ఎం.కే పార్టీ ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదు.

కాబట్టి, ఈ వాదనలో నిజం లేదు.

మరి కొన్ని Fact Checks:

అయోధ్యలో ఖాళీ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ను తిరిగి ఇస్తే ₹5 మనకు అందుతుందా? వాస్తవ పరిశీలన

దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన; వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ ఇటలీ దేశానికి వెళ్లేందుకు తన భారత్ జోడో న్యాయ్ యాత్రను 10 రోజుల పాటు నిలిపివేశారా? వాస్తవ పరిశీలన

వాదన./Claim: ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఇటలీకి వెళ్లేందుకు రాహుల్ గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేశారనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. ఫిబ్రవరి 14, 2024న రాజ్యసభ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న తన తల్లి సోనియా గాంధీతో కలిసి ఆయన జైపూర్‌కి వెళ్లారు.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం–

వాస్తవ పరిశీలన వివరాలు

దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయ్ యాత్రకు నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది.ఫిబ్రవరి 14, ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇటలీకి (అతని అమ్మమ్మ ఇంటికి) బయలుదేరడానికి రాహుల్ గాంధీ తన యాత్రను 10 రోజుల పాటు నిలిపివేసినట్లు వాదన.ఇది ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్‌లో షేర్ చేయబడింది.

FACT CHECK

రాహుల్ గాంధీ చేస్తున్న“భారత్ జోడో న్యాయ్ యాత్ర”కి ఏవైనా అంతరాయాలు ఉన్నాయా అని Digiteye India బృందం మొదట గూగుల్ సెర్చ్‌లో పరిశీలించింది, అయితే అధికారిక యాత్ర సమాచారంలో అటువంటి సుదీర్ఘ విరామం లేదా యాత్ర షెడ్యూల్‌లో మార్పును గురించి ప్రస్తావించలేదు.

అయితే, ఫిబ్రవరి 14, 2024న జైపూర్‌లో రాజ్యసభ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్న తన తల్లి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ వెళ్లడంతో బీహార్‌లో యాత్ర ఆలస్యమైందని వార్తా నివేదికలు ధృవీకరించాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లో(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వెబ్‌సైట్ Inc.in) ఫిబ్రవరి 14, 2024న రాజస్థాన్ నుండి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్న తన తల్లి సోనియాగాంధీతో ఉన్న రాహుల్ గాంధీని మనం చూడవచ్చు.

మరియు, భారత్ జోడో న్యాయ్ యాత్ర యొక్క అధికారిక X హ్యాండిల్ ఫిబ్రవరి 15 యొక్క షెడ్యూల్‌ను షేర్ చేసింది. కింద చూపిన విధంగా బీహార్‌లోని ఔరంగాబాద్‌లో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఫిబ్రవరి 15, 2024న మధ్యాహ్నం 2 గంటలకు బీహార్‌లోని భారత్ జోడో న్యాయ్ యాత్రను పునఃప్రారంభించేందుకు ఔరంగాబాద్‌లో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించడానికి అతను తిరిగి వచ్చినట్లు అనేక వార్తా నివేదికలు ధృవీకరించాయి.

అతని ఫిబ్రవరి 15, 2024 షెడ్యూల్‌పై నిర్వాహకుల నుండి అధికారిక విడుదల కింద చూడవచ్చు:

కాబట్టి,వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14, 2024) నాడు రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లేందుకు తన యాత్రను నిలిపివేస్తున్నారనే వాదన తప్పు.

మరి కొన్ని Fact Checks

కులం ఆధారిత జనాభా గణన ప్రసంగంలో రాహుల్ గాంధీ 50+15=73 అన్నారని పోస్ట్ వైరల్ అయ్యింది? వాస్తవ పరిశీలన

రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారా?; వాస్తవ పరిశీలన

 

మోడీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారా?నకిలీ చిత్రం మళ్లీ వైరల్ అవుతోంది; వాస్తవ పరిశీలన

వాదన/claim:మోడీ స్వయంగా టోపీ పెట్టుకోరు కానీ షేక్‌లను కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారనేది వాదన/claim.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ అయిన చిత్రం ఫోటోషాప్ చేయబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

కాషాయ వస్త్రాలు ధరించిన అబుదాబి పాలకుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘MBZ’తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ దిగిన చిత్రం వాట్సాప్‌లో షేర్ చేయబడింది.హిందీలో క్యాప్షన్ ఇలా ఉంది: “ఈయన మోడీ! ఆయనే టోపీ ధరించరు, కానీ షేక్‌ను దేవుని చిత్రాలు కలిగి ఉన్న కాషాయ వస్త్రాలు ధరించేలా చేశారు.”ప్రస్తుతం (ఫిబ్రవరి 2024) యుఎఇలో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఇది వైరల్ అవుతోంది.

FACT CHECK

Digiteye India బృందం WhatsAppలో వాస్తవ పరిశీలన కోసం ఈ అభ్యర్థనను అందుకుంది.మా బృందం Google ఇమేజ్ సెర్చ్‌లో చిత్రం కోసం చూడగా, ఇది 2021లో షేర్ చేయబడిన పాత చిత్రం అని మరియు సోషల్ మీడియాలో కనిపించిన ప్రతిసారీ వాస్తవం పరిశీలించే వారిచే తప్పుగా నిరూపించబడినట్లు గమనించాము. మరింత పరిశీలించగా, ఈ సందర్భం 2021న ప్రధాని మోడీ UAEని సందర్శించినప్పటిదని,అక్కడ ఆయనకి UAE యొక్క ప్రతిష్టాత్మక జాయెద్ మెడల్ లభించింది.

మేము ఒరిజినల్(అసలు) చిత్రం కోసం వెతకగా, అధికారిక PIB వెబ్ సైట్లో ఒక చిత్రాన్ని గుర్తించగలిగాము. అక్కడ ఇద్దరు నాయకులు కరచాలనం చేసుకుంటున్న  మరియు భారత ప్రధానికి UAE పతకాన్ని అందించిన చిత్రమని తెలుస్తుంది.

ఒరిజినల్(అసలు) క్లెయిమ్ ప్రకారం UAE పాలకుడు కాషాయ వస్త్రాలలో కనిపించటం లేదు, కానీ మోడీ మెడల్ మాత్రం రెండు చిత్రాలలో స్పష్టమైన పోలిక కలిగి ఉంది. క్యాప్షన్ ఇలా ఉంది: “ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కి ఆగస్ట్ 24,2019న UAEలోని అబుదాబిలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ద్వారా UAE యొక్క అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ అందజేయబడింది.” ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన చిత్రాన్ని క్రింద చూడవచ్చు:

The Prime Minister, Shri Narendra Modi being conferred with the UAE’s highest civilian award ‘Order of Zayed’ by the Crown Prince of Abu Dhabi, Sheikh Mohammed Bin Zayed Al Nahyan, at Abu Dhabi, in UAE on August 24, 2019. (PIB)

కావున, చిత్రం నకిలీది,మరియు UAE పాలకున్నీ కాషాయ వస్త్రాలలో చూపించడానికి ఫోటోషాప్ చేయబడింది.

మరి కొన్ని Fact Checks

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

న్యూజిలాండ్ హోం మంత్రి సనాతన ధర్మాన్ని స్వీకరించారని వీడియో పేర్కొంది; వాస్తవ పరిశీలన

అయోధ్యలో ఖాళీ మినరల్ వాటర్ ప్లాస్టిక్ బాటిల్ను తిరిగి ఇస్తే ₹5 మనకు అందుతుందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim: అయోధ్యలో ఖాళీ వాటర్ బాటిల్‌ను తిరిగి ఇస్తే మీకు ₹5 లభిస్తుందనేది వాదన

నిర్ధారణ/Conclusion:డిపాజిట్ రీఫండ్ స్కీమ్ యొక్క QR కోడ్ స్టిక్కర్‌ ఉన్న ఖాళీ బాటిల్‌ను మాత్రమే అయోధ్యలో తిరిగి ఇస్తే ₹5 తిరిగి లభిస్తుంది.
ఏదైనా ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇస్తే ఇచ్చే చెల్లింపు పథకం కాదు

రేటింగ్: తప్పు దారి పట్టించే వార్తా — 

Fact Check వివరాలు

జనవరి 22, 2024న రామాలయాన్ని ప్రారంభించిన తర్వాత అయోధ్య ఇటీవల వార్తల్లోకి వచ్చిన నేపధ్యంలో, క్యూఆర్ కోడ్ స్టిక్కర్‌తో కూడిన ప్లాస్టిక్ మినరల్ వాటర్ బాటిల్ చిత్రం మరియు బాటిల్ తిరిగి ఇచ్చినచో ప్రజలు ₹5 వాపసు పొందవచ్చుననే’ వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

FACT CHECK

క్లెయిమ్/వాదనలో వాస్తవం పరిశీలించడానికి Digiteye India Team ఈ అభ్యర్థనను అందుకుంది. మొదట బాటిల్ పై ఉన్న స్టిక్కర్‌ యొక్క సమాచారం కోసం చూడగా, ఇది ‘ది కబాడీవాలా‘ పేరుతో లోగోను కలిగి ఉంది. దీని వెబ్‌సైట్ ఈ పథకానికి సంబంధించిన వివరాలను క్రింది విధంగా లభ్యపరిచారు.

ముఖ్యంగా, ఇది ఖాళీ బాటిల్‌ను అయోధ్య నగరంలో ఎక్కడా పడేయకుండా, తిరిగి ఇచ్చేలా ప్రజలను ప్రోత్సహించడానికి సంస్థ ప్రారంభించిన ‘డిపాజిట్ రీఫండ్ సిస్టమ్’ .
అయితే, నిబంధన ఏమిటంటే, బాటిల్‌ను కొనుగోలు చేసేటప్పుడు ₹5 ముందుగానే వసూలు చేయబడుతుంది మరియు ఖాళీ బాటిల్‌ను  ఇచ్చిన తర్వాత తిరిగి ₹5 ఇవ్వబడుతుంది.

ఉదాహరణకి మినరల్ వాటర్ బాటిల్ ధర ₹10 అయితే, మీరు ₹15 చెల్లిస్తారు మరియు ఖాళీ బాటిల్‌ను తిరిగి ఇచ్చిన తర్వాత, మీ డిపాజిట్ ₹5 తిరిగి ఇవ్వబడుతుంది. మేము QR కోడ్‌ని స్కాన్ చేసినప్పుడు, అయోధ్యలోని కలెక్షన్ పాయింట్‌ల జాబితా చూపబడింది. ‘ది కబాడీవాలా’ వెబ్ పేజీ కూడా ‘డిపాజిట్ రీఫండ్ స్కీమ్’ అని స్పష్టం చేసింది. కాబట్టి, ఇది ప్రతి ఖాళీ బాటిల్‌కు(కోడ్ స్టిక్కర్‌ లేని బాటిల్ కూడా) తిరిగి ఇచ్చినప్పుడు ₹5 పొందే ఏకపక్ష పథకం కాదు.

రానున్న భవిష్యత్తులో వేలాది మంది భక్తులు అయోధ్య నగరాన్ని సందర్శిస్తారని భావిస్తున్నందున పరిశుభ్రంగా ఉంచడానికి భోపాల్‌కు చెందిన స్టార్టప్ ‘ది కబాడీవాలా’, మరియు అయోధ్య నగర్ నిగమ్ మధ్య పరస్పర సహకారంతో ఈ పథకం జరిగిందని ఇతర వివరాలు ద్వారా తెలుస్తుంది.

ఇంకా, ‘ది కబాడీవాలా’ వెబ్‌సైట్ ఈ వీడియోలో ఈ పధకం గురించి స్పష్టంగా వివరిస్తుంది:

అందువలన, అయోధ్యలో క్లీన్‌నెస్ డ్రైవ్‌లో భాగంగా, ఈ వాటర్ బాటిళ్లను కొనుగోలు చేసే వ్యక్తులు డిపాజిట్‌గా ₹5 అదనంగా చెల్లించి, ఖాళీ బాటిల్‌ను ఇచ్చి డిపాజిట్ ని తిరిగి పొందవచ్చు.

మరి కొన్ని Fact Checks:

అయోధ్యలో దొరికిన రాగి స్క్రోల్ (రాగి ఫలకం)బౌద్ధుల కాలానికి చెందినదని వీడియో పేర్కొంది; Fact Check

నేపాలీ హిందువులు బహుమతులతో అయోధ్యకు చేరుకున్నట్లుగా షేర్ చేయబడిన వీడియో; వాస్తవ పరిశీలన

 

కులం ఆధారిత జనాభా గణన ప్రసంగంలో రాహుల్ గాంధీ 50+15=73 అన్నారని పోస్ట్ వైరల్ అయ్యింది? వాస్తవ పరిశీలన

వాదన/Claim: కుల గణనపై తన ప్రసంగంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 50+15ని 73గా తప్పుగా లెక్కించారని వీడియో లో పేర్కొన్న వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. రాహుల్ గాంధీ ఒరిజినల్ ప్రసంగం నుండి ఆదివాసీలకు సంబంధించిన 8% ప్రస్తావనను తొలగించి వీడియోను మార్చివేయబడింది/సవరించబడింది.

రేటింగ్/Rating: తప్పుగా చూపించే ప్రయత్నం —

Fact check వివరాలు

రాహుల్ గాంధీ కుల గణన మరియు రిజర్వేషన్ సమస్య గురించి మాట్లాడుతున్న వీడియో,ప్రాథమిక గణితం కూడా తెలియదన్నట్లు కాంగ్రెస్ నాయకుడిని ఎగతాళి చేసే ఉద్దేశ్యంతో అనేక శీర్షికలతో(క్యాప్షన్స్)వీడియో వైరల్ అవుతోంది.వీడియోలో,”రాహుల్ గాంధీ, “ఎన్ని?… చెప్పండి… 50.. 15.. ఎన్ని? 73…” అని అనటం చూడవచ్చు. ట్విట్టర్‌లో పోస్ట్‌కు ఇప్పటికే దాదాపు 2 లక్షల వీక్షణలు వచ్చాయి మరియు చాలా మంది దీనిని రీట్వీట్ కూడా చేశారు.

FACT CHECK

రాహుల్ గాంధీ చాలా కాలంగా కుల గణనకు సంబంధించిన సంఖ్య గురించి మాట్లాడటం తెలిసిందే,మరియు ఎప్పుడూ అలాంటి తప్పు చేయలేదు.ఈ వీడియోలో ఆయన ప్రసంగం అనుమానాదాస్పదంగా అనిపించి, digiteye India టీమ్ ఒరిజినల్(అసలు) వీడియో కోసం చూడగా,ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగాన్ని గమనించాము.కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతున్న వీడియో,భారత జాతీయ కాంగ్రెస్ అధికారిక X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో అప్‌లోడ్ చేయబడింది.

Twitterలో షేర్ చేయబడిన క్రింది వీడియో, అసలైన(ఒరిజినల్)వీడియో మరియు మార్చబడిన వీడియో మధ్య వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది:

Fake Video Alert 📢


నిర్దిష్ట క్లిప్‌లో రాహుల్ గాంధీ, రిజర్వేషన్‌లపై జర్నలిస్టు అడిగిన ప్రశ్నను గుర్తు చేసుకుంటూ, కుల గణన వల్ల సమాజంలో మరింత విభజన జరగదని వివరించడం జరిగింది.మన సమాజంలోని ఇతర వెనుకబడిన కులాలు (ఓబీసీ), ఆదివాసీలు (ఎస్టీ), దళితుల (ఎస్సీ) శాతాన్ని ప్రస్తావిస్తూ, ఈ మూడు గ్రూపులు దేశ జనాభాలో వరుసగా 50%, 8% మరియు 15% ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

తరువాత, అతను హిందీలో ఇలా అన్నారు, “50+15+8 అంటే 73. 73% మందికి ఏమీ రాకపోతే; మీడియాలో ప్రాతినిధ్యం లేదు, అతిపెద్ద 200 కార్పొరేట్‌లలో పని చేయటం లేదు, PMOలో లేరు, బ్యూరోక్రసీలో లేరు, ప్రైవేట్ ఆసుపత్రులలో లేరు,ఏ పాఠశాలలు లేదా విశ్వవిద్యాలయాలు వారి పరిధిలో లేవు,మరి భారత్‌ను ఎలా ఏకం చేయవచ్చు?”

అయితే, ట్విటర్‌లో వైరల్ అయిన వీడియో ఆదివాసీల సంఖ్య 8%కి సంబంధించిన మాటను తొలగించి మార్చి, 50+15=73 లాగా కనిపించేలా చేయబడింది.

అందువలన, ప్రాథమిక గణనను(కుల సంఖ్య కూడికను) తప్పుగా చూపుతూ రాహుల్ గాంధీని చెడుగా చూపించడానికి మార్చబడిన వీడియో పోస్ట్ చేయబడింది.

మరి కొన్ని Fact Checks:

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ దివ్యాంగ వ్యక్తితో కరచాలనం చేస్తూ కనిపించే వీడియో, తప్పు దారి పట్టించే ప్రయత్నం. వాస్తవ పరిశీలన

 

దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన; వాస్తవ పరిశీలన

వాదన/Claim: దక్షిణ భారత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం మరియు పసుపు నీటిని అందిస్తున్నారనేది వీడియో లోని వాదన.

నిర్ధారణ/Conclusion:తప్పుడు వాదన.వైరల్ వీడియోలో ఆరోపిస్తున్నట్లు, వీడియో దక్షిణ భారతదేశంకు సంబంధించినది కాదని ఒడిశా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిదని నిర్ధారింపబడింది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

దక్షిణ భారతదేశంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో అన్నం,పసుపు నీళ్లు మాత్రమే అందిస్తున్నారంటూ పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ చిన్న వీడియో వైరల్ అవుతోంది.  హిందీలో క్యాప్షన్ ఈ విధంగా ఉంది:” देखें कि दक्षिण भारत के सरकारी स्कूलों में मध्याह्न भोजन कैसे उपलब्ध कराया जा रहा है। केवल चावल और हल्दी वाला पानी।” [తెలుగు అనువాదం “దక్షిణ భారతదేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఎలా అందిస్తున్నారో చూడండి. అన్నం మరియు పసుపు నీళ్లు మాత్రమే.”]

ఇది ఇక్కడ మరియు ఇక్కడ షేర్ చేయబడింది.

Fact Check

వీడియో యొక్క ముఖ్య ఫ్రేమ్‌లను తీసుకుని, Digiteye India బృందం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను ఉపయోగించి చూడగా, ఒరిజినల్ వీడియోను బిగుల్ టీవీ (ఒడిశా) యూట్యూబ్‌లో ఫిబ్రవరి 1, 2024న పోస్ట్ ను గమనించాము.వీడియో శీర్షిక ఇలా ఉంది”మిడ్-డే భోజనంలో ఇలాంటి పప్పులను ఎవరూ తమ మొత్తం జీవితంలో తిని ఉండరు ;మన పూర్వీకులకు కూడా తిని ఉండరు.ఈ ప్రభుత్వ హయాంలో అది ఎలా సాధ్యం అయింది?”

ఒరిజినల్(అసలు) వీడియోలో, ఆ వ్యక్తి తాను ఫిర్యాదు చేయడం లేదని, అయితే ఎలాంటి పప్పులు వడ్డిస్తున్నారో తెలుసుకోవాలని కార్మికులతో ఒడియాలో ఇలా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.  “ఇవి పప్పులు కావు, మీరు వడ్డిస్తుంది నీరు. మీరు తక్కువ మోతాదులో ఆహార పదార్థాలను అందుకున్నందున పరిమిత వనరులతో ఇక్కడ పని చేస్తున్నారని నాకు తెలుసు,అయినా కానీ నేను వెళ్లి దీని గురించి BDO (బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)కి ఫిర్యాదు చేస్తాను.

అందువలన, వీడియో ఒడిశాలోని ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినది, దక్షిణ భారత ప్రభుత్వ పాఠశాలకు చెందినది కాదు.

మరి కొన్ని fact Checks:

చాక్లెట్ తినడం వల్ల మొటిమలు వస్తాయని వైరల్ పోస్ట్‌లు పేర్కొంటున్నాయి; వాస్తవ పరిశీలన

‘గాఢమైన పసుపురంగు’ ఉన్న పసుపులో ‘లెడ్ క్రోమేట్’అనే పదార్థముందని వైరల్ సందేశం పేర్కొంది; వాస్తవ పరిశీలన

 

 

ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా కర్ణాటక SSLC పరీక్ష శుక్రవారం మధ్యాహ్నం నిర్ణయించబడిందా? వాస్తవ పరిశీలన

వాదన/Claim:శుక్రవారం ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా మార్చి 1వ తేదీన కర్ణాటక SSLC ప్రిపరేటరీ పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నం నిర్ణయించబడిందనేది వాదన.

నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. పీ.యూ.సీ (ప్రీ-యూనివర్శిటీ) పరీక్షలు మార్చి 1వ తేదీన ప్రారంభం కానున్నందున , SSLC (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) పరీక్ష మధ్యాహ్నం మరియు పీ.యూ.సీ పరీక్ష ఉదయం నిర్వహించబడుతుందని ఐఎన్‌సి కర్ణాటక పేర్కొంది.

రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —

వాస్తవ పరిశీలన వివరాలు

కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్‌మెంట్ బోర్డ్ (కెఎస్‌ఇఎబి) ఫిబ్రవరి 2న 10వ తరగతి ప్రిపరేటరీ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసిన వెంటనే, శుక్రవారం మధ్యాహ్నం పరీక్షను నిర్వహించడంపై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీనిని మైనారిటీల మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వ చర్యగా పేర్కొంది.

అందులో ఒక ట్వీట్ ఇలా ఉంది: “కర్ణాటక రాష్ట్ర 10వ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేయబడింది. అన్ని పరీక్షలు ఉదయం షెడ్యూల్ చేయబడగా, కానీ శుక్రవారం మాత్రం.ఎందుకు? ఓహ్.. నమాజ్‌ టైం ?” చక్రవర్తి సూలిబెలే ట్వీట్‌కి ఒక్కరోజులోనే 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఒకే ట్వీట్ ఇక్కడ మరియు ఇక్కడ విభిన్న శీర్షికలతో(క్యాప్షన్స్తో)షేర్ చేయబడింది.

FACT CHECK

Digiteye India బృందం వాస్తవ పరిశీలన చేయడం కోసం షెడ్యూల్ కొరకు వెతకగా,ఈ విషయంపై ఐఎన్‌సి కర్ణాటక ప్రతిస్పందన ఈ విధంగా ఉంది:  “మార్చి 1వ తేదీన, అదే రోజు పీయూసీ (ప్రీ-యూనివర్శిటీ) పరీక్షలు ప్రారంభం కానున్నందున , SSLC (సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్) పరీక్ష మధ్యాహ్నం నిర్వహించబడుతుంది.తర్వాతి రోజుల్లో పీయూసీ పరీక్షలు లేకపోవడంతో ఉదయం నుంచే ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలు (SSLC exam) ప్రారంభం కానున్నాయి. పరీక్షా కేంద్రాల కొరత మరియు గందరగోళాన్ని నివారించడానికి, ఈ క్రింది విధానం అమలులో ఉంది…”


కర్ణాటక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప ఈ వాదనలపై స్పందిస్తూ విద్యార్థులందరికీ ప్రయోజనం చేకూర్చడం కోసం పరీక్ష సమయాలు సర్దుబాటు చేయబడిందని పేర్కొన్నారు. 12వ తరగతి (పి.యు.సి) పరీక్ష మార్చి 1, 2024న ఉదయం షెడ్యూల్ చేయగా, 10వ(SSLC) పరీక్ష మధ్యాహ్నంకి షెడ్యూల్ చేయబడింది.

10వ పరీక్షల షెడ్యూల్‌ను మరింతగా పరిశీలిస్తే, మహా శివరాత్రి (హిందూ పండుగ) పండుగ మార్చి 8వ తేదీన రావడంతో ఆ రోజు ఏ పరీక్షా షెడ్యూల్ చేయబడలేదని స్పష్టమవుతుంది.

మైనారిటీ విద్యార్థుల నమాజ్ కోసం పరీక్ష షెడ్యూల్‌ను మధ్యాహ్నం ఉంచారనే ఆరోపణలను తోసిపుచ్చుతూ పి.యు.సి పరీక్ష టైమ్‌టేబుల్ మార్చి 15 శుక్రవారం మరియు మార్చి 22 శుక్రవారం ఉదయం (మొదటి అర్ధభాగంలో) షెడ్యూల్ చేయబడింది.

కాబట్టి, శుక్రవారం ప్రార్థనకు వెళ్లే ముస్లిం విద్యార్థులకు అనుగుణంగా మార్చి 1వ తేదీన SSLC పరీక్ష సమయాన్ని సర్దుబాటు చేశారనే వాదన అబద్ధం.

మరి కొన్ని Fact Checks:

బీజేపీ గుర్తు(కమలం)తో కూడిన టీ-షర్ట్ ను రాహుల్ గాంధీ ధరించారని తప్పుడు చిత్రం షేర్ చేయబడుతోంది; వాస్తవ పరిశీలన

లేదు, “డీ.ఎం.కే ఓట్ల కోసం హిందువులను అడుక్కోదు” అని స్టాలిన్ ఎప్పుడూ చెప్పలేదు; వాస్తవ పరిశీలన