వాదన/Claim:నాగార్జున సిమెంట్స్ తన ప్రకటనలో ‘కనికరం’ లేకుండా 9/11 థీమ్‌ను(9/11లో జరిగిన దాడుల నేపథ్యంతో కూడిన ప్రకటనను తయారుచేసింది) ఉపయోగించిందనేది వాదన.
నిర్ధారణ/Conclusion: తప్పుడు వాదన. నాగార్జున సిమెంట్స్‌వారు అలాంటి ప్రకటన ఏదీ చూపలేదు.
రేటింగ్: తప్పుగా చూపించే ప్రయత్నం —
వాస్తవ పరిశీలన వివరాలు
ఇది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిమెంట్ తయారీదారు నాగార్జున సిమెంట్ యొక్క ప్రకటన అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేయబడుతోంది. యానిమేషన్‌లో విమానం న్యూయార్క్ నగరంలోని టవర్ను డీ-కొంటున్నట్లు కానీ టవర్స్ లోకి చొచ్చుకుపోలేక, త్వరగా వెనక్కి వెళ్లి అవతలి వైపుకు వెళ్లి ఎగిరిపోతున్నట్లు చూడవచ్చును.ఇది 9/11 దాడిని గుర్తుచేస్తుంది.ఈ వీడియోలో తెలుగు నటుడు వరుణ్ తేజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా కనిపిస్తారు. “భారతీయ ప్రకటనలు దయ(కనికరం) లేనివి” అనే శీర్షికతో దీనిని సెర్గీ కిరియానోవ్ అనే ట్విటర్ వినియోగదారు షేర్ చేసారు.
వీడియోను ఇక్కడ చూడండి:
Indian ads are merciless pic.twitter.com/Tl0XasPjU5
— Sergii Kirianov (@SergiiKirianov) March 10, 2024
FACT CHECK
Digiteye India బృందం వాట్సాప్ టిప్‌లైన్‌లో అభ్యర్థనను స్వీకరించి, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రసిద్ధ సిమెంట్ అయిన నాగార్జున సిమెంట్స్ వారు అటువంటి ప్రకటనేమైనా తయారుచేశారని పరిశీలించింది.వరుణ్ తేజ్ దాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండగా, న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌పై 9/11 విమాన దాడుల నేపధ్యాన్ని ఉపయోగించి తీసిన వీడియో ఏదీ లేదు. వరుణ్ తేజ్ నటించిన నాగార్జున సిమెంట్స్ యొక్క తాజా ప్రకటనను ఇక్కడ చూడవచ్చు:
https://www.youtube.com/@nagarjunacement3145
9/11 దాడుల నేపథ్య ప్రకటనకు సంబంధించి నాగార్జున సిమెంట్స్ గురించి మరింత శోధన చేయగా ఎటువంటి సమాచారం మరియు వీడియో అందుబాటులో లేదు. Digiteye India బృందం నాగార్జున సిమెంట్స్‌కి ఈ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలంటూ ఒక ఇమెయిల్ పంపింది.
మరిన్ని వివరాల కోసం ప్రయత్నించగా,అది నకిలీ వీడియో అని వినియోగదారు స్వయంగా అంగీకరించారని మరియు ట్విట్టర్‌లోని సంభాషణను ఇక్కడ చూడండి:
కాబట్టి,ఈ వీడియో ఫేక్ (నకిలీది).
మరి కొన్ని Fact Checks: